పేరు (ఆంగ్లం) | Kumara Dhurjati |
పేరు (తెలుగు) | కుమార ధూర్జటి |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | కృష్ణదేవరాయల చరిత్రము |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | కుమార ధూర్జటి |
సంగ్రహ నమూనా రచన | సీ. వాక్ఛాసనుం డగువాని నిక్కంబుగా నలబ్రహ్మదేవుడేయని నుతింతు గుండలీంద్రసమాఖ్య గొమరొందుకవిచంద్రు ననువొంద శేషాహియని తలంతు శ్రీనాథవిఖ్యాతిజెన్నొందుబుధవర్యు బురుషోత్తముడటంచుబుజ్జగింతు ధూర్జటిప్రౌడిచే నూర్జితుం డగువాని సాక్షాచ్ఛివుండని సంస్మరింతు నవని మఱియును వెలసిన యాంధ్రకవుల సాధునిక పూర్వకవుల యశోధనికుల సారసాహిత్యసౌహిత్యసరణి వెలయ వర్ణన వొనర్తు రమణీయవాక్యములను ఈకవి తన్నుగూర్చి కృష్ణరాజవిజయమునం దీక్రిందిరీతిగా జెప్పుకొన్నాడు- |
కుమార ధూర్జటి
ఈకవికి నిజ మయినపేరు వేంకటార్యుడు. ఇతడు పాకనాటి నియోగిబ్రాహ్మణుడు, కాళియామాత్యుని పుత్రుడు; ధూర్జటి పౌత్రుడు. ఈకవి యాకువీటిరా జయిన చినవేంకటాద్రియొక్క కోరిక మీద గృష్ణరాయవిజయ మనుపేర కృష్ణదేవరాయల చరిత్రమును శ్రీరామాంకితముగా రచియించెను. ఈతని కవిత్వము మిక్కిలి రసవంతమైనది. ఇతడు కృష్ణరాజవిజయ మనెడి యీనాలుగాశ్వాసముల గ్రంథమును మాత్రమే కాక సావిత్రీచరిత్రము, ఇందుమతీవివాహము మొదలయిన గ్రంథములుకూడ జేసినట్లు తెలియవచ్చుచున్నది. కృష్ణరాజవిజ యమునందలి యీక్రింది కవిస్తుతి పద్యమువలననే యీకవియొక్క ప్రౌడిమ తేటపడుచున్నది-
సీ. వాక్ఛాసనుం డగువాని నిక్కంబుగా నలబ్రహ్మదేవుడేయని నుతింతు
గుండలీంద్రసమాఖ్య గొమరొందుకవిచంద్రు ననువొంద శేషాహియని తలంతు
శ్రీనాథవిఖ్యాతిజెన్నొందుబుధవర్యు బురుషోత్తముడటంచుబుజ్జగింతు
ధూర్జటిప్రౌడిచే నూర్జితుం డగువాని సాక్షాచ్ఛివుండని సంస్మరింతు
నవని మఱియును వెలసిన యాంధ్రకవుల
సాధునిక పూర్వకవుల యశోధనికుల
సారసాహిత్యసౌహిత్యసరణి వెలయ
వర్ణన వొనర్తు రమణీయవాక్యములను
ఈకవి తన్నుగూర్చి కృష్ణరాజవిజయమునం దీక్రిందిరీతిగా జెప్పుకొన్నాడు-
సీ. నను భరద్వాజగోత్రుని సదాపస్తంబసూత్రుని బాంధవస్తోత్రపాత్రు
బాక నా టార్వేలవంశప్రసిద్ధుని ధూర్జటిపౌత్రు బంధురచరిత్రు
సద్గురుకారుణ్యసంప్రాప్తవిద్యావిహారుని శ్రీకాళహస్తినిలయ
చిత్ప్రసూనాంబికాశ్రీక రానుగ్రహాసాదితకవితారసజ్ఞ హృదయు
సారరచనాధురీణు గుమారధూర్జ
టిప్రధానాగ్రగణ్యు బటీరహీర
మహితసత్కీర్తి గాళియామాత్యపుత్రు
వేంకటార్యుని బిలిపించి వేడ్క ననియె.
క. బాలుడ వయ్యును విద్యా | శీలుడవు గభీరమథురశృంగారకళా
లాలితచాతుర్య కవి | త్వాలోచననిపుణ వేంకటామాత్యమణీ.
