పేరు (ఆంగ్లం) | B.Shantaram |
పేరు (తెలుగు) | బి. శాంతారామ్ |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | కళ విలువ,మరోపాట |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | బి. శాంతారామ్ |
సంగ్రహ నమూనా రచన | తడబడుతున్న అడుగులతో వడివడిగా నడుస్తున్నాడతను. కళ్ళలో ఆశ, వళ్ళంతా నీరసం, చాలాదూరం నడిచాడేమో నడకవేగం తగ్గి ఓ చోట ఆగాడు. జేబులోవున్న కాగితాన్ని మళ్ళీ ఓసారి చూసుకున్నాడు. ఆనందంతో కళ్ళు మెరిశాయ్. అతని గమ్యం వచ్చేసింది. జగన్నాధమూర్తి… కళాసదన్ ఇల్లు సులభంగానే దొరికింది. అది ఒక ఎకరం పూలతోటలో ఓ చివర అందంగా కట్టిన ఇల్లు. కాదు, చిన్నసైజ రాజులుండే కోట అంటే బాగుంటుందేమో. ఇంటిపైన పిట్టగోడల చుట్టూ చక్కటి బొమ్మలు అందంగా అమర్చబడ్డాయి. |
బి. శాంతారామ్
కళవిలువ
తడబడుతున్న అడుగులతో వడివడిగా నడుస్తున్నాడతను. కళ్ళలో ఆశ, వళ్ళంతా నీరసం, చాలాదూరం నడిచాడేమో నడకవేగం తగ్గి ఓ చోట ఆగాడు. జేబులోవున్న కాగితాన్ని మళ్ళీ ఓసారి చూసుకున్నాడు. ఆనందంతో కళ్ళు మెరిశాయ్. అతని గమ్యం వచ్చేసింది.
జగన్నాధమూర్తి…
కళాసదన్
ఇల్లు సులభంగానే దొరికింది. అది ఒక ఎకరం పూలతోటలో ఓ చివర అందంగా కట్టిన ఇల్లు. కాదు, చిన్నసైజ రాజులుండే కోట అంటే బాగుంటుందేమో. ఇంటిపైన పిట్టగోడల చుట్టూ చక్కటి బొమ్మలు అందంగా అమర్చబడ్డాయి. చేతిలో చిత్రాలున్న సంచితో వరండాలోకి అడుగుపెట్టి ఇల్లంతా ఓసారి కలయచూశాడు. ఆ గృహం పేరుకుతగ్గట్టు కళాత్మకంగా వుంది. ఇంటినిండా బొమ్మలు గోడలచుట్టూ ఓ క్రమపద్దతిలో అమర్చిన చిరతపటాలు. వాటిని చూసిన అతనిలోని చిరతకారుడు స్వర్గదేవతలను భూమ్మీద చూసినంతటి అనుభూతి పొందాడు.
అతని పేరు సంజీవ్. ఓ చిరతకారుడతను.
‘‘ఎవరూ?’’ ఓ వ్యక్తి గుమ్మంలో నిల్చుని, దిక్కులుచూస్తున్న సంజీవ్ని నొసలు చిట్లించి అడుగుతున్నాడు. సంజీవ్ ఆకారంలో కన్పిస్తున్న బీదతనం ఆ ధనుకునికి అసహ్యంగా కన్పించి వుండవచ్చు.
‘‘నమస్కారమండీ నన్ను రామకృష్ణగారు పంపించారు’’ అని తనని తాను పరిచయం చేసుకుని ఓ చీటీ ఇచ్చి, ఆయన చదువుకునే లోపలే ‘‘నేను బియ్యే పాసయ్యేనిం. బొమ్మలు గీస్తాను…’’
‘‘ఏవీ బొమ్మలు చూపించు’’ సంజీవ్ మాటలు పూర్తికాకమేం అడిగాడు ముప్పయ్యయిదేళ్ళ జగన్నాధమూర్తి.
బొమ్మలు చూసి మళ్ళీ ముఖం చిట్లించాడాయన. ఆయన మనస్పూర్తిగా కళాభిమానికాదని చెప్పేకంటే సంఘంలో గౌరవం కోసం అలా ప్రాకులాడే మనిషి అని అనడం బాగుంటుంది. చాలామంది ధనవంతులు కళాత్మక వస్తువులకోసం డబ్బు విరజిమ్మి అవి ఇంట్లో పెట్టుకుంటే పెద్ద గొప్పతనం వచ్చినట్టు ఫీలవడం అందరికీ తెలిసిందే. ఆ కోవకు చెందిన పెద్దమనిషే ఈ జగన్నాథమూర్తి.
