శ్రీనివాసపురం నరసింహాచార్యులు (Srinivasapuram Narasimhacharyulu)

Share
పేరు (ఆంగ్లం)Srinivasapuram Narasimhacharyulu
పేరు (తెలుగు)శ్రీనివాసపురం నరసింహాచార్యులు
కలం పేరుసింహాశ్రీ
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1/13/1927
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తివైద్యము
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలురాధిక, తెనుగుబిడ్డ, భగ్న హృదయము, రసార్ద్రము, చరమసంధ్య
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుకవికిశోర
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికశ్రీనివాసపురం నరసింహాచార్యులు
సంగ్రహ నమూనా రచన1948 సం. నుండి తీరిక సమయములందు పద్య, గేయ, వ్యాస, విమర్శనాత్మకమగు సాహిత్యకృషిని ప్రారంభించిరి. విద్యార్థిదశ నుండి ప్రాచీన కావ్యాలు, ప్రబంధాలు ఆసక్తిగా చదివేవారు. కనబడిన ప్రతిగ్రంథము చదువుట వీరికున్న ఒక మంచి అలవాటు. ‘‘రాధిక, తెనుగుబిడ్డ, భగ్న హృదయము, రసార్ద్రము, చరమసంధ్య’’ మొదలగునవి వీరి ఖండకావ్యములు.

శ్రీనివాసపురం నరసింహాచార్యులు

1948 సం. నుండి తీరిక సమయములందు పద్య, గేయ, వ్యాస, విమర్శనాత్మకమగు సాహిత్యకృషిని ప్రారంభించిరి. విద్యార్థిదశ నుండి ప్రాచీన కావ్యాలు, ప్రబంధాలు ఆసక్తిగా చదివేవారు. కనబడిన ప్రతిగ్రంథము చదువుట వీరికున్న ఒక మంచి అలవాటు. ‘‘రాధిక, తెనుగుబిడ్డ, భగ్న హృదయము, రసార్ద్రము, చరమసంధ్య’’ మొదలగునవి వీరి ఖండకావ్యములు. వీరి అనేక రచనలు త్రిలింజ్ఞ, హితవాది, చిత్రగుప్త, పల్లెసీమ, భారతి, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభలలో ప్రచురింపబడినవి. చిన్ననాడే వీరు ‘‘కవికిశోర’’మని పిలువబడిరి. 1960 లో ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ‘‘తెలుగు కలాలు’’ శీర్షికలో వీరినిగూర్చి వ్రాయబడినది.
హైందవ చారిత్రక విషయములలో వీరికి విశేషమైన ప్రజ్ఞగలదు. 1964 జనవరి – మార్చి నెలల ‘‘భారతి’’ మాసపత్రికలో ప్రచురింపబడిన ‘‘రాజావళి చరిత్ర నాటిది కాదు’’ ‘‘రాజావళి’’ చరిత్ర మరికొన్ని విశేషములు. వీరి ఎన్నదగిన పరిశోధనా వ్యాసములు. ‘‘అక్షయ భారత విజ్ఞానము’’ అను నొక బృహన్నిఘంటు నిర్మాణమునకు పూనుకొన్న సాహిత్య సాదకుడీయన.
సోదరులతో కలిసి వ్రాసిన విజయనగర నవలామాలిక లోని ‘‘దేవగిరిదుర్గం, రాజ్యోదయము, రాజ్యక్రాంతి, నాగలాదేవి, రఘునాథవిజయము’’ అను నైదు సంపుటములకు వీరు ప్రధాన సంపాదకులు.
‘‘వైద్యము ప్రధానజీవికగా, బ్రతుకుబాటలో భవిష్యత్తుకై సాగే పోరాటములో, కాలముతో కలసిసి రాజకీరాని గడుసరి. ఆత్మాభిమాని. శాస్త్రచక్షువు. వ్యాసకర్త, కావ్యప్రియుడు’’ మన నరసింహాచార్యులు.

———–

You may also like...