పేరు (ఆంగ్లం) | Puranam Subrahmanyasharma |
పేరు (తెలుగు) | పురాణం సుబ్రహ్మణ్యశర్మ |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | కథలు: ‘మిసిమి’ చౌదరిగారి నిష్క్రమణ, అడవి మొక్క, అదృష్టహీనులు, అనుకోని అతిథి |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | పురాణం సుబ్రహ్మణ్యశర్మ ‘‘అదృష్టహీనులు’’ |
సంగ్రహ నమూనా రచన | ఎటువంటి మహత్తర విషయాన్నైనా, చూసీ చూడ్డంతో యిటేట అవలీలగా గ్రహించేశకిత కొందరికుంటుంది. అదేవిషయాన్ని గ్రహించటానికొకప్పుడు కొందరికి కొంత కాలంకూడా పట్టచ్చు మరికొందరి విషయంలో – యిదే సత్యాన్ని గురితించేటందుకుగాను ‘అనుభవం’ పేరిట అనేక సంవత్సరాల జీవితకాలాన్ని వ్యర్థంగా వ్యయపర్చవలసి వస్తుంది. మానజవీవిత పరమ రహస్యాల్లో యిదొకటి. |
పురాణం సుబ్రహ్మణ్యశర్మ
‘‘అదృష్టహీనులు’’
ఎటువంటి మహత్తర విషయాన్నైనా, చూసీ చూడ్డంతో యిటేట అవలీలగా గ్రహించేశకిత కొందరికుంటుంది. అదేవిషయాన్ని గ్రహించటానికొకప్పుడు కొందరికి కొంత కాలంకూడా పట్టచ్చు మరికొందరి విషయంలో – యిదే సత్యాన్ని గురితించేటందుకుగాను ‘అనుభవం’ పేరిట అనేక సంవత్సరాల జీవితకాలాన్ని వ్యర్థంగా వ్యయపర్చవలసి వస్తుంది.
మానజవీవిత పరమ రహస్యాల్లో యిదొకటి.
సుబ్రహ్మణ్యానికి నలభైరెండేళ్ల ఫీసుజీవితంలో క్కనాడూ యీ విషయం గుర్తుకువచ్చిన పాపాన పోలేదు. ఇంతకాలం తను చలనం లేని శుష్కసంస్కారహీనమైన జీవితంలోనే వుంటూ వచ్చాడా? నిజానికిప్పుడతని దగ్గర మనస్సుని కుదుటపర్చుకోవటంకోసం కర్చుపెడదామంటే ‘కన్నీటిబొట్లు’ కూడా కరువేనా? ఈ యిరువైనాలుగేళ్ల ఆఫీసుజీవితం పూర్తికాగా యిక తనకుగాను మిగిలేది అస్థిమాత్రావశిష్టమైన ఒక్క శుష్క కాంకాళమేనా? ఎట్లాగైనా యీ జీవితంలోంచి తప్పించుకుని వురికి బయటపడితే బాగుండ్ననిపించింది సుబ్రహ్మణ్యానికి.
పద్దెనిమిదేళ్ళ చిన్నతనపు వయసుపొంగుల్లో, వెధవ ముప్ఫెమూడు రూపాయల ఆదాయాన్నపేక్షించితలను అమ్ముక్వలసివచ్చింది. ఆనాటి నుంచి క్రమంగా శరీరాంగాల్లో మానవికత పుటుక్కుమని తెగి కాలంతో శరీరానికి చాకిరీకి నిమిత్తం లేకుండా జీవితమంతా జీతపురాళ్లకోసం కర్చుపెట్టవలసి వచ్చిందంటే తల్చుకున్నప్పుడు సుబ్రహ్మణ్యానికి దుఃఖంగా వుండమంటే వుండదూ?
డబ్బుపోతే పోయిందని తెలియగానే విచారిస్తాడు, కాని వ్యర్థమయని వయస్సని వ్యర్థమయినట్లు తెలుసుకున్నప్పుడు మానవుడు ఎటువంటి వేదనకు గురి అవుతాడో వూహించటం కష్టం.
ఐతే అటువంటి వయస్సులో ఏ బాధ్యతల్నైతే, నెత్తిన వేసుకుని యీడ్చుకుంటూ ప్రపంచంలో తనూ ‘ఒక చిన్న వుద్యోగస్థుడిగా, ఒక సంసారిగా పెద్దమనిషిగా’ చలామణీ అవుతూ వచ్చాడో అటువంటి బాధ్యతలు బంధకాల్నుంచి విడిపించుకుని ఎక్కడికన్నా పరిగెత్తుకునిపోతే బావుండ్ననిపించేది ఒకప్పుడు ఎటువంటప్పుడు? తెగని కూడికల్తో బోలెడన్ని జమాకర్చుల్తో రూపాయి అణా పైసల్ని గిట్టించివలసివచ్చినప్పుడు.
