పేరు (ఆంగ్లం) | K.Y.L.Narasimharao |
పేరు (తెలుగు) | కె.వై.ఎల్.నరసింహారావు |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | ప్రిన్సిపాల్ |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | – |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | కె.వై.ఎల్.నరసింహారావు |
సంగ్రహ నమూనా రచన | ”సమానానాముత్తమ శ్లోకో అస్తు’ అనేది మన వైదికాచార సంస్కృతి ఆశీస్సు. నిజానికి తెలుగు వారి సాహిత్య, సామాజిక, దేశభక్తి, సాంస్కృతిక జీవన తత్పరులలో తెలుగునాట ఈ గడిచిన 60, 70 ఏళ్ళ కాలకస్మరణలో శ్రీ కె.వై.ఎల్‌కు సమానులెవరైనా ఉన్నారా అంటే, ఇదమిత్థంగా నిర్ణయించలేము. ఆయన అంతటి పూర్ణ పురుషుడు. పుణ్యశ్లోకుడు. ఆయన బహుధా చైతన్యోజ్జ్వలమైన సుందర సుషమా సుకృత వ్యక్తిత్వ జీవితం భాతీయ చిరంతన ఆకాశాన్ని అలంకరించే కిర్మీరం వంటింది. కిర్మీరం అంటే ఇంద్రధనుస్సు. ఇంద్రధనుస్సు సప్త వర్ణ మనోమోహక శోభితం. |
కె.వై.ఎల్.నరసింహారావు
”సమానానాముత్తమ శ్లోకో అస్తు’ అనేది మన వైదికాచార సంస్కృతి ఆశీస్సు. నిజానికి తెలుగు వారి సాహిత్య, సామాజిక, దేశభక్తి, సాంస్కృతిక జీవన తత్పరులలో తెలుగునాట ఈ గడిచిన 60, 70 ఏళ్ళ కాలకస్మరణలో శ్రీ కె.వై.ఎల్‌కు సమానులెవరైనా ఉన్నారా అంటే, ఇదమిత్థంగా నిర్ణయించలేము. ఆయన అంతటి పూర్ణ పురుషుడు. పుణ్యశ్లోకుడు. ఆయన బహుధా చైతన్యోజ్జ్వలమైన సుందర సుషమా సుకృత వ్యక్తిత్వ జీవితం భాతీయ చిరంతన ఆకాశాన్ని అలంకరించే కిర్మీరం వంటింది. కిర్మీరం అంటే ఇంద్రధనుస్సు. ఇంద్రధనుస్సు సప్త వర్ణ మనోమోహక శోభితం.
రెండు సంవత్సరాల క్రిందట సద్గురు శివానందమూర్తి మ¬దయులు, పూజ్య పాదులు ఆనువార్షికంగా ఇచ్చే శ్రీరామనవమి ప్రతిభా పురస్కారం శ్రీ కె.వై.ఎల్.కు ప్రదత్తం చేశారు. స్వీయ చరిత్రలో శ్రీ కె.వై.ఎల్ ఈ సన్నివేశం తన పూర్ణపురుషాయుర్దాయంలో మిక్కిలి చెప్పుకోదగినది అని రాసుకున్నాడు. ఆయన స్వీయ చరిత్ర కూడా ఈ సన్నివేశాన్ని మంగళాదీని, మంగళాంతానిగా శోభస్కరం చేసుకున్నారు.
