పేరు (ఆంగ్లం) | M.H.V.Subbarao |
పేరు (తెలుగు) | ముటుకూరు హనుమద్వేంకట సుబ్బారావు |
కలం పేరు | యం.హెచ్.వి.సుబ్బారావు |
తల్లిపేరు | |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | కల్ ఆజ్ ఔర్ కల్, కాంక్షారమ్య, కాంతి కిరణం, కీచురాయి, కొత్తమొలకలు |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | యం.హెచ్.వి.సుబ్బారావు కల్ ఆజ్ ఔర్ కల్ |
సంగ్రహ నమూనా రచన | శ్రీరస్తు చిరంజీవి సౌభాగ్యవతియైన మా భార్య జానకికి ఆశీర్వచనములు. క్షేమం, అక్కడ పిల్లలు అందరూ క్షేమమని తలుస్తాను లేఖాంశములు. రంగసానిని నువ్వెరుగుదువు గదా. పోయిన సంవత్సరం మనవూరి గోపాలస్వామి కోవెల్లో వుత్సవాలకి గజ్జెకట్టింది. రాజమండ్రినించి వచ్చిందని జనమంతా విరగబడి చూశారు. చూడు అదే రంగసాని. నిన్న ఇక్కడ నాకు కనిపించింది. పాపం, ప్రస్తుతం ఒంటరిగా బ్రతుకుతోందట. మొన్న మన వూరు వచ్చినప్పుడు ఎంత చలాకీగా, వుత్సాహంగా వుంది. యిప్పుడు మనిషి ఏమీలేదు. బాగా తీసిపోయింది. |
ముటుకూరు హనుమద్వేంకట సుబ్బారావు
(యం.హెచ్.వి.సుబ్బారావు)
కల్ ఆజ్ ఔర్ కల్
శ్రీరస్తు చిరంజీవి సౌభాగ్యవతియైన మా భార్య జానకికి ఆశీర్వచనములు. క్షేమం, అక్కడ పిల్లలు అందరూ క్షేమమని తలుస్తాను లేఖాంశములు.
రంగసానిని నువ్వెరుగుదువు గదా. పోయిన సంవత్సరం మనవూరి గోపాలస్వామి కోవెల్లో వుత్సవాలకి గజ్జెకట్టింది. రాజమండ్రినించి వచ్చిందని జనమంతా విరగబడి చూశారు. చూడు అదే రంగసాని. నిన్న ఇక్కడ నాకు కనిపించింది. పాపం, ప్రస్తుతం ఒంటరిగా బ్రతుకుతోందట. మొన్న మన వూరు వచ్చినప్పుడు ఎంత చలాకీగా, వుత్సాహంగా వుంది. యిప్పుడు మనిషి ఏమీలేదు. బాగా తీసిపోయింది. ఏదో దిగులుతో కృషించిపోతున్న దానిలా కనబడుతోంది… అసలు మనవూళ్లో కలుసుకున్నప్పుడే నాతో అన్నది.
‘‘అమ్మగారిలాంటి ధర్మతల్లి పాదాల దగ్గరబడి వూడిగం చేసుకుంటే ఎన్ని పాపాలైనా పోతాయని’’ దానికి నీదగ్గర వుండి నీ సేవ చేయాలని వున్నదట మనిద్దరం పార్వతీ పరమేశ్వరుల్లా వుంటామట.
నా సంగతి నీకు తెలుసు గదా వట్టి జాలిగుండె ఎవరు ఆపదలో వున్నా కాదనలేను. అలాగే కానిమ్మన్నాను. మీ అక్కకి రాస్తాను, అన్నీ ఏర్పాట్లూ చేస్తుంది అని చెప్పాను. దాన్ని నాతో తీసుకువస్తాను. పాపం, అది సుఖంగా పెరిగిందేమో దానికి యిబ్బందీ కలక్కుండా చూడు.
