కృష్ణదేవరాయలు (Krishnadevarayalu)

Share
పేరు (ఆంగ్లం)Krishnadevarayalu
పేరు (తెలుగు)కృష్ణదేవరాయలు
కలం పేరు
తల్లిపేరునాగలాంబ
తండ్రి పేరుతుళువ నరసనాయకుడు
జీవిత భాగస్వామి పేరుతిరుమలాదేవి, అన్నపూర్ణ, కమల
పుట్టినతేదీ1471
మరణం1529 అక్టోబరు 17
పుట్టిన ఊరుహంపి , కర్ణాటక 
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుఆముక్తమాల్యద
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుఆంధ్ర భోజుడు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికకృష్ణదేవరాయలు
సంగ్రహ నమూనా రచనఇత డాముక్తమాల్యద యను నామాంతరముగల విష్ణుచిత్తీయ మనుప్రబమంధమును రచించిన మహాకవి. ఇతడు కవీశ్వరు డయి విద్వ న్మహాకవుల నాదరించుట వలననేకాక మహారాజయి యనేక దేశములను జయించుటవలన గూడ సుప్రసిద్ధు డయినవాడు. దక్షిణహిందూ దేశమును పాలించినరాజులలో నింతదేశమును జయించి యేలినవాడును, ఇంత ప్రసిద్ధి కెక్కినవాడును, మఱియెవ్వడును లేడు. కాబట్టి యీతని చరిత్రమును వ్రాయుటకుముం దీతని పూర్వచరిత్రమునుగూడ సంక్షేపముగా గొంతవ్రాయుట యుచితమని తోచుచున్నది. ఈతని రాజధాని బళ్ళారిమండలములోని యానెగొందికి సమీపమున తుంగభద్రాతీరమునం దున్న విజయనగరము. ఈవిజయనగరమునకు విద్యానగరమనియు నామాంతరము గలదు.

కృష్ణదేవరాయలు

ఇత డాముక్తమాల్యద యను నామాంతరముగల విష్ణుచిత్తీయ మనుప్రబమంధమును రచించిన మహాకవి. ఇతడు కవీశ్వరు డయి విద్వ న్మహాకవుల నాదరించుట వలననేకాక మహారాజయి యనేక దేశములను జయించుటవలన గూడ సుప్రసిద్ధు డయినవాడు. దక్షిణహిందూ దేశమును పాలించినరాజులలో నింతదేశమును జయించి యేలినవాడును, ఇంత ప్రసిద్ధి కెక్కినవాడును, మఱియెవ్వడును లేడు. కాబట్టి యీతని చరిత్రమును వ్రాయుటకుముం దీతని పూర్వచరిత్రమునుగూడ సంక్షేపముగా గొంతవ్రాయుట యుచితమని తోచుచున్నది. ఈతని రాజధాని బళ్ళారిమండలములోని యానెగొందికి సమీపమున తుంగభద్రాతీరమునం దున్న విజయనగరము. ఈవిజయనగరమునకు విద్యానగరమనియు నామాంతరము గలదు. ఈపట్టణము విద్యారణ్యస్వామియని మహాప్రసిద్ధిగన్న మాధావాచార్యులవారి యాజ్ఞచేత గట్టబడినది. ఈమాధవాచార్యు లాకాలమునందు బుక్కరాజువద్ద మంత్రిగా నుండెను. కంపభూపతి కుమారుడైన బుక్కరాజు క్రీస్తుశకము 1379 వ సంవత్సరము వఱకును రాజ్యము చేసెను. ఈరాజు హూణశకము 1336 వ సంవత్సరము మొదలుకొని 1350 వ సంవత్సరము వఱకునుగూడ తనయన్నయైన హరిహర రాజుతో గలిసి రాజ్యము చేసెననియు, ఆకాలమునందు గూడ మాధవాచార్యుడే వారికి మంత్రియనియు, వారికిరాజ్యము మాధవాచార్యుని వలననే వచ్చెననియు, కొందఱందురుగాని యది యెంతవఱకు సత్యమో తెలియదు. బుక్కభూపాలుని తండ్రియైన