పేరు (ఆంగ్లం) | Pilaka Ganapati Sastry |
పేరు (తెలుగు) | పిలకా గణపతిశాస్త్రి |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 2/24/1911 |
మరణం | 1/2/1983 |
పుట్టిన ఊరు | తూర్పు గోదావరి జిల్లా కట్టుంగ గ్రామం |
విద్యార్హతలు | – |
వృత్తి | రాజమహేంద్రవరం ఆంధ్ర యువతీ సంస్కృత పాఠశాలలోను, వీరేశలింగం పాఠశాలలోను తెలుగు పండితుడుగా పనిచేశాడు.ఆంధ్ర శిల్పి, ఆంధ్రభారతి, ఆంధ్రప్రభ వంటి పత్రికలకు సహాయ సంపాదకుడుగా పనిచేశాడు |
తెలిసిన ఇతర భాషలు | సంస్కృతాంధ్రాంగ్లాల్లో ప్రావీణ్యమే కాక హిందీ, బెంగాలీ, ఫ్రెంచ్ భాషల్లో కూడ ప్రావీణ్యం ఉంది . |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | నవలలు: విశాల నేత్రాలు , హేమపాత్ర – విప్రనారాయణ కథ ఆధారంగా, అశోకవర్ధనుడు – అశోక చక్రవర్తి కథ, మీనాంబిక, కాశ్మీర పట్టమహిషి గృహిణి – నాటకరంగం నేపథ్యంలో నటీనటుల సంబంధాలు-దాంపత్య జీవితంపై వాటి ప్రభావాలు చిత్రీకరిస్తూ వ్రాయబడిన పెద్ద నవల. ఈ నవలను తన అర్ధాంగి శ్యామలకు అంకితమిచ్చాడు. ప్రాచీన గాథాలహరి వచనానువాదాలు: వ్యాసభారతం, హరివంశం, దేవీ భాగవతం, గృహ దహనం – శరత్‌బాబు బెంగాలీ నవల, రెడ్ లిల్లీ – అనటోల్ ఫ్రాన్స్ ఖండకావ్యాలు: విభ్రాంతామరుకము, రత్నోపహారం |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ బహుమతి |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | పిలకా గణపతి శాస్త్రి ధర్మ దీక్ష |
సంగ్రహ నమూనా రచన | ఆవుదూడ ‘అంబా ‘ అని గొంతెత్తి అరిచింది ! గోధూళి వేళ అయ్యేసరికి ఆళవీ గ్రామంలో నందగోపాలుని ఆలమంద అంతా తిరిగి వచ్చి వేసింది. కాని ఒకే ఒక్క ఆవు తిరిగి రాలేదు . బాగా చీకటి పడింది . అయినా ఇంకా ఆవు తిరిగి రాలేదు . గోశాలలో గోవత్సాలన్నీ తోక లెత్తి పెట్టి ఎంతో సంతోషంగా పాలు కుడుచుకుంటున్నాయి . కాని ఆ ఒక్క ఆవుదూడ మాత్రం ‘అంబా ‘ ‘అంబా ‘ అని అదేపనిగా అరవడం మొదలు పెట్టింది . ఆ దూడ పుట్టినప్పటి నుంచీ నందగోపాలుని ఇల్లంతా పాడి పంటలతో కలకలాడింది . |
పిలకా గణపతి శాస్త్రి
ధర్మ దీక్ష
ఆవుదూడ ‘అంబా ‘ అని గొంతెత్తి అరిచింది ! గోధూళి వేళ అయ్యేసరికి ఆళవీ గ్రామంలో నందగోపాలుని ఆలమంద అంతా తిరిగి వచ్చి వేసింది. కాని ఒకే ఒక్క ఆవు తిరిగి రాలేదు .
బాగా చీకటి పడింది . అయినా ఇంకా ఆవు తిరిగి రాలేదు . గోశాలలో గోవత్సాలన్నీ తోక లెత్తి పెట్టి ఎంతో సంతోషంగా పాలు కుడుచుకుంటున్నాయి . కాని ఆ ఒక్క ఆవుదూడ మాత్రం ‘అంబా ‘ ‘అంబా ‘ అని అదేపనిగా అరవడం మొదలు పెట్టింది . ఆ దూడ పుట్టినప్పటి నుంచీ నందగోపాలుని ఇల్లంతా పాడి పంటలతో కలకలాడింది .
అందుచేత ఆ ఆవన్నా , ఆ దూడన్నా నందగోపాలుని కెంతో ఇష్టం . అది అదే పనిగా అరవడం మొదలుపెట్టేసరికి అతని కారాత్రి మరి అన్నం సయించలేదు . రాత్రి తెల్లవార్లు నందగోపుడు అదేమైపోయిందో అని ఆరాటపడుతూనే ఉన్నాడు .
