పేరు (ఆంగ్లం) | Gudipudi Indumatidevi |
పేరు (తెలుగు) | గుడిపూడి ఇందుమతీదేవి |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | గుడిపూడి రామారావు |
పుట్టినతేదీ | 1/1/1890 |
మరణం | – |
పుట్టిన ఊరు | పాత గుంటూరు. |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | అంబరీష విజయము, నర్మద నాటకం, తరుణీ శతకము, మంగళాద్రి నృసింహ శకతము, నీతి తారావళి, లోకావలోకనము, సోదరి, లోకావలోకనము, జన్మ భూమి, రామకథామంజరి, రాజరాజేశ్వరీ నక్షత్రమాల, గోపవిలాపము సీతారాముల పాటలు, గాంధీ పాటలు, రామాయణ గానసుధ |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | కవిసింహి గృహలక్ష్మి స్వర్ణకంకణము- 1959 సాహిత్య ఎకాడమీ ఉత్తమ రచయిత్రి సత్కారం 1965 |
ఇతర వివరాలు | పుట్టినింటిపేరు మతుకుమల్లి. వీరి తాత మతుకుమల్లి నృసింహశాస్త్రి బొమ్మిదేవర జమీన్దారుల ఆస్థాన కవి. సోదరుడు నరసింహశాస్త్రి కూడా కవి. భర్త గుడిపూడి రామారావు. ఈమె పదవయేట రచనావ్యాసంగం ప్రారంభించేరు. అనేక సన్మానాలు పొందేరు. విజయవాడలో అనేక సభలలో పాల్గొని, మంచి వక్తగా పేరు పొందారు. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | గుడిపూడి ఇందుమతీదేవి |
సంగ్రహ నమూనా రచన | 1959 ఏప్రిల్ 26 న కేసరి గారి జన్మదిన సందర్భమున గృహలక్ష్మీ స్వర్ణకంకణం పొందిన కవిసింహి గుడిపూడి ఇందుమతీదేవి గారు కవిపండిత వంశమగు మతుకుమల్లి వారింటి ఆడపడచు. వీరి తాతగారు నరసింహ శాస్త్రిగారు ప్రసిద్ధ కవి, పండితసింహుడు. పదవయేటనుండే చిన్న పద్యములు, గేయములు రచించినది. తాతగారు ఇందుమతీ పరిణయమను కావ్యము రచించి వీరికి ఇందుమతి అని పేరిడగా తాతగారి అడుగుజాడలలో నడువవలెనని లక్షణా పరిణయము అను కావ్యము రచించి తమ పుత్రికకు లక్షణ అను నామముంచినారు. |
గుడిపూడి ఇందుమతీదేవి
1959 ఏప్రిల్ 26 న కేసరి గారి జన్మదిన సందర్భమున గృహలక్ష్మీ స్వర్ణకంకణం పొందిన కవిసింహి గుడిపూడి ఇందుమతీదేవి గారు కవిపండిత వంశమగు మతుకుమల్లి వారింటి ఆడపడచు. వీరి తాతగారు నరసింహ శాస్త్రిగారు ప్రసిద్ధ కవి, పండితసింహుడు. పదవయేటనుండే చిన్న పద్యములు, గేయములు రచించినది. తాతగారు ఇందుమతీ పరిణయమను కావ్యము రచించి వీరికి ఇందుమతి అని పేరిడగా తాతగారి అడుగుజాడలలో నడువవలెనని లక్షణా పరిణయము అను కావ్యము రచించి తమ పుత్రికకు లక్షణ అను నామముంచినారు.
ఇందుమతీదేవి గారు 1889 ఏప్రిల్ లో పాత గుంటూరు నరహర్యాక్ష రాయడు, అనంతలక్ష్మమ్మ గార్లకు జన్మించినారు. తల్లిదండ్రులను వారి వంశమును ఎంతగానో కీర్తించినదీ కవయిత్రి. 1901లో రామారావు గారితో వివాహము జరిగినది మొదలు భర్త గారు వీరి సాహిత్యాభిమానమునకు ఎడతెగని ప్రోత్సాహమునందించిరి.
రచనలు—అంబరీష విజయము, లక్షణా పరిణయము, తరుణీ శతకము, రాజేశ్వరీ శతకము, నీతి తారావళి, నరసింహ శతకము, లోకావలోకనము, సోదరి, గోవిలాపము, ఆంజనేయ స్తుతి, జన్మభూమి, నర్మద(నాటకము), రామాయణ గానసుధ(రామాయణమంతయూ కీర్తనలుగా), రామకధా మంజరి(వచన రామాయణ గ్రంథము), గాంధీ కీర్తనలు, మందారమాల అన్నియు ప్రసిద్ధమైనవే. బహుళ గ్రంథకర్త్రి, పాండితీగరిమ గలిగినవక్త యైన వీరికి త్రిలింగపీఠమువారు, విశిష్టాద్వైతమత ప్రచార సంఘమువారు, సాంగ వేదకళాశాలవారు మొదలగు ప్రముఖులెందరో బిరుదులొసంగినారు. బిరుదులు –కవయిత్రీమణి, ఉభయభాషాప్రవీణ, సతీమణి, కవిసింహి, మధురకవయిత్రి, విద్వత్కవి శిరోమణి కవితాశారద మున్నగు బిరుదములన్ని యు తన ఇష్టదైవమైన భద్రాద్రి రామునకే అంకితమొనర్చినది. వసుచరిత్రను చదివిన పిదప తనకీ కావ్యము వ్రాయవలెనని తోచెనని చెప్పిన ఈమె లక్షణా పరిణయము ఆ కావ్యమును పోలియుండును. అంతకుమునుపే తిరుపతి వేంకటకవులు లక్షణాపరిణయము అను మూడాశ్వాసముల కావ్యమును ఆశువుగా(తాటికొండ రామారెడ్డి గారి కోరికపై) చెప్పినారు. భాగవతమున లేని శుకదౌత్యమును చేర్చినారు. ఇందుమతీదేవి గారు కూడా వీరిననుసరించి శుకదౌత్యమును చేర్చినారు. జంటకవుల కావ్యముకన్న నెక్కువగా వర్ణనలు ఈ కవయిత్రి చేసిరి. అంతియే కాక మద్రేశుడు కూతురు లక్షణను అత్తవారింటికి పంపినపుడు చక్కని నీతిబోధ కావించినట్లు వ్రాసిరి. ఇది ఈ కావ్యము యొక్క ప్రత్యేకత. ఈమె మరణానంతరము ఈమె రచించిన ఇతర గేయములు,ఖండకావ్యములు, వ్యాసములు అన్నియు కలిపి మందారమాల అను పేరిట ప్రచురించిన గ్రంథమునకు పీఠిక విశ్వనాథ సత్యనారాయణ గారు వ్రాసినారు.
———–