పేరు (ఆంగ్లం) | Nachana Somanathudu |
పేరు (తెలుగు) | నాచన సోమనాథుడు |
కలం పేరు | – |
తల్లిపేరు | నాచన |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | ఉత్తరహరివంశము |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | నాచన సోమనాథుడు |
సంగ్రహ నమూనా రచన | – |
నాచన సోమనాథుడు
అరిజూచున్ హరిఁ జూచుఁ జూచుకములం దందంద మందారకే
సరమాలా మకరంద బిందు సలిలస్యందంబు లందంబులై
తొరుగం బయ్యెద కొంగొకింతఁ దొలఁగం దోడ్తో శరాసారమున్
దరహాసామృత పూరముం గురియుచుం దన్వంగి కేళీగతిన్
ఈ పద్యం నాచన సోమనాథుడు రచించిన “ఉత్తరహరివంశము” లో సత్యభామ నరకాసురునితో యుద్ధం చేస్తున్న ఘట్టంలోనిది. ఆమె శ్రీకృష్ణుని ప్రక్కనే ఉండి యుద్ధం చేస్తోంది. దూరంగా ఉన్న శత్రువుని (అరిన్), రోషంగా చూస్తోంది. ప్రక్కనే ఉన్న హరిని ప్రేమ ధృక్కులతో చూస్తోంది. ఆమె స్తనాగ్రభాగాలమీద (చూచుకములన్) అక్కడక్కడ మందార పుష్పమరందము చెమట బిందువులతో కలిసి అందంగా భాసిస్తోంది. అప్పుడప్పుడు తొలగుతున్న పైటని చేతితో సర్దుకుంటోంది. అటు నరకునివైపు, బాణపరంపరల్ని (శరాసారమున్) గుప్పిస్తోంది. ఇటు భర్తవైపు అమృతమయమైన చిరునవ్వులూ చిందిస్తోంది. దరహాసామృత పూరముం గురియుచున్. ఇదంతా ఆమె ఒక ఆటలాగ (కేళీ గతిన్) చేస్తోంది.
ఈ ఘట్టం రౌద్రశృంగార రసాల కలయిక. రౌద్ర శృంగార రసాలు విరోధి రసాలు. రెంటికీ పొసగదు. కానీ ఈ రెండు రసాల్నీ ఏక పద్యంలో అధ్భుతంగా గుప్పించిన ఒక మహాకవి యొక్క ప్రఙ్ఞ ఇక్కడ మనం చూస్తున్నాం.
అరిన్ జూచున్, హరిన్ జూచున్ యమకం. చూచున్ – చూచుకములన్ – మళ్ళీ యమకం. తరవాత సమాసమంతా – మందార కేసర మాలా మకరంద బిందు సలిలస్యందంబులై – “అందంద” అనే అక్షరాలు మాటిమాటికీ రావడం వృత్త్యనుప్రాస. ఈ యమకం వృత్యనుప్రాసలతో కూడిన పద్యం చదివేసరికి మనస్సు ఆనందడోలికల్లో విహరిస్తుంది. వినేవారికి శ్రవణ పేయంగా ఉంటుంది. ఆహా! అనిపిస్తుంది.
ఇంత అందమైన పద్యాలు నాచన సోమన కవిత్వంలో కోకొల్లలుగా కనిపిస్తాయి. కవిత్రయం – నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న – వ్యాస భారతాన్ని తెనుగీకరించే క్రమంలో తెలుగు భాషకి ప్రాణ ప్రతిష్ఠ చేసారు, అందునా ముఖ్యంగా తిక్కనని చెప్పుకోవాలి. “ఒకవిధముగా చెప్పవలెనన్న తిక్కన తెలుగు భాషను సృష్టి చేసినాడని చెప్పవలెను” అన్నారు విశ్వనాథ వారు. ఆంద్ర మహాభారతం విరాట పర్వం మొదలుకొని స్వర్గారోహణ పర్వందాకా పదిహేను పర్వాలలో, 16,617 పద్య-గద్యాల్లో మహానుభావుడు తిక్కనగారి ఆ పని చేశారు. కవిత్రయం తమ రచనలో ఆధ్యాత్మిక భావనకి తత్వబోధనకీ అధిక ప్రాధాన్యం ఇచ్చారు. కవిత్రయం యొక్క శైలికి భిన్నంగా పద్యరచనకి శ్రీకారం చుట్టినవాడు నాచన సోమనాథుడు. అందుకే ఆయన నవీన గుణసనాథ, సంవిధాన చక్రవర్తి అనిపించుకున్నాడు. తెలుగు భాష అందానికి మెరుగులు దిద్దినవాడు, తెలుగుపద్యాన్ని అందంగా తీర్చిదిద్దడం అనే కళను మొదలుపెట్టినవాడు నాచన సోమన ఆని పెద్దలు అంటారు. ఈ కళ శ్రీనాథుడి యందు మహా వృక్షం అయ్యి పెద్దనాదులయందు ఫలించింది ఆని చెప్పవచ్చును.
సహజ పండితుడిగా ప్రఖ్యాతి వహించిన పోతనామాత్యుడికి ఇద్దరు మహాకవుల పట్ల ఆరాధ్యభావం. మెండుగా ఉంది. ఒకరు ఎర్రాప్రగడ, రెండోవారు నాచన సోమనాథుడు. ఈ ఇద్దరు కవుల యొక్క శైలి ప్రభావం పోతనగారి కవిత్వంలో కనిపిస్తుంది. నక్షత్రాలన్నీ స్వయం ప్రకాశాలే అయినా, ఒక నక్షత్రం ప్రభావం మరొక నక్షత్రం మీద పడినట్లు.
