వెలగలేటి విశ్వేశ్వరరావు (Velagaleti Visweswararao)

Share
పేరు (ఆంగ్లం)Velagaleti Visweswararao
పేరు (తెలుగు)వెలగలేటి విశ్వేశ్వరరావు
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుఅంతేనా, అడిగడుగుకు, అడిగానని చెప్పండి, ఆంజనేయ దండనమ్
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికవెలగలేటి విశ్వేశ్వరరావు
సంగ్రహ నమూనా రచనజాజిపూలు పోసిన వెండిపళ్ళెం తీసుకిన డాబామీదికి వొచ్చాడు విజయసారధి.
పక్కలో పాపతో పాటు వొత్తిగిళిల పుడుకుని వుంది మాలతి. సారధి వెళ్ళి ఆమె ప్రక్కగ కూచుని ఆమెమీద చెయ్యివేశాడు. మాలతి ఉలిక్కిపడి యిటు తిరిగింది.
‘‘వొంట్లో బావుండలేదా మల్లీ?’’ అన్నాడతడు.
‘‘ఎంతసేపైంది మీరు వొచ్చి?’’ అడిగింది మాలతి.
‘‘ఇప్పుడే’’ అన్నాడతను ఆమెవంక పరీక్షగా చూస్తూ.
ఉషోదయంలో మంచుబిందువులతో తడిసిన తామర రేకుల్లావున్నాయామె కళ్ళు. తమ ఆరేళ్ళ దాంపత్య జీవితంలో అతను ఆమెను ఆ రూపంలో చూడడం మొదటిసారో రెండోసారో.

వెలగలేటి విశ్వేశ్వరరావు
ఆంజనేయ దండనమ్
హవిస్

జాజిపూలు పోసిన వెండిపళ్ళెం తీసుకిన డాబామీదికి వొచ్చాడు విజయసారధి.
పక్కలో పాపతో పాటు వొత్తిగిళిల పుడుకుని వుంది మాలతి. సారధి వెళ్ళి ఆమె ప్రక్కగ కూచుని ఆమెమీద చెయ్యివేశాడు. మాలతి ఉలిక్కిపడి యిటు తిరిగింది.
‘‘వొంట్లో బావుండలేదా మల్లీ?’’ అన్నాడతడు.
‘‘ఎంతసేపైంది మీరు వొచ్చి?’’ అడిగింది మాలతి.
‘‘ఇప్పుడే’’ అన్నాడతను ఆమెవంక పరీక్షగా చూస్తూ.
ఉషోదయంలో మంచుబిందువులతో తడిసిన తామర రేకుల్లావున్నాయామె కళ్ళు. తమ ఆరేళ్ళ దాంపత్య జీవితంలో అతను ఆమెను ఆ రూపంలో చూడడం మొదటిసారో రెండోసారో.
‘‘ఏమిటి మళ్ళీ ఎవరన్నా ఏమన్నా అన్నారా?’’
మాలతి గభాలున అతనివొళ్లో తలదాచుకున్నది.
సారధి ఆమెతల నిమురుతూ అన్నాడు. ‘విశాలాక్షిని చూసిరావడానికి వెళ్ళాననీ వొచ్చినప్పట్నుంచీ అదోలా వున్నావని శారదక్కయ్య అన్నది ఏమిటి సంగతి? ఆవిడతో ఏదన్నా దెబ్బలాడావా?’’
‘‘లేదన్నట్టు తలవూపింది మాలతి.’’
‘‘మరేమిటో చెప్పు’’ అన్నాడతను లాలనగా.
మాతి అతని నడుంచుట్టూ చెయ్యి వేసి ఈ ఆంజనేయులుగారు మిమ్మల్ని ఏమిటేమిటో అన్నాడు’’అన్నది.
‘‘ఏహన్నాడు?’’ అన్నాడు సారధి ఏ భావం కనబర్చకుండా.
ఆంజనేయులు అతని పూర్తిపేరు వీరాంజనేయలు సారధి లెక్చరర్లా పనిచేస్తున్న కాలేజీలో ట్యూటర్ ఉద్యోగం చేస్తున్నాడు. సారధి యూనివర్సిటిలో ఎం.కాం లో చేరినప్పుడు ఫైనల్ ఆనర్స చదువుతూండేవాడు.
