పేరు (ఆంగ్లం) | Mallemala Venugopalareddy |
పేరు (తెలుగు) | మల్లెమాల వేణుగోపాలరెడ్డి |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | వరలక్ష్మి |
పుట్టినతేదీ | – |
మరణం | 03-07-2023 |
పుట్టిన ఊరు | అలిమెల వెంకటగిరి తా. నెల్లూరు జిల్లా. |
విద్యార్హతలు | ఎం.బి.బి.ఎస్. |
వృత్తి | వైద్యుడు |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | – |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | మల్లెమాల వేణుగోపాలరెడ్డి |
సంగ్రహ నమూనా రచన | నెల్లూరు జిల్లా ‘జమీక్షాదార్’ ఉద్యమములో పాల్గొన్న యోధులు, విద్యానిలయములకు భూదానము లొసగిన దాతలు, ‘జమీన్ రైతు’ పత్రికా నిర్వాహకులైన శ్రీ మలెలమాల రామస్వామి రెడ్డిగారి పేరు వినని వారుండరు. వీరి పూర్వీకులు చిత్తూరు జిల్లా కాళహస్తి తాలూకా పులటాక గ్రామ నివాసులు. శ్రీరామస్వామిరెడ్డి గారికైదుగురు పుత్రులు. ఒక కుమార్తె. వీరిలో ప్రథములైన శ్రీ మల్లెమాల సుందరరామిరెడ్డి గారు తెలుగు చలనచిత్ర నిర్మాతలుగా, సినీ రచయితలుగా వాసికెక్కిరి, ద్వీతయులు, మన కధారచయితలు శ్రీ మల్లెమాల వేణుగోపాలరెడ్డిగారు. |
మల్లెమాల వేణుగోపాలరెడ్డి
నెల్లూరు జిల్లా ‘జమీక్షాదార్’ ఉద్యమములో పాల్గొన్న యోధులు, విద్యానిలయములకు భూదానము లొసగిన దాతలు, ‘జమీన్ రైతు’ పత్రికా నిర్వాహకులైన శ్రీ మలెలమాల రామస్వామి రెడ్డిగారి పేరు వినని వారుండరు. వీరి పూర్వీకులు చిత్తూరు జిల్లా కాళహస్తి తాలూకా పులటాక గ్రామ నివాసులు. శ్రీరామస్వామిరెడ్డి గారికైదుగురు పుత్రులు. ఒక కుమార్తె. వీరిలో ప్రథములైన శ్రీ మల్లెమాల సుందరరామిరెడ్డి గారు తెలుగు చలనచిత్ర నిర్మాతలుగా, సినీ రచయితలుగా వాసికెక్కిరి, ద్వీతయులు, మన కధారచయితలు శ్రీ మల్లెమాల వేణుగోపాలరెడ్డిగారు.
శ్రీ మల్లెమాల వేణుగోపాలరెడ్డిగారు నేడు కడపలో ‘లక్ష్మీనర్శింగ్ హోం’ అను పేర పెద్ద వైద్యశాలను స్వంతముగా నడుపుచున్నారు. వీరి భార్యామణి శ్రీమతి డాక్టర్ వరలక్ష్మి, యం.బి.బి.యస్. గారు కూడా ఈ వైద్యశాలలోనే పనిచేయుచున్నారు. ఈమె కడపలో ప్రముఖ న్యాయవాదిగా పేరుపొందిన శ్రీ కీ.శే. వి. నారాయణరెడ్డిగారి పుత్రిక.
శ్రీ వేణుగోపాలరెడ్డిగారు తమ ఉన్నత విద్యాభ్యాసమును నెల్లూరు జిల్లా గూడూరు హైస్కూలులో ముగించి, తదుపరి నెల్లూరు వి.ఆర్. కాలేజీ లో ఇంటర్ వరకు చదువుకొనిరి నెల్లూరులో కళాశాల విద్యార్థిగా ఉన్నప్పుడే వీరికి తెనుగు సాహిత్యముపై ఎనలేని అభిమాన మేర్పడినది. అందుకు కారణము వారచ్చటి కవిపుంగవులతో పండితులతో చేసుకొన్న పరిచయ భాగ్యమని చెప్పవచ్చును.