ఈ పురస్కార ప్రశంసాపత్ర ప్రస్తావనలో భావుకమనోజ్ఞంగా అక్షరదక్షుడు, మాననీయ మనస్వి శ్రీ పేరాల బాలమురళీకృష్ణగారు శ్రీ కె.వై.ఎల్‌ను గూర్చి ఇట్లా అన్నారు. ”పురా భారతీయ సాంస్కృతిక నాగరికతలు, కళ, మతం, ఆధ్యాత్మికత, చిత్రకళ, నాటక రంగం” వీరి ప్రతిభా సముద్దీప్తికి ఆటపట్టు లైనాయి. వీటినుంచి ఆయనా, ఆయన నుంచి ఇవీ పరస్పర భూషితమైనాయి. అంటే శ్రీ కె.వై.ఎల్ గారిది ఇంద్రధనుస్సు సౌందర్య మూర్తి మత్వమే కదా! 92 సంవత్సరాలలో తన అరవై సంవత్సరాల జీవిత కార్యక్షేత్రమంతా తెలుగునాట విద్యా సంస్కార వికాసం కోసం, జాతీయ సంస్కృతీ వికాసం కోసం, సృజనాత్మక సాంహిక ప్రభోదం కోసం, దృశ్య, శ్రావ్య, రంగస్థల, వక్తృత్వ, మాధ్యమాలను ప్రతిభావంతంగా వినియోగించుకున్నారు నరసింహారావుగారు. స్వాతంత్య్ర పూర్వ అవ్య వహిత సమాజ దేశభక్తి చైతన్యానికి, స్వాతంత్య్రానంతర దేశభక్తి ప్రపూరిత సామాజికోద్యమానికీ అనుసంధాన బాధ్యతను ఆయన నిర్వహించారు. స్వాతంత్య్రం వచ్చిన కాలానికి ఆయన వయసు 23 ఏళ్ళు. స్వాతంత్రం వచ్చిన తరువాత ఆయన 69 ఏళ్ళు తన ధ్యేయ లక్ష్యానికి అంకితమై నాడు. పరమపదించటానికి మూడేళ్ళ ముందు వరకు ఈ మహనీయుడు తన ఉత్సాహం, ఉపజ్ఞ, దేశ సేవాభారతి విస్మరించలేదు. ఇటీవలి పది సంవత్స రాలలో మనుస్మృతి గూర్చి ఇంగ్లీషులోనూ, తెలుగు లోనూ గొప్ప దర్శనం కలిగించాడు. ఆయన నిష్కలంకుడు కాబట్టి ఇటువంటి ఎన్నో గొప్ప పనులతో ఆయన తాదాత్మ్యం చెందగలిగాడు.
హిందూమతం ఎందుకు విశిష్టమైనది, ఎందుకు సర్వశ్రేష్ఠమైనది అని తెలుసుకోవాలంటే ఈ మతంలో ఇటువంటి పుణ్య పురుషులు తరచూ పుడుతుండటం వల్లనే. ఈయన చెప్పుకోదగిన వక్త, కళా హృదయుడు, సంస్కృతిపరుడు కాబట్టి సమాజ హృదయాన్ని ఆకర్షించగలిగాడు. కె.వై.ఎల్. గారిది స్ఫూరద్రూపం ‘వాకునర్థంబు గలసిన పగిదియట్లు’ ఆయన బహిరంతరోచిస్సు పువ్వు తావిని తలపింపచేస్తుంది. అదృష్టం, భగవత్కృప ఉండాలేగానీ ఒక ద్వారం మూసుకోగానే ఇంకో ద్వారం తెరచుకొంటుదని ఆయన స్వీయ చరిత్రలో నమ్మబలికాడు. ఆయన మంచితనమే, ఉదారాశయ కార్యసిద్ధే ఆయన కిటువంటి విశ్వాసం కలిగించిన వైనం స్వీయ చరిత్ర ద్వారా ఆయన పునఃపునరుద్ధాటించారు. వీరి స్వీయ చరిత్ర ఇటీవల తెలుగులో వచ్చిన సర్వ ప్రక్రియా సాహిత్యంలో ఎన్నదగినది. ఈ స్వీయ చరిత్ర ఒక నవలకన్నా ఉత్కంఠ భరితంగా చదివిస్తుంది. చదవడం ప్రారంభిస్తే విడిచిపెట్టలేము. ఇంకొక విశిష్టత కూడా కె.వై.ఎల్.ఎన్.రావు గారి స్వీయ చరిత్రకుంది. అలనాటి అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో శ్రీ కె.వై.ఎల్ మూడు ప్రాంతాలలోనూ విద్యాశాఖలో వివిధ ఉద్యోగ¬దాలు నిర్వహించారు. కడప, రాజమండ్రి, సిద్ధిపేట, ఖమ్మం, కరీంనగర్‌లలో ఆయన పనిచేసిన కళాశాలన్నిటా ఆయన తన వ్యక్తిత్వ ముద్రను విశిష్టంగా ఆవిష్కరించారు. వారి మాటలలోనే ఈ ప్రస్తావన ఉంది.
