పేరు (ఆంగ్లం) | Bandameedapalli Bheemarao |
పేరు (తెలుగు) | బండమీదపల్లి భీమరావు |
కలం పేరు | – |
తల్లిపేరు | భాగమ్మ |
తండ్రి పేరు | హనుమంతరావు |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 6/1/1912 |
మరణం | – |
పుట్టిన ఊరు | మరూరు బండమీదపల్లె, అనంతపురం జిల్లా |
విద్యార్హతలు | యస్.యస్.యల్.సి. |
వృత్తి | సెకెండరీ గ్రేడు ఉపాధ్యాయులు |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | బాలతపస్వి , భక్త ప్రహ్లాద |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | బండమీదపల్లి భీమరావు |
సంగ్రహ నమూనా రచన | సీ. పసరంబు పొడువరా బరుగువాఱుచు జాఱి పడితివో యెందైన బుడుత నీవు? తోడి బాలురగూడి యాడెడివేళల గొట్టిరే వారలు పట్టి నిన్ను? ‘పెనుబూచి యిదెవచ్చెగను’ మంచు బెదరింప వెఱపొందితే చిన్నబిడ్డ నీవు? నీయాట వస్తువుల్ నేస్తగాండ్రెవరేని దస్కరించిరె ముద్దుతనయ తెల్పు |
బండమీదపల్లి భీమరావు
అనంతపురం పట్టణమున శ్రీ బండమీదపల్లి భీమారావును గూర్చి తెలియనివారు లేరు, వీరు అనంతపురము శ్రీ సాయిబాబా జూనియర్ కళాశాలలో 1944 నుండి సెకెండరీ గ్రేడు ఉపాధ్యాయులుగాచేరి అచ్చట 1972 వరకు పనిచేసి, విశ్రాంతి తీసుకొనిరి. చిన్నతనము నుండియు భీమరావు గారికి తెలుసు సాహిత్యముపై అభిలాషమెండు వీరికి వీరి మేనమామ దేశాయి రామచంద్రరావుగారు ప్రాథమిక విద్యతోబాటు తెనుగు పద్యపరనముపై పునాది వేసిరి. స్వగ్రామములో ఎనిమిదవతరగతి వరకు చదివి, పిదప మదనపల్లె దివ్యజ్ఞన ఉన్నతపాఠశాలలో ప్రవేశించి, యస్.యస్.యల్.సి. వరకు చదివి ఉత్తీర్ణులైరి. 1931-33 సం.లో బళ్లారిలో సెకెండరీగ్రేడ్ ఉపాధ్యాయుడుగా శిక్షణపొందిరి.
చిన్నతనము నుండియు నాటకప్రదర్శనపై అభిలాషగల భీమరావు గారు పిన్నవయసుననే ‘దుర్వాస గర్వభంగము’, ‘బాలతపస్వి’, ‘భక్త ప్రహ్లాద’ మున్నగు నాటకములు వ్రాసి పలుచోట్ల ప్రదర్శించి మెప్పుపొందిరి. బాలతపస్వియైన ధ్రువుడు తండ్రితోడ యొక్కబోగా, సవతితల్లి వానిని క్రిందికీడ్చినది. అప్పుడాతని మనసు క్రుంగి ఏకధారగా కన్నీరుగార్చినది. ఆ బుడతడు తనతల్లి కడకువెళ్ళగా ఆమె ఆ చిన్నారివాని నెత్తుకొని ఇట్లు ప్రశ్నించినది.
సీ. పసరంబు పొడువరా బరుగువాఱుచు జాఱి
పడితివో యెందైన బుడుత నీవు?
తోడి బాలురగూడి యాడెడివేళల
గొట్టిరే వారలు పట్టి నిన్ను?
‘పెనుబూచి యిదెవచ్చెగను’ మంచు బెదరింప
వెఱపొందితే చిన్నబిడ్డ నీవు?
నీయాట వస్తువుల్ నేస్తగాండ్రెవరేని
దస్కరించిరె ముద్దుతనయ తెల్పు
గీ. మేల ? పాల్గారు చెక్కిళు లెఱ్ఱవాఱె?
సిగ, యదేలొకొ ముడివీడి చిక్కువడియె
కంట తడిపెట్టగా నేమి కారణంబౌ
చెప్పుమా యేడ్వవలదు; నాచిన్నియన్న
ఇట్లతి సరళముగా వ్రాయుటచేతనే వీరికి సరసకవి బిరుదము లభించినది. వీరి పద్యములలో భావములుకూడ అద్భుతములే, వీరు రచించిన శ్రీ చంద్రమౌళీశ్వర శతకము నందలి ఒక పద్యమును చూతము.
కంటమంటలు, గళమున గరళముండ
చూపులో చల్లదనమును, తీపుమాట
యుండునాయని సందియ మొందుచుందు,
వృషభపురివాస చంద్రమౌళీశ శ్రీశ
‘స్వాతంత్ర్యసమర విజయము’, ‘ఏకాంతవాసి’ వీరి యితర అముద్రిత కృతులు.
శ్రీ భీమరావుగారు నిపుణులు, నిరాడంబరులు, నిస్వార్థసేవాపరాయణులు, కర్తవ్యదీక్షాదక్షులు. సద్గుణ సంపన్నులు. అనంతపురములో ముద్రింపబడు జిల్లాకవుల పుస్తకములందలి తప్పొప్పులను సరిదిద్దు ముఖ్యమైన పనిని వీరు చేబట్టి కవిపండితులకొక గొప్పసహకార మొనర్చిరి. వీరు కొన్నాళ్ళపాటు ‘లక్ష్మీస్వదేశీప్రెస్’లో మేనేజరుగా పనిచేసిరి. ఏడుపదుల వయసులోకూడ వీలు కల్గజేసుకొని, తామార్జించిన విద్యను విద్యార్థులకు ధారబోయుచు, సాహితీ సేవజేయుచు శాంతముగా తమ జీవితమును కడపుచున్నారు. వీరికి శ్రీ పరమేశ్వరుడు, ఆయురారోగ్య భాగ్యము లొసగి రక్షించుగాత.
రాయలసీమ రచయితల నుండి…….
———–