పేరు (ఆంగ్లం) | Bhamidipati Jagannatharao |
పేరు (తెలుగు) | భమిడిపాటి జగన్నాథరావు |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 12/1/1934 |
మరణం | ఫిబ్రవరి 6 |
పుట్టిన ఊరు | కృష్ణా జిల్లా, గుడివాడ |
విద్యార్హతలు | పబ్లిక్అడ్మినిస్ట్రేషన్లో ఎం.ఎ |
వృత్తి | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖలో జాయింట్ డైరెక్టర్‌గా, ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌కు ప్రెస్ సెక్రెటరీగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి పదవీ విరమణ |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | అడుగుజాడలు, అనుతాపం అనురాగం, అపరంజి పంజరం, చిత్రనళీయం, చూపు, చేదునిజం |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | భమిడిపాటి జగన్నాథరావు |
సంగ్రహ నమూనా రచన | అనూరాధ డాబా చివరకొచ్చి స్తంభంపై చేయాన్చి వీధిలోకి చూసింది. స్తంభానికి అల్లుకొని పైకెగబాకుతున్న మాధవీలత చేతికి తగిలింది. కింద గడియారం గంటలు కొడుతోంది. లెక్క పెట్తోంది అనూరాధ ఒకటి, రెండూ… ఎనిమిది. అబ్బ ఎనిమిదైందన్నమాట ఈయనింకా రాలేదెంచేతో? అనుకొంది. పిక్చరు కెళ్ళారేమో? మంచివేవీ లేవన్నారుగా అంతకంటె రేడియో ట్యూన్చేసి కూచుంటే మంచి పాటలొస్తాయన్నారుగా ఎక్కడ కెళ్ళేరు చెప్మా. ఆయనకి పాటలంటే ఇష్టం… లలిత సంగీతం మరీను. |
భమిడిపాటి జగన్నాథరావు
అనుతాపం – అనురాగం
అనూరాధ డాబా చివరకొచ్చి స్తంభంపై చేయాన్చి వీధిలోకి చూసింది. స్తంభానికి అల్లుకొని పైకెగబాకుతున్న మాధవీలత చేతికి తగిలింది.
కింద గడియారం గంటలు కొడుతోంది. లెక్క పెట్తోంది అనూరాధ ఒకటి, రెండూ… ఎనిమిది.
అబ్బ ఎనిమిదైందన్నమాట ఈయనింకా రాలేదెంచేతో? అనుకొంది.
పిక్చరు కెళ్ళారేమో? మంచివేవీ లేవన్నారుగా అంతకంటె రేడియో ట్యూన్చేసి కూచుంటే మంచి పాటలొస్తాయన్నారుగా ఎక్కడ కెళ్ళేరు చెప్మా.
ఆయనకి పాటలంటే ఇష్టం… లలిత సంగీతం మరీను.
తనకి శాస్త్రియ సంగీతమంటె మక్కువ చిన్నప్పటి సాధికం మూలాన్నేమో.
ఇప్పుడా శ్రద్ధ లేకుండాపోతోంది. ఆ ఫిడేలు అలా పెట్టెలోనే మూలుగుతోంది. మధ్య, మధ్య కూనిరాగాలు తిప్పితే గొంతు విప్పిపాడడం తగిపోతోంది.
’అలా కూనిరాగాలు తీయకపోతే, కాస్త జోలపాటలు నేర్చుకోకూడదూ? అంటూరాయన కొంటెగా చూస్తూ… ఆయనలా అంటూంటే తనకంత సిగ్గనిపిస్తుందేవిటో.
వీధి చివర కనపడుతూన్న దెవరు చెప్మా? పొడుగ్గావున్నారు… ఈయనే నేమో పొడుగు అనగానే తనకి ‘ఆ’ సంగతి జ్ఞప్తికొస్తుంది.
ఆనాటి సంఘటన తలుచుకుంటే, ఏవిటోలా అనిపించి, ఈనాడు కూడ సిగ్గు ముంచుకొస్తుంది.