సంగ (కంప) రా జొకచిన్న సంస్థానాధిపతియై యుండి, మహమ్మదీయులు దండెత్తి వచ్చి హిందూ రాజ్యమును నాశనముచేసి యోరుగంటి ప్రతాపరుద్రుని చెఱగొనిపోయిన కాలములో తనరాజ్యమును పోగొట్టుకొని యుండును. కొందఱతడు గొల్లవాడని చెప్పుదురు. కాని యాతని పూర్వస్థితిని నిర్ధారణము చేయుటకు దగిన యాధారము లేవియు నిప్పుడు కానరావు. ఈ హరిహర బుక్కరాజులు సహితము ప్రతాపరుద్రుని యవసానదశ యందాతని సేవలో దండనాథులుగా నుండిరని యొకానొకరు వ్రాసియున్నారు. ఏదియెట్లున్నను వీ రారంభదశలో రాజ్యహీనులయియుండి తమ ధైర్యసాహసముల వలనను తమ కులగురువైన మాధవాచార్యుని బుద్ధిబలమువలనను రాజ్యము సంపాదించి, స్వతంత్రులై మాధవాచార్యుని మంత్రిగా జేసికొని యాతని యాలోచన ననుసరించి వర్తించు చుండినట్టుమాత్రము నిశ్చయముగా తెలియవచ్చుచున్నది. మాధవాచార్యులు తానొక దేవత నుపాసించి యాదేవతను బ్రత్యక్షము చేసికొని యామెవరముచేత బుక్కభూపాలునకు రాజ్యమిప్పించెనని కొందఱును, లక్ష్మీకటాక్షమును బొంది సన్నిహితురాలయిన లక్ష్మీదేవిని త న్నైశ్వర్యవంతునిగా జేయుమని కోరినప్పు డామె యాతని కాజన్మమునందు లక్ష్మీ లభింపదని చెప్పగా జన్మాంతరతుల్యమైన సన్యాసమును స్వీకరించి వైభవములను బొందెనని కొందఱును వ్రాసియున్నారు. ఇవి యిటీవలివారి బుద్ధికల్పితములు. ఇటువంటి కథలను కల్పించుటలో హిందువులకు గల సామర్థ్యము మఱియెవ్వరికిని గానబడదు. మాధవాచార్యులకు బూర్వమునందు శంకరాచార్య పీఠమునకు వచ్చిన యతీశ్వరు లాదిశంకరుని వలెను, ఇతర సన్యాసులవలెను పాదచారులయి భిక్షాటనము చేయుచు, శిష్యపరంపరకు తత్త్వబోధను జేయుచువచ్చిరి. ఈ మాధవాచార్యుడు బుక్కరాజువద్ద మంత్రిగానుండి సమస్తవైభవముల ననుభవింపుచు సన్యసించినవా డగుటచేత దాను సన్యాసియయ్యును తొంటివిభవములను విడువజాలనివా డయి జనులకు దనయందు గల గౌరవాధిక్యము వలనను, రాజానుగ్రహము వలనను, గజాశ్వాందోళనాది సమస్తరాజ చిహ్నములను ధరించి, పీఠాధిపతుల కిట్టి యైశ్వర్యచిహ్నము లుండవచ్చునని నిబంధనముచేసి సమర్థించుకొనెను. ఏనుగులతోను, గుఱ్ఱములతోను, వాద్యములతోను పల్లకులలోనెక్కి సర్వసంగపరిత్యాగు లయిన సన్యాసులు మహారాజ వైభవముతో సంచరించుట దేవతా పరాయత్తమని సాధించుటకై మనవారీ లక్ష్మీకథను తరువాత గల్పించియుందురు. సన్యాసాశ్రమమును స్వీకరించినప్పుడు మాధవాచార్యులవారు విద్యారణ్యు లన్న నామమును స్వీకరించిరి. వీరికాలము నుండియే జగద్గురువుల మనుకొనెడు స్మార్తాచార్యపీఠస్తు లయినయతుల కందఱకును గజాశ్వాదులును వాద్యములును పెండ్లి పల్లకులును పరంపరగా వచ్చుచున్నవి. ఈ మాధవాచార్యులవారు గొప్ప విద్వాంసులు. ఆదిశంకరుల తరువాత శంకరాచార్య