మండు వేసంగిలోనైనా నిలువెత్తు కెరటాలు ఎగిరెగిరి మిడిసిపడ్తూండగా ఉత్సాహంతో జంట జంటలుగా విహంగమాల్లా జనం తిరుగాడుతూంటే అటువంటి కమ్మటి వాతావరణంలో సూర్యాస్తమయ శోభల్ని లోకం వేసుకునే చీకటి ముసుగులోని తర్యాలిన మననం చేసుకుంటూ స్నేహితుల్తో కులాసాగా కాలక్షేపం చెయ్యటానిక్కూడా వీలయ్యేది కాదు. తెగించి ఒక వేళ ఏ పార్కుకిగాని సినిమాకుగాని వుపన్యాసానికిగాని కులాసాగా నలుగురితో వెళ్ళదల్చుకున్నాడో సరిగ్గా ఆవాళ, చిట్టాకూడికలు నగదు మొత్తానికి సరిపోకపోవటమో, అసలు చిట్టాలోకి ఎక్కించవలసిన మొత్తాలు చూస్తూండగా బలిసిపోవటమో ఏదో ఒకటి విధిగా జరిగితీరేది. అదీ యిదీ గాకపోతే శెక్రటరీగారితో ఎవరో వస్తున్నారని ఆహ్వానించటం కోసం స్టేషనువరకు వెళ్లవలసి రావటమో, సంభవించేది సుబ్రహ్మణ్యానికి.
ఈవిధంగా ఎటువంటి ప్రముఖ సంఘటనల్తో తనకు సంబంధం ఏర్పడినా, ఎంతలేసి మహాత్ములు పండితులు కవులు సభలు చేసి విజ్ఞానం వెదజల్లినా, మాంచి రసవత్తరమైన నాటకాలు ప్రదర్శింపబడినా, చక్కని హృదయరంజకమైన పాట కచ్చేరీలు జరిగినా, ఆఖరికి ఒక్క దాంట్లోకూడా పాల్గొని సామాజిక జీవిత సుఖాల్నీ, అనుభవాల్ని పొందలేక పోయినాడంటే, వాటిమీద తనకుగల అభిరుచిని ప్రేమను క్రమంగా తగ్గించుకుంటూ ‘దేనితోనూ నాకిక జీవితంతో నిమిత్తం లేదు దరిద్రుడిగా పుట్టి దరిద్రుల్ని వుత్పత్తించి దేశాన్ని దారిద్ర్యంలోనే ముంచి నిష్ర్కమిస్తాను అన్న మాధ్యమిక దారిద్ర్య జీవితాంతర్గతఫలమైన వైరాగ్యాన్ని అలవర్చుకుని దుస్సహదుర్ని రీక్ష్యదర్భర దారిద్ర్యాన్ని యావజ్జీవితము విధిలేక భరిస్తూ ఆఖరికి ఏ చివర గడియల్లోనో ‘పెన్షను డబ్బుల’న్నా కళ్లజూడకుండా యీ యిహలోక యాత్రచాలించే వేలాదివేల ‘సుబ్రహ్మణ్యాలు’, జైళ్లలో దెబ్బలు తిని, యుద్ధాలలో కాళ్లూ చేతులూ విరగ్గొట్టుకుని, ఆకారణంగా రాజకీయపు కక్షల్లో వురి తీయబడి. దేశంనుంచి బహిష్కరింపబడినటువంటి ‘యోధానయోధుల దేశ భక్తుల’ జాబితాల్లోకి రాకపోయినా ఎందులోనూ వారికి మాత్రం తీసిపోరు.
ఎందువల్లనంటే ‘సుబ్రహ్మణ్యం’ వంటి గుమస్తాజీవులు గాంధిజీ, మాలవ్యా, తిలకు, గోఖే వంటి మహాపురుషుల ఛాయలోకేవారారు. ‘కాళిదాసు, భవభూతి, భాణుడు, శ్రీహర్షుడు’ వంటి పూర్వపురుషులకున్న ప్రాముఖ్యతన్నా లేదుకాని వీరమాత్రం అడివిలో ఎండిపోయిన మ్రాను చివర గాలివిసురికి పుటుక్కుమని విరిగి రాలిపోయే ఎండుపుల్ల ముక్కలు.
సుబ్రహ్మణ్యం వంటి బుర్రనమ్ముకున్న వ్యక్తులవల్న సమాజాలు పొదగబడవు. ఎదగనూ లేవు కానైతే సమాజంలో వీళ్లుమాత్రం గొప్పసేవల్ని కొద్ది ప్రతిఫలానికి చేస్తూ వచ్చారు.
బానిసబ్రతుకుకన్నా అధ్వాన్నమైన రీతిలో కష్టాలు పడుతున్నప్పటికి, సహిస్తూ, కడుపు చేత్తో పట్టుకుని, జీతపురాళ్లమీద ఆధారపడి పెద్ద పెద్ద గంపంతసంసారాల్ని యీడుస్తూ, పిల్లల్ని కంటూ చదువులు పెళ్లిళ్లు కార్యం కరామత్తులు చేయిస్తూ వున్నట్లుండి ఏదో ఒక సుముహూర్తాన మూటాములె సర్దుకుని పరలోకాలకు ప్రయాణమై పోయారు.
సుబ్రహ్మణ్యం కూడా అటువంటి కష్టీవుల్లో ఒకడు.
