గోవిందరాజు సీతాదేవి (Govindaraju Sitadevi)

Share
పేరు (ఆంగ్లం)Govindaraju Sitadevi
పేరు (తెలుగు)గోవిందరాజు సీతాదేవి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరుగోవిందరాజు సుబ్బారావు
పుట్టినతేదీ
మరణం2014 సెప్టెంబరు 11
పుట్టిన ఊరుకాజ, మొవ్వ మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుసుందర స్వప్నం, ఆలయం, పూలవాన, దేవుడు బ్రతికాడు
తాతయ్య గర్ల్‌ఫ్రెండ్, ఆశలపల్లకి, జీవితం చిన్నది, అనురాగ ధార, రేపటి స్వర్గం, ముత్యాలపల్లకీ, గోవిందరాజు సీతాదేవి కథలు(కథల సంపుటి), పాఠకులారా బహుపరాక్(కథల సంపుటి), దోస్త్ రానిక నీకోసం(కథల సంపుటి), అహల్య, ఓ నాన్నకథ, తుంగభద్ర, వెలుగు నీడ, మజిలీ
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలుప్రముఖ కథా/నవలా రచయిత్రి. ఈమె 300కు పైగా చిన్నకథలు, 21 నవలలు రాసింది. ఆమె రాసిన తాతయ్య గర్ల్‌ఫ్రెండ్, ఆశలపల్లకి నవలలు సినిమాలుగా వచ్చాయి. అనేక అవార్డులు, పురస్కారాలు ఈమెను వరించాయి. ప్రముఖ నవలారచయిత్రి యద్దనపూడి సులోచనారాణి ఈమెకు సొంత చెల్లెలు.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికగోవిందరాజు సీతాదేవి – అంతరాత్మ
సంగ్రహ నమూనా రచనకృష్ణా ఎక్స్ ప్రెస్లో దిగింది విమల. సికిందరాబాద్ రైల్వేస్టేషన్ మమా రద్దీగా వుంది. విమలకి భాగ్యనగరం కొత్త. అందుకే భయం భయంగా దిగి స్నేహితురాలు జలజ కోసం వళ్ళంతా కళ్ళు చేసుకుని చూసింది. అయిదూ పది నిమషాలు అయిపోయింది. అందరూ వెళ్ళిపోతున్నారు. చాలామంది వెళ్ళిపోయారు కూడా.
జలజ ఇంటి అడ్రెస్ దగ్గర వుంది.ఎలా వెళ్ళాలో కూడా వాళ్ళ నాన్న ప్లాన్ వేసి చూపాడు కూడా.

గోవిందరాజు సీతాదేవి
అంతరాత్మ

కృష్ణా ఎక్స్ ప్రెస్లో దిగింది విమల. సికిందరాబాద్ రైల్వేస్టేషన్ మమా రద్దీగా వుంది. విమలకి భాగ్యనగరం కొత్త. అందుకే భయం భయంగా దిగి స్నేహితురాలు జలజ కోసం వళ్ళంతా కళ్ళు చేసుకుని చూసింది. అయిదూ పది నిమషాలు అయిపోయింది. అందరూ వెళ్ళిపోతున్నారు. చాలామంది వెళ్ళిపోయారు కూడా.
జలజ ఇంటి అడ్రెస్ దగ్గర వుంది.ఎలా వెళ్ళాలో కూడా వాళ్ళ నాన్న ప్లాన్ వేసి చూపాడు కూడా. తనువస్తూన్నట్లుగా వుత్తరంరాస్తే జలజ స్టేషనుకి రాకుండా వుంటుందని అనుకోలేదు. తనకి పిచ్చి భయంగానే ఇదే మనాన ఫారెనా తెలుగు దేశం, ఛీ భయపడకూడదు అనుకుని తనకి తనే ధైర్యం చెప్పుకుని స్టేషన్ బయటికి వచ్చేసింది విమల.