అప్పట్లో ఆంజనేయులు యూనివర్సిటీలో ఒకరకమైన ‘విధూషకుడి’లా వుండేవాడు. అతని అతివాగుడుతనం, ఆడపిల్లల చుట్టూ అతనుచేసే ప్రదక్షణాలు అందరికీ నవ్వుపుట్టించేవి.
ఒక వయస్సులో ప్రతి యువకుడికీ ఆడపిల్లల్తో స్నేహం చాలా గర్వకారణంగా వుంటుంది. ఆంజనేయులుకి ఆ గర్వం కాస్త మితిమీరి వుండేది. ప్రతి అమ్మాయినీ అతను పలకరించేవాడు. సభ్యతంటూ వొకటి అఘోరించిందిగనుక, పైగా యూనివర్శిటీగనుక ఆడపిల్లలు అతని పలకరింపుకి జవాబు చెప్పేవారు. దానికి చిలవలు పలవలు అల్లి ప్రచారం చేసుకుని తృప్తిపడేవాడూను.
ఈ రకమైన రాంధోళి ఫలితంగా అతనికి సాధ్యమైంది ఒక్కటే ` చావు తప్పి కన్ను లొట్టబోయి రికమండెడ్ డిగ్రీతో బయటపడడం.
సారధి ఎం.కాం. పాసై ఒకానొక ప్రైవేటు కాలేజీలో లెక్చరర్ కొలువు కుదిరిన ఏడాదికి ఆంజనేయులు అదే కాలేజీలో ట్యూటర్గా చేరాడు. కాలేజీ కమిటీ మెండర్లలో ఒకడైన గిరిజా రమణారావు ద్వారా అతనికి ఉద్యోగం దొరికింది. కాలేజీకి వొచ్చిన మొదటి రోజునే అతను సారధిని చూసి ‘‘అరె నువ్వటోయ్ వెల్ వెల్ నువ్విక్కడ ఉద్యోగం చేస్తున్నావన్నమాట?’’ అని ఫెళ ఫెళ నవ్వాడు. పక్కనున్న వ్యక్తికి సారధిని పరిచయంచేసి ‘‘ఇతనిక్కూడా నాకుమల్లేనే బొమ్మల పిచ్చి వుండేది ఏంవోయ్? ఇంకా గీస్తున్నావా? మానేశావా? అన్నాడు.
అందులో ఏమాట ఎవరిని ఉద్దేశించి అన్నాడో సారధికి తప్ప ఎవరికీ అర్థంకాలేదు. ఆంజనేయులు వెళ్ళిపోయాక సారధి పక్కనవున్న అతని బావ, అంటే లెక్చరర్ లక్ష్మీనారాయణ ‘నీకు అతను బాగా తెలుసా బావా?’ అన్నాడు.
‘కొద్దిగా పరిచయం’ అన్నాడు సారధి.
‘ఏకవచనంతో మాట్లాడుతూంటే అడిగాను.’
‘అది అతని అలవాటు కాబోలు అన్నాడు సారధి.
ఆ ఆంజనేయులు భార్య విశాలాక్షి. మాలతి స్నేహితులు. చిన్నతనంలో బాపట్లలో ఉండగా ఇద్దరి యిళ్ళు పక్క పక్కన ఉండేవి…
‘ఏమన్నాడు మళ్ళీ?’ అన్నాడు సారధి తిరిగి.
‘జయలక్ష్మికి మీకు రంకుకట్టాడు. చాలా?’ అన్నదామె కోపంగా, బాధగా.
సారధి తృళ్ళిపడ్డాడు. మాలతి ఆంజనేయులు అన్న మాటలు పూసగుచ్చినట్టు ఏకరువు పెట్టింది. మాలతిని చూడంగానే అతను నవ్వు ముఖంతో లోపలికి ఆహ్వానించాడు. మరల ప్రశ్నలూ, వగైరా అయిన తర్వాత సారధి ప్రసక్తి వచ్చింది.
