పేరు (ఆంగ్లం) | Dr. G.S.Mohan |
పేరు (తెలుగు) | డాక్టర్ జి.యస్. మోహన్ |
కలం పేరు | – |
తల్లిపేరు | గుమ్మగట్ట రామాబాయి |
తండ్రి పేరు | గుమ్మగట్ట శ్రీనివాసరావు |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 11/3/1949 |
మరణం | – |
పుట్టిన ఊరు | మలయనూరు, అనంతపురము జిల్లా. |
విద్యార్హతలు | ‘స్త్రీల పాటలు – అనంతపురమండలము’ అను విషయముపై పరిశోధన గావించి పి.హెచ్.డి. పట్టము పొదిన విద్యావంతులు. |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | – |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | డాక్టర్ జి.యస్. మోహన్ |
సంగ్రహ నమూనా రచన | డాక్టర్ గుమ్మగట్ట శ్రీనివాసరావు మోహన్ గారు, చిలమత్తూరు, పామిడి, ధర్మవరములలో హైస్కూలు విద్య, హైదరాబాదు న్యూసైన్సు కళాశాలలో బి.ఎస్.పి. (1966) ఉస్మానియా విశ్వవిద్యాలయము నుండి ఎం.ఏ., తెలుగు పట్టము (1972) బెంగళూరు విశ్వవిద్యాలయము నుండి 1979 ఫిబ్రవరిలో ‘స్త్రీల పాటలు – అనంతపురమండలము’ అను విషయముపై పరిశోధన గావించి పి.హెచ్.డి. పట్టము పొదిన విద్యావంతులు. |
డాక్టర్ జి.యస్. మోహన్
డాక్టర్ గుమ్మగట్ట శ్రీనివాసరావు మోహన్ గారు, చిలమత్తూరు, పామిడి, ధర్మవరములలో హైస్కూలు విద్య, హైదరాబాదు న్యూసైన్సు కళాశాలలో బి.ఎస్.పి. (1966) ఉస్మానియా విశ్వవిద్యాలయము నుండి ఎం.ఏ., తెలుగు పట్టము (1972) బెంగళూరు విశ్వవిద్యాలయము నుండి 1979 ఫిబ్రవరిలో ‘స్త్రీల పాటలు – అనంతపురమండలము’ అను విషయముపై పరిశోధన గావించి పి.హెచ్.డి. పట్టము పొదిన విద్యావంతులు.
1968-69 లో అనంతపురం జిల్లా ధర్మవరము జూనియర్ కళాశాలలో జూనియర్ తెలుగు పండితులుగను, 1974-75 లో గౌరీబిదునూరు నేషనల్ కాలేజి మరియు ఆచార్య జూనియర్ కళాశాలలో తెలుగు ఉపన్యాసకులుగాను పనిచేసిరి. 1975 ఆగష్టు నుండి 1980 అక్టోబరు వరకు బెంగళూరు విశ్వవిద్యాలయము తెలుగు విభాగములో రీసర్చి అసిస్టెంటుగా పనిచేసి, ప్రస్తుతము అదే విభాగములో ఆంధ్రోపన్యాసకులుగా ఉన్నారు.
వీరు డా. చిలుకూరి నారాయణరావుగారి దౌహిత్రులు, వీరి తండ్రి గారు, శ్రీ జి.యస్.రావు, ఎం.ఏ., ఎం.ఇ.డి., భి.కామ్, ఎల్.ఎల్.బి., గారు ధర్మవరం జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాలుగా పనిచేసి 1974లో రిటైరైనారు.
వీరి ముద్రిత గ్రంథములు (1) కన్నడ తెలుగు గాదెగళు సమానార్థకగళు’ ఇది కన్నడములో ముద్రితము. కన్నడ తెలుగు భాషలలో సమానార్థకములైన సామెతలు; ఆంగ్ల, హిందీ, తెలుగు, కన్నడభాషలలో సమానార్థకములైన కొన్ని సామెతలు ఇందు కూర్చబడినవి. సామెతలపై ఉపోద్ఘాతము వ్రాయబడినది.
(2) ‘జానపద విజ్ఞాన వ్యాసావళి’ దీనికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ వారు రెండువేలరూపాయలు గ్రాంటుగా ఇచ్చిరి. ఇందు జానపద విజ్ఞానమునకు సంబంధించిన 17 వ్యాసములు గలవు. తెలుగులో జానపద విజ్ఞానమునకు సంబంధించిన ఇన్ని వ్యాసములు శాస్త్రీయముగా గ్రంథరూపమున వెలువడుచుండుట ఇదియే ప్రథమము. శ్రీ మోహన్గారు దీనికి కీ.శే. లైన వారి మాతృమూర్తికి ప్రేమతో సమర్పించి ధన్యులైరి. ఈ గ్రంథము 1981 జనవరిలో విడుదలైనది.
విరి తెలుగు, కన్నడ, ఆంగ్లభాషలలో జానపద విజ్ఞానము, భాషా విజ్ఞానములపై నలుబడికి పైగా వ్యాసములు ప్రచురింపబడినవి. వాటినన్నింటిని ‘జానపద విజ్ఞాన వ్యాసమంజూష’ పేర్లతో పుస్తకరూపమున తెచ్చుటకు ప్రయత్నములు చేయుచున్నారు. ‘స్త్రీల పాటలు (అనంతపుర మండలము) సిద్ధాంత వ్యాసముకూడ అముద్రిత గ్రంథముగా నిలిచి ఉన్నది. ‘కన్నడ – తెలుగు గాదెగళు సమానార్థగళు ముద్రించిన విధముగానే తెలుగు – కన్నడ సామెతలు సమానార్ధములు, ప్రచురించు ప్రయత్నములో ఉన్నారు.
వీరు ఆంధ్రప్రదేశ్ జానపద సాహిత్య పరిషత్తు, హైదరాబాదు, కార్యదర్శులలో ఒకరు. అనేక భాషాసాహిత్య సదస్సులలో పాల్గొని పరిశోధన వ్యాసములను చదివరి. 1978 డిసెంబరులో కటక్ (ఒరిస్సా) లో జరిగిన ‘International Seminar on folk Culture’ కు బెంగళూరు విశ్వవిద్యాలయము నుండి ప్రతినిధిగా పంపబడిరి. హైద్రాబాదు, బెంగళూరు కాశవాణి కేంధ్రముల ద్వరా వీరి ప్రసంగములు వెలువడినవి. జానపద విజ్ఞానముపై ఆసక్తి మెండుగా గలిగి విమర్శనాదృష్టి అధికముగా కలిగిన యువకుడు శ్రీ మోహన్గారు, చిన్నవయసుననే పెద్దకార్యమును సాధించిన ఘటికులు వీరు. మాతామహులైన కీ.శే. డా. చిలుకూరి నారాయణరావుగారికి తగిన మనములు వీరు. వీరి కృషి, అచంరదతారార్కము నిలుచునది, భావితరములవారికి బంగారుబాట కాగలిగినది. వీరికి భగవంతుడు ఆయురారోగ్య భాగ్యము లిచ్చుగాత.
———–