మరునాడు తెల్లవారగట్లే లేచి , ఆవును వెదకి పట్టుకోవడం కోసం ఆళవీ గ్రామానికి సమీపంలో ఉన్న అడవికి బయలుదేరి వెళ్లాడు .
నందుడూరి పొలిమేర సమీపించేసరికి పొద్దు పొడిచింది . పొరుగూళ్ళ జనం తీర్ధ ప్రజలాగా ఆళవీ గ్రామానికి నడిచి వస్తున్నారు . కాని నందు డొక్కడు మాత్రం గ్రామ సమీపంలో ఉన్న అడవికి బయలుదేరి పోతున్నాడు !
ఆ ప్రజానీకం ముఖాలన్నీ అరుణోదయ కాంతులలో నూతనందావేశాలలో కలకలాడుతున్నాయి . చిన్న చిన్న పసిపాపలను కూడా వెంటబెట్టుకొని వారంతా ఎక్కడికి వెడుతున్నారో అని నందుని హృదయాంతరాళంలో జిజ్ఞాస రేకెత్తింది . నడవలేక నడవలేక నడుస్తున్న ఓ ముసలితాత దగ్గరికి వెళ్లి నెమ్మదిగా అడిగాడు .
“ఎక్కడికి తాతా ! ఈ ప్రయాణం !”
“ఆళవికి పోతున్నాను బాబూ !”
“ఏమిటి విశేషం !”
“నీకింకా తెలియదా ?”
“నాకేమీ తెలియదే !”
“ఈ వేళ ఉదయమే గౌతమ బుద్ధుడు ఆళవికి విచ్చేస్తున్నారట ! ఆ మహాత్ముణ్ణి ఒక్కసారి కళ్లారా సందర్శించి వత్తామని బయలుదేరాను . తిరిగీ ఈ జన్మలో మరి ఆయన సందర్శన భాగ్యం కలుగుతుందో ! కలగదో !” అని ఆ వృద్దుడొక పెద్ద నిట్టూర్పు విడిచి పెట్టాడు . నందగోపుడతనిని మళ్లీ అడిగాడు .
“వారీ వేళంతా ఆళవిలోనే ఉంటారా ?”
“మధ్యాహ్న భిక్ష ముగించుకొని వెంటనే తిరిగి శ్రావస్తీ నగరానికి వెళ్ళిపోతారట !”
“అయ్యో ! అలాగా !” అని నందగోపుడు తిరిగి నిట్టూర్పు విడిచి పెట్టాడు . ముసలితాత అతని వాలకం చూచి ఇలా గడిగాడు.
“మీదేవూరు నాయనా ?”
“ఆళవీ గ్రామమే !”
“అలాగా ! అయితే పొరుగూళ్ళ జనం అంతా తీర్ధ ప్రజలాగా ఇక్కడికే వస్తూంటే నీవు ఉన్న గ్రామం విడిచి పెట్టి పోతావేమయ్యా !” అని ఒక చిరునవ్వు విసిరాడా ముసలితాత . నందుడతనికి తన ప్రయాణ కారణం తెలియజేశాడు . అడవిలో ఆ ఆవు ఏ పులివాత పడిందోనని భయపడుతున్ననాని కూడా అన్నాడు . ఆ మాట విన్న తరువాత ముసలి తాత మరి అతని మాటకడ్డు చెప్పలేక తన దారిని వెళ్ళిపోయాడు . అతని వెంట ఇంకా ఎందరెందరో పరిసర గ్రామస్తులు ఆళవీ గ్రామం వైపు నడిచి వెళ్లారు .
అది చూడగానే నంద గోపాలుని హృదయం ఆరాటం ప్రారంభమైంది. గోవు గొడవ విడిచి పెట్టి తాను కూడా వారి వేనక పడిపోవాలని అనుకున్నాడు . ఇక ఈ సమయంలో కాకపోతే మరింక తధాగతుని దర్శన భాగ్యమే కలగదేమోనని అతనికొక భయం పట్టుకుంది . వెంటనే వెనక్కి తిరిగి రెండు మూడడుగులు వేశాడు .
అంతలో అతని హృదయంలో లేగ దూడ ‘అంబా ‘అని అరిచినట్టయ్యింది . ఆవు ఒంటరిగా అడవిలో పులివాత పడిపోతున్నట్టు కనబడింది ! ‘అంబా ‘ అని గుండె పగిలిపోయేటట్టరిచినట్టు వినబడింది !
అది నందగోపాలుని ఇంట పుట్టిన ఆవు . క్రమంగా అతని పాపలతో బాటే పెరిగి పెద్దదయింది . అతని పాపలందరు ఆ ఆవు పాలు తాగి క్రమంగా పెరిగి పెద్ద వారైనారు . నందుడు కూడా క్రమ క్రమంగా వారితో బాటే ఆ ఆవు పాలు తాగి పెద్ద వాడైనాడు .