‘పాపం వార్షికోత్సవం తాలూకు నాటకం కోసం నానా అవస్థా పడిపోతున్నాడు. ఆ తగలాటం నాకు తగిలిద్దామని చూశాడు మా ప్రిన్సిపాల్. వీల్లేదని నిర్మొహమాటంగా చెప్పాను. సారధి మొహమాటపడి వొప్పుకున్నాడు. అన్నట్టు మొన్న రాత్రి ఆ జయలక్ష్మి, అతను రిక్షాలో పోతూంటే చూశాను అన్నాడు. ఒక్క క్షణం ఆగి భార్యవంక చూసి ‘జయలక్ష్మి అంటే తెలుసుగా విశాలా? మొగుణ్నొదిలేసిన అమ్మాయి. ఆ అమ్మాయికీ తనకీ చాలా దోస్తిలే. ఇద్దరూ కలిసి సినిమాలకు కూడా పోతుంటారు?’ అని నవ్వాడు.
మాలతి స్నేహితురాలివంక చూసింది. ఆమె ముఖంలో తనమీద జాలి కనిపించడంతో మాలతి ప్రాణం చచ్చిపోయి తల వొంచుకుంది…
అంతా చెప్పి బావురుమన్నది మాలతి. ‘జయలక్ష్మి ఎట్లాంటిదో మీరూ, నేనూ ఎరుగుదుం. అతనికేం తెలుస్తుంది? మిమ్మల్ని ఆయన అంత మాట అనేసరికి తల పగలకొట్టుకు చచ్చిపోవాలనిపించింది అన్నది.
సారధి ఆమె వీపుమీద తట్టాడు. అప్రయత్నంగా అతని పిడికిలి బిగుసుకుంది. ’ఈ ఆంజనేయులుగాడిని త్రాహిత్రాహి అనిపించకపోతే…’’ అతనికి రక్తం ఉడికిపోయినట్లయింది.
‘సినిమా స్టార్లతో స్నేహం ఉండడమంత న్యూసెన్స్ మరోటి లేదనుకోండి. ప్రతి అడ్డమైనవాడూ వేషా లిప్పంచడంటూ ప్రాణాలు తీసేస్తారు. మొన్న శత దినోత్సవానికి ఎన్టీ రామారావు వొచ్చాడు చూశారూ? ఆ రోజున అతను మా ఇంటికొచ్చి లాక్కుపోయాడు ఉత్సవానికి. ఇంకేముంది? మర్నాడు ఇంటిముందు వందలాది కుర్రకారు తయారు ఛఛ ఈ సినిమా వేలంవెర్రి జనంలో విపరీతమైపోయింది సుమండీ’
సారధి స్టాఫ్ రూమ్లోకి అడుగుబెట్టే సరికి ఆంజనేయులు ఉఫన్యాసం వినిపించింది. సారధి నిర్లిప్తంగా కోటు విప్పి హాంగర్కి తగిలించి కుర్చీలో కూలబడ్డాడు.
ఆంజనేయుల అతనివంక తిరిగి మొన్న నువ్వొచ్చినప్పుడు గోడకి తగిలించివున్న….’’ అంటూ ఏదో అనబోయాడు.
సారధి మధ్యలోనే అడ్డొచ్చి ’’అదేమిటండీ? నేను మీ ఇంటి కెప్పుడొచ్చాను?’’ అన్నాడు.
ఆంజనేయులు గతుక్కుమని మరుక్షణమే తమాయించుకుని అదేమిటోయ్ పోయిన ఆదివారం రాలా? అన్నాడు.
లేదులెండి బహుశా మరెవరో వస్తే నేనే అనుకుని ఉంటారు’ అన్నాడు సారధి చిరునవ్వుతో.
పక్కనున్న స్టాఫ్ మెంబర్లు ముఖాలు చాటేసుకు నవ్వుకున్నారు.
ఆంజనేయులు చటుక్కున బల్లమీది కళ్ళజోడు పెట్టుకుని అందరివంక చూసి వికవిక నవ్వాడు. సారధి భుజంతట్టి ‘భలే జోక్స్ వేస్తావోయ్’ అన్నాడు.
