రామినేని రామానుజమ్మ (Ramineni Ramanujamma)

Share
పేరు (ఆంగ్లం)Ramineni Ramanujamma
పేరు (తెలుగు)రామినేని రామానుజమ్మ
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరుఈడ్పుగంటి రాఘవేంద్రరావు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1/11880
మరణం9/22/1977
పుట్టిన ఊరుమధ్య ప్రదేశ్ లోని బిలాస్ పూర్
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలుమరాఠీ, హిందీ, ఆంగ్లము
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు1921 లో “పుత్రోపహారం” అనే రచనను హిందీ నుండి తెలుగులోకి అనువదించారు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలురామినేని రామానుజమ్మ ప్రముఖ అనువాదకురాలు మరియు ప్రజా సేవకురాలు.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికరామినేని రామానుజమ్మ
సంగ్రహ నమూనా రచనఎక్కడో మధ్య ప్రదేశ్ లోని బిలాస పూర్ లో జన్మించి ,ఆంద్ర ప్రదేశ్ లో కృష్ణాజిల్లాలో ఒక కుగ్రామానికి కోడలుగా వచ్చి మహాత్ముని పిలుపుకు స్పందించి సంఘ సేవలో అందునా ముఖ్యం గా హరిజన సేవలో జీవితాన్ని ధన్యం చేసుకొన్న పునీతురాలు శ్రీమతి రామినేని రామానుజమ్మ .ఆమె చరిత్ర అన్ని తరాలకూ ఆదర్శమే .