అది యింట్లోకి వస్తే కొన్ని చిక్కులున్నాయనుకో. పిల్లలు దాన్ని ముట్టుకున్నప్పుడల్లా జంధ్యాలు తడుపుకొని బట్టలు మార్చుకోవాలి. కాని ఏం చేస్తాం మరి. అందుకే అది అస్తమానం ఇల్లంతా కలియతిరక్కుండా దన్ని మేడమీదే వుంచేద్దాం. అది వండితేమనం ఎలాగా తినం. కాబట్టి నీవే యింత వండి, నీవింత తిని, దానికింత పడేస్తే సరిపోతుంది. వండి వార్చేపని ఎలాగూ లేదు గనుక అస్తమానం మడి వాళ్లకంటపడకుండా దాన్నక్కడే మేడమీదే దిగకుండా వుంచేసి వేళకి యింత అన్నం పంపుతూంటే సరి. అదే పడుంటుంది.
మొదటినుంచీ రాజులదగ్గర మెదిగిన మనిషి. కష్టానికి వోర్చుకోలేదు. కాబట్టి యీ విషయాలన్నీ నీవే స్వయంగా చూడు. పిల్లలకి కూడా చెప్పి అట్టే పెట్టు, నాన్నగారు ఒక పిన్నిని తీసుకొస్తన్నార్రా అని. తరవాత వాళ్లు ఎవరో అని తెల్లబోకుండా, నేను నాలుగురోజుల్లో బైలుదేరి వస్తున్నాను. ఏర్పాట్లన్నీ చేసి వుంచుతావని నమ్మతాను. ఇట్లా రాసినందుకు ఏమీ అనుకోకు.
ఇట్లు
రాజశేఖరశాస్త్రి వ్రాలు
మహారాజరజాశ్రీ శ్రీవారి పాద పద్మములకు నమస్కరించి తమ చరణదాసి జానికి వ్రాయు విన్నపములు.
తమరు వ్రాసిన లేఖ అందినది. మీ చమత్కారమునుచూసి మురిసిపోయినాము. గం అమ్మ్మగారు చూసి ‘కొంటె గోపాలకృష్ణుడు. అన్నీ వాళ్ల తాతగారి పోలికలే’ అని ఎంతో ఆనందించినారు. ఇక నా విషయం, మీరు నా పాతివ్రత్యాన్ని పరీక్షించడానికే యిట్లా రాశారని నమ్ముతున్నాను. లేకపోతే నేను ఎప్పుడైనా కాదంటానా మీ సుకం కంటే నాకీ జన్మలో యింక కోరుకోవలసిందేముంది? చివర్న మీరు రాసిన మాటలు ‘‘యిట్లా రాసినందుకు ఏమీ అనుకోకు’’ అన్నవి నా తలకొట్టేసినట్లు వున్నాయి నేనా? నేనేనా ఏమైనా అనుకునేది? నా స్వామి తన సుఖాన్ని కాంక్షించి ఏదైనా పనిచేస్తే దానికి అడ్డు తగిలేంత పామర స్త్రీ ననుకున్నారా? మీరా ముక్కలు రాసేటప్పుడు మా సంప్రదాయాన్ని మర్చి పోయారనుకుంటాను. మా పుట్టింట్లో ఆపనీ యీపనీ చేస్తూ వుండేవాడే, ఖాదర్ అనే కుర్రాడు మేం అంతా అన్నయ్యా అని పిలుస్తూ వుండే వాళ్ళం. వాడు మా పని మనిషికి మొగుడు పోయిన మూడేండ్లకి మా యింట్లో వుంటూండగా కలిగిన కొడుకు. ఓరోజున అది పొట్టమీద గుండ్రాయితో కొట్టుకుంటూంటే మా అమ్మచూసి, ‘‘ఓసి నీ ఇల్లు బంగారంగానూ, ఎందుకే ఇలాటి అఘాయత్యప్పన్లు చేస్తావ్’’ అని చీవాట్లు పెట్టి తీసుకొచిచ పురుడు పోసిందట. వాడు పుట్టాకే మేమంతా పుట్టాం. అలాంటి సంప్రదాయంలో పుట్టిన నేను మీ సుఖాని కడ్డువస్తనా? కుష్ఠు వాణ్ణి గంపలో కూర్చోబెట్టుకుని వేశ్యఇంటికి మోసుకుని పోయిన సతీసుమతి రక్తం నాలో ప్రవహిస్తోంది. మీరేమీ సంకోచించకుండా ఆమెను ఇంటికి తీసుకు రండి. మళ్లీ మరొక్కసారి చెబుతున్నాను. మీ సుఖమే నా సుఖం. త్వరలో వస్తారని ఎదురుచూసే
మీ
సహధర్మచారిణి
జానకి.
