పువ్వాడ శేషగిరిరావు (Puvvada Seshagirirao)

Share
పేరు (ఆంగ్లం)Puvvada Seshagirirao
పేరు (తెలుగు)పువ్వాడ శేషగిరిరావు
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ7/12/1906
మరణం5/24/1981
పుట్టిన ఊరుమొవ్వ, (కృష్ణాజిల్లా)
విద్యార్హతలుఉభయభాషాప్రవీణ, పి.ఒ.యల్. పట్టములు
వృత్తితెలుగు పండితులు, ఆంధ్రోపన్యాసకులు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్venu@puvvadakavitha.com
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుశతపత్రము, తాజమహలు,గోవత్సము,దారా,ఆంధ్ర తేజము,రేడియో నాటికలు,మధు కలశము,రక్త తర్పణము,అపసృతులు, పాలవెల్లి,ఆంధ్ర సామ్రాజ్యం (ఆసంపూర్ణం)
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికపువ్వాడ శేషగిరిరావు
సంగ్రహ నమూనా రచనకవిపాదుషా’ పువ్వాడ శేషగిరిరావు సాహిత్యం, పద్య కవిత్వం అజరామరమని, పద్యాన్ని చదవడంలో ఆయనకు ప్రత్యేక శైలి వుందని మాజీ మంత్రి, కృష్ణాజిల్లా రచయితల సంఘం గౌరవాధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్‌ కొనియాడారు.

పువ్వాడ శేషగిరిరావు

కవిపాదుషా’ పువ్వాడ శేషగిరిరావు సాహిత్యం, పద్య కవిత్వం అజరామరమని, పద్యాన్ని చదవడంలో ఆయనకు ప్రత్యేక శైలి వుందని మాజీ మంత్రి, కృష్ణాజిల్లా రచయితల సంఘం గౌరవాధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్‌ కొనియాడారు. చినుకు మాసపత్రిక, స్పందన సాహితీ సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో పువ్వాడ శేషగిరిరావు స్మారకోపన్యాస సభ ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు పువ్వాడ తిక్కన సోమయాజి రచించిన పద్య కవితా సంపుటి ‘అక్షరధామం’ గ్రంథాన్ని ఆవిష్కరించారు.
స్పందన సాహితీ సమాఖ్య అధ్యక్షులు గుత్తికొండ సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో మండలి ప్రసంగిస్తూ పద్య కవితా పితామహుడు, కవి పాదుషావారి రచనలు ఎంతో ప్రాచుర్యాన్ని పొందాయన్నారు. ‘తాజమహలు, శతపత్రం’ వంటి కండకావ్యాలు తెలుగు సాహితీరంగంలో చిరస్థాయిగా నిలిచాయన్నారు. తెలుగు పండితులుగా, ఉపన్యాసకులుగా అయన పలు కళాశాలల్లో పని చేశారని, పద్యకావ్యాలు, గద్యకృతులు, బుర్రకథ, నాటకాలు ఎన్నో రాశారని, అన్నీ తెలుగునాట ప్రాచుర్యాన్ని పొందాయన్నారు. కృష్ణాజిల్లా మొవ్వ గ్రామంలో 1906లో జన్మించారని, ఆయన జన్మించి 105 సంవత్సరాలయినా అయన ఆశయాలను, సిద్ధాంతాలను, రచనలను బ్రతికించడం కోసం ఆయన కుమారుడు తిక్కన సోమయాజ చేస్తున్న కృషి ప్రశంసనీయమైనదన్నారు.

———–

You may also like...