రెండు నిముషాలు ఆంజనేయులు మౌనంగా కూచున్నాడు. ఆ తర్వాత లేచి ‘అలా వెళ్ళొస్తాను బ్రదర్స్. సాయంత్రం దాకా క్లాసులేదు. బోరుకొడుతుంది. లైబ్రరీ కెళ్ళి ఏదన్నా పుస్తకం తెచ్చకుంటాను’ అని ఒక ప్రకటన చేసి వెళ్ళిపోయాడతను.
అతను నిష్క్రమిస్తుండగానే గంట మోగడంతో క్లాసులని లెక్చరర్లు కూడా లేచి వెళ్ళిపోయారు. సారధి లక్ష్మీనారాయణ మిగిలారు.
‘‘చచ్చిపోతున్నామయ్యా బాబూ నేనూ వాగుడుకాయల్ని చూశాను కాని, ఇంతగా బొల్లునేర్చేవాడ్ని చూడలేదు’’ అన్నాడు లక్ష్మీనారాయణ.
సారధి నవ్వాడు.
‘‘అదుగో ఆ నవ్వు చూస్తేనే వొళ్లు మండిపోయేది’’ అన్నాడతను చిరాగ్గా.
‘‘ ఏం చెయ్యమంటావు బావా?’’
లక్ష్మీనారాయణ తన కుర్చీని అతనికి దగ్గిరగా లాక్కుని కూచుని ఏదో చెయ్యాలి బావా రోజు రోజుకు వాడి ధోరణి శృతిమించి రాగాన పడుతూంది.
వెంకటర్నతంగారితో పితూరీలు చెప్పడం దగ్గిర్నించి స్టూడెంట్సుతో స్కాండల్సు మాట్లాడ్డందాకా, వీడు చేసే వెధవ పనులకి మితిలేకుండా పోతూంది’’ అన్నాడు.
సారధి ఏమీ మాట్లాడలేదు.
‘‘నోరు మెదప వేమిటోయ్ మహానుభావా?… మాకు వీడి పీడ వొదల్చలేవా?’’ అన్నాడతను తిరిగి.
‘‘నేనేం విష్ణుమూర్తినా?’’
‘‘కాదనుకో కాని ఉపాయం ఆలోచించలేవా?’’
సారధి ఏదో అనబోయి ‘‘అతనొస్తున్నాడు. తర్వతా మాట్లాడుకుందాం’ అన్నాడు.
ఆంజనేయులు సుడిగాలిలా దూసుకు వచ్చాడు. చేతిలో పుస్తకం విసిరి బల్లమీద కొట్టాడు. ’నాన్సెన్స్, న్యూసెన్స్ లాంటి పదాలు కొన్ని ధారళంగా వొదిలేశాడు. ఆ తర్వతా సారధివంక తిరిగి సీరియస్గా ‘ఏం నాయనా? నేను సుఖంగా వుండడం యిష్టం లేదల్లే వుందే?’’ అన్నాడు.
‘‘నేనేం చేశానండీ?’’ అన్నాడు సారధి సాదాగా.
ఆంజనేయులు లక్ష్మీనారాయణవంక తిరిగి ‘ఈ పెద్దమనిషి ఏం చేశాడో చూశారా గురువుగారూ దిక్కు మాలిన నాటకం డైరెక్షన్ కాస్తా నానెత్తిమీద పడేశాడు’’ అన్నాడు.
‘అంటే?’ అన్నాడు లక్ష్మీనారాయణ అర్థంగాక.
‘పైనార్ట్స్ ప్రెసిడెంటు గిరీకి రాజీ నామా యిచ్చాట్ట. అది చాలక నాటకం వ్యవహారం ఆంజనేయులుగారు చూస్తాడని సిఫార్సు చేశాట్ట. వార్షికోత్సవం వారం రోజులుకూడా లేదు. ఈ టైములో ఆ దిక్కుమాలిన కోతి మూకని ఎలా తయారుచేసేట్టని. అక్కడికి కాదని చెప్పిచూశాను వెంకటర్నతం వింటేనా’ అన్నాడు ఆంజనేయులు.
