కంచి వీరశరభకవి (Kanchi Veerasharabha Kavi)

Share
పేరు (ఆంగ్లం)Kanchi Veerasharabha Kavi
పేరు (తెలుగు)కంచి వీరశరభకవి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుహరిశ్చంద్రోపాఖ్యానము
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికకంచి వీరశరభకవి
సంగ్రహ నమూనా రచనఈకవియు శంకరకవివలెనే హరిశ్చంద్రోపాఖ్యానము నయిదాశ్వాసముల పద్యకావ్యముగా రచియించెను. కవి శైవబ్రాహ్మణుడు; కాశ్యపగోత్రుడు; శోభనాద్రీశునకును పండితారాధ్యుల వీరనాధ్యుని పుత్రియగు గురవమాంబకును బుత్రుడు . ఈయిరువురుకవులు నించుమించు నేకకాలమునందే తమకావ్యములను రచియించినట్లు తోచుచునంది. ఇందు శంకరకవిపుస్తకమునకంటె నేబదిపద్యము లధికముగా నున్నవి. ఒకరు వ్రాయుచున్నకథ నొక రెరుగకయిరువురుకవులును గౌరనమంత్రికృతమైన ద్విపదకావ్యము ననుసరించి తమ పద్యకావ్య ములను జేసి యుండవచ్చును. ఒకవేళ నీయిద్దరిలో నొకరు రెండవ వాని కావ్యమును జూచి తరువాత దనపుస్తకమును జేసియు నుండవచ్చును. ఈయంశమును దీనిం జదువువారు నిర్ధారణ చేసికొన గలుగుట కయి యించుమించుగా శంకరకవి గ్రంథములోనుండి యుదాహరించిన పద్యముల యర్థము నిచ్చెడు పద్యములనే యిందుదాహరించు చున్నాను-

కంచి వీరశరభకవి

ఈకవియు శంకరకవివలెనే హరిశ్చంద్రోపాఖ్యానము నయిదాశ్వాసముల పద్యకావ్యముగా రచియించెను. కవి శైవబ్రాహ్మణుడు; కాశ్యపగోత్రుడు; శోభనాద్రీశునకును పండితారాధ్యుల వీరనాధ్యుని పుత్రియగు గురవమాంబకును బుత్రుడు . ఈయిరువురుకవులు నించుమించు నేకకాలమునందే తమకావ్యములను రచియించినట్లు తోచుచునంది. ఇందు శంకరకవిపుస్తకమునకంటె నేబదిపద్యము లధికముగా నున్నవి. ఒకరు వ్రాయుచున్నకథ నొక రెరుగకయిరువురుకవులును గౌరనమంత్రికృతమైన ద్విపదకావ్యము ననుసరించి తమ పద్యకావ్య ములను జేసి యుండవచ్చును. ఒకవేళ నీయిద్దరిలో నొకరు రెండవ వాని కావ్యమును జూచి తరువాత దనపుస్తకమును జేసియు నుండవచ్చును. ఈయంశమును దీనిం జదువువారు నిర్ధారణ చేసికొన గలుగుట కయి యించుమించుగా శంకరకవి గ్రంథములోనుండి యుదాహరించిన పద్యముల యర్థము నిచ్చెడు పద్యములనే యిందుదాహరించు చున్నాను-

చ. ఉరుతరసత్యవాక్యవినయోచితభూరిగుణప్రసిద్ధికిన్
నరపతు లేమిలెక్క పదునాలుగులోకములయందు జూడ గి
న్నరసురయక్షకింపురషనాయకులం దొక డైన లేడు ని
ర్భరమహితప్రభావమున బన్నిద మిత్తు బురారిసన్నిధిన్. [ఆ.1]

ఉ. మానవనాథ యీకొఱత మాటల దీఱదు గాధినూను డీ
పూనిక దప్ప డింక గొనిపోయిరె మున్ను ధరిత్రి చేరెడం
తైన నర్తేంద్రముఖ్యులు దివాకరవంశ పయోధిచంద్ర నీ
మానితవాగ్వదాన్యమహిమం బెడబాయు టదేమి చూడగన్. [ఆ.2]

చ. ధృతిమెఱయంగ నే నిటుపతివ్రత నేని, ధరిత్రిమీద మ
త్పతిఘనసత్యవాక్యనయభాసుర డేని కృశాన నీ విదే
హితమతి శీతలాకృతి వహించి ధరామరవర్యు భూవిభున్
సుతు డగులోహితాస్యు దయజూచి మునీంద్రుఋణంబుదీర్పుమా. [ఆ.2]

ఉ. ఏమనవచ్చు మున్ను ధరయేలినరాజులదేవులెల్ల స
త్కామవినోదవైభవసుఖప్రదలై నసియింప, నిన్ను బల్
బాముల గప్పి కాఱడవిపాలుగ ద్రిప్పి కృతఘ్న బుద్ధిచే
నీమము దప్పి యమ్ముకొన నేరుపు గల్గె లతాంగి యేమనన్. [అ.4]
శా. సప్తద్వీపసముద్రముద్రితమహాసర్వంసహాచక్రసం
ప్రాప్తశ్రీకమనీయలక్షణజగత్ప్రావీణ్యసత్యవ్రతో
ద్దీప్తప్రాభవు డైనరాజసుతు డర్థిన్ దైన్యభావోదయ
వ్యాప్తిన్ బెత్తెడునేల కైన దగడే యంచు న్విలాపించుచున్. [ఆ.5]

ఆంధ్ర కవుల చరిత్రము నుండి…

———–

You may also like...