చాగంటి సోమయాజులు (Chaganti Somayajulu)

Share
పేరు (ఆంగ్లం)Chaganti Somayajulu
పేరు (తెలుగు)చాగంటి సోమయాజులు
కలం పేరుచాసో
తల్లిపేరుతులసమ్మ
తండ్రి పేరులక్ష్మీనారాయణ శర్మ,
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1/15/1915
మరణం1/1/1994
పుట్టిన ఊరు
విద్యార్హతలుఅయిదోఫారం వరకు శ్రీకాకుళం లో చదివారు. విజయనగరం ఉన్నత పాఠశాలలో ఎస్‌.ఎస్‌.ఎల్‌.సి. పూర్తి చేసి మహారాజా కళాశాల విజయనగరంలో పైచదువులు చదివారు.
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుతొలికవిత : ‘ధర్మక్షేత్రము’ (భారతి : 1941 జూన్‌)
, తొలి కథ : చిన్నాజీ (భారతి: 1942).కుక్కుటేశ్వరం,వాయులీనం,రాతిరి , బ్రతుకు ,కుంకుడాకు ,ఊహా ఊర్వశి ,మాతృ ధర్మం , థామస్ వ్యాసాలు ,మెరుగు , చాసో కథలు ,
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికచాగంటి సోమయాజులు
ఎంపు
సంగ్రహ నమూనా రచనకుంటాడి కావేళ జోలి నిండిపోయింది . అది ఆవేళ వాడి అదృష్టం . జోలితో జోలెడు ముష్టి . అంటే రెండు కుంచాల బియ్యం . రేపటి చింతలేని బతుకైనా తొడకి బరువుగా తగుల్తూ జోలి వేళాడుతూ ఉంటె కొంటాడి ప్రాణం సంతుష్టితో సుఖ పడ్డాది . పది రోజుల గ్రాసం వాడి బుజాన్ని దిగాలాగుతూ వేళ్లాడుతున్నది .