‘ఆటో’ పెద్ద తెల్సినదానిలా ఆటోని పిల్చి సూట్కేస్ లోపల పెట్టుకుని కూర్చుని జలజ అడ్రెస్ చెప్పింది. ఆటో అతను మాట్లాడకుండా ఆటోని పోనిస్తూన్నాడు. జలజని నాలుగూ దులిపెయ్యాలి అన్న కోపంతో కూర్చుంది. ఆటో వేగంగా వెడుతూ వుంది. విమల ఆలోచనలూ అంతకంటే వేగంగా వెనక్కి వెళ్లాయి. జలజా విమలా చిన్నప్పటి స్నేహితులు. ఇద్దరూ హైస్కూలు చదువు ముగించారు. విమలని తండ్రి కాలేజీలో చేర్పించాలని ప్రయత్నిస్తూంటే అతి సామాన్యుడైన జలజ తండ్రి ఇంక నేను చెప్పించలేను అనటంతో జలజ విమల దగ్గరకి వచ్చి భోరుమంది. విమలకే కాక విమల తల్లిదండ్రులకి కూడా జలజ అంటే అభిమానం. అందుకే ఆ అమ్మాయిని ఓదార్చటమేకాక ‘‘ఇద్దరూ కల్సి చదువుకుంటారుగా. బుక్స్ కల్సివస్తాయి ఇంక జీతం విషయం నేకొంత సాయం చేస్తానులే’’ అని ధైర్యం చెప్పి జలజనీ కాలేజీలో జాయిన్ చేశారు. దాదాపు డిగ్రీచదువు అయేవరకూ ఆయన తన మాట నిలబెట్టుకున్నారు. అయితే కాలేజీలో చేరిన తర్వాత జలజలో ఏదో తెలియని మార్పు రాసాగింది. విమల అంటే అసూయపడటం ప్రారంభించింది. ఈ భావం బైటపడకుండా చాలా జాగ్రతత్తగా వుండాలని ప్రయత్నిస్తోంది. విమల అసలు ఇదేమీ పట్టించుకోని అమాయకురాలు. జలజని అభిమానించడం మాత్రమే తెల్సు. సహజంగా విమల అందంగా వుంటిం. అందులోనూ తండ్రికి మంచి వుద్యోగం కావటంవల్ల మంచి బట్టలూ అవీ వేసుకుని చూసేవాళ్ళని ఇట్టే ఆకర్షించేది.
అబ్బాయిలు విమల అంటే పడి చచ్చేవాళ్ళు. కానీ విమల అదేం పట్టించుకునేది కాదు. తన చదువు ఇల్లూ స్నేహితురాలు జలజా. ఇదే ప్రపంచం. ఇద్దరూ ఇలా చదివి భి.ఏ., పాస్ అయారు. జలజ అన్నగారు భాగ్యనగరంలో వుండటంతో సిటీకి వచ్చి వుద్యోగం చేస్తూ ఎం.ఏ. పాస్ అయింది. లెక్చరర్ వుద్యోగం సంపాదించుకుంది. విమల తండ్రి పోవటంతో సంసార పరిస్థతి తారుమారై చదువు ఆపేసి ఖాళీగా వుండిపోయింది. తల్లి పెళ్ళి ప్రయత్నం చేస్తుంది కానీ ఒక్కటీ కల్సిరాలేదు. విమల గాభరాపడి పోయింది. ఇటు చదువూ లేదు, అటు వుద్యోగమూ లేదు. పోనీ పెళ్ళి కాల్సిరావటంలేదు. ఎన్నాళ్ళని చచ్చిపోయే పెళ్ళి పోడుకుల ఎదుట ప్రాణంలేని బొమ్మలా కూర్చుంటుంది. కట్నాలు ఇవ్వలేని తన కూతురికి పెళ్ళి అవదా అని దిగులు పడింది విమల తల్లి. విమల ఆలోచించి జలజకి వుత్తరం రాసింది. ‘‘నే వ్చేస్తూన్నాను నీ దగ్గరికి. ఓ చిన్న వుద్యోగం చూసిపెట్టు’’అని.
జవాబు కోసం చాలారోజులు ఎదురుచూసి విసిగి తనే యబలుదేరి వస్తూ ఫలానా రైల్లో వస్తూన్నా అని రాసింది. అయినా స్టేషనుకి రాలేదు జలజ.
‘‘నా వుత్తరాలు అందలేదా ఒకవేళ ఇల్లు మారివుంటారా అలా జరిగితే నేనం చేయాలి ‘‘ఎన్నెన్నో ఆలోచనతో సతమత మౌతుంది విమల.
ఇల్లు తెల్సుకోవటం కాస్త కష్టమైనా మొత్తానికి దొరికింది. ‘అమ్మయ్య’ కొండంత ధైర్యం వచ్చేసింది విమలకి. జలజ ఎం.ఏ., అన్న బోర్డు చూసేసరికి ఆటో మీటర్ చూసి డబ్బు ఇచ్చేసి సూట్కేస్ తీసుకుని మూసి వున్న తతలుపు తట్టింది. చెదిరిపోయిన జుత్తు సరిచేసుకుంటూ కర్చిఫ్తో ముకాన పట్టిన చెమట తుడుచుకుంటూ.