”నేను ఎక్కడ ప్రిన్సిపాల్‌గా ఉంటే అక్కడ దానిని ‘గోల్డెన్ పీరియడ్’ అన్నారు. స్టాపు, స్టూడెంట్స్ కూడా నన్ను ప్రేమించారు. మిక్కిలి గౌరవించారు. ఆఫీస్ స్టాప్ (నేను ఎక్కడ పనిచేసినా) నన్ను దేవుడని చెప్పుకునేవారు. కొంతమంది ప్రిన్స్‌పాల్స్ ఇప్పుడు కూడా అంతా నన్ను గురించి అంతా ఘనంగా చెప్పుకుంటాడని చెపుతారు (పుట 171-స్వీయచరిత్ర ప్రచురణ – 2014)”. ఇట్లా ఆత్మ విశ్వాసంతో చెప్పుకోగలిగినది, వారిది ధన్యజీవితం. 1978 ఆగస్టులో శ్రీ యోగానంద లక్ష్మి నరసింహారావుగారు పదవీ విరమణ చేసిన తరువాత కూడా భారతీయ చైతన్యాత్మను వారు నిరత ప్రబుద్ధం చేస్తూనే వచ్చారు.
కరీంనగర్ కళాశాల అధిపతిగా ఆయన పనిచేస్తున్నప్పుడు అద్భుతమైన ఉదంతం ఒకటి ఆయనిట్లా స్మరించారు స్వీయచరిత్రలో. ”ఇక్కడ కాలేజి క్కు టైగర్‌ను గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ప్రతిరోజు ఉదయం నేను కాలేజీకి వెళ్తుంటే నా కంటె ముందు పరుగెత్తుతూ నాకు దారి చూపించేది. సాయం కాలం యింటికి వెళ్తుంటే వేగంగా పరుగెత్తి అమ్మగారికి నా రాక సూచించేది. ఎప్పుడైనా యింటి నుంచి పిలుస్తే కాలేజి కంపౌండు వాలు, బయటి రోడ్డు, మా యింటి కంపౌండు ఒక్క నిముషంలో దాటి నా ముందు తోకాడిస్తూ నిలిచేది. ఒకసారి ఒక సంవత్సరం తరువాత నేను కరీంనగర్ వెళ్ళి కాలేజి గెస్టు హౌస్‌కు వెళ్ళాను. అది ఎట్లా పసిగట్టిందో పరుగు పరుగున వచ్చి నా చుట్టూ తిరిగి ముందుకాళ్ళు ఎత్తి నా మీద పెట్టి నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. దానికెట్లా కృతజ్ఞత చెప్పాలో నాకు తోచలేదు. మనిషిలో మానవత్వం లోపించవచ్చు. కుక్కలో దైవత్వం తొణికిసలాడుతూ ఉంటుంది” (పుట. 171). అంటూ దాని విషాద మరణం కూడా తలుచుకొని బాధపడ్డాడు యోగానందులు. ఎక్కడ ప్రేమ, కరుణ, ఆర్ద్రత, సర్వభూత హితమైత్రి ఉంటాయో వారు దైవ స్వరూపులే కదా! భగవాన్ శ్రీరమణ మహర్షులకు కుక్కల పట్ల ఎంతో ప్రేమ, మైత్రి ఉండేది. శ్రీ కె.వై.ఎల్. ఉద్యోగ పదవీ విరమణానంతరం కూడా విద్యా, సాంస్కృతిక, కళా, సాహిత్యరంగాలలో ఎంతో సేవ చేశారు. ఒక 20సం||లు ఆయన ఎక్కడుంటే అక్కడ నిత్యవసంతం. పద్యనాటక వారోత్సవాలు, సంస్కారభారతి పండుగ తిరునాళ్ళు, చదవదగినవి. శ్రీ కె.వై.ఎల్. దార్శనికత పట్ల ‘సంస్కార భారతి’ అఖిల భారతదేశంలో అగ్రగణ్యమైంది ‘స్వాతంత్య్ర స్వర్ణోత్సవ సాంస్కృతిక జైత్రయాత్ర’. ఈ రథయాత్రను గూర్చి చదువుతుంటే ఒళ్ళుపులకరిస్తుంది. జోగేటి అచ్యుత రామశాస్త్రి దీని రథసారథి. ఒక మనుధర్మ శాస్త్రాన్ని గూర్చివారు వ్యాఖ్యా సహితంగా ఇంగ్లీషు, తెలుగులలో రాయటం అది ఒక సువర్ణాధ్యాయము. ఇదిన్నీ 80 సం||లు వయసున వారు నిర్వహించారు. ఎంత ప్రస్తుతి పాత్రమైన మహత్కార్యము. వారి జీవితమే ప్రస్తుతి పాత్రమైనది.
– డా|| అక్కిరాజు రమాపతిరావు
———–