తరిగొప్పుల మల్లన (Tarigoppula mallana)

Share
పేరు (ఆంగ్లం)Tarigoppula Mallana
పేరు (తెలుగు)తరిగొప్పుల మల్లన
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుచంద్రభాను చరిత్రము
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికతరిగొప్పుల మల్లన
సంగ్రహ నమూనా రచనఈకవి చంద్రభానుచరిత్ర మనెడి యైదాశ్వాసముల ప్రబంధమును రచియించెను. ఇతడు నియోగిబ్రాహ్మణుడు; దత్తాత్రేయ యోగీంద్రుని శిష్యుడు; దత్తనామాత్యుని తమ్ముడు. ఈతడు లాక్షణిక కవి; కవిత్వము రసవంతముగా నుండును. ఈకవి వసుచరిత్రమును కృతినందిన తిరుమలదేవరాయని పుత్రుడగు వేంకటపతిరాయల కాలములో నుండినట్లు చంద్రభానుచరిత్రములోని యీక్రిందియెత్తుగీతములో జెప్పినాడు –

సీ. … … … … …
అనుచు బుధులెన్నవలయు రాజాధిరాజ
రాజపరమేశ సకలకర్ణాటకాంధ్ర
రాజ్యధౌరేయ తిరుమలరాజతనయ
చంద్రు డగువేంకటపతిక్షి తీంద్రమణికి.

తరిగొప్పుల మల్లన

ఈకవి చంద్రభానుచరిత్ర మనెడి యైదాశ్వాసముల ప్రబంధమును రచియించెను. ఇతడు నియోగిబ్రాహ్మణుడు; దత్తాత్రేయ యోగీంద్రుని శిష్యుడు; దత్తనామాత్యుని తమ్ముడు. ఈతడు లాక్షణిక కవి; కవిత్వము రసవంతముగా నుండును. ఈకవి వసుచరిత్రమును కృతినందిన తిరుమలదేవరాయని పుత్రుడగు వేంకటపతిరాయల కాలములో నుండినట్లు చంద్రభానుచరిత్రములోని యీక్రిందియెత్తుగీతములో జెప్పినాడు –

సీ. … … … … …
అనుచు బుధులెన్నవలయు రాజాధిరాజ
రాజపరమేశ సకలకర్ణాటకాంధ్ర
రాజ్యధౌరేయ తిరుమలరాజతనయ
చంద్రు డగువేంకటపతిక్షి తీంద్రమణికి.

ఈవేంకటపతిరాయలు 1585 వ సంవత్సరము మొదలుకొని 1614 వ వఱకును రాజ్యముచేసినవా డయినందున, కవియు నాకాలమునం దుండినవాడే. తాలికోట యుద్ధమయినతరువాత తండ్రియైన తిరుమలదేవరాయడు తనరాజధానిని విజయనగరమునుండి పెనుగొండకు మార్చుకొన్నట్లే కొమారుడైన యీవేంకటపతిరాయడును తనరాజధానిని పెనుగొండనుండి చంద్రగిరికి మార్చుకొనెను. ఈకవి కవితా రచనను సూచించెడుపద్యములను రెంటిమూటి నిందు బొందుపఱుచు చున్నాను-

ఉ. అంత దిగంతదంతురల తాంతనిశాంతని తాంతకాంతవ
న్యంతిక తాంతపాంధజనతాంతరసంతతకృంతనప్రధా త్యంతసమంతవిస్ఫుర దుదంత పరంతపకాంతిసంతతి
క్రాంతదురంతకుంతరతికాంతము పొల్చె వసంత మెంతయున్. [ఆ.3]

ఉ. తత్తఱపాటుతోడ గనుదమ్ములడాలు దిగంతరంబులన్
జిత్తరు నింప లే బయిటచేల కుచంబులపొంత జాఱ నా
బిత్తరి మ్రానుపాటొదవ బిమ్మటితో నొకకొంత గొంకి లో
జిత్తము మట్టుపెట్టుకొని చేరి సహోదరుదండ నిల్వగన్. [ఆ.4]

ఉ. ధరణితలేంద్రనందనవిధంబున గనుంగొన గోరి మున్ను కి
న్నరవరు డిచ్చినట్టి భువనస్తుతమైనయదృశ్యవిద్య న
య్యిరువురు గుప్తమూర్తు లయి యిందుసహోదరమందిరంబునన్
దరలక యుండి రట్టియెడ దన్వియు జేరగ వచ్చి యచ్చటన్. [ఆ.5]

ఆంధ్ర కవుల చరిత్రము నుండి…..

———–

You may also like...