రెండు నిమిషాల్లోనే తలుపు తెరుచుకుంది ఎదురుగా లావుగా పొట్టిగా వున్న ముప్ఫైయేళ్ళ యువకుడు నిల్చుని ‘ఎవరికోసం’ అన్నట్టుగా చూశాడు. విమలనీ విమల చేతిలోవున్న సూట్కేస్ నీ.
‘‘నాకూ… నాకు… జలజ కావాలి’ జలజ భర్త కాబోలు అనుకుంటూ. వెళ్ళింది. మూడింటికి కానీ రాదు. అన్నట్టు మీరు’’
‘‘నేనూ నేను జలజ ఫ్రెండ్ విమలని నేవస్తూన్నట్లుగా వుత్తరం కూడా రాశానే’’
‘‘అలాగా రండిలోపలికి గోవిందూ ఇలారా’’ కేకపెడుతూ పక్కకి తప్పుకున్నాడు విమలకి యేంచేయాలో తోచలేదు. బైట యెండ మాడ్చేస్తోంది. నౌకరు కుర్రాడు వచ్చి షూట్కేస్ అందుకున్నాడు ‘రండమ్మా’ అంటూ పిల్చాడు యజమాని ముఖంలోకి చూసి అర్థమైనట్లుగా తలవూపుతూ.
‘‘ముందు మంచినీళ్లు ఇచ్చి కాఫీఇవ్వు తర్వాత స్నానం భోజనంచూడు’’ అతను మర్యదాచేస్తూన్నందుకు తృప్తిగా వుంది కానీ కొత్తకావటం వల్ చాలా బెరుగ్గా వుంది. గోవిందు అయిదునిమిషాల్లోనే వేడి కాఫీతెచ్చి యిచ్చాడు. విమల కాపీ తాగుతూ ఇల్లు అంతా పరీక్షగా చూసింది.
ఇల్లు అంతా నీట్గా సర్దివుంది. సోఫాలో కిటికీలకీ దర్వాజాలకీ తెరలూ వగైరా చూస్తే జలజ ఆడంబరంగానే బ్రతకగల్గుతోంది అన్పిస్తోంది ఈయనకి యేం వుద్యోగమో తెలియదు. జలజ ఇతని వివరాలు తెల్పలేదు బహుశా పెద్ద వుద్యోగమే అయివుండచ్చు.
ఆలోచనల్లోనే స్నానంచేసింది కాస్త హాయిగా అన్పిస్తోంది.
‘‘అమ్మా భోజనం వడ్డించాను’’ విమల భోజనం చేస్తూండగా జలజ భర్త శంకర్ కర్టెన్ తప్పించుకుంటూ వచ్చి.
‘‘మీరు భోజనం చేసి విశ్రాంతి తీసుకోండి జలజకి ఫోన్చేశాను త్వరగా వచ్చేస్తుంది నాకు అర్జెంట్ పని వుంది. బైటకి వెళ్లాలి మీకు యేంకావాలన్న గోవిందు వుంటాడు.’’
‘సరే’ అన్నట్లుగా తలవూపింది విమల అతని మర్యాదకి మాత్రం చాలా తృప్తిపడింది పరిచయం లేకున్నా గౌరవించి నందుకు శంకర్ వెళ్లిపోయాడు అందగాడుకాకపోవచ్చు కానీ మంచివాడులా వున్నడు జలజ అదృష్టవంతురాలు అనుకుంది.
గోవిందు వీధితలుపు వేసి లోపలికి వచ్చాడు విమల భోజనం కాగానే ఓ గది చూపించి ‘‘మీ పెట్టి అక్కడ పెట్టాను ఏం కావాలన్న పిలవండి’’ అంటూ హాలులోకి వెళ్ళి యేదో పుస్తకం చదువుకుంటూ కూర్చున్నాడు పధ్నాలుగేళ్ళ గోవిందు విమలకి చాలా అలసటగా వుంది నిద్రముంచుకు వస్తోంది ఆ గది అం పరీక్షగా చూసింది ఓ మంచం దానిమీద తెల్ల దుప్పటీ రెండు దిళ్ళూ చిన్న టేబిలూ ఓ రెండు కుర్చీలూ బట్టల ష్టాండు వున్నాయి అంతే.