చాగంటి సోమయాజులు
ఎంపు

కుంటాడి కావేళ జోలి నిండిపోయింది . అది ఆవేళ వాడి అదృష్టం . జోలితో జోలెడు ముష్టి . అంటే రెండు కుంచాల బియ్యం . రేపటి చింతలేని బతుకైనా తొడకి బరువుగా తగుల్తూ జోలి వేళాడుతూ ఉంటె కొంటాడి ప్రాణం సంతుష్టితో సుఖ పడ్డాది . పది రోజుల గ్రాసం వాడి బుజాన్ని దిగాలాగుతూ వేళ్లాడుతున్నది .
కుంటాడు కాలరెగరేస్తూ ఊరవతల తోటల్లో కెళ్ళాడు . నెల్లాకు ఎందు పుల్లలు ఎరుకున్నాడు . మూడు మామిడి పిందలు దొంగిలించాడు . సాయంకాలానికి సత్రవు అరుగులు చేరుకున్నాడు . మూటలో మట్టి పిడత తీశాడు . మూడు రాళ్ల మధ్య నిప్పు వేసి అన్నం ఎవరు పెట్టేడు .
ఎర్రగా పొయ్యి నిండా లేచింది మంట . చలితో చుట్టుకుపోయి కుంటాడి శరీరం వెచ్చపడ్డాది . చుట్టముట్టించి అడ్డ పొగ పెట్టేడు . వాడి తొడ కానుకొని ఉన్న బియ్యపు జొలిని తడువుకుంటూ తనివితో కళ్ళు అరమోడ్చేడు . అన్నం ఉడు కట్టింది .
“ఎర్రీ!” అని కేక పెట్టాడు . సత్రపు అవతల వరండాలో ఎర్రి , దాని కుష్టు రోగపు తండ్రి కాపరమున్నాడు . ఎర్రి ఒచ్చింది .
“పులుసుదాకోపాలి ఇద్దూ ?” అన్నాడు .
“ఏం పులుసురో ?” అన్నది ఎర్రి .
“ఏం పులుసునే , మావిడి కాయ నెల్లాకు ?”
ఎర్రి పసికట్టింది . కుంటాడి చంకలోంచి దిగి తొడ వార గుండ్రంగా మఠం వేసుకొని ఉన్నాది రెండు కుంచాల బియ్యపుమూట . ఎర్రి బుర్రంతా ఆశతో నిండిపోయింది .
“గింజలు బాగా దొరికినాయిరో ! ఎవిడి మొకం సూసినావు ?’ అన్నాది .
“సీకతిలో సలిమంట ఏసినాడు , ఎర్రగా నీ మోకమే సూసినాను “ అన్నాడు .
“ఉన్ననాడూ తినవా ? ఎదవ నెల్లాకు . సేపలైనా కొన్రా ! నానైతే మాంసం కొందును”. “అమ్మో గింజలైపోవూ ? ఆటితో నాను పడెను రోజులు బతకాలి !?
“రేపు తిరిపెమెత్తవా ? జానడు పోట్టకేబోరె ? మూడు పిడికిళ్ళు దొరికితే సాల్దూ ? కొన్రాసేపలు ?” అని బలవంత పెట్టింది .
దాని మాటలో ఉన్నాది ముష్టి వాళ్ల ఆర్ధిక రహస్యం . మూడు పిడికిళ్ళు దొరికితే చావకుండా బతకొచ్చు ! నలుగురమ్మలకి దయ గలిగితే నిండిపోతుంది . అదీ ముష్టి వాళ్ల ధీమా ! సోట్టాడు లేచాడు .ముసల్ది ముష్టి ముసాఫర్లకి కిరాణి సామానులు , కూరలు , కంపకట్టలూ అమ్ముతుంది .సోలడు నూకలు వెలపుచ్చుకొని నాలుగెండు చేపల్తో పులుసు సామానిచ్చింది . ఎర్రి పులుసుదాక తెచ్చింది .
“ఒరే ,నా నోటడుగుతాడు !” అన్నాడు .
“ఏటిరో ?”
“బియ్యం !”
“మా యమ్మకి జొరం . మూడు నాళ్ళయి ముష్టి నేడు .”
“నా నియ్యను !”
“ఊరికే అక్కర్నేదురో , నీకాడున్నాయి , బదులియ్యి , లేనినాడు మాకాడుచ్చుకో !”
“నా నియ్యను .”
“ఓ రియ్యరా !”
“జటకావోన్నడుగు . ఆడంటే నీకు రాకు .”
“ణీ జిమ్మడ ! జటకావోడు నన్నొగ్గీసినాడు .”
“నేదు .ఆడు బండి ఎక్కి కుచ్చుల కమిచీతో ఛలో ఛలో అంటాడు . ఆడి దగ్గర కెళ్ళు !”
“ఆడికి పెళ్లయి పోనాది !”
“ఐతే బైరోగొన్నడుగు , బైరాగోడిపాటి సేసినాను కాదు ! నా నూకలు కావాలా ?”
“ఆ బైరాగోడి సంగతి తెలుసా ? వో నా డద్ద రేతిరి శిలుం కొట్టి కొట్టి ఒచ్చినాడు , “ఏటంటావు ‘అన్నాడు . ‘రూపాయి ఇయ్యి ‘అన్నాడు . ‘రూపాయి బుర్రా నాది ?’ అన్నాడు .’అయితే పోయి శిలుం కొట్టుకో ‘అన్నాను . అటు సూసినాడు . ఇటు సూసినాడు . మొల్లోంచి తీశాడు . ఇచ్చు రూపాయి . బైరాగోళ్లు పెద్దవోళ్ళు ఆళ్ళ కాడ డబ్బుంటాది . నువ్వేటిరా ఇచ్చినావు ?”