జానకీ,
ఈ వుత్తరం నీకు ఎలా రాయాలో నాకు బోధ పడడంలేదు. జీవితపు అంచున నిలబడి నీ తీర్పు కోసం ఎదురుచూస్తున్నానంటే నమ్ముతావా? దార్లు చీలిపోయేచోట నిల్చుని అయోమయంలోపడ్డ ప్రయాణీకుణ్ణి నేను. నిజానికి నా జేబులో టిక్కెటుటంది. అయితే, నా హృదయంలోని సర్వశక్తులూ. పాలోని బుద్ధీ, చైతన్య, స్పందన, అన్నీ నా గమ్యం అటుకాదని చెబుతున్నాయ్ విధాతకోసిన ఆ టిక్కెట్టుకి కాన్సెల్లేషనూలేదు. ఎక్స్ఛేంజీలేదు. ఆ విషయం నాకు తెలుసు. కాని ఏం చెయ్యను? నాలోని బుద్ధీ, విచక్షణా మనస్సుని జయించలేక పోతున్నాయి. నాకు తెలుసు నేను టిక్కెటుటలేని ప్రయాణీకుణ్ణే అవుతానని కాని ఏం చెయ్యను? ఏనాటికయినా ఆ మార్గలోనే నాగమ్యం వున్నదని నా కనిపిస్తున్నది. అక్కడికి చేరుకుంటేనే నాకు ప్రశాంతి లభ్యమౌతుంది. నాలోని ప్రతి అణువూ ఆ ప్రశాంతినే కోరుతోంది.
జానకీ నన్నుచూస్తే నీకు అసహ్యంవేస్తోంది గదూ అవును. నలభయ్యోపడిలో యిలాటి జంజాటంలో ముగ్గురు పిల్లల తండ్రి యిరుక్కున్నాడంటే ఎవరికి గౌరవం వుంటుంది? జానకీ యీ నా పరిణామానికి అర్థం నాకు తెలుసు గనుకనా ఒకరితో చెప్పుకునేందుకు? యీ సంఘర్షణలో పడి నేను ఎంత నలిగి పోతున్నానో నీకు చెప్పుకునే అర్హత నాకు లేదు. అయినా తప్పదు. ఏదో ఒకనాడు విషయమంతా నీకు వివరించవలసిందే. విషయం యింకా మభ్యపెట్టి యిటు నిన్నూ, అటు సుజాతనీ యిద్దర్నీ మోసం చెయ్యలేను.
జానకీ మనం ఎంతో ప్రేమించుకున్నాం గదూ. మనం కాలేజీల్లో కలుసుకోలేదు. తోట్లల్లో, దొడ్లల్లో పడి ప్రేమగీతాలు పాడుకోలేదు. పెళ్ళికాక ముందువిన్న అరగంట చూశాను. ఆ అరగంటలో నిన్ను చూడగానే వులిక్కి పడ్డాననీ, జన్మజన్మలుగా నేను వెదుకుతోంది. నీకోసమేనని అప్పుడే తెలుసుకున్నాననీ చెప్పను. ఆ రోజు నిన్ను చూసీ బాగుంది అనుకున్నాను. నీ అందాన్ని క్రిటికల్‘గా గూడా చూశాను. అంతమంది వుండగా మంచి నీళ్ళు నిన్నే ఎందుకు తెమ్మన్నారనుకున్నావ్? నీ నడక తీరు పరీక్షించేందుకు గోడవారగా కుర్చీలో కూర్చున్న నేను నువ్వు వంటింటి గుమ్మంలోంచి వస్తోంటే వెడుతోంటే నీ ‘ప్రొఫైల్ని’ జాగ్రత్తగా చూశాను. నువ్వు నాకు నచ్చావు. నీ జాతకం మా నాన్నకు నచ్చింది. మీ నాన్న చెక్కుబుక్కు మా అందరికీ నచ్చింది.