ఆవేళ సరిగ్గా జీతాలిచ్చేరోజు, ఇంపీరియలు బ్యాంకునుంచి చిల్లర క్రొత్తనోట్లుకూడా తెప్పించుకుని సిద్ధంగా వున్నాడు కూడా అప్పటికీ ఉదయం పదిన్నరకి, గుపెపడు మెతుకులు నోట్లో కుక్కుకుని, ఆదరాబాదరా దుస్తులు వేసుకుని, యిచ్చిన తమలపాకులకు వీధిలోనే నడుస్తూ సున్నం రాసుగుంటూ, దారిలో కనపడడ్డ ఎలక్ట్రికు స్తంభాలకు చెయ్యి తుడుచుకుని కుర్చిలో కూలబడే సరికి తలప్రాణం తోకకొచ్చింది.
రిక్షామీదగాని, సిటీబస్సుమీదగాని వచ్చినట్లయితే యింతకష్ట మనిపించదు కాని జీతపు డబ్బుల్నందుకుంటేనే గాని రిక్షానెక్కటానికి గాని, బస్సునందుకోవటానిగ్గాని తనకు సామర్థ్యమెక్కడిది?
అక్కడికి పెద్దపిల్ల తోట్లోపిల్లవాడికి పాలు నోట్లోపెడుతూ ‘నాన్నా’ ప్రక్కవాళ్లింటికెళ్లి పావలా చేబదులుతేనా? నడిచేం వెళ్తావులెమ్మని సర్దుకుని లేవబోయింది.
‘ఎందుకమ్మా నడక అలవాటేగా’ అని వారిస్తూ, ‘వద్దమ్మా లేవకు అట్లా చీటికి మాటికి పావలాలకు బేడలకు అందరిళ్లకూ అప్పుకి పోతే పరువు మర్యాద లుండవు. ఒక వేళ ఎదుటివాళ్లు లేదన్నా విసుక్కున్నా ప్రాణం చచ్చిపోయినట్లనిపిస్తుంది’. అంటూ వీధిలోకొచ్చి వుత్తరీయం ఒక్కమాటు గట్టిగా విదళించి పైనవేసుకుని రెండంగలు కూడా వెయ్యకుండానే మీనాక్షి గొణుక్కుంటూన్న వాక్యాలు వినపడ్డాయి ఏమని?
‘నాన్నా ఐతే యీ కుటుంబంకోసం యీ కుటుంబమర్యాదకోసం నువ్వొక్కడివే కష్టించాలా? నాన్నా ఎంత పిచ్చి నీకు’ అని.
సరిగ్గా ఆ నిమిషాన తోచింది ‘తన యావజ్జీవితము వ్యర్థమయిపోయినట్లు’ సుబ్రహ్మణ్యానికి. ఆ బాధే పైకి రాలేక కళ్లవెంబడి బొట్లు బొట్లుగా ధారకట్టి కోటుముడతల్లో యినికి ఫీసుకొచ్చే సరికి యెండిపోయింది.
నిజంగా వ్యర్థమయినటేనా? ఈ జీవితానికింక వూపిరి లేకుండా పొట్టకోసం ఎల్లవేళలా కషిటంచటమే పరమావధా? ప్రపంచంలో ఎంతలేసి ఘనకార్యాలిన మానవుడు యీ కొద్ధిజీవితకాలంలో నిర్వరితించి యశఃకాయుడటం లేదు తినో? తనువు పొధినిమిత్తమే యావజ్జివితాన్ని కుటుంబపోషణ కనే పేరుతో వ్యర్థంగా కర్చుపెట్టేస్తున్నాడే?
అవును మీనాక్షి అన్నమాటలో ఆయథార్థం రవ్వంతికూడా లేదు ఎందువలనంటే మన కుటుంబ మర్యాదకోసం, కుటుంబం కోసం తన తరవాత కష్టించేవారెవరు? ఒకవేళ తను పోతే తలుచుకునే వారెవరింక? నిజంగా అంతే కూడా. ఈవాళ సాయంత్రం కాలుడి ఆజ్ఞ ఐతే తను ప్రయాణానికి సిద్ధంగా వున్నాడా?
ఇంటా బయటా చేబదళు మినహాయిస్తే బోలెడన్ని అప్పులు యివన్నీ ఎవరు తీరుస్తారు? మూడు వేలకు అరగాని తక్కువైతే పిల్లను చేషుకోనన్న అల్లుడికి తనకుటుంబమర్యాదను నిలపవలసిన అవుసరం ఏం కలిగింది?
మీనాక్షికి మేనరికమే గనుక చేసివున్నట్టయితే యీ ప్రసక్తి తన కిప్పుడు వచ్చి వుండనవసరంలేదు రాఘువుడెవరు? తనసహోదరిగర్భవాసాన్న పుట్టిన దిక్కుమాలిన నిసువేగా ప్పుడయితే యిట్లా జరిగింది గాని యింతకుముందు కూడా ఎదురు మేరికం పనికిరాదు యివ్వకూడదంటూ వచ్చారుగా నలుగురూ తనయింట్లో తన పిల్లతో పెరిగి పెద్దగాడయి గడ్డాలు మీసాలు వస్తూండగా ఒకనాటి దౌర్భాగ్యపు సాయంత్రాన చేతికందే వయస్సులో వెధవస్కుల ఫైనలు పరీక్ష్ పోయిందన్న కారణంగా పరారయి యింట్లోంచి లేచిపోతే చచ్చాడో బ్రతికే వున్నాడో మళ్లీ వస్తాడో రాడో ఎట్లా తేలటం?