మావయ్య ఆ రోజు పెళ్ళిచూపులకి తీసుకొచ్చాడు…. ఈయన్నీ, అత్తగార్నీ. స్కూల్ ఫైనల్ చదువుతోందితను. కారణం తెలీదుకాని, అందరూ ‘ఈ’ సంబంధం అయిపోతుందనుకున్నారు. ఇంకా గమత్తు వాళ్ళద్దరూ సరాసరి తమ ఇంట్లోనే దిగడం, లాంఛనంగా చూపించడం పాట, వగేరాలన్నీ అయిపోయాయి. ఆ సాయంత్రం చెప్పారట అత్తగారు ‘‘ఇక ముహూర్తం గట్రా చూడ్డంమీదే తరచాయి’’ అని.
తను ఆ రోజు ఇక గదిలోంచి కదిల్తేవొట్టు… అంత… సిగ్గనిపించింది. రెండో రోజు పొద్దుటవాళ్ళు వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. తను మెట్లెక్కి మేడమీదికి వెళ్తోంది… పౌడరుకోసం మెట్లెక్కి చూస్తే చప్పున ఎక్కడైనా దాక్కోవలనిపించింది. కాలుకదల్దే… అలాగే నిల్చుండిపోయాను ఏమనడానికి, ఎటూ పోడానికీ పాలుపోక.
ఇంతలో అత్తగారు దగ్గరకొచ్చి తలమీద చెయ్యేసి, సిమురుతూ ‘‘అలా ఖంగారుపడతానేమో వెర్రిపిల్లా ఏదీ. ఇలా దగ్గరిగా రా, మా వాడి పక్కననుంచో ఓమాటు చూసాను’’ అన్నారు. తను కదలలేక శిలలా అయిపోయింది ఎంచేతో?
‘‘నువ్వేరారా, రామం పక్కననుంచో’’
ఆయన పక్కకి వొచ్చారు. తనకు బాగా జ్ఞాపకం తనకిష్టమైననల్లటివోణీ, పువ్వులపరికిణీ కట్టుకున్నది. ఆయన పక్క నునుంచుంటే ఆయన భుజం వోణీకి తగుల్తూవుంది. తనముఖం సిగ్గుతో కందగడేఐపోయింది.
‘‘భయం లేదులే అమ్మా నేనే పొడుగులే కొద్దిగా అని ఆయన ఇంకా కొద్ది దగ్గరగా వచ్చారు, కొల్చుకోమన్నట్టు. ఆయన చెయి తన భుజానికి తగిలిది. వంట్లోంచి, ఏమిటో వణుకు లా వచ్చింది. తనకున్న పొడుగుకూడా కరిగిపోయి నట్లనిపించింది. తల ఎత్త లేకపోయింది.
అనూరాధ ఆలోచన లోంచి తేరుకొని తలెత్తి మరోమాటు వీధిలోకి చూసింది.
అబ్బే, ఆపొడుగ్గా వస్తున్న దీయనకాదు. హైస్కూల్లో పని చేస్తూన్నటీచరు. పాపం, ఈవిడ ఇప్పుడెళ్ళి వంటచేసుకోవాలి. ఆ వున్న ఒక్క తమ్ముణ్ణీ కాలేజీలో చదివించడానికి ఈ తాపత్రయమంతాను. ఆ తమ్ముడికి ఎక్కడలేని ఆకతాయి గుణాలు వొచ్చాయి. మొన్న ‘సుధ’ చెప్తోందిగా… అమ్మాయిల వెనకాల తిరుగుతాడని.