మంచంమీద కూర్చుని ఆలోచిస్తోంది జలజ లేకుండానే దాని ఇంట్లో ఇలా వచ్చి కూర్చుంటానని ఎప్పుడూ అనుకోలేదు ఇంక అది ఎలావుందో చాలా మార్పు వుండివుంటుంది నేనిలా వచ్చేయటం మంచిదా చెడ్డదా ఏమో సరే వచ్చేశాను ఇంక ఆలోచించటం అనవసరం అనుకుని దిండు మీదవాలింది విమల. ఆ గదిలో గోడకి జంలజ చిన్నప్పటి ఫోటో ఒకటి తగిలించి వున్నది చూస్తూ అలాగే పడుకుంది విమల.
తెలియకుండానే నిద్రముంచుకు వచ్చేసింది.
‘‘ఏఏ మొద్దు లే’’ అన్న జలజ పిలుపుకి గానీ మెలుకువ రాలేదు విమలకి. కళ్ళు తెరిచి జలజని చూసి గభాలున లేచి కూర్చుంది.
‘‘ఎంతసేపైంది వచ్చి’’
‘‘పావుగంటపైన అయింది. కుంభకర్ణుడి చెల్లెలులా నిద్రపోతున్నావు పాపం లేపటం ఎందుకులే అనుకున్నాను కానీ ఈ వెధవ మనస్సు వుంది చూశావూ ఇది ఆగదే’’ అంటూ మంచంమీద విమలని ఆనుకుని కూర్చుని కబుర్లు చెప్తూన్న జలజని రెప్పవాల్చకుండా చూస్తోంది విమల.
చదువుకునే రోజులకంటే ఇప్పుడు కాస్త లావు అయింది ఖరీదైన బట్టలు వేసుకుంది చేతులకి నాలుగు జతల బంగారు గాజులూ మెడలో ముత్యాల హారం, చెవులకి పెద్దవిగా వున్న కమ్మలూ వగైరా ఆమె స్థతిని చెప్పక చెప్తూన్నాయి.
‘ఏయ్ గోవిందూ వేడి టీ పట్టుకురా’ అని కేకపెట్టి ఇటుతిరిగి‘‘విమలా అరె వుత్తరమైనా రాయకుండా ఇలా వూడిపడ్డావేమిటీ’’ అంది.
‘ఒకటి కాదు రెండు వుత్తరాలు రాశాను’ చిరుకోపంగా అంది విమల.
‘‘ఏవీ’’
‘‘అందలేదా’’
‘‘అబద్ధం చెప్తానా’’ విమలా నువ్వు కాస్తన్నా మారినట్లు లేవుకదూ.
విమల పేలవంగా నవ్వింది. ‘‘ఉండు బట్టలు మార్చుకు వస్తాను’2 అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది జలజ. విమల అలాగే మంచంమీద కూర్చుంది దిక్కులు చూస్తూ. జలజ ముస్తాబు ముగించుకుంటూనే కేకపెట్టింది.
‘‘విమలా ముఖం కడుక్కుని బట్టలు మార్చుకో. అలా బైటకి వెళ్ళివద్దాం.’’
విమలకి బద్ధకంగా వున్నా లేచింది. జలజలో తన ఆశించినంత ఆత్మీయత కన్పించటంలేదు ఎందుచేతనో విమల మనస్సు అదోలా అయిపోతూన్నా ఛీ నేను తప్పుగా ఆలోచిస్తూన్నానేమో అనుకుని గబగబా తయారయింది. జలజ భర్త మళ్ళీ కన్పించలేదు. రెండు రోజులు సిటీ అంతా తిప్పి చూపించి ఆఖరుకి అంది.
‘‘విమలా నాకింక లీవులేదు కాలేజీ వుంటే అస్సలు తీరుబడి వుండదు’’
ఈ రెండురోజుల్లోనూ విమల తను వచ్చిన విషయం చెప్పాలని ప్రయత్నంచింది. కానీ జలజ సంభాషణ మార్చేస్తూ విమలకి అవకాశం ఇవ్వలేదు.
విమల ఇంక లాభంలేదని యిప్పుడు చెప్పింది.
‘‘నాకో చిన్న వుద్యోగం కావాలి జలజా. నీ దగ్గర వుండి యీ వూళ్ళో ఎక్కడన్నా ప్రయత్నిస్తాను. నాకు వుద్యోగం చాలా అవసరం’’
పాఠం అప్పగించినట్లు గబగబా అనేసింది.