‘మీవాడు యుద్ధంలో చేరి మలయా సింగపూరు ప్రాంతాల్లో వుంటూ వుండవచ్చనీ, యుద్ధం అయిపోయినాక్కూడా అక్కడే వుండి పోతే నని పెళ్లాంబిడ్డల్తో నిమిత్తం లేకుండా అక్కడి స్త్రీలతో కాలక్షేపం చేస్తూంటాడని’ కొందరంటారు ఇది నమ్మశక్యంగా లేదు ఎందువల్లనంటే ‘రాఘవుడు’ నిజంగా అభిమానంకొద్దీ యింట్లోంచి వెళిలపోయుంటే, యీచతురంభోధి పరితభూవలయంలో ఎక్కడున్నా మీనాక్షి’ కోసమన్నా రాకపోతాడా అన్న ఆశ కొంతకాలం సుబ్రహ్మణ్యాన్ని బాధించెది.
‘రాఘవుడి’ వద్దనుంచి ‘మావయ్యా నేను ఫలానా చోట వున్నాను. జీవితంలో స్థిరపడ్డా. అన్న వుత్తరంముక్కన్నా ఎక్కడ్నుంచీ వూడి పడలేదు.
ఇంక ఏ ఆశమీద రాఘవుడు బ్రతికివుంటున్నాడనుకుంటూ ఎంతకాలం ఎదిగిన కూతుర్ని ‘పెళ్లి పెటాకులు’ చెయ్యకుండా అట్టే బెడ్తాడు. క్రమంగా మేనరికపుటాశ జీర్నించిపోగా ‘భగవంతుడా ప్రభూ యింతచేశావా యిన్నేళ్లు పెంచిన మేనల్లుడ్ని దాచి మాయంచేసి నాటక మాడ్తున్నావా?’ అని విలపిస్తూ మూడువేల పైబడిన వ్యయంతో మగోపై సంబంధాన్ని చేసి కూతురికి కనెనదెర విడిపించానని పించుకున్నాడు సుబ్రహ్మణ్యం.
‘మీనాక్షి‘కూడా యిందు కేమాత్రం అభ్యంతరాన్ని సూచించలేక పోయింది. ఆ పిల్లమనస్సులో ఏమేమి వూహించుకున్నదో, ఏమనుకున్నదో, ఏమేమి తీర్మానించు కున్నదో ఎవరికీ తెలియదు కాని క్రొత్తమనిషిని యిట్టే పెళ్లాడేసింది. వెంటవెంటనే చాలా గుట్టుచప్పుడుగా ఎక్కువ హృదయభారంతో పిల్లనత్తవారింటికి పంపటం వెళ్లిన మూడు నాలుగు మాసాలకే ఒక గర్భం నిలవటం మళ్లీ ఐదారుమాసాలు పైబడకుండా సీమంతోత్సవాల్ని జరిపి గాజులు తొడిగించి పిల్లనింటికి తీసుకురావటం అన్నీ చకచక జరిగిపోయినై. సుబ్రహ్మణ్యానికి ‘మనవడ్ని’ఎతుతకునే అదృష్టం కూడా అచిరకాలంలోనే కలిగింది కలిగినా ఆ సంతోషరేఖ అతని ముఖసీమలో ఎక్కడా కంచుకాగడాల్తో వెదకిచూచినా కనపడ్డంలేదు.
సహజంగా యిప్పుడు ‘రాఘవుడ్ని’గూర్చి ఎవ్వరూ ఎక్కువగా ఆ యింట్లో ప్రసంగించటానికి కిష్టపడరు. ఏ రైలుక్రిందో చెరువులోనో పడి అసువుల్ని చాలించి వుంటాడని విన్నప్పుడు ‘రాఘవుడి’కోసం ఎవరైతే ఎక్కువగా గిలగిల్లాడి బాధపడివున్నారో వారే ఆ ’మీనాక్షి సుబ్రహ్మణ్యా’లే క్రమ క్రమంగా అతడ్ని గూర్చి స్మరించవలసి వచ్చినపుడు మళ్లీ ఎన్నటికీ తిరిగి రాకుండా వుంటేనే బావుండ్ననే ఆలోచనకు వచ్చారంటే, కాలప్రవాహంలో ఎంతటి ఆప్తులైనా ఎట్లాకొట్టుకుపోగలరో బోధపడక మానదు.
పూర్వం రాఘవుడు చదువుకునే గదిని, వాడి పుస్తకాల్ని, వాడి బట్టల్ని – ఆ రోజున పైమీద ఒకే ఒక వుత్తరీయంతో గృహపరిత్యాగం చేసిన నాట్నించి కొన్నాళ్లవరకూ మహాచారిత్రకమైన వస్తువులుగా భావించి యింటి పాదీ చూసుకున్నాడు. త యెందుకు? ఆఖరికి ‘మీనాక్షి’ శోభనం నిమిత్తం ఆ గదిని కాళీచేసి పక్కనమర్చవలసి వచ్చినప్పుడు ఒక్కొక్క ప్రియబాంధవుడి సంస్మరణచిహ్నాన్నీ అంటే పక్కచుట్ట పుస్తకాల్ని చొక్కాల్ని తీసి ఒక మూలకు నిరుపయుక్తాలుగా గిరాటుపెట్టవలసి వచ్చినపుడు అదే రాఘవుడిగదిలో రాఘవుడితో కాకుండా మరొక వినూత్నవ్యక్తితో మీనాక్షిని కలుపుతున్నాననే శంకతో సుబ్రహ్మణ్యం మనస్సెంతగా క్షోభించి వుంటుందో ఎవ్వరూహించగలరు?