ఆవిడ ఉద్యోగం చేస్తూ, ఇంటిపనంతా చేసుకుంటుంది. ఇప్పుడు ప్రైవేట్లు చెప్పివస్తోంది కాబోలు. ఈవిడెంతో మంచిది. ఆ మధ్య మునసబుగారింటికి పేరంటాలి కొచ్చినప్పుడు, తనతో ఎంత ఆప్యాయంగా చక్కగా మాట్లాడింది పాపం. ఆవిడ ఒక్కర్తినీ విడిగా, ఏదో వెల్తిగా చూశారక్కడ. ఎంత బాధపడి వుంటుందో?
అందరికీ పసుపురాసి ఈవిడ కాళ్ళకి రాయకుండా చూస్తూ వూరుకొంది ఆనరసమ్మగారు.
‘‘రాయండీ’’ అంటూ చీర కుచ్చిళ్ళు సున్నితంగా పైకితీసి, ఎంతవెన్నెల చిలకరించింది ఆ చిరునవ్వులో, పాదాలు పచ్చగా మెరిసిపోయాయి.
‘‘అబ్బే, చదువుకున్న వాళ్ళు పసుపూ గట్రా రాయించుకోరేమోనని అనుకున్నా నమ్మాయ్ మాదంతా పూర్వాచారం, ఏదో తెలీనివాళ్ళం’’ అంది నరసమ్మగారు గట్టిగా.
నరసమ్మగారికి ఇంకోళ్ళని బాధపెట్టడం బాగా తెలుసు… మిగతావేవీ తెలీక పోయినా, నరసమ్మగారి మాటలు తనకేబాధ అనిపించేయే… ఆవిడంతా మనసులో దాచుకుని, అబ్బే, నాకలాటి అభ్యంతరాలు లేవండీ’ అని నవ్వతూ, ఎలా అనగలిందో? నరసమ్మగారు ఆవిడ కట్టుకున్న సిల్కు చీర పాడవాలన్నట్లు పాదాలే కాకుండ, మోకాళ్ళదాకా రాసినంత పనిచేసి పోయింది. మళ్ళా నరసమ్మగారి మనవరాలు ఎక్కడైన పేరంటానికొస్తే కాస్త గోళ్ళకి రాయండీ అంటుంది మామ్మపక్కనుండగానే.
ఇలాటి సూటిపోటీ మాటలుపడ్తూ ఆవిడెలా నెగ్గుకొస్తోందో?… వీధులో మగవాళ్ళలో, చుట్టుపక్కల ఆడవాళ్ళలోను. ఆ చిరునవ్వే ఆవిడకి భూషణం. ఆనవ్వులో ఎదుటివాళ్ళ మాలిన్యంకూడ హరించుకుపోయే శక్తివుంది. మరి ఆ నరసమ్మగారెలా అనగల్గిందామాటలు?
ఈవిడ సంగతిచెప్తూ చాలామంచిదని ఆయన్తో అంటే, ‘‘మీ అన్నయ్యకో ఉత్తరం రాయి. వచ్చి చూసుకొని పెళ్లి చేసుకుంటాదేమో, ఓ పిల్లనైనా రక్షించినవాడవు తాడు’’, అన్నారు నవ్వుతూ.
ఈయనకి పెద్దగొప్ప, గర్వమూనూ… తనేం కట్నం తీసుకోలేదని. అవునినజమే. ఆ మాత్రం గర్వం వుండడంలో తప్పు లేదనిపిస్తుంది. ఈ రోజులో కట్నం లేకుండ ఎవరు చేసుకొంటున్నారు? నాన్నగారు ఇస్తావన్నా ఆమాట ఎత్తవద్దని పంతంపట్టె చేసుకున్నారు.
‘‘సాక్షాతూ లక్ష్మి మా ఇంటికొస్తుంటే, ఇక మాకు వేరే కట్నమెందుకూ?’’ అన్నారట అత్తగారు ఆ రోజు నాన్నగారితో, మావగారికి కట్నం తీసుకోకపోవడం మొదటో చిన్నతన మనిపించినా, ఒక్కగానొక్క కొడుకు పట్టుదలకి వొప్పుకున్నారు.
