పేరు (ఆంగ్లం) | Anisetty Subbarao |
పేరు (తెలుగు) | అనిసెట్టి సుబ్బారావు |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 1/1/1922 |
మరణం | 1/1/1981 |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | బి.ఎ. |
వృత్తి | తెలుగు సినిమా రచయిత మరియు ప్రగతిశీల కవి, నాటక కర్త. |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | రక్తాక్షరాలు (1943), అనిశెట్టి నాటికలు (1945), శాంతి (1951), మా ఊరు (1954) |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | సుబ్బారావు, మహాకవి శ్రీశ్రీకి బాగా సన్నిహితుడు. సుబ్బారావు మరణించిన తర్వాత మద్రాసులోని సంతాప సభలో శ్రీశ్రీ ‘నాకు అనిశెట్టి, ఆరుద్ర అ-ఆ’ లాంటివారు. అ-పోయింది. ఆ- మిగిలింది’ అని చెప్పి క్లుప్తంగా తమ అనుబంధాన్ని తెలిపి ముగించాడు |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | అనిసెట్టి సుబ్బారావు |
సంగ్రహ నమూనా రచన | వచ్చాను వచ్చాను వ్యాస సంతతి వాణ్ణి! వెళ్ళిపోయిన కోటికోట్ల జీవుల విడిచి కుళ్ళిపోయే నేటి కోట్ల జీవుల కొరకు పొర్లివచ్చే కోటీ కోట్ల జీవులకొరకు వచ్చాను వచ్చాను |
అనిసెట్టి సుబ్బారావు
వచ్చాను వచ్చాను – అనిసెట్టి సుబ్బారావు కవిత
వచ్చాను వచ్చాను
వ్యాస సంతతి వాణ్ణి!
వెళ్ళిపోయిన కోటికోట్ల జీవుల విడిచి
కుళ్ళిపోయే నేటి కోట్ల జీవుల కొరకు
పొర్లివచ్చే కోటీ కోట్ల జీవులకొరకు
వచ్చాను వచ్చాను
వ్యాస సంతతి వాణ్ణి !
కలగుండు వడియు నిశ్చలమైన గుండె వలె
నిద్రించు నీటిలో విడుచు పొడిరాయివలె
ఆడవులూ, పడవులూ ‘ అహఒఉ ‘ టెల్లలు దాటి
వచ్చాను వచ్చాను
వ్యాస సంతతి వాణ్ణి !
పగిలించి రణ్భేరి, పద్మవ్యూహము త్రెంచి
శివమెత్తి విస్ఫులింగములు చిమ్ముతులేచి
ఈ జగతిలో నూతన జగతి పెకలిస్తాను!
వచ్చాను వచ్చాను
వ్యాస సంతతి వాణ్ణి !
తలవొగ్గి బానిస సలాము చెయ్యరు మీరు,
ధన మదాంధత బలిసి తారసిల్లరు మీరు,
వచ్చాను వచ్చాను
వ్యాస సంతతి వాణ్ణి !
రాళ్ళు రప్పలు ప్రాణ్మొలొకి పులకింపగా
పరాకోటినందు ప్రాణుల కళాసృష్టి;
ఎగసి ప్రవహిస్తుంది ఇక వెలుగు బావుటా
వచ్చాను వచ్చాను
వ్యాస సంతతి వాణ్ణి !
ప్రేమమూర్తుల నిత్యనృత్యమై, సత్యమై
భువనముల్ సకలముల్ పొంగి పోవంగా
నిర్భరానందమావిర్భవించగా
వచ్చాను వచ్చాను
వ్యాస సంతతి వాణ్ణి !
———–