పెళ్ళిలో మాటమాటికీ నీ చెయ్యి పుచ్చుకోమని ఆదేశిస్తోన్న పురోహితుడికి లోలోపల నేనెతో కృతజ్ఞత తెలియపరచుకున్నాను. మెత్తని పువ్వులాంటి నీ చెయ్యి నా చేతుల్లో ఎంత నలిగి పోయిందో, ఆ రోజు నువ్వు నాకేసి ఎంత కోపంగా చూశావో గుర్తుంది. కాని ఏం చెయ్యను? నేను ముట్టుకున్న మొట్టమొదటి ప్రాజ్ఞురాలైన స్త్రీవి నువ్వు.
ఆ తరువాత వెచ్చవెచ్చగా గడిచిపోయిన మొదటి రోజులు… నిన్ను ప్రేమించి పెళ్లాడలేదని నేను ఏనాడూ అనుకోలేదు. మొదటి రోజుల వేడి తగ్గిపోయాక గూడా మన మేనాడూ పోట్లాడుకోలేదు. ఒకరి నొకరు కష్టపెట్టుకోలేదు. మనది ఎంతో అన్యోన్య దాంపత్యం గదూ. ఎప్పుడైనా చిన్న చిన్న కలతలు వచ్చినా ఎంత హాయిగా రాజీపడేవాళ్ళం మనం. నీ మృదుల స్వభావమూ, వివేకమే మన యింటిని అంత ఆనందమయం చేశాయని నేను యీ నాటికీ నమ్ముతన్నాను. నీ పేరు ఎత్తగానే మనసంతా తృప్తితో, హృదయం నిండి పారిజాత పరిమళం అలముకున్నట్లు హాయిగా అనిపిస్తుంది. చెప్పుకోడానికి సిగ్గేస్తున్నదిగానీ, నేనింకా నిన్ను వెనుకటిలాగే ప్రేమిస్తున్నాను.
సుజాత బొత్తిగా నువ్వెరగనిది కాదు. బహుశా నాలోని యీ కోణమే నీకు పూర్తిగా అపరిచితమైనదేమో. కవులు ఒక రకం ఆకర్షణని ‘దివ్యప్రేమ’ అంటారు. బహుశా అది వేరు కావచ్చు. లేకపోతే కవులకి అలవాటైన గారడీ పదాల్లో అదీ ఒకటి కావచ్చు. ఏమైనా ఒకటి మారతం నిజం. ఇది ఆకర్షణ మారతం అవును. ఆకర్షణ దురవిలంఘ్యమైన ఆకర్షణ, క్వైట్ యిన్డిస్పెన్సిబిల్ రెక్కలుతెగినా, మంటలలోబడి మలమల మాడిపోయినా దీపం చుట్టూ ప్రదక్షిణం చెయ్యడంలో ఎంత ఆనందం వుందనీ.
యింకా ఎక్కువగా రాయదలుచుకోలేదు నన్ను నేను సమర్థించుకోడమూ లేదు. మనం యధాప్రకారంగా జీవించవచ్చు. పిల్లలకుగానీ, నీకుగానీ ఏలోటూ వుండదు.
ఏమైనా నా జీవితం యిప్పుడు నీ చేతుల్లో వుంది. నిన్ను ఎక్కువగా విసిగించడం, అసహ్యంగానూ, స్వార్థంగానూ వుంటుంది. దయచేసి యీ విషయాన్ని నిరుద్రేకంగా ఆలోచించు.
మరో విషయం గూడా నీకుస్పష్టం చేస్తున్నాను. నీ తీర్పుకి అదేదైనాగానీ కట్టుబడి వుంటాను.
ఇట్లు
నీ రాజు
రాజశేఖరరావుగారికి
నమస్కారములు మీ వుత్తరం అందింది. మీ సమస్యని నిరుద్రేకంగా ఆలోచించి నా నిర్ణయాన్ని రాయమన్నారు. అంటే ‘నేనూ యిందులో ఓ పాత్రని’ అన్న ముక్క మరచిపోయి అభిప్రాయం యివ్వాలి. అంతేకదూ. బాగానే వుంది. సినిమాల్లో అయితే ముడి ఫిలిం కోటా అయిపోగానే ఎవరో ఒకర్ని చటుక్కుని చంపేస్తారు. కాని యీ దౌర్భాగ్య జీవితంలో మన కోటా ఎంతో మనకి తెలీదు.
———–