ఆదిరాజు వీరభద్రరావు (Adiraju Veerabhadrarao)

Share
పేరు (ఆంగ్లం)Adiraju Veerabhadrarao
పేరు (తెలుగు)ఆదిరాజు వీరభద్రరావు
కలం పేరు
తల్లిపేరువెంకమాంబ
తండ్రి పేరులింగయ్య
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ11/16/1890
మరణం9/28/1973
పుట్టిన ఊరుఖమ్మం జిల్లా, మధిర మండలం, దెందుకూరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుబిజిలి సంపాదనము 1
తెలంగాణ 9 జిల్లాల చరిత్రను, భాగ్యనగరం గ్రంథాలను కూడా రచించారు.
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికఆదిరాజు వీరభద్రరావు
సంగ్రహ నమూనా రచనరావిచెట్టు ప్రోత్సాహం, సహాయంతో ఆదిరాజు చాదర్‌ఘాట్ ఉన్నత పాఠశాలనుండి విద్యనభ్యసించి, రావిచెట్టు రంగారావు ఇంట్లో నెలకొల్పిన శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం గ్రంథాలయానికి తొలి గ్రంథపాలకుడిగా ఆదిరాజు వీరభద్రరాజు నియమితులైనాడు

ఆదిరాజు వీరభద్రరావు

ఇతను 1890 నవంబరు 16న ఖమ్మం జిల్లా, మధిర మండలం, దెందుకూరు గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. చిన్న వయస్సులో ఉన్నప్పుడే తండ్రి లింగయ్య మరణించాడు. తల్లి వెంకమాంబ ఇతన్ని మంచి చదువు చదివించాలని తలచి దూరపు బంధువైన రావిచెట్టు రంగారావును ఆశ్రయించింది. రావిచెట్టు ప్రోత్సాహం, సహాయంతో ఆదిరాజు చాదర్‌ఘాట్ ఉన్నత పాఠశాలనుండి విద్యనభ్యసించి, రావిచెట్టు రంగారావు ఇంట్లో నెలకొల్పిన శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం గ్రంథాలయానికి తొలి గ్రంథపాలకుడిగా ఆదిరాజు వీరభద్రరాజు నియమితులైనాడు
1908లో కొమర్రాజు లక్ష్మణరావు యొక్క విజ్ఞాన చంద్రికా మండలి హైదరాబాదు నుండి మద్రాసుకు తరలి వెళ్ళవలసి వచ్చిన తరుణంలో, లక్ష్మణరావు విజ్ఞప్తి మేరకు వీరభద్రరావు కూడా మండలిలో పనిచేయటానికి మద్రాసు వెళ్ళారు. మండలిలో పనిచేస్తున్న సమయంలో అనేక ప్రసిద్ధ రచయితలు, కవులు, పండితులు మరియు పరిశోధకులతో పరిచయం ఏర్పడింది. లక్ష్మణరావుచే ప్రభావితుడై, ఆయన మార్గదర్శకత్వంలో చక్కని పరిశోధకునిగాను, బాధ్యతాయుత రచయితగాను శిక్షణ పొందారు. 1914లో హైదరాబాదుకు తిరిగివచ్చి మహబూబ్ కళాశాలలో తెలుగు ఆచార్యునిగా నియమితుడయ్యారు. ఆ తరువాత ఛాదర్‌ఘాట్ ఉన్నత పాఠశాలలోనూ, నారాయణ గూడలోని బాలికోన్నత పాఠశాలలోనూ తెలుగు పండితునిగా పనిచేశారు. మర్రి చెన్నారెడ్డి ఇతని శిష్యులలో ప్రముఖుడు.
1921లో తెలంగాణ సాహితీ సాంస్కృతిక వికాసానికై ఆంధ్ర పరిశోధక మండలి స్థాపించినప్పుడు దానికి కార్యదర్శిగా ఆదిరాజు పనిచేశారు. ఆ సంస్థ తెలంగాణ లోని పలు చారిత్రక ప్రదేశాలు, శిలా శాసనాలు, తాళపత్ర గ్రంథాలు సేకరించి “తెలంగాణ శాసనాలు” పేరిట పెద్ద గ్రంథాన్ని ప్రచురించుటలో ఆదిరాజు కృషి నిరుపమానమైనది. కాకతీయ రాజ్య పతనానంతరం ఓరుగల్లును ఏలిన సీతాపతి (షితాబుఖాను) చరిత్రను వెలువరించారు. తెలంగాణ 9 జిల్లాల చరిత్రను, భాగ్యనగరం గ్రంథాలను కూడా రచించారు.
ఇతడు శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయంలో లైబ్రేరియన్‌గా, కార్యదర్శిగా, అధ్యక్షుడిగా పనిచేశారు. విజ్ఞానచంద్రిగా గ్రంథమాల కార్యాలయ ప్రముఖుడిగా, ఆంధ్ర జనసంఘ కార్యవర్గ సభ్యుడిగా, లక్ష్మణరాయ పరిశోధకమండలి కార్యదర్శిగా, ఆంధ్ర సారస్వతపరిషత్తు స్థాపక సభ్యుడిగా, ఆంధ్ర చంద్రికా గ్రంథమాల ప్రధాన సంపాదకుడిగా, విజ్ఞానవర్ధినీ పరిషత్తు సభ్యుడిగా, సంగ్రహాంధ్ర విజ్ఞానకోశ ప్రధాన సంగ్రాహకుడిగా, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ విశిష్ట సభ్యునిగా ఇతడు తన సేవలను అందించారు.
అలనాటి దక్కన్ రేడియోలో తెలుగులో మొట్టమొదటి ప్రసంగం చేసిన ఘనత ఈయనకే దక్కింది

———–

You may also like...