‘బాధ’ అనే పదానికి అర్థం తెలియని ఆ పెద్దమనిషికి, వయసులో వున్న ఆ దనవంతుడికి విషాదం అంటే పరమ అసహ్యం, (అదసలు ఆయన దరిదాపులకి ఇప్పుడప్పుడే రాదు) అందుకే ఆయనకు ఆ బొమ్మలు నచ్చలేదని కచ్చితంగా చెప్పొచ్చు.
‘‘ఏమిటవి? ఇవసలు బొమ్మలేనా? ఇంత అధ్వాన్నంగా వున్నవాటిని నా కెలా చూపిద్దామని తీసుకొచ్చావ్? వంగిపోయిన ముసలి వాడు. ‘విరిగిపోయిన చెట్టు’, ‘తుఫాను భీభత్సాలూ’ ఇవేనా చిరతాలంటే? ఛీఛీ ఏవో పిచ్చి పిచ్చి బొమ్మలేసి ప్రతివాడూ చిత్రకారుడి ఫోజు కోపంగా క్రిందకు విసిరేశాడు. ‘అటు ఆ గోడలకేసి చూడు. ఎంత సుందరమైన చిరతాలో శృంగారం కొన్నటిలో చిందులేస్తుంటే సుందర దృశ్యాలతో కొన్ని ఎంత అందం కలిగిస్తున్నాయో? అవి ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారులవి.’’
అతని కోపాన్ని గర్వాన్ని చూసిన సంజీవ్ నిజంగా భయపడ్డాడు. ‘‘క్షమించండి. నేను ఈ చిత్రాలు కొనమని రాలేదు. మీకు బొమ్మలంటే యిష్టమనీ, ఈ బొమ్మలు చూసి సంతోషించి నాకేదైనా జీవనాధారం చూపిస్తారనీ రామకృష్ణగారు చెప్పి పంపారు. దయచేసి నాకేదైనా పని…’’
జగన్నాధమూర్తిలో యింకో కోపం, అసహ్యం తగ్గలేదు. ‘‘పనా? నీకా? ముందిక్కడ్నించి వెళ్ళు. నీ లాటి దరిద్రపు మొహాల్ని ఒక్క క్షణం చూళ్ళేని నేను, నిన్ను పన్లో పెట్టుకుని రోజంతా చూడలేను’’ త్రుంచినట్లు మాటలాడి లేచి వెళ్లిపోయాడు.
సంజీవ్ ముఖానికి పట్టిన చెమటను తుడుచుకుని ఇంటికేసి బయలుదేరాడు. అతని కళ్ళ నిండా విరక్తి నిండిపోయింది. భారంగా నడుస్తున్నాడు.
తలుపునెట్టి ఆ పూరింట్లోకి ప్రవేశించాడు. అంతా చీకటి అతని బ్రతుకులా. దీపం వెలిగిస్తే వెలగలేదు వెలుగు లేని ఆతని కళ్ళలా పైన ఊడిన తాటాకుల సందుల నుండి వెన్నెల తొంగిచూస్తోంది. కాని భవిష్యత్తులోకి అతని ఆవలు తొంగిచూడటంలేదు. సందడిలేక బిక్కు బిక్కు మంటున్న ఆ ఇంటిని చూస్తేనే తెలుస్తుంది అతను ఒంటరివాడని. ఇప్పటి వరకూ వివరించిన అతని పరిస్థితే చెబుతుంది అతను నిరుద్యోగి అని.
సంజీవ్ తండ్రి కాయకష్టంకేసి, అతన్ని చదివించాడు. అతని సంపాదన తనకుండానే మరణించాడు. (అసలు సంపాదన టేగా తినడానికి)
సంజీవ్ చదువు ముగించిన తరువాత కొన్నాళ్ళకు, తన అభిరుచికి తగ్గట్టు పెయింటింగ్ షాపులో పని దొరికింది. జీతం డెభైరూపాయలైనా సంతోషంగా కొన్నాళ్ళు చేశాడు. అతని ఆనందం ఎంతో కాలం నిలవలేదు. ఇప్పుడా షాపులేదు. ఆ షాపు యజమాని పెద్ద ఉద్యోగం వస్తే షాపు ఎత్తేసి వెళ్లిపోయాడు.
సంజీవ్ కొన్నాళ్ళు దుర్భురంగా రోజులు గడిపాడు. ఆ రోజులలోనే విరక్తి అతన్ని వెంటాడుతూ చివరకు ఈ రోజు జగన్నాధమూర్తి చేసిన పరాభవంతో అతనికి జీవితంమీద ఆశ చచ్చిపోగా, పూర్తిగా అతన్ని విరక్తి ఆక్రమించుకుంది.
తన అభిరుచికి తగిన ఉద్యోగం దొరుకుతుందని సంజీవ్ చదువునే రోజుల్లో యెన్నో కలలు కన్నాడు.