లక్ష్మీనారాయణ సారధివంక కోపంగా చూసి ‘బావుందయ్యా భగవానూ’ అన్నాడు.
‘బాగా చెప్పారు. అన్నీ యిలాంటి కుర్రతనం పనులే చేస్తాడు… సరే కానీ తప్పేదేముంది?’ అన్నాడు ఆంజనేయులు.
స్టాఫ్ రూంనుంచి బయటకొచ్చాక లక్ష్మీనారాయణ సారధిమీద విసుక్కున్నాడు. ‘ఎందుకిలాంటి పని చేశావు? ఈ ఎడాదీ వార్సికోత్సవం చాలా గ్రాండ్గా చేయాలని వెంకటరత్నంగారు ఉబలాటపడుతూంటే, అసలైన పనికాస్త ఈ కోతికి అప్పగిస్తావా? నీకు మతేమన్నా పోయిందా సారధీ?’ అన్నాడతను.
‘ఏం చెయ్యను బావా? రోజూ రాత్రి పది, పదకొండు అవుతోంది. ఇంట్లో మాలతి ఒక్కర్తీ…’
లక్ష్మీనారాయణ అడ్డొచ్చి శారదాంబ ఏమైంది?’ అన్నాడు.
‘ఉందనుకో అయినా… ’నసిగాడు సారధి.
‘నోనో నీ వ్యవహారం బొత్తిగా నచ్చలేదు బావా… అయినా ఎంతయినా యూనివర్శిటీ స్నేహితులుగదూ? ఆ అభిమానం ఎక్కడికి పోతూంది?’’
సారధి పక పక నవ్వాడు.
ఆ తర్వాత నాలుగైదు రోజులు గడిచిపోయాయి. శనివారం రాత్రి జరగనున్న వార్షికోత్సవంలో ఫైనార్ట్స్ సంఘం చెయ్యబోతున్న బ్రహ్మాండమైన ఏర్పాట్లు గురించి, తయారౌతున్న నాటకాన్ని గురించి, దానికోసం ‘యిష్టంలేకపోయినా తాను తగలెయ్యవలసి వస్తున్న విలువైన కాలాన్ని గురించి ఆంజనేయలు రోజూ స్టాఫ్రూంలో ఉపన్యాసాలు దంచడం సాగించాడు. అసలే కోతి, కల్లు తాగింది, నవ్వుతూ వుంది. తోక తెగింది అన్న చందాన ఆంజనేయులు పేట్రేగిపోతూంటే స్టాఫ్లోని బృందం ఏమీ అనలేక భరించలేక లక్ష్మీనారాయణ నాయకత్వాన సారధిని చిన్నెవన్నెలుగా తిట్లు లంకించుకున్నారు.
అన్నీ విని చిరునవ్వు నవ్వడం మినహా సారధి ఏమీ చెయ్యలేదు. చివరి కొక రోజు సాయంత్రం క్లాసులు అయిపోయిన తర్వాత ఇంటికిపోదామని స్టాఫ్రూంకు వొచ్చిన సారధికి దిగాలుగా కూచుని వున్న ఆంజనేయులు, ఏదో చదువుకుంటున్న లక్ష్మీనారాయణ కనిపించారు.
‘ఇంటికి వెడదామా?’ అన్నాడు సారధి బావవంక చూసి.
లక్ష్మీనారాయణ తలెత్తి వెడదాంగాని, ఎవరో కామేశ్వరి గారి డాన్స్ ప్రోగ్రాం పెట్టిస్తున్నావట ఎవరు బావా ఆవిడ? అన్నాడు.
సారధి నవ్వతూ యూనివర్శిటీలో నాకు సీనియర్. చాలా అందమైన అమ్మాయి. అక్కడక్కడ డాన్స్ ప్రోగ్రాంలు యిచ్చింది అన్నాడు.
మన వార్షికోత్సవాలకీ ఆవిడకీ ఏమిటి సంబంధం?’
ఏమీ సంబంధం లేదనుకో ఇందాక ప్రిన్సిపాల్గారు ఏదన్నా డాన్స్ కూడా వుంటే బావుంటుందన్నారు. నాకు తోచిన పేరు చెప్పాను. ఆయన సరేనన్నాడు.