“నాకాడేటుంది ?”
“ఉన్నదే !”
“ఉంటే తగువేమి ?”
‘ఆ బియ్యమన్నీ ఒగ్గేస్తావూ ?”
“ఒయ్యి కెళ్ళు . మాట తిరిగితే ఒట్టు “.
ఆ రాత్రి చీకట్లో కుంటాడు ఎర్రిని పట్టుకుని చెడ్డ బతిమాలేడు . తనూ వాళ్ళతో ఉండిపోతాననీ , తనకీ గంజి నీళ్లు పోస్తూ ఉండమనీ , తనని పెళ్లాడమనీ పెద్ద పట్టు పట్టేడు . ఎర్రి మెత్త పడ్డాది .
మర్నాడు ఎర్రి , సోట్టాడు కలిసి ఒండుకొంటున్నారు . ఎర్రి చేపల పులుసు మళ్లా పెట్టింది . కైరేతీ సత్రవులో అందరి ముక్కులూ ఎగర గొట్టింది పులుసు వాసన . జ్వరంతో పడుకున్న ముసిలాడు లేచాడు .
“ఈ డెవడు ?” అనడిగాడు .
“ఇక్కడున్న సోట్టాడే !” అన్నాది ఎర్రి .
“ఎందుకొచ్చి నాడూ ?”
“కలిసి వండుకొంటున్నాం .”
“కలిశా ?”
“ఔను మామా , కలోసుకొన్నాం .” అన్నాడు సోట్టాడు . ముసిలాడు ఎర్రగా చూశాడు .
“ఎళ్ళవతలికి సెత్త ఎదవా !” అన్నాడు ముసిలాడు .
“ఎందుకలా కసురుతావు ! నానంత సెడిపోయి నోన్ని కాను ,”అన్నాడు సోట్టాడు .
“ఓ రెరుగుదునెళ్రా ! జాత్తక్కువ ఎదవా !?
సోట్టాడు పిచ్చెత్తి పోయాడు .
“నాకా జాత్తక్కువ ? నాను కాపోళ్ళ కుర్రోన్ని . ఏటనుకొన్నావో ! ఆ ణీ కూతురు గొప్పయి పోనేదు . జటకావోడితో పోయిన సెటకారీ . ఆ జటకావోడు కాల్తో తన్నేడు . పెద్ద అల్లరి అయిపొయింది . ముష్టి వాళ్లంతా ఆమధ్య పడ్డారు . సోట్టాడు కుంటుకుంటూ వెళ్ళిపోయాడు .
“ఈ ఎదవా దొరికినాడు నీకు ? సరియైన వోన్ని నానే సుత్తాను “ అని ఎర్రికి చెప్పి ఎక్కడికో వెళ్ళిపోయాడు . సోట్టాడు మళ్లీ వొచ్చేడు .
“మీ యయ్యమాటలు ఇన్నావా ?” అనడిగాడు
“నా నేటి సేతును !” అన్నాది ఎర్రి
“నువ్వు సెయ్యగలిగింది నువ్వు సెయ్యాల !”
“ఏటి సెయ్య మంటావు ?”
“నాతోరా ! “
“ఎక్కడికి .”
“ఎక్కడికేటి ? రామేశ్శరం దరి నుంచి అడ్డు మాలిన రాజ్జం .”
“ముసిలాడు ?”
“ఆడేడు పాడేడుస్తాడు !”
“అంటే “
“ఒగ్గేద్దాం !”
“అమ్మ గుండె తీసినోడా ? రోగిష్టి పొన్నే ఒగ్గేసి నెతో కులుకుతూ రమ్మంతావూ ?”
“ణీ కిష్టమైతేనే !”
“ఎళ్ళేళ్ళు” అని కసిరి కొట్టింది . ఎర్రి కెదురుగా గోడమూల గోనె కప్పుకొని గొంగళీ పురుగులాగు చుట్టుకొని సోట్టాడు పడుకొన్నాడు . ఎర్రి దాకలో అన్నం గంజి వేసి నంచుకోడానికి నాలుగు మిరపకాయలు పెట్టి సోట్టాన్ని లేపింది .
“తిండి తిన్రా ! మళ్లా మా యయ్యోస్తే జట్టీ “
“నాను తినను !” అన్నాడు . ఎర్రి ఎంత బతిమాలినా లేచాడు కాదు .
ముసిలాడు వచ్చేడు . వాడితో పాటు గుడ్డి వాణ్ణి ఒకణ్ణి తీసుకొచ్చాడు .
“ఎర్రీ ! “ అని కేకేశాడు . ఎర్రి పలికింది .
“ఇయాళ నుంచి నువ్వు ముగ్గురికి గంజి నీళ్లు ఉడకెయ్యాలి. తెలిసిందా ? ఆ ? ఈ గుడ్డోన్నేరగవూ ?”
ఎర్రి గుడ్డి వాణ్ణి ఎరుగు . వాడితో వాళ్లు శ్రీ కూర్మం డోలా యాత్ర కెళ్ళారు .
“ ఎర్రీ బాగున్నా ?” అని కుశల మడిగేడు గుడ్డివాడు .
“ఏం బాగునే ? ముసిలోడు మూల పడ్డాడు !” అన్నాది ఎర్రి .
“పెద్దోడయాడు .” అన్నాడు గుడ్డివాడు .
“అనాగేనే “ అన్నాది ఎర్రి .

సేకరణ :బంగారు కథలు (కథా సంకలనం ) నుంచి ……………..

———–

You may also like...