ఏ కళాకారునికైనా అతని కళలో, అతని స్వంత అనుభవాలే యెక్కువగా కనబడుతాయని అందరికీ తెలిసిందే. సంజీవ్ మనసు ఏనాడూ సుందరదృశ్యాలవైపు మొగ్గలేదు. అతను గీసిన ఆ పది చిత్రాలూ విషాదపూరితమైనవే.
తాను గీసిన చిత్రాలన్నిటినీ ఓసారి చూసుకుని నిట్టూర్చాడు. చాపమీద పడుకుని కళ్ళు తెరిచి, తాటాకుల సందుల్లో నుండి ఆకాశాన్ని, మిణుకు మిణుకుమంటున్న నక్షత్రాల్నీ చూస్తున్నాడు. కళ్ళు నీరసంలో మూతలు పడుతున్నాయి చుక్కల్లాగా, అన్నం వాసన చూసి ఓ వారం రోజులు కావచ్చు.
ఇప్పుడతనిలో ఆవలు లేవు. భవిష్యత్తుపై ఊమలు లేవు.
అతను తన జీవితాన్ని మట్టిగా ఉపయోగించి చేసిన బొమ్మల్లాంటి ఆ చిత్రాలు అతన్ని చూసి సానుభూతిగా ఏడుస్తున్నాయి. ఒక చిత్రంలో సూర్యోదయాన్ని, భయంకరంగా కూలిపోయిన చెట్లమధ్య చూపించాడు. సృష్టిలోని సుఖదుఃఖాలకు ఆ చిత్రంలోని ఆ రెండు దృశ్యాలు ప్రతినిధులేమో అన్ని చిత్రాల్లోనూ విషాదం తప్పకుండా తొంగిచూస్తుంది. అవి అతని జీవితానికి దర్పణాలు. అతని కళ్ళలో కొరవడిన జీవం అతని చిత్రాలలో కనబడుతుంది. చురుకుదనం లేని అతని కళ్ళను ప్రక్కకునెట్టి అతని కళాహృదయం కళ్ళు తెరవగా, హృదయస్పందనలు గీతలుగా మారుతున్నాయేమో, రంగులు కొనలేని ఆ బీద కళాకారుడు తన రక్తాన్ని రంగుగా పోశాడేమో అన్నట్లు ఆ చిత్రాలు గోచరిస్తాయి.
ఆ యువకుడి జీవనానికి చదువు, కళరెండు తోడ్పడలేకపోయాయి.
సంజీవ్ కళ్ళు అప్రయత్నంగా మూసుకున్నాయి నిద్ర వచ్చి. మళ్ళీ అతను కళ్ళు తెరవలేదు.
కాలగర్భంలో చాలా సంవత్సరాలు శిథిలమయ్యాయి. క్రొత్తమార్పులు ప్రపంచంలో దయించాయి. మానవుడు యింకా నాగరికుడయ్యాడు.
స్థరం : కళాసదన్ అందులో ఓ శతవృద్ధుడు గోడకు క్రోత్తగా తగిలించిన చిత్రాలకేసి చూస్తున్నాడు. చాలా కాలం క్రితం వేసినట్లున్నాయి. రంగులు నిండుగాలేవు. అవి విరిగిన చెట్లు, వంగిపోయిన వృద్దుడు, రెక్కలు తెగిన పక్షి, ‘తుఫాను దృశ్యం’ మొదలైన రకరకాల చిత్రాలు. అవి సంజీవ్ చిత్రాలే. ఆ వృద్ధుడు జగన్నాధమూర్తే. ఇప్పుడతని వృద్ధాప్యంలో అవి చాలా అందంగా కన్పిస్తున్నాయి. ఏవో సత్యాలు చెబతున్నాయ్.
ఒకానొకప్పుడు ఆ వ్యక్తి చేత విసిరేయబడ్డ చిత్రాలు. ఇప్పుడతని ఇంటిలో ప్రత్యేకమైన గదిలో వ్రేలాడుతున్నాయి. ఆ వ్యకిత వాటిని ఓ మ్యూజియంలో ఆ మధ్యనే రెండు లక్షలకు కొన్నాడు. చాలామంది పోటీలుపడి ధరపెంచగా అది కళాభిమానం కాదని మళ్ళీ చెప్పాలా? రెండు లక్షలతో ఆ చిత్రాలు కొన్నందుకు సంఘంలో చాలా ‘ప్రెస్టేజ్’ సంపాదించుకున్నాడు.
ఆ చిత్రాకారుడి హృదయం నుండి సూటిగా వెలువడ్డ ఆ చిత్రాలు, అతని రక్తంతో రంగులు దిద్దుకున్న ఆ చిత్రాలు, ఆనాడతన్ని కళాకారునిగా గౌరవించకపోయినా కనీసం అతన్ని ఓ మనిషిగానైనా నిలెబట్టలేకపోయినా ‘ఆనాటి జగన్నాధమూర్తి’ లాంటి వారిని నేడు వెక్కిరిస్తున్నాయి.
———–