పేరు (ఆంగ్లం) | Jakka Venkataramanappa |
పేరు (తెలుగు) | జక్కా వెంకటరమణప్ప |
కలం పేరు | – |
తల్లిపేరు | జక్కా అక్కమ్మ |
తండ్రి పేరు | జక్కా పెద్ద నారాయణప్ప |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | ధర్మవరము, అనంతపురం జిల్లా |
విద్యార్హతలు | యం.ఏ. |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | ‘మహాభారతము – మహిళ’ అను విషయముపై ఒక సిద్ధాంత గ్రంథము |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | జక్కా వెంకటరమణప్ప |
సంగ్రహ నమూనా రచన | ఆంధ్రరాష్ట్రమున సుప్రసిద్ధ జ్యోతిష్మార్తాండులుగా వాసికెక్కిన శ్రీమాన్ రాళ్లపల్లి గోపాల కృష్ణమాచార్యుల వారికెందరో ఏకలవ్య శిష్యులు కలరు. శ్రీ ఆచార్యులవారి జ్యోతిశ్శాస్త్ర ప్రావీణ్యతను గూర్చి వేరుగా చెప్పపనిలేదు. అట్టివారిని గురువుగా భావించి జ్యోతిశ్శాస్త్రమున ప్రాచ్య, పాశ్చాత్య పద్ధతులలో అభ్యసించి గత దారువర్షముల నుండి ప్రతిసంవత్సరము పన్నెండు రాశుల ఫలముల వ్రాసి, అచ్చువేయించి ఆంధ్రదేశమునకే కాదు, కర్ణాటక ప్రాంతమునకు కూడ అందించు ఘనతను శ్రీ జక్కా వేంకట రమణప్పగారు దక్కించుకొనిరి. |
జక్కా వెంకటరమణప్ప
ఆంధ్రరాష్ట్రమున సుప్రసిద్ధ జ్యోతిష్మార్తాండులుగా వాసికెక్కిన శ్రీమాన్ రాళ్లపల్లి గోపాల కృష్ణమాచార్యుల వారికెందరో ఏకలవ్య శిష్యులు కలరు. శ్రీ ఆచార్యులవారి జ్యోతిశ్శాస్త్ర ప్రావీణ్యతను గూర్చి వేరుగా చెప్పపనిలేదు. అట్టివారిని గురువుగా భావించి జ్యోతిశ్శాస్త్రమున ప్రాచ్య, పాశ్చాత్య పద్ధతులలో అభ్యసించి గత దారువర్షముల నుండి ప్రతిసంవత్సరము పన్నెండు రాశుల ఫలముల వ్రాసి, అచ్చువేయించి ఆంధ్రదేశమునకే కాదు, కర్ణాటక ప్రాంతమునకు కూడ అందించు ఘనతను శ్రీ జక్కా వేంకట రమణప్పగారు దక్కించుకొనిరి.
ధర్మవరమునందలి ఉన్నతపాఠశాలలో ఉన్నతవిద్యను ముగించి, అనంతపురం కళాశాలలో బి.ఏ. పట్టమును ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులై, 1961లో ఆంధ్ర యూనివర్శిటీ నుండి యం.ఏ., పట్టమును, అనంతపురం పోస్టుగ్రాజుయేట్ సెంటర్ నుండి ‘మహాభారతము – మహిళ’ అను విషయముపై ఒక సిద్ధాంత గ్రంథమును తయారుచేసి, యం.ఫిల్ ను పొందిరి.
వీరి ‘మహాభారతము – మహిళ’లో ఐదు ప్రధాన స్త్రీ పాత్రలు కలవు. అవి కుంతి, మాద్రి, ద్రౌపది, గాంధారి, సుదేష్టలు, ‘తినన గారెలు తినవలె, వినిన మహాభారతము వినవలె’ నన్నసామెత కొద్ది మహాభారతమును కథగా చదువవచ్చును, వినవచ్చునేగాని, అందలి పాత్రతల స్వభావములను గూర్చి నిశితముగా నాలోచించి నప్పుడెన్నియో సందిగ్ధ విషయముల, చదువరి మనసున పొడచూపగలవు. అందునను అబలల మనసు లెఱుగుట అతి కష్టముతో కూడినపని. ‘ఇంతి మనసు తెలియ నీళుఁదరమె?’ యన్న నానుడి యెల్ల రెఱిగినదేయైనను, ఆ పూబంతుల మనసులెరిగిన వాడొక్కడులేడు. ‘రవిగాంచనిచో కవిగాంచు నెయెయడన్’ అను నార్యోక్తి కూడ ఈ విషయమున దూరమే కావచ్చను. అటువంటిది శ్రీ జక్కా వేంకటరమణప్పగారు తమ మనసును మహాభారత మహిళలపై నిమగ్నముచేసి ఆ పాత్రతల నుంచి చెడుగుల నెత్తి చూపుట సాహసముతో కూడిన విషయము. వీరెక్కువగా ఆంధ్ర మహాభారతకర్తల కథాసంఘటనలలో ఆయాపాత్రతలు కన్పించుతీరును బట్టియే వారివైశిష్ట్యమును పేర్కొనిరి. టనట సంస్కృత కర్తల యుద్దేశ్యములను కూడ తడివిరి.
