పేరు (ఆంగ్లం) | Bhogaraju Narayanamurthy |
పేరు (తెలుగు) | భోగరాజు నారాయణమూర్తి |
కలం పేరు | – |
తల్లిపేరు | జోగమ్మ |
తండ్రి పేరు | బాల ప్రసాద రావు |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 10/8/1891 |
మరణం | 4/12/1940 |
పుట్టిన ఊరు | గజపతినగరం లోని దేవులపల్లి గ్రామం |
విద్యార్హతలు | – |
వృత్తి | తెలుగు పండితుడు |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | నవలలు: విమలాదేవి (1915), ఆంధ్ర రాష్ట్రము (1918), అస్తమయము : ఆంధ్రుల ప్రాచీన వైభవాన్ని తెలిపే నవల, ఆంగ్ల రాజ్య స్థాపన (1917) : దేశభక్తి ప్రబోధాత్మకమైన నవల, ప్రచండ పాండవము, చంద్రగుప్తుడు, పండుగ కట్నము (1927) పద్య కావ్యాలు : కంకణము : నీటిబొట్టు చెప్పిన ఆత్మకథ, కృష్ణకుమారి : రాజపుత్ర స్త్రీ జీవిత చరిత్ర, వాసవీ పరిణయము : విజయనగరంలోని కన్యకా పరమేశ్వరీ ఆలయంలో ఆశువుగా చెప్పిన పద్యకావ్యం, ప్రత్యక్ష రాఘవము : భద్రాచల రామదాసు కథ, పార్థివలింగ శతకము |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | ప్రముఖ నవలా రచయిత మరియు నాటక కర్త. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | భోగరాజు నారాయణమూర్తి |
సంగ్రహ నమూనా రచన | పద్యరచనలో కూడా చక్కని హాస్యం మిళితమైన రచనలువెలువడ్డవి. స్వర్గీయ భోగరాజు నారాయణమూర్తి గారి “పండుగ కట్నం” చెప్పుకోదగ్గది, నవ్వించగలదీ. ఆనాటి సంఘంలో స్త్రీ కి ఉన్న విలువలు తెలియచెప్పేది. శరభరాజనే లోభి, కుమార్తె వివాహం చెయ్యాలనుకుంటాడు. డబ్బాశ మూలంగా తన కుమా ర్తేను ఒక వయసుమళ్ళినవాడికిచ్చి వివాహం చేయాలని చూస్తాడు. కాని ఇది అతని భార్యకు, పిల్లకు ఇష్టం ఉండదు. వాళ్ళని సమ్మతిపరచటానికి పెళ్ళి కొడుకుని సమర్ధిస్తాడు. అది ఎలా అంటే – |
భోగరాజు నారాయణమూర్తి
పద్యరచనలో కూడా చక్కని హాస్యం మిళితమైన రచనలువెలువడ్డవి. స్వర్గీయ భోగరాజు నారాయణమూర్తి గారి “పండుగ కట్నం” చెప్పుకోదగ్గది, నవ్వించగలదీ. ఆనాటి సంఘంలో స్త్రీ కి ఉన్న విలువలు తెలియచెప్పేది.
శరభరాజనే లోభి, కుమార్తె వివాహం చెయ్యాలనుకుంటాడు. డబ్బాశ మూలంగా తన కుమా ర్తేను ఒక వయసుమళ్ళినవాడికిచ్చి వివాహం చేయాలని చూస్తాడు. కాని ఇది అతని భార్యకు, పిల్లకు ఇష్టం ఉండదు. వాళ్ళని సమ్మతిపరచటానికి పెళ్ళి కొడుకుని సమర్ధిస్తాడు. అది ఎలా అంటే –
“కామరాజని పెళ్ళి కొడుకు ఉన్నాడు. అతను యోగ్యుడు కాకపోయిన ఆస్థి అంతా అతనిదే. వయస్సు నలుబది సంవత్సరాలని చెబుతారు కాని ౩౦కి మించి ఉండవు. అందమైనవాడు కాకపోయిన మంచి ఏపుగా ఉంటాడు. సీతమ్మ ఇష్టమని తరచూ రాస్తుంటాడు. గిట్టని ముండాకొడుకులు, ముండ ఉందని చెబుతారు. పెండ్లాము లేని ధనవంతుడు, వాడు ఏమి ఏడిస్తే మనకెందుకు? మనం పిల్లనిద్దాం”, అని అంటాడు.
ఆఖరికి పెళ్ళి ఖర్చులుకూడా తప్పుకోవాలని ఏకరాత్రి వివాహం అంటాడు.
“ఏకరాత్రి పెండ్లి యైనచో జాల
వరకు ఖర్చు తగ్గవచ్చు మనకు
చూడవచ్చిన చుట్టాలచే నిల్లు
గుల్లగాదు, డబ్బు చెల్లిపోదు”.
వివాహముహూర్తం నిర్ణయమైనదని విని పాపం పెండ్లికుమార్తె బెంగ పెట్టుకుని మంచం ఎక్కుతుంది. తల్లి, కూతురు మనసు మేనల్లుడియందు అనురక్త అని తెలుసుకుని వైరిప్పించమని శరభరాజుతో చెప్పింది. అతను ఆరణాలు పెట్టి వైరెందుకు అంటూ, డబ్బున్నర కవరందుకుని రాడా?” అంటూ కవరు రాస్తాడు.
ఇదంతా ఒక ఎత్తు. దీని తరువాతిది మరొక ఎత్తు.ఇందులో ఇంగ్లిష్ దొరసాని అచ్చమైన ఇంగ్లిష్‌లో పద్యాలు చెబుతుంది. మచ్చుకి ఒకటి:
“పోస్టాఫిసున పోస్టుజేయుడొక కార్డు రేపే నా మాటలన్
టెష్టున్ జేయగవచ్చు స్టార్టిమిడియట్లీయంచు వైరిచ్చుటే
బెస్ట్అన్నింటను వైరుచూచుకొనుచున్ వేవేగమే మైల్‌రైల్లో
నే స్టార్టవుతాడారణాలేకదా మీకేమైనా వేష్టైనచోన్”.
———–