‘ఆవిడ ఈ వూళ్ళోనే వుందా?’
లేదు. వైజాగ్లోనే వుంది. రమ్మని టెలిగ్రాం యిచ్చాను. మంత్రి పుంగవులు వొస్తున్న సభకదా? ఆమాత్రం కళ లేకపోతే ఏంబావుంటుంది?
ఆంజనేయులు చటుక్కున లేచి ‘జాక్సెన్స్’ అంటూ బయటికి వెళ్ళిపోయాడు.
లక్ష్మీనారాయణ అతనివంక చూస్తూ ‘ఏమిటిబావా’? గురుడు దివాలా మొహం పెట్టాడు? అన్నాడు.
‘అడక్కపోయావా?’
‘చచ్చాం ఆయన గారు బోరు వినొద్దూ అని ఇందాక ఆ నాటకంలో కుర్రాళ్ళు కనిపించారు. నువ్వు చెప్పిన మూవ్ మెంట్సన్నీ మనవాడు తారుమారు చేశాట్ట. నువ్వు మరోరకంగా చెప్పావంటే విసుక్కున్నాట్ట… రేపు మనవాడి నాటకం వెయ్యికళ్ళతో చూడాల్సిందే’ అన్నాడు లక్ష్మీనారాయణ.
‘అతనిది వరకు నాటకాలు వేయించాడు బావా’ అన్నాడు సారధి.
‘చాల్లేపద’ అన్నాడు లక్ష్మీనారాయణ.
మరునాడు లక్ష్మీనారాయణ కాలేజీకి వెళ్ళేసరికి ప్రిన్సిపాల్గారి దగ్గరనుంచి కబురొచ్చింది. లక్ష్మనారాయణ చూడంగానే ఆయన ధుమధుమ లాడుతూన్న ముఖంతో ‘‘ఏమండీ ఆ ఆంజనేయులుగారి యిల్లు మీ యింటిప్రక్కన కాబోలు. ఏదో సుస్తీచేసిందట పాపం? ఏమిటి?’’ అన్నాడు.
వెంకటరత్నంగారి ప్రశ్న లక్ష్మీనారాయణకు అంతుపట్టలేదు.
కాలేజీకి రాగానే ఉత్తరం చూశాను. సుస్తీగా వుందట. రాత్రి ప్రోగ్రాం యింకెవవన్నా చూసుకోవాలట. ఏమిటండి యిదంతా?’ అన్నాడాయన.
లక్ష్మీనారాయణకి కొంచెం చిరాకేసి ‘ఏం చేయమంటారు?’ అన్నాడు.
వెంకటరత్నంగారు చేతిలో కాయితం విసిరికొట్టి మీరేం చేస్తారండీ? ఎవరూ ఏమీ చేరు. అవతల మంత్రిగారు ఊర్లోకొచ్చి కూచున్నాడు. మనం చేస్తే ఏం చేయాలిఅంటూ దిక్కులు చూస్తున్నాం. అయినా ఆ సారధికి యిప్పుడే రావాలండీ ఈ పాడుబుద్ది రిజైన్ చేయాలనీ పైగా వున్నదిచాలక ఆవిడెవర్నో విశాఖనుంచి దిగుమతిచేస్తున్నాడు’’ అన్నాడు.
పోనీ సారధిని పిల్చుకురమ్మంటారా? అన్నాడు లక్ష్మీనారాయణ.
సరే సరే అదీ అయింది ఆయన గారికీ ఒంట్లో బావుండలేదుట. రాడుట అన్నాడాయన మరింత విసుగ్గా.
నన్ను వెళ్ళి అడగమంటే అడుగుతాను.
‘‘వొప్పుకుంటాడంటారా.’’ అన్నాడు వెంకటరత్నంగారు ఆశగా.
‘ప్రయత్నిద్దాం.’