కళాశాల విద్యాభ్యాసానంతరం 1956 నుండి, కాలేజీలో ఎం.బి.బి.ఎస్. చదివిరి. ఈ ఆరేండ్ల కాలములో వైద్యవిద్యనేకాక సాహిత్యమును కూడా సుప్రసిద్ధ కవులైన శ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి జాషువాగారికి శిష్యులై నేర్చుకొనిరి, గుంటూరులో చదువు చున్నప్పుడే తమ 21వ సంవత్సరమున సంఘసేవా కార్యక్రమములో పాల్గొని, ఒకసారి 1958 లో ఢిల్లీలో యువజనోత్సవమునకు మెడికల్ ప్రతినిధిగా వెళ్ళిరి.
గుంటూరులో వైద్యవిద్యను ముగించి విశాఖపట్టణములో ఐదేండ్లు యం.యస్. వైద్యవిద్యలో శస్త్ర చికిత్సను ప్రత్యేకముగా నేర్చిరి. ఏగూటి పక్షి ఆ గూటికే చేరునన్నట్లు శ్రీ మల్లెమాల వారి సాహితీ మల్లెలు విశాఖలోని సాహితీ నందనోద్యానమున వైశాఖములో విరిసినవి. అచ్చట శ్రీ పురిపండ అప్పలస్వామి, శ్రీ రాచకొండ విశ్వనాథశాస్త్రి మున్నగు వారి సాహచర్యముతో వారి సాహిత్య సౌరభ మినుమడించినది. విశాఖరచయితల సంఘము (వి.ర.సం) లో సభ్యులుగా చేరి ఆంధ్రభాషకు సేవ లొనర్చరి.
తదుపరి శ్రీ మలెలమాలవారు డా. శ్రీమతి వరలక్ష్మి యం.బి.బి.యస్. గారిని వివాహమాడి కడపలో స్థిరపడిరి.
కడపలో సాగిన వీరి సాహిత్యకృషి వీరి జీవితమందొక కలకితురాయి. పుష్పించిన వీరి జీవితాశయము లిచ్చటనే ఫలించినవి. డాక్టరుగా ధనార్జన సాగించుటయే విధిగా పెట్టుకొనక, పాత్రత నెఱిగి దానమొనర్చుచు, బీద సాదల కుచితముగా చికిత్సల నొనగూర్చి ‘మానవసేవయే మాధవసేవగా’ తలచిన మహనీయ గుణసంపన్నులు.
1972 వ సంవత్సరములో శ్రీయుతులు జానమద్ది హనుమచ్ఛాస్త్రి, సాంబశివయ్య, జే.పి. సుబ్బయ్య మొదలగు సాహితీమిత్రులు సహాయ సహకారములతో కడప జిల్లా రచయితల సంఘము నొకదానిని స్థాపించిరి. ఆ సంఘమున కధ్యక్షులై రచయితలను, కవులను, పండితులను సన్మానించిరి. నేడీ రచయిత లసంఘమునకు శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ ప్రాంతమున ఒక ప్రత్యేక స్థానమున్నది. ఆంద్రప్రదేశ్ సాహిత్య అకాడమీ దీనిని గుర్తించినది. శ్రీ మల్లెమాలవారు సాహిత్య అకాడమీ కార్యనిర్వాహక సభ్యులుగా ప్రస్తుతము అనేక సామితీ కార్యముల నెరవేర్చుచున్నారు. ఈ జిల్లా రచయితల సంఘము కడపజిల్లా పౌరులనేకాక రాయలసీమలోని సాహితీప్రియుల మనన్నల నందినది. వీటన్నిటికినీ అధ్యక్షులు శ్రీ మల్లెమాల వారు, కార్యదర్శులు శ్రీ జానమద్దివారు. వీరిరువురి అనుబంధము బంగారునకు పరిమళ మబ్బినట్లుండును.