ఇందాకా మనం జ్ఞాపకం చేసుకున్న “అరి జూచున్, హరిజూచున్…” అనే పద్యం పోతన గారికి ఎంత నచ్చిందంటే, ఆయన “భాగవతం” లో “నరకాసుర వధ” ఘట్టంలో ఇలా వ్రాసుకున్నాడు.
పరుజూచున్ వరుజూచునొంపనలరింపన్ రోషరాగోదయా
విరత భ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్
జరగం, గన్నుల గెంపు సొంపు బరగం, జండాస్త్ర సందోహమున్
సరసాలోక సమూహమున్ నెరపుచుం, జంద్రాస్య హేలాగతిన్ !
నాచన సోమనాథుడు తిక్కనగారి శిష్యుడు తిక్కనగారి వారసత్వాన్ని అందిపుచ్చుకుని హరిహరినాథునికి అంకితంగా “ఉత్తరహరివంశం” రచించినవాడు. సోమనాథుడు ఇతని పేరు. నాచనగారి పుత్రుడు కాబట్టి నాచన సోమనాథుడు అన్నారు.
తన ఉత్తర హరివంశంలో “ఇది శ్రీమదుభయకవిమిత్ర కొమ్మనామాత్య పుత్ర బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబైన శ్రీ మహాభారత కథానంతరంబున….” అంటూ ఆశ్వాసాంత గద్యం వ్రాసుకున్నాడు. తిక్కనగారి నామధేయాన్ని ప్రతి ఆశ్వాసం చివరిలోనూ సంస్మరించి తన గురుభక్తిని ప్రకటించుకున్నాడు సోమన.
మనకి లభించిన “ఉత్తర హరివంశం” ఆరు ఆశ్వాసాల గ్రంథం. సాధారణంగా ప్రతి గ్రంథానికీ ఉండే “అవతారిక” ఈ ఉత్తర హరివంశానికి లేదు. ఆరవ ఆశ్వాసం చివరిలో ఈ గ్రంథం ముగిసినట్టు కూడా చెప్పలేదు. సాధారణంగా కవులు “అవతారిక”లో తమ గురించి, తమ వంశం గురించి, ఇంకా ఎవరికైనా ఆ గ్రంథాన్ని అంకితం ఇస్తే, ఆ కావ్య గ్రహీత వివరాలూ వగైరాలు వ్రాసుకుంటారు. ఉత్తర హరివంశం గ్రంథానికి అవతారిక లేకపోవడంతో సోమన గారి కాలం గురించి వాదోపవాదాలు జరిగాయి.
విజయనగర రాజు బుక్కరాయలు గుత్తి దుర్గంలో ఉన్న పెంచుకలదిన్నె అనే గ్రామాన్ని నాచనసోమన్నకు క్రీ.శ. 1344లో దానం చేసినట్లు లభించిన తామ్రశాసనం ఆధారంగా ఇతడి కాలాన్ని సుమారు 1300 నుంచి 1380 మధ్య కాలంలో జీవించి ఉంటాడు ఆని పరిశోధకులు నిర్థారించారు. ఎఱ్ఱాప్రగడకు సమకాలీనుడు కానీ కొంచెం తరువాతవాడు గానీ అవుతాడు.
కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారు నాచన సోముని కవితా వైభవాన్ని “ఒకడు నాచన సోమన” అనే చక్కటి విశ్లేషణాత్మక గ్రంథంలో వ్రాసారు. “సాహిత్య సురభి” అనే పద్యసంకలన గ్రంథంలో సోమన గురించి విశ్వనాథవారు ఇలా అన్నారు “కొందఱితనిని తిక్కన్న కన్నా గొప్పవాడని యనుకొనువారు కలరు. కొన్ని విషయములలో నట్లే యనిపించును. తిక్కన్నగారికంటే ప్రౌఢుడు. కాని తిక్కన్నకు శిష్యుని వంటివాడు. ఎఱ్ఱన్న – నన్నయగారి ననుసరించినట్లుగా నాచన సోమన్న తిక్కన్నగారి ననుసరించెను. కాని ఎఱ్ఱయ్య నన్నయ్యకు కొంత తగ్గిపోవునని చెప్పవలయును. సోమన్న తిక్కన్నను కొన్నిచోట్ల మించి పోవునని చెప్పవలయును” అన్నారు. దీన్ని బట్టి సోమనాథుడు ఎంతటి మహాకవో మనం గ్రహించవచ్చును.
లక్షణగ్రంథాల్లో ఇచ్చిన ఒకటి రెండు ఉదాహరణల్ని బట్టి నాచన సోమన్న “వసంతవిలాసము” అనే మరోకావ్యం రచించాడని తెలుస్తోంది. కానీ ఇంతవరకూ అది బయటపడలేదు.
ఇప్పుడు మనం నాచన సోమనాథుని ఉత్తర హరివంశం నుండి ఒక రసవత్తర ఘట్టాన్ని జ్ఞాపకం చేసుకుందాం.
మహాభారతం, ఉద్యోగపర్వంలో తిక్కనగారు సంజయ రాయబారాన్ని అత్యద్భుతంగా నిర్వహించారు. శ్రీకృష్ణ రాయబారం గురించి చెప్పనే అక్కరలేదు. అది జగద్వితం. ఈ రెండు రాయబారాల్లో తిక్కన సోమయాజిగారి రాజకీయ దురంధరత ప్రతి మాటలోనూ, కదలికలోనూ ప్రస్ఫుటం ఔతుంది. నాచన సోమన్న ఉత్తరహరివంశంలో జనార్దనుడి రాయ బారాన్ని అంత రసవంతంగానూ పండించాడు
———–