ఇటీవల ఆ ఆవు కొక కోడెదూడ పుట్టింది . అంత వరకు పుట్టినవన్నీ పెయ్య దూడలే . కోడె పుట్టిన వేళా విశేషమేమో గాని ఆనాటి నించీ నంద గోపుని ఇల్లంతా పసిపాప నవ్వులతో కలకలాడింది . అతని గుండెలో మళ్లీ ఆ లేగ దూడ ‘అంబా ‘ అని అరిచినట్లు వినబడింది !
నందగోపాలునికిక కాలు సాగలేదు . ముందుగా తొందర తొందరగా అడవికి వెళ్లి ఆవును వెదికి పట్టుకొని ఆ తరవాతే గౌతమ దేవుని సందర్శంచవలెనని అనుకొన్నాడు . ఒకవేళ తాను తిరిగి వచ్చేసరికి తథాగతుడు గ్రామం విడిచి వెళ్ళిపోతే ! ఇక మళ్లీ ఆయన ధర్మ ప్రసంగం వినే అదృష్టమే కలుగదేమోనని నందగోపాలుని కెంతో భయం వేసింది . తాను చేసుకున్న పూర్వ పుణ్యం అంతే అనుకుని ఒక్క వేడి నిట్టూర్పు విడిచి పెట్టాడు . తొందర తొందరగా ఆవును వెదికి పట్టుకుని తిరిగి వచ్చి , అధమ పక్షం గౌతదేవుని దర్శన భాగ్యమైనా పొందవలెనని సంకల్పించాడు . బాగా తొందరగా అంగలు వేసుకుంటూ అడవిలోకి వెళ్ళిపోయాడు .
నందగోపుడావు కోసం అడవి అంతా గాలిన్చేసరికి మిట్ట మధ్యాహ్నం అయింది . ఎండ నెత్తి మాడ్చి వేస్తూంది . లోలోపల ఆకలి దహించి వేస్తూంది . నాలుక పిడచ గట్టుకుపోతూంది . అయినా నందుడు తన పట్టు విడువలేదు .
అంతలో అడవిలో ఎక్కడో మారుమూలగా ఒక ఆర్త నాదం వినబడింది . నందునికది ఆవు ‘అంబా ‘ అని పిలిచిన పిలుపులాగే స్ఫురించింది . గబగబా చెట్లు పుట్టలు దాటి ఆ పిలుపు వినిపించిన ప్రదేశానికి చేరుకున్నాడు . అక్కడ హఠాత్తుగా అతనికొక పెన్నిధి కనిపించినట్టయింది .
అది నందుడు చిన్నప్పటినించీ పెంచి పెద్ద చేసిన ఆవు ! అడవిలో దారి తప్పి ఎటో పడిపోతూ మాటి మాటికీ ‘అంబా – అంబా ‘అని అరుస్తూంది . ఏ పెద్ద పులినో చూచి బెదిరిపోయి కంగారుగా పరుగెత్తి ఉండవచ్చుననీ , అందువల్లనే అడవిలో తప్పి తికమకలు పడుతూ ఉండవచ్చుననీ నందగోపాలకుడూ హించాడు . వెంటనే దాన్ని వెంటబెట్టుకుని ఇంటికి బయలుదేరాడు .
ఆవుతోబాటతడు గ్రామం పొలిమేర చేరుకునేసరికి మిట్ట మధ్యాహ్నం దాటిపోయింది . ఎంతో ఆలస్యం అయిందని నందుడిక ఇంటికి చేరుకునే సంకల్పం విరమించుకున్నాడు . తొందర తొందరగా నడిచి వెళ్లి బుద్ధదేవుని ధర్మ బోధ వినవలెనని అనుకొన్నాడు . ఆ అదృష్టం కలిసి రాకపోతే పోనీ అధమం ఒక్కసారి కళ్లారా ఆ మహామహుని సందర్శన భాగ్యమైనా పొందవలెనని ఉవ్విళ్లూరి పోతూ గౌతమదేవుడు శిష్య గణంతో విశ్రమించిన వట వృక్షం వైపు సాగిపోయాడు . గోవు కూడా అతని వెంట ఒక చిన్న లేగ దూడలా నడిచి పోయింది .
**** **** *****
ఆనాడాళవీ గ్రామంలో అరుణోదయ కాంతులు , కాషాయంబరధారులైన బౌద్ధ భిక్షుకు సమూహాలు ఒకేసారిగా ప్రత్యక్షమైనాయి . ఆ భిక్షువులతో గౌతమదేవుని ముఖ జ్యోతి అప్పుడప్పుడే ఉదయిస్తున్న భానుబింబంలా మెరిసింది .