‘‘నీకా వుద్యోగమా కావాలా’’
‘‘ఔను. నేను నా కాళ్లమీద నిలవాలి. ఆపైన మా అమ్మకి సాయంచేయాలి. ఇలాంటి పరిస్థతి వచ్చింది ఇంక వివరాలు చెప్పలేను’’
‘‘నీకెవరు తెల్సునని ప్రయత్నిస్తావు?’’
‘‘ఎవ్వరూ లేరు నువ్వు తప్ప’’
జలజ పెద్దగా నవ్వేసింది. ‘‘అలా అన్నావు బాగుంది నేనిప్పిస్తాను ఉద్యోగం.’’
‘‘నిజంగా’’
‘‘అక్షరాలా’’
‘‘ఎక్కడ?’’
‘‘మా శ్రీవారు పనిచేసే కంపెనీలో అప్లికేషన్ ఇచ్చి నువ్వు నిశ్చంతగా ఇంటికి వెళ్ళిపో ఆర్డర్సు పంపిస్తాం’’
‘‘నన్ను చూడకుండానే ఇస్తరా? అదెలా సాధ్యం?’’
‘‘అవన్నీ నీ కనవసరం నువ్వు నిశ్చంతగా వెళ్ళిపో’’
జలజ ఇస్తున్న భరోసాకి విమలకి సంతోసంతో కన్నీళ్ళు తిరిగాయి
‘‘జలజా నాకీ సాయం చేశావంటే నీకు చాలా రుణపడి వుంటాను’’
‘‘అంత పెద్దమాటలు వద్దులే’’
‘‘అదికాదు ఆర్ధిక యిబ్బందులువల్ల ఒకటికి రెండుసార్లు యీ వూరికి రాలేను కూడా. అందుకు చెప్తూన్నాను’’
‘‘మరేం ఫర్లేదు అంత అవుసరం రానీయనుగా’’
‘సరే’ నిశ్చింతగా నిద్రపోయింది విమల.
రికి బయలుదేరి మరోసారిజ జలజని హెచ్రించి మరీ ఆలో ఎక్కింది విమల బస్కిటికెట్ రిజర్వేషన్ అంత టైములేక క్యూలో నిల్చుంది టికెట్ కోసం క్యూ చాలా పొడుగ్గా వుంది పెట్టి బరువుకి చెయ్యి లాగుతోంది అసలే విసుగ్గా వుంది. టికెట్టు ఇవ్వటం మొదలుపెట్టారు విమల మెల్లగా నడుస్తోంది.
అరె విమలా నువ్వా ఈ వూరు యెందుకు వచ్చావ్ పరిచయమైన గొంతువిని తలతిప్పి చూసింది చిన్నప్పటి స్నేహితురాలు అరవిందు తమ్ముడు పదహారేళ్ళ శ్యామలరావు పల్కరించడం చూసి ‘‘అరె నువ్వీ వూళ్ళో వున్నావా’’ అంది ఆశ్చర్యంగా చూస్తూ శ్యామలరావు అరవిందతోబాటు విమలనీ అక్కా అని పిలిచేవాడు ఆత్మీయంగా వుండేవాడు.
‘‘అక్కకి పెళ్ళి అయి అత్తవారింటికి వెళ్లిందిగా మానాన్నారికి యీ వూరు బదిలీ అయింది ఇక్కడే వుంటూన్నాం. అన్నట్లు నీకు తెలియదుకదూ సరేగానీ ఈ వూరు ఎందుకు వచ్చినట్లు’’.
విమల తల్లదండ్రులకీ అరవింద తల్లి దంద్రులకీ చాలాసంవత్సరాల స్నేహితం. ఇరుగుపొరుగున వుండేవాళ్ళు ఒకరంటే ఒకరు ప్రాణం ఇచ్చేంత సన్నిహితంగా వుండేవారు. విమలా అరవిందా మరీ కల్సివుండేవాళ్ళు అరవింద తండ్రికి ఆ వూరు నించి బదిలీ కావటంతో ఇరుకుటుంబాల వారూ చాలా బాధపడిపోయారు అరవింద చాలారోజులు వుత్తరాలు రాస్తూ క్షేమం తెల్పుతూ వుండేదిరానురాను అవి కాస్త తగ్గాయి. అరవిందకి పెళ్ళి అయిపోయిందని తెల్సుకూడా విమలకి.
శ్యామలరావు చాలా పెద్దవాడిలా అయిపోయాడు అనుకుంటూ అతన్ని పరీక్షగా చూస్తూ ‘ఏం చదువుతున్నావ్’ అంది.