ఎప్పుడూ ఆంత్యంలో ఒక ద్వంద్వ యుద్ధం జరుగుతూండేది సుబ్రహ్మణ్యానికి. దానికి మనవడు కలిగాడనే సంతోషం లేకపోవటం ఒక కారణం. కూతురిమీద ప్రేమకొద్దీ ఎత్తుకుని లాలించినా ‘యీ నిసువు తనకేమీ కాదేమో’ అన్పించేది మనస్సులో.
‘వీడు నీ మనవడేగదా వాడ్ని నువ్వు పరిపూర్ణంగా అభిమానించి నష్కలమ్మషంగా ఎందుకాదరించలేవు?’ అని ప్రశ్నించేది మనస్సు.
‘వీడితండ్రి నా కూతుర్ని ఏలటంకోసం నాదగ్గర గుంజిన మూడువేలకి ఫలితం అందువల్న నేను అథఃపాతాళానికి అంటే భవిష్యత్తులో నేను చచ్చేదాకా తీర్చవలసినంత అప్పుకి ఫలితం వీడు నా కూతుర్ని ప్రేమించినంతగా వీడ్ని ప్రేమించలేక పోతున్నాను.’ అని సమాధాన మిస్తుంది అంతరాత్మ.
తిరిగి మనస్సు వూరుకుంటుందా తర్జనభర్జనలు చేస్తానంటుంది ఏమని? ఓయి సుబ్రహ్మణ్యమా యి దేమి పఓపాతం నీకు రాఘవుడి కొడుకే ఐతే నీ వెట్లా ప్రేమించి వుండేవాడివి? ఇది నీకు ధర్మంకాదు రాఘవుడివలన మీనాక్షికి కలిగితే ఎట్లా దరించి ప్రేమించేవాడివో అట్లానే యీ పిల్లవాడ్ని కూడా ఎందుకు చూడవు?’ అని. దీన్ని పూర్వపక్షం చేస్తూ అంతర్యంలో యిట్లా ధ్వనిస్తుంది. ‘ఒకప్పుడు నీవన్నట్లు రాఘవుడే నాకూతుర్ని ఏలటం సంభవిస్తే వాడి కొడుక్కి యిట్ట అధర్మం జరిగే అవకాశానిన వాడు ఒక్కనాటికి సఈష్టించుకునేవాడుకాదు ఎందువల్లనంటే రాఘవుడితో నాకుగల బాంధవ్యం అర్థజ్ఞానాతీతమైన ప్రేమసంబంధం’ అని.
గతించిన జీవితాన్ని తలపోసుగుంటూ భవిష్యత్తు నెందుకు దుఃఖభాజనం చేసుగుంటావన్న ప్రశ్నకు సమాధానం మాత్రం దొరకలేదు సుబ్రహ్మణ్యానికి.
ఆఫీసులో జవానుకూడా సుబ్రహ్మణ్యం వాలకాన్ని చూసి నవ్వుతాడు దర్శనార్థం వారింటికి పోయినప్పుడలాల మేనేజరుగాకుండా యన కొడుకు సైతం ‘మయాయ’అని అథార్టీ చెయ్యబోతాడు. నలభైయేళ్ల పై బడిన మనిషిని తన్ను యన భార్య ‘ఏం వోయి సుబ్రహ్మణ్యమూ బజార్లోంచి వచ్చేటప్పుడు నాలుగుకొట్లు చూసి వంకాయలన్నా తెచ్చిపెట్టక పోయావా, చస్తూంటే యింట్లో మీ మీనేజరుగారివల్ల ఒక్కపనీకాదు ఎందుకూ పనికి రారులే’ అంటుంది. ఆయనకూతురు ‘పంతులూ యిటుచూడు’ అంటూ ఏదో పూరమాయిస్తుంది.
‘ఓయి భగవంతుడా వీళ్ల నెత్తుటిలోనే యింత చలాయింపుతత్వంయిమిడివుందేమయ్యా’ అనుకుని వస్తుబోతూంటాడు సుబ్రహ్మణ్యము.
కాని యీవాళ యీ తరహా ఆలోచనలతో మనస్సు పాడుచేసుగుని బాధపడుతన్నా ‘పంచేంద్రియాలు’ యంత్రప్రాయంగా తమపని తాము చేసుగుని పోతున్నై. దరెందరో తమకాతాల్లో పెద్ద పెద్ద మొత్తాల్ని జమకట్టారు. తన చేతుల్తో పేమెంట్లు చేస్తూ వచ్చాడు కూడితే జమలన్నీ టక్కున సరిపడ్డాయి. అటువైపు కర్చుల మొత్తంకూడా కూడితే ‘యిక పని అయినట్టే’ అనుకుని యింతలో ‘యీవాళ నెలాఖరుగదూ – ఏది జీతాలబిల్లు’ అని జవాన్ని రెవెన్యూ అణాబిళ్లల్ని అంటించమనిచెప్పి పెద్దనోట్లను చిన్న నోట్లను నూనిమరకలు పడ్డవాటిని కొద్దిగా చిరిగిన వాటిని వేరుచేస్తూ, చిల్లర లెక్కపెట్టడంలో నిమగ్నుడైపోయాడు.