పీఠమునకు వచ్చినవారిలో మాధవచార్యులకు బూర్వమునందుగాని పరమునందుగాని యింతటిపండితులు మఱియెవ్వరును లేరు. ఈయన పరాశర మాధవీయ మనుపేర పరాశరస్మృతి కొక్క గొప్ప వ్యాఖ్యానమును, కాలమాధవీయ మనునొక కాలనిర్ణ యగ్రంథమును, శంకరవిజయమును, విద్యారణ్యమని ప్రసిద్ధిగన్న వేదభాష్యమును, నూటయెనిమిది యుపనిషత్తుల కొకవ్యాఖ్యానమును, సర్వదర్శన సంగ్రహమును, మాధవనిదాసమును రచియించెను. రాబోయెడు విజయనగర రాజుల చరిత్రమును దివ్యజ్ఞానముచేత ముందుగానే తెలుపుచు నీ మహావిద్వాంసునిచే రచియింపబడిన దన్న కాలజ్ఞానమను పుస్తక మొకటి కలదు. గాని యది విజయనగర సంస్థానము క్షీణించినతరువాత రచింపబడిన యాధునికగ్రంథ మయియుండును. మాధవాచార్యులవారు తుంగ భద్రాతీరమునందున్న పంపానగరమునందు జన్మించిరి; వీరు బుక్కభూపాలునికి కులగురువులు; భారద్వాజసగోత్రులయిన తెలుగు బ్రాహ్మణులు; ఈయన తండ్రి మాయణుడు; అన్నసాయణుడు. అన్న యందును తండ్రియందునుగల గౌరవముచేత మాధవాచార్యుల వేదభాష్యములలో గొన్నిటికి వారిపేరులు పెట్టెను. మాధవాచార్యులు తొంబదిసంవత్సరముల ప్రాయమున సిద్ధిపొందిరట; ఈయన 1368 వ సంవత్సరము నందు బుక్కరాజుమంత్రి యైయుండిన ట్లొక తామ్రశాసనమువలన దెలియ వచ్చుచున్నది. మాధవీయాదిగ్రంథములలో మాధవాచార్యులవారు తమవంశమును దెలుపుచు వ్రాసిన రెండు శ్లోకముల నిందు జూపు చున్నాను:-
శ్లో|| యస్య బోధాయనంసూత్రం శాఖాయస్యచయాజుషీ
భారద్వాజకులంయస్య సర్వజ్ఞ స్సహిమా ధవ:
శ్రీమతీయస్యజననీ సుకీర్తి ర్మాయణు: పితా
సాయణోభోగ వాథశ్చ మనోబుద్ధిసహోదరౌ.
బుక్కరాజుతరువాత నాతనికి కామాక్షీ దేవివలన బుట్టినహరిహరనాథుడు 1379 వ సంవతరము మొదలుకొని 1401 వ సంవత్సరము వఱకును రాజ్యము చేసెను. ఈ హరిహరరాజునకు మల్లాదేవి వలన గలిగిన పుత్రుడైన వీరప్రౌడదేవరాయలు 1412 వ సంవత్సరము వఱకును, ఆతనిపుత్రుడైన విజయభూపతి 1418 వ సంవత్సరము వఱకును, ఆతనికుమారుడైన దేవరాయలు 1422 వ సంవత్సరము మొదలుకొని 1447 వ సంవత్సరము వఱకును రాజ్యము చేసినట్లు శిలాతామ్రశాసనములవలన దెలియవచ్చుచున్నది. కాని వీ రేయేసంవత్సరములయందు సింహాసన మెక్కిరో యేయేసంవత్సరములయందు పరమపదమును పొందిరో నిశ్చయముగా దెలియదు. బుక్కరాజు కాలమునుండియు వీరికి మహమ్మదీయులతో యుద్ధములు జరుగుచు వచ్చెను. 