అది చూసి ఆళవీ గ్రామస్థులందరు భిక్షులందరికీ ఆసన్నమయింది . భిక్షులందరు తమతమ భిక్షా పాత్రలు ధరించి ఆళవీ గ్రామంలో ప్రవేశించారు . కాని గ్రామస్థులెవ్వరు దాని కనుమతించలేదు. తామంతా ప్రత్యేకంగా వారికి విందు చేయబోతున్నామనీ , ఆ విందారగించవలసిందనీ పరి పరి విధాల ప్రాధేయపడ్డారు . భిక్షువులు మొదట తమ భిక్షా ధర్మం విసర్జించడానికంగీకరిచలేదు గాని చిట్ట చివరికి ఆచార్య దేవుని అనుజ్ఞపై ఆ విందు భోజనానికంగీ కరించారు .
కొంత సేపటికి శ్రమణ కులందరూ భోజనాలు ముగించుకొని ప్రశాంత వట తరుచ్చాయలో సమాసీనులైనారు . అప్పటి కించుమించుగా రెండు యామాలకాలం గడిచిపోయింది .తధాగతుడు వట వృక్ష మూలంలో అమర్చిన సుఖాసనంపై విశ్రమించి ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లుగా ఆళవీ గ్రామం పొలిమేరల వైపు పరికిస్తున్నాడు.
భోజనానంతరం ఆయన చేసే ధర్మ బోధలాలకించవలేననే ఆసక్తితో ఆళవీ గ్రామ స్థులందరూ అక్కడికి చేరుకొన్నారు . ఇంకా పరిసర గ్రామాలనించి వచ్చిన వారెందరెందరో ఆ ధర్మ బోధలాలకింపవలెనని ఉత్కంతతో తహతహాలాడిపోతున్నారు . కాని వారందరికీ బుద్ధ దేవుని ముఖంలో కేవలం ప్రశాంత మౌనముద్ర మాత్రమే ప్రత్యక్షమైంది . అలా ఎంత సేపు వేచి ఉన్నా ఒక్క పలుకైనా ఆయన నోటి నుంచి వెలువడలేదు .
క్రమక్రమంగా మూడో యామం కూడా గడిచిపోయింది . గౌతమ దేవుని విశాల నేత్రాలప్పుడేవరి కోసమో నిరీక్షిస్తున్నట్టుగా స్ఫురిస్తున్నాయి . ఈ నిరీక్షణ తాత్పర్యమేమో ఎవరికీ అవగాహన కాలేదు . కొందరు భిక్షులు కదేమీ బోధపడక ఆచార్యుని వలెనే తాము దిక్కులు చూడడం మొదలుపెట్టారు . కాని ఎంత సేపటికీ ఏమి ఫలితం కలగలేదు .
అంతట అనతి దూరంలో గంభీరంగా ఒక ‘అంబా ‘ అని వినిపించింది . అందరు అటువైపు చూచారు . గౌతమి బుద్ధుని నేత్రాలంత పూర్వం నుంచి ఆ వైపే పరికిస్తున్నాయి .
అంతలో గోవును వెంట బెట్టుకుని తొందర తొందరగా అంగాలు వేసుకుంటూ వస్తున్న నందగోపాలుడనతి దూరంలో ప్రత్యక్షమైనాడు . కాని భిక్షువు లెవరూ అతని వైపంత ఆత్రంగా పరిశీలించలేదు . అయితే గౌతముని నేత్రాలు నిశ్చలంగా అతని ఆగమనమే నిరీక్షిస్తున్నట్లున్నాయి . దాని కారణమేమో వారెవరికీ బోధపడలేదు .
నందుడంతలో గోవును వట వృక్ష చ్చాయలో నిలిపి నురుగులు గక్కుకుంటూ పరుగెత్తుకు వచ్చి బుద్ధ దేవుని పాదాలపై సాగిలపడ్డాడు . కొంత సేపటికి లేచి అతివినయంగా దోసిలి ఒగ్గి నిలబడ్డాడు . చివరికెలాగైనా దర్శన భాగ్యమైనా లభించింది గదా ! అని ఎంతో సంతోషించాడు . వెంటనే గౌతముడు లేచి నిలబడ్డాడు . వెనువెంటనే భిక్షువులందరు లేచి నిలుచున్నారు ! బుద్ధ దేవుదేంతో ఆత్రంగా పక్కనే నిలబడిన భిక్షువులతో
“ఇంకా భోజన పదార్దాలేమైనా మిగిలి ఉన్నాయా ?” అన్నాడు .
భిక్షువులు “లేకేమి ?సమృద్దిగానే ఉన్నాయి “ అన్నారు .
———–