రోజూ యింతే సరిగ్గా నిలవల్నీ తేల్చేటప్పుడు గుండెలు పిచుపిచుమనేవి. ఈ వెధవ షరాబు వుద్యోగం యింతేగదా. దినదిన గండం వెయ్యేళ్లాయుస్సు. అనుకుంటూ ఆఫీసుకి రాంగానే శ్రీరామ అరచేతిలో వ్రాసుకొంటే యినపెపట్టి తాళం చెవుల్ని ముట్టుకునేవాడు కాదు. ఆ శ్రీరామమూర్తికటాక్షవీక్షణపరం పర చేతనే యిటువంటి ఆఘాతాలు లేకుండా తనపని తాను చేసుగుంటూ నమ్మకస్తుడైన వ్యక్తనిపించుగున్నాడు కూడా.
నేడు ఆ శ్రీరామచంద్రమూర్తికూడా కాసంత శీతకన్ను వేశాడు. అంతా తారుమారయింది. ఎన్న లెక్కలు సరిచూసినా ఎన్ని వందల మాట్లు కూడినా తక్కువొస్తుంది రెండు వేలు. తలమీద పిడుగు పడినట్లయింది. ఒకవేళ పిడుగు పడితేనన్నా ‘అర్జున – ఫల్గుణ – పార్థ – శేవతవాహన – కిరీటి’ అనొచ్చు. ఈ పిడుక్కు ఏ మంరతం కూడా పారేట్టులేదు.
అనుకున్నంత పనీ అయింది. గుండె ఝల్లుమంది సుబ్రహ్మణ్యానికి. ఎప్పుడు ఎవరికి ఎక్కువిచ్చాడో ‘రెండువేలు’ అంటే ఐదురూపాయల నోట్లకట్టలు రెండు తిక్కువన్నమాట. సుబ్రహ్మణ్యం మొగాన కత్తివ్రేటుకు నెత్తురుచుక్కలేదు. ఆఖరికి మేనేజరుకూడా నానాతంటాలు పడిచూశాడు. నిజమే రెండువేలు ఎక్కువ యివ్వటం ఎవరికో జరిగింది.
సుబ్రహ్మణ్యానికి మనస్సు మనస్సులో లేదు. బయట వానజల్లు, కొద్దిగా అప్పుడప్పుడూ యీదురుగాలి. మధ్య మధ్య వికారంగా పిట్టల అరుపులు. పెద్ద పెద్ద చెట్ల మధ్యనుంచి బీతాంగంగా రివటలుకొట్టే దెయ్యపుగాలి. సన్నివేశాన్ని అతిభీభత్స కరంగా చిత్రించి వేశాయి.
తెప్పరిల్లుకుంటూ – ‘వెళ్లి మనం కొందరు కాతాదార్లవద్ద దర్యాప్తు చెయ్యాలి. దానివల్ల ఏదన్నా ఫలిత ముంటుందని తోస్తోంది నామట్టుకి. మీ రేవంటారు.’
మేనేజరు నవ్వుతున్నాడు అట్టహాసంగా నవ్వు మద్యలో ఆపి సరే నువ్వన్నట్లు వెళ్తామయ్యా – అసలు యింట్లోకాలు బయటపెట్టడానికీ వానొకటిగా శనల్లే. జట్కా ఎవడు కట్తాడు యీ ముసురులో.
సుబ్రహ్మణ్యానికి మనస్సులో నడిచి పోదామనే ఉంది. ఆ మాట పైకంటే అసలే అధికారి అందులో కతి, కల్లు త్రాగింది – ముల్లు గుచ్చుకుంది – నిప్పుకూడా తొక్కింది. ఎక్కడ కోపవివశుడవుతాడో అన్నభయంతో ‘నేనే వెళిల జట్కా పిలుచుకొస్తాను తెమిలి నట్టేనా మీరు.’ ఇంకా వెకిలినవ్వు నవ్వుతూనే వున్నాడు. వున్నట్లుండి ‘వెళ్లవయ్యా వెళ్లి పిల్చుకురా అని మళ్లీ ఏమనుకున్నాడో ఏమో వుండు సుబ్రహ్మణ్యం నువ్వెళ్లరా పాపయ్యా అని మరొకడ్ని పంపాడు.
జట్కావచ్చి నిల్చుండి. వాత తగ్గేట్టు లేదు. వాడు అయిదురూపాయలు కావాలన్నాడు. సుబ్రహ్మణ్యం ఏమాత్రం అడ్డు చెప్పలేదు. మేనేజరు యీ కర్చుకూడా నువ్వే భరించాలి సుమా అన్నట్లు చూశాడు.
‘చిత్తం మహాప్రభో నిండా ములిగినవాడికిహచలేమిటి?’ అంటూ మనస్సులో రెండువేలు నష్టంకాగా దు ముష్టివెధవ రూపాయలు మన ప్రాణాని కడ్డుపడతాయా అనుకున్నాడు సుబ్రహ్మణ్యం.
