తూముకుంట భీమసేనరావు (Tumukunta Bhimasenarao)

Share
పేరు (ఆంగ్లం)Tumukunta Bhimasenarao
పేరు (తెలుగు)తూముకుంట భీమసేనరావు
కలం పేరు
తల్లిపేరువెంకమ్మ
తండ్రి పేరుగుండూరావు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ6/27/1911
మరణం
పుట్టిన ఊరుకల్యాణదుర్గం తా. తూముకుంట
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుద్రౌపదీ స్వయంవరము, సౌగంధికాసహరణము, కర్మయోగి కల్లూరి
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికతూముకుంట భీమసేనరావు
సంగ్రహ నమూనా రచనఅనంతపురము జిల్లాలోని ఉన్నతపాఠశాలలో భారీ ఎత్తున సాహితీ వ్యాసంగములకు నాందిపలికి, విద్యార్థులకు సాహిత్యాభిరుచి కలిగించిన వారు శ్రీ భీమసేనరావుగారు. వారు (1950-71) వఱకు అమరాపురం, మడకశిర, కల్యాణదుర్గం ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి, పాఠశాలల సర్వతోముఖాభివృద్ధికే గాక ఆయాప్రాంతపు సాంఘికాభివృద్ధకి కూడ కృషిచేసిరి.

తూముకుంట భీమసేనరావు

అనంతపురము జిల్లాలోని ఉన్నతపాఠశాలలో భారీ ఎత్తున సాహితీ వ్యాసంగములకు నాందిపలికి, విద్యార్థులకు సాహిత్యాభిరుచి కలిగించిన వారు శ్రీ భీమసేనరావుగారు. వారు (1950-71) వఱకు అమరాపురం, మడకశిర, కల్యాణదుర్గం ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి, పాఠశాలల సర్వతోముఖాభివృద్ధికే గాక ఆయాప్రాంతపు సాంఘికాభివృద్ధకి కూడ కృషిచేసిరి.
వివిధ విషయములపై తమ అభిప్రాయములను పత్రికల ద్వారా పాఠకుల కందించ వలెననెడి తపన వీరిని రచయితగా మార్చినది తదుపరి వీరికృషి పరిశోధనలపై మరలి ‘ద్రౌపదీ స్వయంవరము’ ‘సౌగంధికాసహరణము’లపై భారతికి వ్యాసములు వ్రాసిరి. శ్రీ రూపావతారం నారాయణ శర్మగారి ‘నీలకంఠ విజయము’నకు విమర్శనాత్మకమైన పరామర్శ వ్రాసిరి. శ్రీ రూపావతారం గారితోకలిపి పద్మశ్రీ కల్లూరు సుబ్బరావుగారి జీవిత చరిత్రను ‘కర్మయోగి కల్లూరి’ అనుపేర చక్కని వచన రచన గావించి రాయలకళాపరిషత్ పక్షమున ప్రకటింపనున్నారు.
శ్రీ భీమసేనరావుగారు రచయితేకాదు, కృతిభర్తలు కూడ, కవి సవ్యసాచి కలుగోడు అశ్వత్థరావుగారు వేమన పద్యములను కన్నటీకరించి శ్రీ భీమసేనరావుగారి కంకితమిచ్చిరి. కృతికర్తయు శ్రీరావుగారు స్వర్ణకంకణముతో సన్మానించిరి. చిరకాలమైత్రికి చిహ్నముగా శ్రీ రూపావతారం నారాయణశర్మగారు ‘దేవయాని’ కావ్యమట శ్రీతూముకుంట వారికంకితమిచ్చిరి. రావుగారి సప్తతి శాంచి సందర్భముగా వీరి శిష్యులైన శ్రీ జి. చెన్నయ్య కవి తమ గురువుల జీవితమును ‘గురుసంకీర్తన’ మనుపేర ఒక శతకమును వ్రాసి వారి కంకితమిచ్చిరి.
పద్మశ్రీ కల్లూరు సుబ్బరావుగారి కనుచరులై వారిచే స్థాపింపబడిన రాయల కళాపరిషత్తునకు అధ్యక్షులై ఆసంస్థ పఓమున రాయలసీమలోని ప్రముఖ కవిపుంగవులను, నటశేఖరులను ఘనముగా సన్మానించిరి, వీరు నిర్వహించిన సాహితీకార్యక్రమములలో 1964వ సం.లో కల్యాణదుర్గంలో తొమ్మిది దినములపాటు నిర్వహించిన సభలో ఆంధ్ర-కన్నడ సోదరుల ఐక్యతాభావము వెల్లివిరిసినది.
1979లో శ్రీరావుగారికి కల్యాణదుర్గం సాంస్కృతిక సంఘమువారు శ్రీ చేబ్రోలు సుబ్రహ్మణశర్మ అధ్యక్షతన జరిగిన సభలో ‘సాహితీబంధు’ బిరుదము నిచ్చి సత్కరించిరి. 1980 మార్చి 23వ తేది అనంతపురములో వీరి స్తతి శాంతిమహోత్సవ సందర్భమున ఆనాటి సభకు అధ్యక్షత వహించిన శ్రీ లోలూరి హవమజ్జానకీరాశర్మ గారి సమక్షమున పలువురు కవి పుంగవులు మీని ‘దేశిక సార్వభౌమ’ అను బిరుదుతో సత్కరించిరి.
విద్యావేత్తగా, ఉపాధ్యాయ ఉద్యమనేతగా రచయితగా, కృతిపతిగా సాహితీబంధువుగా రాణించిన శ్రీతూముకుంట భీమసేనరావుగారికి నేటికి ఏడు పదుల వయస్సు, ఈ వయస్సులో కూడవారు సాహితీ వ్యాసంగమును, వదలక ఉత్సాహవంతులై నిర్వహించుచుండుట ఎంతయో ముదావహము.
వీరు కవిపండితులయెడ ఆదరణచూపు స్వభావము గలవారు, వీరిని శ్రీ సర్వేశ్వరుడు సదా రక్షించుగాత.

రాయలసీమ రచయితల నుండి….

———–

You may also like...