పేరు (ఆంగ్లం) | Kandukuri Ramabhadrarao |
పేరు (తెలుగు) | కందుకూరి రామభద్రరావు |
కలం పేరు | – |
తల్లిపేరు | కందుకూరి నాంచారమ్మ |
తండ్రి పేరు | కందుకూరి సూర్యనారాయణ |
జీవిత భాగస్వామి పేరు | రామలక్ష్మి |
పుట్టినతేదీ | 1/31/1905 |
మరణం | 10/8/1976 |
పుట్టిన ఊరు | ఆత్రేయపురం మండలం లోని రాజవరం (తూర్పుగోదావరి జిల్లా) |
విద్యార్హతలు | బి.ఏ, బి.ఇడి |
వృత్తి | ఉన్నత పాఠశాల హెడ్మాస్టారు |
తెలిసిన ఇతర భాషలు | ఆంధ్రము మరియు ఆంగ్లము |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | 1.పద్య కవితలు: లేమొగ్గ, తరంగిణి, వేదన, జయపతాక, నివేదనము, కవితాలహరి 2.గేయ కవిత: గేయమంజరి, గేయ నాటికలు 3.ఆంగ్ల రచనలు: Searching strains (Rendering of his poems into English), Leaves from a diary. 4.అనువాదం: చిత్ర (రవీంద్రుని రచన) 5.వచనం: ఎందరో మహానుభావులు |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | కవితల్లజ |
ఇతర వివరాలు | వీరు పిఠాపురం మహారాజా కళాశాలలో పట్టభద్రులై ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. వీరు రాజవరం పంచాయితీకి మొదటి అధ్యక్షులు. . ప్రాథమిక పాఠశాల భవనం ఏర్పాటు చేశారు. చిత్తరంజన్ దాసు పేరిట ఒక గ్రంథాలయాన్ని కూడా ప్రారంభించారు.పదవీ విరమణ అనంతరం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ప్రయోక్తగా ఒక దశాబ్ది కాలం పనిచేసి ఎన్నో గేయాలు, ప్రసంగాలు, కవితలు, సంగీత నాటికలు ప్రసారం చేశారు.ఆకాశవాణిలో సుమారు పది సంవత్సరములు పనిచేశారు. స్టాఫ్ ఆర్టిస్టులు అసోసియేషన్ కి అధ్యక్షులుగా పనిచేశారు. అనేక గేయాలు, సంగీత రూపకాలు, విద్యావిషయనాటికలు రచించారు. కవి సమ్మేళనాలలో పాల్గొన్నారు. ఆంగ్ల ఆంధ్రాలలో ప్రసంగాలు చేశారు. 1970లో విజయవాడ కేంద్రం నుంచి రిటైరు అయ్యారు. |
స్ఫూర్తి | రామభద్రరావుగారు తన జీవితాన్ని గాంధీమహాత్ముడు, సాహితీ రచనలను రవీంద్ర కవీంద్రుడు ప్రభావితం చేశావని చెపుతూ ఉండేవారు. |
నమూనా రచన శీర్షిక | కందుకూరి రామభద్రరావు |
సంగ్రహ నమూనా రచన | శ్రీ కందుకూరి రామభద్రరావు 31-01-1905 తేదీన గౌతమీ తీరాన రాజవరం అనే చిన్న గ్రామంలో జన్మించారు. ప్రాధమిక విద్యాభ్యాసం- స్వగ్రామంలోను, ఉన్నతపాఠశాల విద్య రాజమహేంద్రవరంలోని వీరేశలింగం ఆస్తికోన్నత పాఠశాలలోను చేశారు. తరువాత కాకినాడ పిఠాపురం మహారాజా కళాశాలలో బి.ఏ. డిగ్రీ పొందారు. కళాశాల విద్యాభ్యాసంలోనే ఆయనకు రచనా వ్యాసంగం, ఆంగ్ల ఆంధ్ర భాషలలో ఉపన్యాస పటిమ అలవడ్డాయి. పిఠాపురం మహారాజా కళాశాల స్వర్ణోత్సవానికి రవీంద్రనాధ టాగోరు ‘చిత్ర’ నాటకాన్ని తెలుగులోకి అనువదించి ప్రచురించారు. |
కందుకూరి రామభద్రరావు
శ్రీ కందుకూరి రామభద్రరావు 31-01-1905 తేదీన గౌతమీ తీరాన రాజవరం అనే చిన్న గ్రామంలో జన్మించారు. ప్రాధమిక విద్యాభ్యాసం- స్వగ్రామంలోను, ఉన్నతపాఠశాల విద్య రాజమహేంద్రవరంలోని వీరేశలింగం ఆస్తికోన్నత పాఠశాలలోను చేశారు. తరువాత కాకినాడ పిఠాపురం మహారాజా కళాశాలలో బి.ఏ. డిగ్రీ పొందారు. కళాశాల విద్యాభ్యాసంలోనే ఆయనకు రచనా వ్యాసంగం, ఆంగ్ల ఆంధ్ర భాషలలో ఉపన్యాస పటిమ అలవడ్డాయి. పిఠాపురం మహారాజా కళాశాల స్వర్ణోత్సవానికి రవీంద్రనాధ టాగోరు ‘చిత్ర’ నాటకాన్ని తెలుగులోకి అనువదించి ప్రచురించారు.