ఉ. చిత్రముగాగ బిన్నపుడె చెప్పితివౌ రసము ల్చెలంగ సా
విత్రిచరిత్రమున్ మిగుల వేడుక నిందుమతీవివాహమున్
స్తోత్ర మొనర్ప నర్హ మగుసూక్తిగతిన్ రచియించితౌ గదా
ధాత్రి బ్రసిద్ధిగాంచితివి ధన్యుడ వౌర కుమారధూర్జటీ.
చ. డెలు గున జెప్ప నేర్చినసుధీజను లెల్ల సెబాసు ధూర్జటీ
బళి యన దళ్కువగ బాటిలు తేట తెనుంగుమాటలన్
మెలకువగాంచు బెళ్కుజిగిమించ బ్రబంధములన్ ఘటించితౌ
పలుకులముద్దరాలిమిహిబంగరుటందెరవల్ చెలంగగన్.
క. మాకరుణకు బాత్రుండవు|ప్రాకటగతి బద్యకావ్యఫణితిం జెపుమా
శ్రీకృష్ణరాయచరితము|నీకవితాప్రౌడి సుకవినికరము మెచ్చన్.
శ్రీకృష్ణరాజవిజయములోని యీక్రిందిపద్యమునుబట్టి చూడగా గృష్ణదేవరాయల పట్టాభిషేక మహోత్సవమునాటి కార్వీటి బుక్కరాజు జీవించియున్నట్టే కనబడుచున్నది-
సీ. చక్కెరవిలుకాని చక్కదనముగల్గి చొక్కమౌ నార్వీటి బుక్కరాజు,
సాకల్యముగ గీర్తి సర్వదిక్తటులందు బ్రాకటస్థితిమించు నౌకువారు,
కంటకరాజన్య గర్వంబు లడగించి లీలచే మించునంద్యాలవారు,
ధాటీనిరాఘాట ఘోటీహతవిరోధికోటులై వెలయు వెల్గోటివారు.
చండతరశౌర్యు లగు పెమ్మసానివారు
బూదహళివారు మొదలైనభూమిపతులు
గొలువ పట్టాభిషిక్తుడై చెలువుమీఱె
రమ్యగుణపాళి శ్రీకృష్ణరాయమౌళి.
ఈకవియొక్క తాత కృష్ణదేవరాయని యాస్థానమునం దున్న వాడగుటచేతను కృష్ణరాజవిజయమును జెప్పునప్పటి కితడు బాలుడని చెప్పబడియుండుటచేతను కృష్ణరాజవిజయము 1550 వ సంవత్సర ప్రాంతమునందు రచియింపబడి యుండును. ఈ కవియు 1560 – 70 సంవత్సరముల వఱకు జీవించియుండునని యూహింపదగియున్నది. ఈతని కవిత్వము మృదుమధుర వాక్యరచనాధురీణమయి కర్ణరసాయనముగా నుండును. ఈతని కవనధోరణిని దెలుపుటకు గృష్ణరాయ విజయములోని రెండుమూడు పద్యము లిందుదహరింపబడుచున్నవి-
ఉ. ఠీవిగ నౌకువారును గడిందిరహిన్ వెలుగోటివార లా
రావెలవారు గూడుకొని రాత్రిపగల్ చతురంగసేనతో
నేవగ జూచినన్ దివియ నెంతయు శక్యముగాని దుర్గమా
భూవరమౌళి కాంచి యొకపూటనె తీసెదనంచు నుగ్రుడై.
శా. ఔరా చూచితిగాదె రాయలబలం జౌరౌర యేనుంగు ల
య్యారే యీచతురంగసంఘము లహాహా మన్నెవారల్ బళీ
ధీరుల్ రాజకుమారు లంచు మది నెంతేనద్భుతం బొందుచున్
బోరన్ శక్యమె యీనృపాలమణితో భూరిస్థిరప్రౌడిమన్- [ఆ.3]
మ. చెలువల్ తోడ్కొనిరా మణీఖచితమంజీరధ్వను ల్మించగా
దళుకుంజెక్కు మెఱుంగుటద్దములపై దాటంకరత్నద్యుతుల్
వెలయం దా గజరాజపుత్రి యగుఠీవిం దెల్పుచందాన వ
చ్చె లతాంగీమణి మందమందగతులన్ శృంగార ముప్సొంగగన్- [ఆ.4]
ఆంధ్ర కవుల చరిత్రము నుండి…
———–