వీళ్ళింట్లో చాలా కాలాన్నించి చిన్న పిల్లలు లేకపోడంతో తనని కన్న కూతురు కంటె ఎక్కువగా, మల్లెపూవులా చూసుకునేవారు అత్తగారు. మావగారుకూడ ఎంత హుందాగా అభిమానం వ్యక్తపరిచే వారనీ
‘‘ఇంటో చిన్న పిల్లలు తిరిగి పాతికేళ్ళవ్వస్తోంది. నీకడుపులో కాయకాస్తే…’’ అనే అత్తగారి మాటలు తనకిపులకరింపుగా వుండేవి.
విసురుగాలి వీస్తోంది. చల్లటి గాలి చలిగాలిగా మారింది. అనూరాధ ఆకసంలోకి చూసింది. దూరంగ నల్లమబ్బులు గుమిగూడి పరిగెట్టి వస్తున్నాయి. చుక్కలు మబ్బుల్లో కలిసిపోతున్నాయి. ఆ నల్లమబ్బులు తన్ని కప్పి తన అందం మింగకుండా వుండేందుకా అన్నట్టు చందమామ పరిగెడుతున్నాడు. గాలి విసురు ఎక్కువైంది.
అనూరాధకి చప్పున భయం వేసింది.
ఇంతసేపు ఎక్కడవున్నారు చెప్మా? గాలి ఎక్కువై పోతోంది, వర్షమొస్తుందేమో కూడానూ?
అనూరాధకి వున్నట్లుండి వళ్ళు తిప్పినట్లైంది. కడుపులో కెలికినట్లుగా వుంది.
ఇంత బాధగావుందేమిటో?
కళ్ళుకూడ తిరుగుతునాన యెంచేతో?
వీపుమీద చల్లనిచేయి తగిలింది. వెనక్కితిరిగింది. అత్తగారు పక్కనవున్నారు.
‘‘ఇంతిగాలిలో ఒక్కతినే వున్నావేమో రాధా కిందికిరా. భోంచేసి పడుకుందువు గాని’’ అన్నారు లక్ష్మమ్మగారు.
‘‘ఆయన వొస్తారుగా… అప్పుడు తింటాలెండి.’’
‘‘వాడు ఎప్పుడొస్తాడో? నువ్వు తినేదువుగాని రా’’
‘‘ఎందుకండీ… కాసేపట్లో వస్తారుగా’’
‘‘నే చెప్తున్నారా రాధా నువ్విలా వుండడం మంచిది కాదు, తెలుసా? పోనీ, నీకోసం కాదులే…’’ అంటూ లక్ష్మ్మమ్మగారు, కోడలినడుంచుట్టూ చెయ్యేసి కిందకి తీసుకువెళ్ళారు.
మెట్లు దిగుతూంటే రాధకి మళ్లా వొళ్లు తిప్పి, వాంతివచ్చేట్టునిపించింది. అన్నం ముందు కూచున్నదన్న మాటేగాని ఏం తినలేకపోయింది.
నీ కిష్టమని చేశానే ఆకూర, పచ్చడీను… ఏవీ ముట్టకోడం లేదేం తల్లీ’’ అంది అత్తగారు దగ్గరగా జరిగి.
‘‘ఏవిటో తినాలని లేదండీ… గాభరాగా వుంది.’’
ఇంతలో మావగారు వంటింటి గుమ్మం దగ్గరకొచ్చారు. లేవబోతూంటే కోడల్ని కూచోమని సంజ్ఞచేసి ‘‘వీడింకా రాలేదూ?’’ అన్నారు.
‘‘లేదండీ… ఎక్కడి కెళ్ళాడోకాని?’’ అన్నారు లక్ష్మమ్మగారు.
‘‘ఈ పాటి కొచ్చేయకూడదూ పిల్లవొక్కటేవుంది… ఖంగారుపడుతుందినైనాతలు లేదా’’ అంటూ వీధిలోకి వెళ్ళిపోయా రాయన.