శ్రీ మల్లెమాలవారు కడపలో నిర్వహించని సాంగిక సేవాకార్యక్రమము లేదు. సంఘసేవా కార్యక్రమ నిర్వహణలో మేటిసంస్థగా ఎన్నికైన ‘లయన్స్ క్లబ్’ ను కడపలో స్థాపించి కొంతకాల మద్దానికి అధ్యక్షులుగా పనిచేసిరి. తదుపరి వీరు 1977లో లయన్సు క్లబ్బుల జోనల్ ఛేర్మెనుగా నియమింపబడిరి. లయన్సు క్లబ్ అధ్యక్షులలో వీరుత్తములుగా ఎన్నికగుట వీరి సేవా గుణవిశేషములకు నిదర్శనము. అరవిందుని ఆదర్శములను వీరు పాటించిరి. కడప చిన్మయ మిషన్ కార్యదర్శిగా ఆధ్యాత్మిక రంగములో సేవలు చేయుట వీరి తాత్విక దృష్టికి తార్కాణము. ప్రస్తుతము సామాజిక చైతన్యమునకు కళాత్మకమైన విలువలు గల చలన చిత్రము లెంతేని అవసరమని యూహించి, ‘కడప ఫిల్మిం సొసైటీ’ని స్థాపించి ఉత్తమ చలన చిత్రములు ప్రదర్శింప జేయుటకు కృషిచేసిన లౌకికులు. జీవకారుణ్య సంఘమునకు కార్యవర్గ సభ్యులైరి. శ్రీ సాయిబాబా అనాధ శరణాలయ నిర్వహణలో సభ్యులుగా పాలుపంచుకొనిరి. అందలి అనాథ బాలురందరికి ఉచిత వైద్య సమాయములను గావించిన దాతలు. ‘ఆల్ ఇండియా సర్జన్సు అసోషియేషన్’లో సభ్యులుగా రాణించిరి. ఇట్లనేక సంఘసేవా కార్యక్రమములందు తల మునుకలగుచు, తీరికేలేని ఈ విశ్వసంసారమందు తాము కూడ ఒక కుటుంబ సభ్యులై, తమ తోడివారికి తోడుపడుచూ, దినమునకు 18 గంటలు నిర్విరామకృషి సాగించుచున్న ప్రజాసేవకులు. సాహిత్య విజ్ఞాన కోశాధికారులు ప్రియ మితచతుర భాషులు – సౌమ్యులు నిరాడంబరులు శ్రీ మల్లెమాల వేణుగోపాలరెడ్డిగారు. వీరిని 1976 లో ఉగాది పండుగ సందర్భమున ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వము హైదరాబాదులో ఘనముగా సన్మానించినది.
శ్రీ మల్లెమాలవారు సాహితీ ప్రియులేకాదు, మంచి కథకులు. వక్తలు కూడ. వీరు ‘శిరీష’ అనే కలముపేర కొన్ని కథలు వ్రాసిరి. అవి వార, మాసపత్రికలలో ప్రకటింపబడినవి. వాటిని ‘ఉ(దా)త్త పురుషుడు’ అనుపేర కథల సంపుటిగా ప్రకటించిరి.
వృత్తి చేత డాక్టరుగా, ప్రవృత్తిచేత కథకులుగా సంఘసేవకులుగా శ్రీ మల్లెమాలవారు రాణించిరి. వారి హృదయము శిరీష కుసుమవేశలము. వారి కథలలో వారి సహజగుణములు ప్రతిబింబించుట గమనార్హము. ఈ కథలు వారి స్వీయానుభవములే. ప్రతి కథలోను డాక్టరుగారి ప్రతిరూపము మనకు గోచరించగలదు. ‘మరో ప్రేమకథ’ ఈ కథలో ‘జీవితాంతము ఒక వ్యక్తిని ‘ప్రేమ’ అనే పేరుతో ఆరాధించే మజ్నూలాంటి మనుషులు నేడున్నారు’ అంటూ వరాత్పరరావుకు ఒక డాక్టర్ చేత తాండాస్త్రీ ఊర్మిళ కధను చెప్పించి, ఆ ప్రియుని మనస్తత్వమును మనముందొక చమత్కారపు మాటతో ప్రదర్శించినారు. ఆ రెండు మాటలే ఆ కథకు ప్రాణములు. ‘వికలత్వము’ కథలో, ‘ప్రతిమ’ పాత్ర విషయముగా ఆ కథలోని డాక్టర్ కృష్ణమోహన్, హృదయ విదారకముగా చింతించిన తాత్వికుడు. డాక్టరుగా కాకుండా, మనిషిగా కదలి పోతాడతడు. మనసులోని భావము నా అమ్మాయి మామగారి ముందు డాక్టరు, విశద పఱచును. కాని ఆయన మనసుమారదు. తుదకు ‘‘నీవు కేవలం డాక్టరువి… అంతే’’ అని అతని చేత. మాటపడుతాడు డాక్టరు. ఇందు శ్రీ మల్లెమాలవారు డాక్టరు కృష్ణమోహనుగా, తారస పడతారు.