సారధి వొప్పుకుంటే, ఎందరెందరు లక్ష్మీనారాయణకి ఋణపడతారో ఏకరువుపెట్టాడు వెంకటరత్నంగారు. కావాలంటే తనకారు తీసుకువెళ్ళమన్నాడు. ఒక్కక్షణం ఆగి రమ్మంటే తను కూడ వొస్తానన్నాడు. అవసరం లేదని, పర్మిషన్ యిప్పిస్తే తనే వెళ్ళివొస్తాననీ చెప్పాడు లక్ష్మీనారాయణ.
పర్మిషనా? ఇవాళ మీరు ఒక్క క్లాసుకూడ తీసుకోవద్దు. ఆ ఏర్పాట్లు నేను చూస్తాను. వెళ్ళి రండి అన్నాడాయన.
లక్ష్మీనారాయణ వెళ్ళేసరికి వీధి గదిలో కూచునివున్న ఆంజనేయులు కనిపించాడతనికి. మనిషి ముకం బాగా పీక్కుపోయివుంది. ముఖంలో జీవకళ అనేది లేకుండాపోయింది. దిగాలుగా, భూమిపై కష్టాలన్నీ మోస్తున్నవాడిలా కూచుని వున్నాడతను.
లక్ష్మీనారాయణను చూసి పలకరింపుగా నవ్వడానికి విఫల ప్రయత్నం చేశాడు ఆంజనేయులు. లక్ష్మీనారాయణ అతని వాలకం చూసి లోలోపల ఆవ్చర్యపడుతూనే సారధి లోపలున్నాడా? అన్నాడు.
ఔనన్నట్లు తలవూపాడు ఆంజనేయులు.
లక్ష్మీనారాయణ లోపలికి వెళ్ళేసరికి భోజనం ముగించి వొస్తున్న సారధి ఎదురయ్యాడు. సారధి అతన్ని చూసి నవ్వుతూ ప్రిన్సిపాల్గారు పంపించారా?’ అన్నాడు.
‘ఔనుగాని, మీ మిత్రుడు ఏమిటి బయట నుంచుని వున్నాడు?’ అన్నాడు లక్ష్మీనారాయణ.
‘నాకుమాత్రం ఏంతెలుసు? కనుక్కుంటాను’ అంటూ సారధి అట్లాగే వీధిగదిలోకి దారితీశాడు.
లక్ష్మీనారాయణ మాలతితో కబుర్లాడుతూ లోపలే ఉండిపోయాడు.
సారధిని చూడంగానే లేచినిలబడ్డాడు ఆంజనేయలు.
అతన్ని కూచోమని ‘యేమిటి ఇలా వొచ్చారు? పనుందా? అన్నాడు సారధి.
ఆంజనేయులు ఒక్కక్షణం మాట్లాడలేదు. ఆ తర్వాత గొంతుపెగుల్చుకుని మీరు నాకోసహాయం చేసిపెట్టాలి అన్నాడు.
చెప్పండి.
ఆంజనేయులు హఠాత్తుగా అతని చేతులు పట్టుకుని అన్నలాంటివారన్న నమ్మకంతో వొచ్చాను. మీరివాళ నన్ను కాపాడాలి. ఇవి చేతులు కావు అన్నాడు.
చెప్పండన్నాను గదటండీ కాని ఈ రోజు ప్రోగ్రాం నేను చూసుకోవాలా? అని అడిగాడు సారధి.
కన్నీళ్లు దాచుకోవడానికి ముఖం పక్కకి తిప్పుకున్నాడు ఆంజనేయులు. సారధి అతని భుజం తట్టి ప్రిన్సిపాల్గారి నుంచి కబురువచ్చింది. నేను వెడతాను లెండి. కానీ, చూడండి ఆంజనేయులుగారూ మనం వ్యక్తిత్వం వొచ్చిన వాళ్ళం. స్టూడెంట్స్ కి బుద్దులు నేర్పవలసిన వాళ్ళం. ఆడవాళ్ళని బాధపెట్టడం, స్కాండల్సు ప్రచారం చేయడం చేయకూడనివాళ్ళం, ఇది గుర్తుంచుకోండి చాలు అన్నాడు.