భోజనం సయించక అనూరాధ కంచం దగ్గరనుండి లేస్తుంటే కళ్లుతిరిగాయి. దొడ్లోకెళి వాంతి చేసుకుంది.
‘‘కాస్తయినా తినలేదే తల్లీ ఒంటరి మనిషివి కూడా కాదు.. ఏదో కాస్త హితవు చేసుకోవాలి. ఆ బీరువాలో బత్తాయి పళ్ళున్నాయి. అవి తీసుకుని పైకెళ్ళి కళ్ళు మూసుకు పడుక్కో నేను పనిచూసుకువస్తాను’’ అని అత్తగారు మెట్లదాకవచ్చి సాగనంపారు.
మేడమీద గదిలో పడుకొని అనూరాధ కళ్ళుమూసుకొంది.
ఇంత గాభరాగా వుందేవిటి?
కడుపులో కదిలించినట్టై లేచి కూర్చుంది.
డాబామీది కొచ్చింది. గాలి ఇంకా బలంగా వీస్తోంది. మాధవీలత గాలికి రెపరెపలాడి దీనంగా చూస్తోంది. రాతిస్తంభం నిశ్చలంగావుంది.
ఈయనింకివాల్టికి రారేమో?
రేపు తన పుట్టినరోజు కూడానూ?
మొన్న, మొన్నటిదాకా అమ్మ ఎంత హడావిడి చేసేది పుట్టింరోజంటే.
అమ్మ ఏం చేస్తుంటుందో ఇప్పుడు? నాన్నగారు వస్తారేమో?
అమ్మని చూసి అప్పుడే ఎన్నాళ్ళొ అయినట్టుంది. ఐదారు నెలలకిందటి తను వుత్తరాలు రాయకపోతే అమ్మ విలవిల లాడిపోయిందట తను ఏ పని రాస్తుంది?
రాస్తే ‘ఆ’ సంగతెలా రాయడం? పైగా యన వేళాకోళాలొటి… ఇంటికి ఉత్తరం రాయమని, ఎలా రాయాలో, ఏమని రాయాలో తెలీక, సిగ్గుచేత వరసగా మూడు నెలలు వుత్తరమే రాయలేదు. అమ్మ కంగారుపడి, పెద్దవదిన పుట్టింటినుండి వస్తుంటే ఇక్కడికి పంపింది… కులాసాగా వున్నట్టు చూసిరమ్మని.
పెద్దవదిన ఇంట్లో దిగుతూనే తన దగ్గరకొచ్చి, రెండు మాటలాడి, అదోరకంగా చూస్తూ నవ్వింది గమత్తుగా, ఆవిడ మొహంలోకి చూడలేకపోయిందితను.
వెంటనే అత్తగారి దగ్గరకెళ్ళి, గుసగుస లాడి దగ్గరిగావచ్చి, కొంటెగా చూస్తూ ‘‘ఏవిటే విశేషాలు?’’ అంది.
‘‘ఏ మున్నాయి…?’’ అంది తను మెల్లగా.
మా ఆడబడుచుకు మొదటినుంచీ గుట్టే. ఎన్నో నెలేమిటి?’’ అంది.
‘‘ఏమో నాకు తెలీదు, పోదూ…’’
‘‘ఇదిగో ఇప్పుడే చెప్తున్నా నమ్మాయ్…. కోడలుకోసం మా అన్నయ్యకూడ చూస్తున్నారు. మరి ఏం చేస్తానో?’’ అంది ఎంతో ఆదరంగా నడుంచుట్టూ చెయ్యేనూ.
ఇంటికెళ్లి వదిన చెప్పగానే, అమ్మ వచ్చేసింది… ఏవేవో చేయించి తీసుకొస్తూ ఐదునెల్లోగాని ఏడోనెల్లోగాని తీసికెళ్లమని అత్తగారు చెప్పారు. గడియారం పదిగంటలు కొట్టింది.
