పేరు (ఆంగ్లం) | Jayanti Ganganna |
పేరు (తెలుగు) | జయంతి గంగన్న |
కలం పేరు | – |
తల్లిపేరు | సూరమ్మ |
తండ్రి పేరు | సూర్యనారాయణ |
జీవిత భాగస్వామి పేరు | సత్యనారాయణమ్మ |
పుట్టినతేదీ | – |
మరణం | 1/1/1962 |
పుట్టిన ఊరు | శ్రీకాకుళం |
విద్యార్హతలు | – |
వృత్తి | ఉపాధ్యాయుడు |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | ఎన్నో జానపద గేయాలు వ్రాశారు. అయ్యో కొయ్యోడా, విలాపము |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | జయంతి గంగన్న |
సంగ్రహ నమూనా రచన | జయంతి గంగన్న శ్రీకాకుళంలో 1884లో సూర్యనారాయణ, సూరమ్మ దంపతులకు జన్మించాru. ఇతడు మెట్రిక్యులేషన్ శ్రీకాకుళంలో ముగించి రాజమండ్రిలో ఉపాధ్యాయ శిక్షణ పొందారు. ఇతడు తన 11వ యేట 5యేళ్ల వయసు వున్న సత్యనారాయణమ్మను వివాహం చేసుకున్నారు. ఇతనికి ఎం.ఎ. చేయాలని కోరిక ఉండేది. కానీ ఇతని జాతీయ భావాల కారణంగా కళాశాల ప్రిన్సిపాల్ మార్క్ హంటర్ ఇతని దరఖాస్తును తిరస్కరించారు. దానితో రాజమహేంద్రవరంలోని వీరేశలింగం ఆస్తికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా చేరి ఆ తరువాత ప్రధానోపాధ్యాయుడిగా పనిచేశారు. |
జయంతి గంగన్న
జయంతి గంగన్న శ్రీకాకుళంలో 1884లో సూర్యనారాయణ, సూరమ్మ దంపతులకు జన్మించాru. ఇతడు మెట్రిక్యులేషన్ శ్రీకాకుళంలో ముగించి రాజమండ్రిలో ఉపాధ్యాయ శిక్షణ పొందారు. ఇతడు తన 11వ యేట 5యేళ్ల వయసు వున్న సత్యనారాయణమ్మను వివాహం చేసుకున్నారు. ఇతనికి ఎం.ఎ. చేయాలని కోరిక ఉండేది. కానీ ఇతని జాతీయ భావాల కారణంగా కళాశాల ప్రిన్సిపాల్ మార్క్ హంటర్ ఇతని దరఖాస్తును తిరస్కరించారు. దానితో రాజమహేంద్రవరంలోని వీరేశలింగం ఆస్తికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా చేరి ఆ తరువాత ప్రధానోపాధ్యాయుడిగా పనిచేశారు. నవల రచయిత కొవ్వలి లక్ష్మీనరసింహారావు ఇతని శిష్యుడు. బొబ్బిలిరాజా తన సంస్థానంలో ఒక పాఠశాలను నడపవలసిందిగా ఇతడిని కోరగా తిరస్కరించారు. అలాగే ఆంగ్లేయ ప్రభుత్వం ఎన్నో అవకాశాలను ఎరచూపినా వాటిని తిరస్కరించారు. ఈయన ఎన్నో రచనలు, కావ్యాలు వ్రాశారు. వాటిలో హరిశ్చంద్రోపాఖ్యానము, సుమబాల అను చాళుక్య చోళ సమ్మేళనోదంతము, కంఠమాల, నీతి సూచనలు, ఎన్నో పాఠ్యపుస్తకాలు ఉన్నాయి. ఇతనికి జానపద సాహిత్యం అంటే ఎంతో మక్కువ. ఎన్నో జానపద గేయాలు వ్రాశారు. వాటిలో ప్రాచుర్యం పొందిన “అయ్యో కొయ్యోడా”, “విలాపము” మొదలైనవి ఉన్నాయి. ఈయన భలే పెళ్లి అనే సినిమాలో నటించారు. 1903లో ఒక లిఖిత పత్రికను నడిపారు. ఈయన 1962లో మరణించారు.
భలే పెళ్ళి సినిమాలో డాక్టర్ కూచిభొట్ల శివరామకృష్ణయ్య, జయంతి గంగన్న, ఇటీవలే పుట్టిల్లు సినిమా తీసి ఉన్న గరికపాటి రాజారావు, సురభి గోవిందరావు కూతుళ్ళూ, తదితరులు నటించారు. అయితే భలే పెళ్ళి నాగేంద్రరావును సినిమా ప్రపంచంలో నిలబెట్టలేకపోయింది. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న ఆ రోజుల్లో, సినిమాలు తీయటానికి ఫిల్ము కూడా కరువైన ఆ రోజుల్లో మద్రాసు అంతా ఖాళీ అయ్యి సినిమా చిత్రనిర్మాణం బాగా కుంటుపడగా, నాగేంద్రరావు తిరిగి నాటకాలాడించుకోవటానికి బందరు వెళ్ళిపోవలసివచ్చింది.
———–