విలవలు తీసి కాతాలో రెండువేలు నష్టం చూపించి వూరిమీద ఎవరెవరైతే పెద్ద మొత్తాలు పట్టుకెళ్లారో వాళ్లందరీ గడపలు ‘అమ్మా – బాబూ’ అని బ్రతిమాలుకుంటూ తిరిగాడు సుబ్రహ్మణ్యం. లేకపోయింది ఫలితం. ఈ జట్కారుసుం కూడా జులుములా వదిలింది.
మేనేజరు కూడా సుబ్రహ్మణ్యానికి పట్టిన అవస్థకు జాలిపడుతూ చెప్పలేక ‘రేపుసాయంత్రంలోగా మీ రీసొమ్ము భర్తీచెయ్యాల్సి వుంటుంది. జ్ఞప్తిలో వుంచుకోండి.’ అని హెచ్చరించి జట్కాదిగి వెళ్ళిపోయాడు. మేనేజరు ఏడుస్తూ అనుకున్నాడు ‘ఎవరు చేసిన కర్మ వారనుభవింపక ఎవరికైనను తప్పదన్నా’ అని. కొంతసేపటికి జట్కావాడు ‘ఎక్కడ దింపమంటారు బాబూ, అని అడిగిన ప్రశ్నకు దింపమంటారు బాబూ, అని అడిగిన ప్రశ్నకు సుబ్రహ్మణ్యం ‘గంగలోకి’ అని మాత్రమనగలిగాడు. జట్కావాడు ఏమాలోచించుకున్నాడో ఐతే యిక్కడ దిగి పొండిబాబూ’ అంటూ పరీక్షకోసం అగ్గిపుల్ల ముట్టించి బీడీ ముట్టించుకుని వెలుతుర్లో సుబ్రహ్మణ్యం ముఖాన్ని పరీక్షగా చూసి గుఱ్ఱాన్ని నిలేశాడు. మాట్లాడకుండా దిగి ఐదు రూపాయలు వాడిమొహాన పారేసి పెద్ద పెద్ద అంగలు వెయ్యనారంభించాడు. త్వరగా యింటిముఖం పడుతూన్నకొద్దీ హృదయం భారమైపోసాగింది. సందులన్నీ తిరిగి యింటి మళుపులో లాంతరు స్తంభం వెలుతుర్లోకి వచ్చేసరికి సుబ్రహ్మణ్యానికి వళ్లుకూడా స్వాధీనం తప్పిపోయింది.
ఇక వున్నట్లుండి లాంతరు స్తంభం నీడని యిసకలో కూర్చుండిపోయి బిగ్గరగా గొంతెత్తి ఏడువనారంభించాడు. చీకటి వాన యింకా కురుస్తూనే వున్నది. యించుమించుగా అర్థరాత్రి సమయం. యీ నిర్భాగుయడి దుఃఖాన్ని వినడానికింకా ఎవరు మేలుకోమంటారు? ఆ కొద్ది వెలుగులో పొంగి పొరలి వస్తూన్న దుఃఖానికి చెలియలికట్టను వేయలేక చిన్న పిల్లవాడేడ్చినట్టు గొంతెత్తి ‘అమ్మా అమ్మా’ అని ఆ స్తంభాన్ని కావలించుగుని మరీ వాపోసాగాడు. జల్లుజల్లుగా కురుస్తూన్న వాన ముసురేసుకు పోతున్నదనే ఉత్సాహంతో కప్పలు సంతోషంతో అరుస్తున్నాయి.
ఒకటి రెండు పందులు మోరలెత్తి చెవులు నిక్కించి వింటున్నాయి. రెండు కుక్కలు కాస్సేపు మొరిగి దగ్గరకు వచ్చినిల్చునివిచిత్రంగా కళ్లు పెద్దవిచేసి కూర్చుని సావకాశంగా సుబ్రహ్మణ్యంయొక్క దుర్బలత్వాన్ని నిస్సహాతకు తమవంతు సానుభూతిని వ్యక్తపరుస్తున్నాయి.
సరిగ్గా అటువంటి లాంతరు స్తంభం నీడను ఒక జట్కావచ్చి ఆగిపోయింది.
‘ఎందుకాపావు, పోనియ్యి…’ లోపల్నుంచి ఎవరో జట్కావాడ్ని ప్రశ్నించారు. బండివాడు దిగి ‘దారికడ్డంగా ఎవరో మనిషిపడి ఏడుస్తున్నాడు? ఏం చేసేది’
ఆ బండిలోని వ్యక్తికూడా నేల కురికాడు యీ నిర్భాగ్యుడ్ని పరీక్షించేందుకు గుఱ్ఱం కూడా డెక్కల్ను చప్పుడు చేస్తూ తలను డించి నిలబడిపోయింది.
ఆ మనిషి యీ అపరిచితవ్యక్తిని లేవనెత్తి ప్రశ్నించాడు ‘ఏమయ్యా ఎవరు నువ్వు యిటల్ యెందుకు పడిపోయావని?’ సుబ్రహ్మణ్యం కళ్లు తెరిచి పరీక్షిస్తున్నాడు ఎవరీ అపరిచతుడని. నల్లటి వుంగరాలజుట్టు మనిషి వేషం కట్టు ఉత్తర హిందూస్థానీ వేషం. గుడ్డిదీపం వెలుగులో ఆకర్షణీయంగానే వున్నాడు. ఆ ఆజానుబాహువు జాలిపడుతూ ‘ఎవరు బాబూ మీరు? ఎక్కుతారా మీ క్ష్టిదగ్గర దిగుదాం’ ఆ వ్యక్తి నిదానంగా సుబ్రహ్మణ్యం సమాధానం కోసం కనిపెట్టుకోకుండా బండిదగ్గరకు జట్కావాడి సాయంతో నడిపించుకు పోసాగాడు.