మహాభారతకథలో ఐదుగురు పుత్రుల తల్లులు కుంతి, మాద్రి. వీరితో బాటుఐదుగురు భర్తల సతి, శతసుతమాత, కీచకాది శతాధిక సోదరులు గల సోదరి, ముఖ్యమగు మహిళలు, ఇవన్నియు కీలకపాత్రలే, వీరిని విడిచిన కథలేదు; కథను విడిచి వీరులేదరు, వీరందరి గుణవిశేషములు చెప్పుటకెంత కథ అవసరమో అంతేకథను శ్రీ జక్కావారు నుడివిరి. తొలుత స్త్రీ వైకిష్ట్యమును గూర్చి విపులీకరించి, తదుపరి మహాభారతమును కవిత్రయమును గూర్చి వ్రాసిరి. కవిత్రయ కవులు భగవత్ర్పార్థనలలో స్త్రీమూర్తులకిచ్చిన మహోన్నత స్థానమును గూర్చి చర్చించిరి.
ద్రౌపది ఐదుగురు భర్తలకు భార్య. ఆమె మయసభలో దుర్యోధనుని చూచి నవ్వినది, మున్నగు విషయములందు పాఠకులకు వచ్చుకొన్ని సందేహములను నివృత్తి చేసి ఆ పాత్రయొక్క ఆంతరంగిక విషయములను మనముందుంచిరి. ‘ద్రౌపదినవ్వు’ను గూర్చి వ్రాయుచు ‘ద్రౌపది రాగాది వికారములు లేని రాతిబొమ్మకాదు. కావున మానవ సహజమైన వికార మా సన్నివేశమున ఆమెను పొందినది. ఇది అపరాధము మాత్రము కాదు’ అని అభివ్యక్తముచేసిరి. ద్రౌపది ‘పరమవివేకురాలు’ అనుటకు సభలో ఆమె వేసిన ముఖ్యమైన ప్రశ్నకు జవాబు మొత్తము భారతమున లేదు. తుదకు భీష్ముడు కూడ ఆ సందేహము తీర్చలేదు. ఆమెకది యే విధముగ నుపకారము కాక పోయినను, మహాసామ్రాజ్య మేలదగిన రాజనీతి ‘ద్రౌపదిసొమ్ము’ అని నిరూపించుకొన్నది ‘విరాటపర్వ కథా చక్రమునకు ద్రౌపది కేంద్రబిందువు’ (ద్రౌపది సౌశీల్యమునకు విరాటపర్వమొక అగ్ని పరీక్ష) ఆమెను కీచకుడు సభకీడ్చినప్పుడును, ఉప కీచకు లామెను ముట్టడించినప్పుడును, ఆమె ‘అజ్ఞాతవాస నిబంధన’ మల్లంఘించలేదు. ఇట్టి సందిగ్ధ విరాటపర్వఘట్టమున ద్రౌపది, సుదేష్ణల గుణగణములను, అంతర్యములను చక్కగా విడమఱచి శ్రీ జక్కావరు విపులీకరించిరి.
గాంధారి తెలిసి తెలిసి తన నూర్గురు సుతులను పోగొట్టుకొన్నది, ఆ ఏడ్పు ఒక పర్వమైనది. ఈ విషయముగా ఆమె భర్త యెదుట భవిష్యత్తును గూర్చి ఆలోచించినది. ఇందు తన భర్త కపట నాటకము కూడ దాగాయున్నదని ఆమె గ్రహించినది. ఆమెభర్త నీ విషయముగా ప్రశ్నించినది. ఆ మాటలలో ఆమె సమరసభావము ధార్మిక ప్రవృత్తి. అధర్మములపై ఏహ్యభావము కనబడుచున్నది’ అని జక్కావారు విడమఱచి తెల్పిరి. ఆమె పుత్రశోకము పాండవులనే దహించెడిది. కాని ఆమెధర్మముగ, తనకొడుకుల ప్రవర్తనను, తనతో బుట్టువు శకుని నడవడిని నిందించినదేకాని, అధర్మమునకు పాల్పడలేదు. ఇది మె ‘పతివ్రతాప్రభావ జనిత మనోబలము’నకు నిదర్శనముగా జక్కావారు నిరూపించిరి.
ఇట్టి ఉదాత్త పాత్రల సౌశీల్య మనోభావ ప్రవర్తనలు వివరముగా చదువు పాఠకులకు కొన్ని సందేహములు పొడచూపక మానవు. అట్టి సందేహములు కొన్నిచోట్ల నివృత్తి కాగలవు. మరికొన్ని చోట్ల తటస్థముగా నుండగలవు. తెనుగు మహాభారత గ్రంథములో కవిత్రయము చిత్రించిన ఘట్టములందలి స్త్రీ పాత్రల ప్రవృత్తిని విపులముగా వివరించుటలో వీరుచేసిన కృషి గొప్పది. శ్రీ వేంకట రమణప్పగారు ఈ గ్రంథమును శ్రీ శలాక రఘునాథశర్మగారికి అంకితమిచ్చి గురుఋణము తీర్చుకొనిరి.
శ్రీ జక్కావారు ప్రస్తుతము హిందూపురము కళాశాలలో ఆంధ్రోపన్యాసకులుగా పనిచేయుచు, బి.ఏ., అడ్వాన్సు తెలుగులో లక్షణ గ్రంథములకు సంబంధించిన పరిశీలనతో ప్రథముడుగా వచ్చని విద్యార్థికి రజత పతకముల నిచ్చి విద్యార్థులకు ప్రోత్సహించు చున్నారు. వీరు పి.హెచ్.డి. పట్టమునకై ప్రయత్నించుచున్నారు. వీరు సౌమ్యులు, పండిత గోష్ఠులందు సభలందు విరివిగా పాల్గొనుచుందురు. మంచివక్తలు. సద్భావములు కల వారు. వీరు నిర్వారామముగా జ్యోతిష్య, సాహిత్య, వేదాంత గ్రంథములందు కృషి సల్పుచున్నారు. వీరికి భగవంతుడారోగ్యభాగ్యము లిచ్చుగాత.
———–