ఋణగ్రస్తుడనే కథలో, కన్నబిడ్డకు కష్టకాలములో రక్తమివ్వడానికి వెనుకాడి, తన దగ్గఱ పనిజేసే రిక్షావాలా తీర్చవలసని బాకీకుగాను రక్తము తీసుకొన్న ఒక నికృష్ట యజమాని, రిక్షావాలా ఎప్పుడూ ఋణగ్రస్తుడే. అతడు మోపిన నిందలో, రిక్షావాల ఖైదీగామారి రక్తదానము చేయుట, డాక్టరుగారి హృదయమును ద్రవింపజేసినది.
ఉ(దా)త్త పురుషుడెవరు? ఉత్తమపురుషుడెవరు? ఈ ప్రశ్నలకు జవాబు చక్రపాణి పాత్రద్వారా రచయిత వెల్లడింపజేసిరి. సుచరీత, పురుషోత్తములు ఆదర్శ అన్యోన్య దంపతులు. ఆ దంపతులపై, చక్రపాణి కొక గౌరవ భావము కలదు. సుచరిత అగ్ని ప్రమాదానికి గురికాగా, ఆమె కొఱకు, పురుషోత్తముడు పరితపించిపోయి, బిడ్డల కన్యాయము చేయనని మాట ఇచ్చను. సుచరిత మరణించిన తర్వాత జరిగిన మార్పులకు చక్ర పాణి ఆశ్చర్య పడతాడు. అతడు మంజుశ అనే ధనిక అమ్మాయిని పెండ్లాడి, పిల్లలను వాళ్ళ అమ్మమ్మ తాతగార్లవద్ద వదలి పెట్టినాడని తెలుసుకొని బాధపడతాడు. అతని దృష్టిలో పురుషోత్తముడు, పురుషోత్తముడు కాడు, ఉదాత్త పురుషుడు కాడు. అతడుత్తమ పురుషుడుగా, నిలిచిపోయినాడు.
ఇట్టి మంచి కథల నెన్నింటినో వ్రాయుటలో, శ్రీ మల్లెమాలవారు, సిద్ధహస్తులు, చక్కని భావగేయములు వ్రాయగల సమర్థులు, కలము, హలము బట్టిన రచయితలు, మన తెలుగు సాహితీ లోకములో కలరుగాని కలము తొలుతబట్టి, స్టెతస్కోపు తదుపరి బట్టిన రచయిత లరుదు. వీరి కథలను, శ్రీ రా.వి. శాస్త్రి తులసీకృష్ణ, శ్రీ మధురాంతకం రాజారాం, కీ.శే. కె.సభాకేతు వివ్వనాథరెడ్డి, మున్నగు ప్రసిద్ధ కథకులందరి చేతను మెప్పును గొప్నవి. శ్రీ మధురాంతకం వారు వీరి కథల సంపుటికి, పరిచయ వాక్యములు వ్రాయుచు సునిశితమైన జీవిత పరిశీలన ఆరోగ్యకరమైన హాస్యదోరణి, ఆహ్లాదకరమైన కథాకౌశలము, ఈ కథలలో యున్నదనియు, ఇంతకన్నా కావలసిన శక్తి యుక్తులు మరేమి కలవని వ్రాసినారు.
వారి సాహితీ మల్లెమాల విరబూసి సుగంధ పరిమళ మాంధ్ర సాహితీ లోకములో వెదజల్ల బడుగాక.
రాయలసీమ రచయితల నుండి…
———–