1364 వ సంవత్సరమునందు మొట్ట మొదట బుక్కరాజు మహమ్మదీయులను యుద్ధములో జయించెను. ఆతని పుత్రుడైన హరిహరరాజును మహమ్మదీయులతో యుద్ధము చేసి 1380 న సంవత్సరమునందు తురష్కులను గోవానగరమునుండి వెడల గొట్టెను. ఈ హరిహరరాజు హిందూదేవాలయముల కనేకములకు భూధానములు చేసెను. హరిహరరాజుయొక్క కడపటి దినములలో సాళువగుండరాజు మంత్రిగా నుండెను. గుండరాజు జైమినిభారతము కృతినందిన సాళువనృసింహరాజుతండ్రి. గుండరాజు మంత్రిగాను దండనాథుడుగాను ఉండి కొంత రాజ్యమును సంపాదించెను. తదనంతర మాతనిపుత్రుడు సాళువ నృసింహరాజు దేవరాయలు సంతానము లేక మృతుడగుటవలననో మఱియేలాగుననో కర్ణాటకరాజ్యము నాక్రమించుకొనెను. నరసింహరాజునకు తిమ్మరాజను పేరుగల జ్యేష్టభ్రాత యొకడు గలడు. అతడే యీశ్వరరాజు తండ్రియైన సాళువతిమ్మరాజని తోచుచున్నది. సాళువ నృసింహరాజు భూదానములు మొదలయిన దానము లనేకములు చేసెను. ఇతడు చిత్తూరి మండలములోని వందవాసినగరమునకు పడమట నామడదూరములో నున్న వెల్లము గ్రామములోని దేవాలయమునకు శాలివాహనశకము 1391 వ సంవత్సరమునం దనగా హూణశకము 1469 వ సంవత్సరమునందు గొంతభూమి యిచ్చెను; ఈతని రాజ్య కాలములోనే చిత్తూరిమండలములోని యాపూరు గ్రామములోని శివాలయమున కొకరిచేత శాలివాహనశకము 1393 వ సంవత్సరమునకు సరియైన క్రీస్తుశకము 1471 వ సంవత్సరము నందు గొంతభూమి యియ్యబడినది. ఈ నృసింహరాజు కాలమున తిమ్మరాజు పుత్రుడైన యీశ్వరరాజు దండనాథుడుగా నున్నట్లు వరాహపురాణ పీఠికవలన దెలియవచ్చుచున్నది. ఈ నృసింహరాజు మరణానంతర మీశ్వర రాజపుత్రు డయిన నరసింహరాజు రాజ్యమునకు వచ్చెను. ఇతడు 1487 వ సంవత్సరము వఱకును రాజ్యము చేసినట్లు శాసనములవలన దెలియవచ్చుచున్నది. కొందఱితడు 1505 వ సంవత్సరమువఱకు మాత్రమే రాజ్య పరిపాలనము చేసె ననియు, ఆసంవత్సరము మొదలుకొని యాతని జ్యేష్టపుత్రు డయిన వీరనృసింహరాయలు పరిపాలనము చేసెననియు చెప్పుచున్నారు. ఇదియే నిజమై యుండవచ్చును. పే రొక్కటియే యై యుండుటచేత శాసనములను పరీక్షించినవారు కొడుకునుగూడ తండ్రినిగా భ్రమించియుందురు. 1509 వ సంవత్సరమునందు కృష్ణదేవరాయల ప్రభుత్వ మారంభమైనది. కృష్ణదేవరాయలు రాజ్యమునకు రాకముం దాతని యన్నయైన వీరనృసింహరాయలు కొంతకాలము రాజ్యము చేసినట్లు కృష్ణదేవరాయల కంకితము చేయబడిన గ్రంథములయం దెల్లరు జెప్పబడియున్నది:-
క. వీరనృసింహుడు నిజభుజ
దారుణకరవాలపరుషధారాహతవీ
రారియగుచు నేకాతవ
వారణముగ నేలె ధర నవారణమహిమన్.
క. ఆవిభు ననంతరంబ ధ
రావలయము దాల్చె గృష్ణరాయుడు చిన్నా
దేవియు శుభమతి తిరుమల
దేవియునుం దనకు గూర్చు దేవేరులుగన్ – మనుచరిత్రము,
క. వారలలో దిప్పాంబకు
మారుడు పరిపంధికంధిమంథాచలమై
వీరనరసింహ రాయడు
వారాశిపరీతభూమివలయం బేలెన్. శా. వీరశ్రీనరసింహ శౌరి పిదపన్ విశ్వక్షమామండలీ
ధౌరంధర్యమున స్జనంబు ముద మంద న్నాగమాంబాసుతుం
డారూడోన్నతి గృష్ణరాయడు విభుండై రాజ్యసింహాసనం
బారోహించె విరోధులు న్గహనశై లారోహముం జేయగన్. [పారిజాతాపహరణము]

ఆంధ్ర కవుల చరిత్రము నుండి…

———–

You may also like...