రామినేని రామానుజమ్మ

ఎక్కడో మధ్య ప్రదేశ్ లోని బిలాస పూర్ లో జన్మించి ,ఆంద్ర ప్రదేశ్ లో కృష్ణాజిల్లాలో ఒక కుగ్రామానికి కోడలుగా వచ్చి మహాత్ముని పిలుపుకు స్పందించి సంఘ సేవలో అందునా ముఖ్యం గా హరిజన సేవలో జీవితాన్ని ధన్యం చేసుకొన్న పునీతురాలు శ్రీమతి రామినేని రామానుజమ్మ .ఆమె చరిత్ర అన్ని తరాలకూ ఆదర్శమే .
‘’ గాంధీ టోపీ గవర్నర్ ‘’అని ప్రసిద్ధి చెందిన కృష్ణా జిల్లా పామర్రుకు దాగ్గరలో ఉన్న పెదమద్దాలి కు చెందిన ఈడ్పు గంటి రాఘవేంద్ర రావు గారి అక్కగారు రామినేని రామనుజమ్మ గారు .తండ్రిగారు నాగన్న గారు . తమ్ముడు రాఘ వేంద్ర రావు గారు మధ్య ప్రదేశ్ లోని బిలాస పూర్ లో వ్యాపారం చేస్తున్నప్పుడు 1880 లో జన్మించారు .రాఘ వేంద్ర రావు గారు ఇంగ్లాండ్ వెళ్లి బారిస్టర్ పాసై ఇండియా కు తిరిగివచ్చి కొంతకాలం న్యాయ వాద వ్రుత్తి చేసి జాతీయ నాయకులు బాల గంగాధర తిలక్ ప్రభావంతో రాజకేయ ప్రవేశం చేసి బిలాస పూర్ మునిసిపల్ చైర్మన్ అయ్యారు .గాంధీజీ నాయకత్వాన ఉద్యమాలలో పాల్గొన్నారు .స్వశక్తితో ఎదిగి రెండేళ్ళు నాగపూర్ ప్రావిన్స్ ప్రధాన మంత్రిగా ,ఏడేళ్ళు హోమ్ మంత్రిగా నాలుగు నెలలు గవర్నర్ గా పని చేశారు .ఇంతటి చైతన్య శీలి కి రామానుజమ్మ గారు అక్కగా పుట్టటం అదృష్టం .
రామానుజమ్మ గారు కృష్ణా జిల్లా ఉయ్యూరు కు దగ్గరలో ఉన్న కుమ్మమూరు గ్రామం లో రామినేని వియ్యన్న గారి ని వివాహ మాడి రామినేని వారి ఇంటికోడలయ్యారు .భర్త మంచి స్థితి పరులు గొప్ప భూస్వామి , గ్రామ మునసబు .వియ్యన్న గారు ఉయ్యూరు లో1909 లో ఏర్పడిన ‘’ఉయ్యూరు లిటరరీ అసోసియేషన్ అండ్ సోషల్ క్లబ్ ‘’కు వ్యవస్థాపక సభ్యులు .ఒక కుమారుడు కౌసలేంద్ర రావు పుట్టిన తర్వాత భర్త మరణించారు .కౌసలేంద్ర రావు గారికి ఈడుపు గంటి రాఘ వేంద్రరావు గారు మేనమామ .హిందీ రాష్ట్రం లో ఉండటం వలన రామానుజమ్మ గారికి సహజం గా హిందీ అలవడింది .మరాఠీలో ప్రావీణ్యం సంపాదించారు .విజయవాడ లో భండారు అచ్చమాంబ గారి వద్ద ఇంగ్లీషు ,తెలుగు నేర్చారు .అత్తవారింట కుమ్మమూరు గ్రామం లోనే ఉంటూ పిల్లవానిని పెంచుతూ సమాజ సేవ చేశారు .
హరిజనుల కోసం పాఠ శాలను కుమ్మమూరు గ్రామం లో నిర్మించి పేద హరిజన విద్యార్ధులకు విద్యా సౌకర్యం కలిగించిన వితరణ శీలి రామానుజమ్మ గారు .భారత జాతీయోద్యమం లో చురుకుగా పాల్గొన్నారు .హిందీ భాషలో మంచి ప్రజ్ఞ ఉండటం చేత 1921లో ‘’పుత్రోపహారం ‘’అనే హిందీ గ్రంధాన్ని తెలుగులోకి అనువదించారు .దీనిలో బాలలు సత్ ప్రవర్తన కలిగి ఉండాలని దానికోసం ఎలా నడుచుకోవాలో తెలియ జేశారు .ఆదర్శం గా జీవించి అనేక సంస్థలకు వ్యక్తులకు దాన ధర్మాలు చేసి విద్యా వ్యాప్తికీ సాంఘిక మార్పులకు దోహద పడ్డారు .
ఆణి ముత్యం లాంటి వీరి కుమారుడు రామి నేని కౌసలేంద్ర రావు విదేశాలలో న్యాయ శాస్త్ర విద్య నభ్యసించి ,నాగపూరు హైకోర్ట్ న్యాయ వాదిగా పని చేశారు .తర్వాత ప్రభుత్వ న్యాయ వాదియై ,అడ్వకేట్ జనరల్ అయి ,నాగ పూరు హైకోర్ట్ న్యాయ మూర్తిగా ఉన్నారు . ఫైనాన్స్ కమీషన్ సభ్యులుగా నియమింప బడి గౌరవం పొందారు.తల్లి రామానుజమ్మ గారి గొప్ప సుగుణాలైన విశాల ద్రుష్టి ,నిష్పాక్ష పాతం ,సత్ప్రవర్తన సాటి వారి యెడ ప్రేమాదరణలు కౌసలేంద్ర రావు గారికి సంక్రమించాయి .
కౌసలేంద్ర రావు గారి భార్య శ్రీమతి సరోజినీ దేవి మదన పల్లి లో రాటకొండ వారి ఆడపడుచు . కుమారుడు అంటే రామానుజమ్మ గారి మనుమడు శ్రీ రామి నేని భాస్కరేంద్ర రావు ‘’ఇండిపెండెంట్ చార్టర్డ్ అకౌంటెంట్.గా ఉంటున్నారు . మనం అందరం మర్చి పోయిన ఎన్నో చారిత్రిక విశేషాలను ఆయన కంప్యూటర్ లో భద్ర పరచి అందిస్తూ ఉంటారు .’’ఇరవై వ శతాబ్దపు తెలుగు వెలుగులు ‘’అనే శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయంప్రచురించిన విస్తృత ఆచూకీ (రిఫెరెంస్ ).గ్రంధ రచన ‘’సంపాదక సలహా మండలి ‘’లో సభ్యులు .గొప్ప పుత్రుడైన –కౌసలేంద్ర రావు గారిని ,సమర్ధ వంతుడైన మనుమడు భాస్కరేంద్ర రావు ను తన వారసులుగా అందించిన రామినేని రామానుజమ్మ గారు97 ఏళ్ళు సార్ధక జీవితం గడిపి 1977లో మరణించారు .

———–

You may also like...