ఈయనింక ఇవాళ రారేమో? ఎప్పుడూ ఇలా చేయలేదే?… ఆరు దాటకుండానే వచ్చేసేవారు.
అబ్బ కడుపులో ఇలా తప్పుతోందేం చెప్మా వికారంతో కళ్లుకూడ తిరుగుతున్నాయి. ఇంత బాధగా వుందేం?
గాలి తీవ్రతకి మాధవీలత వణికిపోయినట్టు రెపరెపలాడింది.
అనూరాధ బాధగా గదిలో కెళ్ళి మంచంపై వాలింది.
రేపు తనపుట్టినరోజు పండగనగా, ఇవాళి తనకింత బాధగా వుందేవిటో. రేపు పుట్టినరోజునగానే, అమ్మదగ్గర వుండగా ఎంతో సంతోషంగా వుండేది. ఆ రోజున కొత్త వోణీ, పరికిణీ కట్టుకొని, అమ్మ చెప్పి ‘స్వీటు’ తింటూ… ఎంతో బావుండేది.
ఆ అలవాటు అత్తగారు కూడా మానలేదు. తన వద్దంటున్నా, పండుగ రేపనగా ఆయన్చేత కొత్తచీర తీయించి, కట్టించికొని వూరుకునేవారు కాదు.
మొన్నామధ్య సినిమా కెళ్ళినప్పుడు వీధి చివర ఆ పీడరు వివ్వనాథంగారి బార్య కట్టుకున్న చీర ఎంత బావుందీ. ఆయనకి చూపించి చీర బావుందికదూ…’’ అంటే, ‘‘అంటే కావాలనేగా ఆడవాళ్ళు లాటి రోజులో కోరిన కోరిక తప్పకుండ తీర్చాలని శాస్త్రకారుడు లిఖించాడుగా. తీసుకొస్తాలే’’ అన్నారు.
అన్నారేకాని, వెంటనే మర్చిపోయినట్లున్నారు. ఆ చీర పుట్టినరోజునాడు కట్టుకొవాలనిపించింది. మొన్న జ్ఞాపకం లేదాయనకి ఈ మొగాళ్లకెప్పుడూ ఇంతే.. చీరల విషయంలో రంగూ, బోర్డరూ వీ జ్ఞాపకముండవు.
‘‘ఆరుద్ర పురుగు రంగండీ’’ అంటే ‘‘ఆరుద్ర పురుగు ఎలా వుంటుంది?’’ అని అనడం.
మొత్తానికి చీర తీసుకొచ్చి చూపిస్తేనే కాని తెలీలేదు.
కొటొచ్చేరంగూ, తళతళ మెరుస్తూ నల్లటి బోర్డరూ… ముద్దొస్తూ వుంది చీర.
ఈయనే రాకపోతే, ఇక చీర ఎక్కడినుంచి వస్తుంది?
అసలింతసేపటిదాకా ఎందుకు రాక పోవాలీ? అనూరాధకి వున్నట్టుంది కళ్ళనీళ్ళు తిరిగాయి.
పైగా తన కింత బాధగా వుంటే ఇంటికింకారాలేదు.
పదికొండుకూడ కావస్తోంది. మళ్ళా సాయంత్ర పెందరాళె ఇంటికొస్తామని చెప్పడం.
క్లబ్బు కెళ్ళారేమో? ఈమధ్య మానీసినా, ఆ ‘చంద్రం’గారువస్తే, ఆ క్లబ్బులో కూచుని ఊహు కబురు.
ఈయన కింత అశ్రద్ద తే నేనెందుకు ఇక్కడుండడం? నాన్న గార్ని రమ్మని వెళ్ళిపోతే సరి.
గడియారం పదుకొండుకొట్టింది. ఆకాశం రుముల్తో మెరుముల్తో దద్దరిల్లాపోతోంది. ఇక వర్షం రావడం ఆగదు.
———–