బొల్లిముంత శివరామకృష్ణ (Bollimunta Shivaramakrishna)

Share
పేరు (ఆంగ్లం)Bollimunta Shivaramakrishna
పేరు (తెలుగు)బొల్లిముంత శివరామకృష్ణ
కలం పేరు
తల్లిపేరుమంగమ్మ
తండ్రి పేరుఅక్కయ్య
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ11/7/1920
మరణం6/5/2005
పుట్టిన ఊరుగుంటూరు జిల్లా వేమూరు మండలం చదలవాడ
విద్యార్హతలుగుంటూరులోనే హయర్‌ గ్రేడ్ ట్రెయినింగ్
వృత్తిఉపాధ్యాయుడు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలునవల : మృత్యుంజయులు
బెంగాల్ కరవుపై బుర్రకథ రాశారు. ‘రైతుబిడ్డ’ హరికథ రాశారు.
నాటికలు : ఏ ఎండకాగొడుగు, పత్రికా న్యాయం, తెలంగాణా స్వతంత్రఘోష, క్విట్ కాశ్మీర్, ధర్మసంస్థాపనార్థాయ
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు‘కాలం మారింది’కి రాష్ట్ర ప్రభుత్వ అవార్డు, ‘నిమజ్జనం’కు జాతీయ అవార్డు లభించాయి.
ఇతర వివరాలుబొల్లిముంత 1945లో టీచర్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి, పూర్తి సమయం పార్టీకి అంకితం చేశారు. పార్టీ పనులమీద తిరుగుతూ మునగాల పరగణాలోని జగ్గయ్య పేటకు వెళ్ళి రావడం జరుగుతూ ఉండేది. అక్కడే తెలంగాణ పోరాటం గూర్చి వినడం, అందిన రిపోర్టులు చదువుకోవడం, విషయాలు తెలుసుకోవడం జరుగుతూ ఉండేది. వాటితో ఉత్తేజితుడైన యువకుడు బొల్లిముంత ఇరవై ఏడేళ్ళ వయసులో ‘మృత్యుంజయులు’ నవల రాశారు. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన 1946-51 మధ్య అర్ధ దశాబ్ద కాలం పాటు తెలంగాణ రైతులు సాయుధులై దోపిడీ వర్గాల మీద తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటులో కవులు, రచయితలు, కళాకారులు ఎంతోమంది భాగస్వాములయ్యారు. యాదగిరి, సుద్దాల, తిరునగరి, నాజర్‌, సుంకర, వాసిరెడ్డి, కాళోజి, దాశరథి, కుందుర్తి, సోమసుందర్‌, గంగినేని వంటి కవులు తమ అక్షరాయుధాలతో ముందు నిలిచారు.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికబొల్లిముంత శివరామకృష్ణ
సంగ్రహ నమూనా రచనతెలుగునాట అభ్యుదయ సాహిత్యోద్యమం తొలిదశలో ఉన్నప్పుడే బొల్లిముంత శివరామకృష్ణ (1920-2005) సాహిత్య సృజన ప్రారంభించారు. బాల్యంలో ఈయనపై జస్టిస్‌ పార్టీ ప్రభావం, త్రిపురనేని రామస్వామి చౌదరి ప్రభావం ఎక్కువగా ఉండేది. అందుకు కారణం, వారి తండ్రిగారికి రామస్వామి చౌదరి నడిపే బ్రాహ్మణ వ్యతిరేకోద్యమంతోనూ, జస్టిస్‌ పార్టీతోనూ సన్నిహిత సంబంధాలుండేవి. ఆ సంబంధాల ప్రభావం కొడుకు శివరామకృష్ణపై బాగా పడ్డాయి. త్రిపురనేని రామస్వామి చౌదరి పద్యకవిత్వం రాస్తూ ఉండేవారు.

You may also like...