‘బీయస్సీ’ కానీ ముందా క్యూలోనించి ఇవతలకి రా అమ్మా నాన్నా దగ్గరకి వెడదాం’ అంటూ విమల వద్దు అంటూన్నా బలవంతపెట్టి ఆటో పిల్చాడు.
అరవింద తల్లిదండ్రులు విమలని చూసి చాలా సంతోషపడిపోయారు శ్యామల రావు ఓ స్నేహితుడిని పంపటానికి బస్ స్టాప్కి వెళ్ళడం వల్ల నువ్వు కన్పించడం గమ్మత్తుగా జరిగింది కదూ. అంటూ విమల కుటుంబ విషయాలు తెల్సుకుని విచారపడ్డారు.
‘‘నీకు వుద్యోగం కావాలంటే మరి వూరికి వెళ్ళకు మేం వున్నాంగా’’ అని బలవంతం చేసి ఆపేశారు.
‘‘అక్కా అలా సినీమాకి పోదాం. షికారు పోదాం’’ అటూ శ్యామలరావు స్వంత అక్కని చూసినంతగా సంబరపడిపోతూ విమలని తిప్పుతున్నాడు.
శ్యమాల తండ్రి ‘నేనూ చూస్తానమ్మా’ అంటూ ప్రయత్నం ప్రారంభించాడు.
వారం రోజుల ఇట్టే గడిచిపోయింది. జలజ ఇంటికి వెళ్ళి వూరు వెళ్ళదేదు అని చెప్పాలని ప్రయత్నంచింది. కానీ వీలు కాలేదు.
శ్యామలరావు తండ్రి ఒకరోజు అన్నాడు ‘‘నీ ఫ్రెండ్ ఏం చేసిందో తెల్సుకో’’ అని
విమల జలజ ఇంటికి బయలుదేరింది. జలజ ఇంట్లో నౌకరుతప్ప మరెవరూలేరు. అలవాటు అయిన ఇల్లు కావటంవల్ల సరాసరి లోపలకి వెళ్ళి కూర్చుంటూ ‘‘మీ అమ్మగారు ఎప్పుడు వస్తారు ఇంటికి గోవిందూ’’ అండిగింది.
‘‘సాయంకాలం సినీమాకి వెళ్ళిగానీ రామన్నారు’’
‘‘అలాగా సరే మళ్ళీ వస్తానులే. నేను వూరికి వెళ్ళలేదు అని చెప్పు మీ అమ్మగారు అన్నట్టుల నా జాకెట్ ఒకటి ఇక్కడ మార్చిపోయాను వున్నదా’’
‘వుంది’ తెచ్చి యిచ్చాడు.
‘‘గోవిందూ ఓ కాయితం ఇవ్వు ఇది కట్టి తీసుకుపోతాను’’
గోవిందు కాయితం పట్టుకవచ్చాడు. తను కుంపటి వెలిగించుకునేందుకు వుంచుకున్న కాయితాల్లోంచి మంచిది ఏరి మరీ పట్టుకువచ్చాడు.
జాకెట్ చుట్టేయబోతూ తన సంతకం కన్పించి ఆవ్చర్యపోయి కాయితం పరీక్షగా చూసింది. ఆవ్చర్యపోయింది. ఇది ఇది గోవిందు వాడుకునే చిత్తు కాయితాల్లోకి యెలా వచ్చిందీ నిర్ఘాంతపోయి అలాగే కూర్చుంది. ఇంతలో జలజ భర్త వచ్చాడు. విమలని చూసి ఆశ్చర్యపోయి ‘‘అరె మీరు వూరువెళ్లారని చెప్పింది జలజ? యెపడొచ్చారు మళ్ళీ’’.
‘‘వెళ్ళాలనుకున్నాను కానీ వెళ్ళలేదు’’ నీరసంగా ఇచ్చింది జవాబు.
‘‘హరి మీ మేరేజ్ సెటిల్ అయిపోయిందని చెప్పింది జలజ’’
‘‘అలాగా?’’ మరీ తెల్లబోయింది విమల.
‘‘గోవిందూ రెండు కప్పులు వేడి కాఫీ పట్టుకురా’’ అంటూన్న అతన్ని వారిస్తూ ‘‘వద్దండీ నేను మరోసారి వస్తాను అలా చెప్పండి జలజకి’’ అంటూ లేచింది.

———–

You may also like...