సుబ్రహ్మణ్యానికి తెలివి కలిగింది. ‘ఎందుకు? యిదే మా యిల్లు – వెళ్లిపోతాను.’ అంటూ వంకర తిరిగిన మెట్లకేసి చూపిస్తూ ఆ సన్నటిదీపపు వెలుగులో కృతజ్ఞతాపూర్వకంగా చేతులెత్తి ‘నమస్కారంనాయనా’ అంటూ ముందుకు మెల్లిగా పురోగమిస్తూ ‘అమ్మాయీ’ అని తలుపుమీద మూడుసార్లు తట్టి, ‘ఇక మీరు వెళ్లవచ్చు’ అంటూ మళ్లీ హెచ్చరిస్తూ వెనుదిరిగిచూశాడు.
ఆ మెట్లు చీకట్లోకి తీసుకుపోయేటట్లున్నాయి. ఆయింటి కప్పుద్వారాన్ని కూడా కటిక చీకట్లో ముంచివేసింది. వాన జల్లి తడిసిన గచ్చుమీద యిసక బర బర లాడుతోంది.
ఆ అపరిచితుడు సందేహిస్తూ అట్లానే నిల్చుండిపోయాడు. అతని పాదాలు కర్తవ్యాన్ని బోధించినా మనస్సు ‘యింకా కాస్సేపు యిక్కడ గుదా’మని సలహాయిస్తోంది.
సుబ్రహ్మణ్యం ‘మీనాక్షీ మీనాక్షీ’ అని యింకా బిగ్గరగా అరిచాడు. అతనట్లా వుచ్చరించిన నామాక్షారాలు అపరిచితుడి హృదయ కవాటాలమీదుగా దూసుకుని పోయినై.
ఆ తలుపు తెరుచుకుంది. క్రొత్తగా వుట్టిపడిన మాతృత్వశోభలో ‘మీనాక్షి’ అద్భుతంగా వుంది. ఆ అపరిచితుడు కూడా పోల్చుకున్నవుత్సాహంతో, ‘మీనాక్షీ – మీనాక్షీ’ అని ముందుకు వంగి ‘మావయ్యా’ అంటూ సుబ్రహ్మణ్యాన్ని రెండు చేతుల్తోనూ హృదయానికి హత్తుకున్నాడు.
మీనాక్షి చేతిలోని హరికెనుదీపాన్ని బక్కున నేలకు వదిలేసి విస్తుబోయి చూస్తూ నిలబడింది.
వాడు రాఘవుడు.
అతడ సుబ్రహ్మణ్యము.
మె మీనాక్షి.
నిజంగా కొన్ని సంవత్సరాల క్రితం ఏరాఘవుడైతే అభిమానం కొద్దీ స్వజనాల్నీ బంధు మిత్రాదుల్ని వదలి బొంబాయి చేరుకుని మార్వాడీలవద్ద గుమాస్తాగా కుదురుకున్నాడో ఆ రాఘవుడు తన స్వప్రయోజకత్వంవల్ల నైతే నేమీ, అదృష్టంవల్ల నైతే నేమీ వ్యవహారదక్షుడై క్రమక్రమంగా పైకి వచ్చి విదేశాలకు కూడా పోయి డబ్బు సంపాదించుకుని అప్పుడు మేనమావ కూతుర్ని జ్ఞప్తకి తెచ్చుకుని వస్తే యింకా ఎక్కడి మేనమామ కూతురు?
రాఘవుడికి సర్వం అర్థమయింది. ఆ యింట్లో ఒక్కమాటు, తనంతట తాను తన స్థానన్ని నిర్మూలించుగున్నాడు. ఇప్పుడు నిజంగా తన కాయింట్లో స్థానం లేదు. మీనాక్షి తన కెవరు? ఏమీ కాదు. తను బ్రతికి వున్నట్లు వ్రాసిన వుత్తరాలన్నీ అందినపాపాన పోలేదు.
మర్నాడు సాయంత్రం రాఘవుడు సామాను బండి కెత్తుతూ ‘రెండు వేల రూపాయలకు’ చెక్కు వ్రాసి మేనమామ కిస్తూ ‘శెలవు మావయ్యా. మీనూ’ అని గ్గబట్టకున్న స్వరంతో ‘నువ్వు కూడా నేను చచ్చిపోయానే అనుకున్నావా? ఎంత పనిచేశావ్ మీనూ’ అంటూండగా.
రాఘవుడి కళ్లలోంచి ముత్యాలు తొంగి చూశాయి. మీనాక్షి కొడుకుచిట్టిచేతుల్ని పట్టుకని దండం పెట్టించింది. రాఘవుడు ప్రీతిగా చెయ్యి వూపాడు బండిలోంచి నవ్వు తెప్పించుగుంటూ.
———–