ఆంజనేయులు తలతిప్పలేదు. ఏదో తీవ్రమైన మధన పడుతున్నవాడిలా భూమిని అతుక్కుపోయి నిల్చున్నాడు. ఒక నిముసం తర్వాత తల తిప్పకుండానే మీ దయ నన్ను మీరే రక్షించాలి. అంటూ చరాచరా బయటికి వెళ్ళి పోయాడు.
సారధి వెనక్కి తిరిగేసరికి గుమ్మంలో లక్ష్మీనారాయణ కనిపించాడు. అతని ముఖంలో చెప్పరానంత ఆశ్చర్యం చూసి సారధి చిన్నగా నవ్వాడు. కోరికతీరిందా బావా? అన్నాడు నవ్వుతూనే.
కాంప్లెక్స్ చాలా గందరగోళంగా వుంది. ఏమిటి అద్భుతం? అన్నాడతను.
చెబుతాను కూచో అని తనూ కూచున్నాడు సారధి దీనిని కామేశ్వరీ మంత్రం అంటారు అన్నాడు.
అంటే?
సారధి చెప్పాడు కామేశ్వరి అనే అమ్మాయి, సారధి ఎం.కాం. లో చేరిన ఏడాది యూనివర్సిటీలో తెలుగు ఎం.ఏ చదువుతుండేది. మనిషి చాలా శాంతంగా సౌమ్యంగా వుండేది. ఆమె డాన్స్ నేర్చుకున్నదని చాలా బాగా చేయగలదని యూనివర్సిటీలో మొట్ట మొదట పసిగట్టినవాడు సారధి. ఆమె చేత మొదటి బహిరంగ ప్రదర్శన యిప్పించినవాడుకూడా అతనే.
ఆడపిల్ల కనిపిస్తే స్నేహంచేసుకోకుండా వొదిలి పెట్టని ఆంజనేయులు కామేశ్వరిని చూడడంతో వెర్రులెత్తిపోయాడు. ఆమె సారధికి బాగా పరిచయస్తురాలని తెలియడంతో పరిచయం చేయమని సారధి వెంటపడ్డాడు.
అదే నా తప్పయి పోయిందిబావా వాళ్ళిద్దరి పరిచయాన్ని చాలా దూరం తీసుకువెళ్ళాడు ఆంజనేయులు. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని అంతా చెప్పుకున్నారు. చివరికి ఆంజనేయులు అడ్రస్కూడా చెప్పకుండా పరారైపోయాడు అప్పుటికా అమ్మాయి నాల్గునెల్ల గర్భిణి అని ముగించాడు సారధి.
మైగాడ్ నిర్ఘాంతపోయాడు లక్ష్మీనారాయణ అందుకా ఆ అమ్మాయి పేరు వినగానే బిగుసుకుపోయాడు పెద్దమనిషి? ఈ సంగతి ఇన్నాళ్ళు చెప్పకుండా ఎందుకు దాచావు బావా పద వీడి అంతు చూద్దాం అన్నాడు.
ఏం చూస్తానంటావు?
స్టాఫ్లో దండోరావేస్తాను. మనిషి ముఖం ఎత్తుకోలేకుండా చేస్తాను కసిగా అన్నాడు లక్ష్మీనారాయణ.
ఇది పట్టుకుని స్టూడెంట్స్ పేట్రేగిపోతారు అన్నాడు సారధి.
లక్ష్మీనారాయణ గతుక్కుమన్నాడు.
అందుకని ఇక ఆ సంగతి మర్చిపో. అతని రోగం కుదిరింది. నీ కోరిక తీరింది. బట్టలు వేసుకొస్తాను. కాలేజీకి పోదాం అని లోపలికి వెళ్లాడు సారధి.
రెండు నిముషాల తర్వాత రిక్షాలో సారధితో కలసి బయలుదేరిన లక్ష్మీనారాయణ ఇంతకీ ఆ అమ్మాయి ఊర్నించీ వచ్చిందా బావా? ఆ అమాయకురాల్ని చూడాలని వుంది అన్నాడు.
ఆ అదృష్టం లేదుబావా ఆమె యేనాడో ఆత్మహత్య చేసుకుంది అన్నాడు సారధి భారంగా.

 

———–

You may also like...