1930-35 కాలంలో వారి స్వగ్రామంలో పంచాయితీకి సంస్ధాపక అధ్యక్షునిగా పాఠాశాల నిర్మాణం, గ్రంథాలయ స్ధాపన మొదలైన సమాజసేవా కార్యక్రమాలు నిర్వర్తించారు. 1935-39 సం||లలో పిఠాపురం కళాశాల తెలుగు శాఖలో ట్యూటర్‌గా పనిచేశారు. 1939-40 సం||లో రాజమహేంద్రవరంలో ట్రయినింగు కాలేజీలో బి.ఇ.డి. చదువుతూ ఆంధ్రవిశ్వవిద్యాలయ అంతర్కళాశాల వక్తృత్వ పోటీలలో ఆంధ్ర, ఆంగ్ల భాషలలో ప్రధములుగా నిలిచారు.
శ్రీ రామభద్రరావు ఉపాధ్యాయవృత్తి చేపట్టి, వీరేశలింగం ఆస్తికోన్నత పాఠశాలలోను, గొల్లపాలెం, పేరూరు, రాజోలు, అమలాపురం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా ప్రధానోపాధ్యాయునిగా, వందల విద్యార్దుల జీవితాలను మలచారు. ఆత్రేయపురం హైస్కూలుకు సంస్థాపక ప్రధానోపాధ్యాయులు. ఉపాధ్యాయ వృత్తిలో ఉండగానే తరంగిణి, వేదన, జయపతాక, నివేదనం గేయమంజరి కావ్యాలను ప్రచురించారు. ఆయనకు ఆంగ్లభాషలో కూడ మంచి పాండిత్యం ఉంది. తన రచనలను కొన్నిటిని
“Searching strains” గా ఆంగ్లంలోకి అనువదించారు.
1960 సం||లో అమలాపురం ఉన్నతపాఠశాల ప్రధానోపాధ్యాయునిగా పదవీ విరమణ చేసి, 1961 నుంచి సుమారు 10 సంవత్సరములు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో విద్యావిషయిక ప్రయోక్తగా పని చేశారు. ఆ సమయంలో విద్యా కార్యక్రమాలకు వన్నె తీసుకొని రావడమే కాక, అనేక లలిత గీతాలు, దేశభక్తి గేయాలు, సంగీత రూపకాలు, కవితలు రచించి ప్రసారింప చేశారు. ఆయన చేసిన సేవకు గొల్లపాలెం ప్రజలు స్పందించి, ‘వేదన’ అనే పుస్తకాన్ని ప్రచురించి, ఘనంగా సన్మానించారు. ఆయన పదవీ విరమణ సందర్భంగా అమలాపురం ప్రజలు కూడ ఘనంగా సన్మానించారు. ఆంధ్ర జ్యోతిలో వారం వారం రచించిన ఆయన వచన రచనలు ‘ఎందరో మహానుభావులు’ గా రూపు దిద్దుకున్నాయి. శ్రీరామభధ్రరావు మంచి కవిగా ఉత్తమ ఉపాధ్యాయునిగా గొప్ప వక్తగా కీర్తి నార్జించారు. ఆయన 8-10-1976 న దివంగతు లయ్యారు. 2005 జనవరి నెలలో ఆయన శతజయంతి హైదరాబాద్ త్యాగరాయగానసభలో వైభవంగా జరిగింది. ఆ సందర్భంలో ‘కందుకూరి రామభద్రరావు సమగ్ర సాహిత్యం’, ‘ప్రతిభామూర్తి (జీవిత చరిత్ర), “Searching strains and leaves from a diary”, శతజయంతి ప్రత్యేక సంచిక వెలువడ్డాయి
———–