పేరు (ఆంగ్లం) | Baddena Bhupaludu |
పేరు (తెలుగు) | బద్దెన భూపాలుడు |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | – |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | కమలాసన, కవిబ్రహ్మ |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | బద్దెన భూపాలుడు |
సంగ్రహ నమూనా రచన | క. సాధింపఁ గడిఁది శత్రుల సాధించిన బలిమి వృథ నిజక్షితిజనులన్ బాధించు కంటకులఁ బతి శోధింపనినాఁడు నన్నిచోడనరేంద్రా! క. తనకెన్నఁ డుండియును ద క్కని భృత్యులఁ బెరుగ మనుపఁగాఁ జనదు ప్రయో జనమునకుఁ దగిన వెల యి చ్చునది నరేశ్వరుండు నన్నిచోడనరేంద్రా! |
బద్దెన భూపాలుడు
కళావిలాసము కావ్యకర్త నన్నెచోడుడు గాక బద్దెన భూపాలుడు కావచ్చునా? ఇదొక సరికొత్త సమస్య. కళావిలాసము నన్నెచోడుని రచనమే గాని, ఆ నన్నెచోడుడు సుప్రసిద్ధమైన కుమారసంభవ కావ్యకర్త గాక సుమతి శతకము రచయిత అయిన బద్దెన కావచ్చునని ఒక అభిప్రాయం. సుమతి శతకము బద్దెన కృతి కాదన్న వాదం ఉండనే ఉన్నది.
1910లో బద్దెన భూపాలుని నీతిశాస్త్రముక్తావళిని, 1923లో మడికి సింగన సకలనీతిసమ్మతమును ప్రకటించిన రామకృష్ణకవిగారు బద్దెన సుమతి శతకాన్ని వ్రాసి ఉండకపోవచ్చునని, అది భీమకవి కృతి కావచ్చునని, ఆ భీమన వేములవాడ భీమనా? చెదలువాడ భీమనా? అని పరిశీలింపగా దక్షవాటి భీమన అని అనిపిస్తున్నదని, అయితే తెలంగాణంలో ఉన్న వే(లే)ములవాడతో భీమకవికి సంబంధం లేదని చెప్పటం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. నన్నెచోడుడే బద్దెన కావచ్చునా? అని పరిశీలించి, బద్దెన రెండవ నన్నెచోడుడని, నన్నెచోడుని వంశంలో కొన్ని తరాల తర్వాత పుట్టి ఉండవచ్చునని, బెజవాడలో దొరికిన క్రీస్తుశకం 1050 నాటి ఒక శాసనంలోని బొద్దన నారాయణదేవుడు బద్దెన కావచ్చునని వ్రాశారు. అంతకు మునుపే కుమారసంభవము పీఠికలో క్రీస్తుశకం 902 నాటి బీచుపల్లి శాసనం నన్నెచోడుని కాలనిర్ణయానికి, బీచుపల్లికి 50 మైళ్ళ దూరంలో తుంగాతీరంలో ఉన్న అలంపురంలోని ఆధారాలు నన్నెచోడుని గురువైన మల్లికార్జునయోగి కాలనిర్ణయానికి ఉపకరిస్తాయని వివరించారు.
పరిశోధకులు పెదచెరుకూరి శాసనంపైని దృష్టిని కేంద్రీకరించి, వివాదాస్పదాలైన ఈ శాసనాల వివరాలను జాగ్రత్తగా పరిశీలింపనందువల్ల సాహిత్యంలో నన్నెచోడుని గురించి, మల్లికార్జునయోగిని గురించి ఎన్నో పొరపాటు నిర్ణయాలకు పునాది ఏర్పడింది. ఆ శాసనవివాదవిశేషాలను, మల్లికార్జునయోగి చరిత్రను మరొక వ్యాసంలో వివరిస్తాను. బీచుపల్లి క్షేత్రచరిత్రను రచించిన శాసనపరిశోధకులు గడియారం రామకృష్ణశర్మ గారి ఆత్మకథ శతపత్రములో దీని ప్రస్తావన ఉన్నది.
“(బీచుపల్లి) గొప్ప క్షేత్రము… స్థలమహిమ తప్ప ఇక్కడ చారిత్రక విశేషాలుగాని, వాస్తుశిల్పవిశేషాలు గాని లేవు. అయితే ఆలయావరణలో ఒక శిలాశాసనమున్నది. అది ఎక్కడో ఉన్న రాతీర్థానికి సంబంధించినది. ఎవరో ఇక్కడ ఆ శాసనాన్ని పెట్టినారు. అందులో కళ్యాణి చాళుక్యరాజు త్రైలోక్యమల్లుని దండనాయకుడు చిద్దన చోళుడు 11-వ శతాబ్దిలో చేసిన దానవిషయమున్నది. 20-వ శతాబ్దిలో వనపర్తి సంస్థానంలో ఉన్న గొప్ప పండితులు మానవల్లి రామకృష్ణకవిగారు మొదట రాజకీయవ్యవహారాలు చూస్తుండేవారు. ఆయన గొప్ప పరిశోధకులుగా సుప్రసిద్ధులు. వనపర్తి నుండి విస్మృతకవులు అనే గ్రంథమాలను ప్రారంభించి శ్రీరంగమాహాత్మ్యం, తిమ్మ భూపాలుని అనర్ఘరాఘవం మొదలైన గ్రంథాలను వెలికితీసి పరిష్కరించి ప్రకటించినారు. ఆ మాలికలోనే “నన్నెచోడుని కుమారసంభవం” అనే కావ్యాన్ని ప్రకటిస్తూ ఈ కావ్యం నన్నయకు ప్రాచీనమైనది అని వ్రాసినారు. తెలుగు పండితలోకంలో వాదోపవాదాలు చెలరేగినాయి. ఆయన తన వాదనను సమర్థించుకోవటానికి చూపిన ఉపపత్తులలో ఈ బీచుపల్లి శాసనం ముఖ్యమైనది. శాసనం 11-వ శతాబ్ది నాటిది. కాని తొమ్మిదవ శతాబ్దికి తీసుకొనిపోబడింది. శాసనకర్త చిద్దన చోడుడైతే బద్దెన చోడునిగా చెప్పబడింది. అంటే నన్నెచోడుని తండ్రి బద్దెన అని ముడిపెట్టినారు. ఆ చిద్దన చోడుని శాసనాలు చాలా ప్రకటించబడినాయి. మానవల్లి వారివంటి మహాపండితులు అట్లా చేయరాదు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్ కొర్లపాటి శ్రీరామమూర్తి గారు కుమారసంభవాన్ని మానవల్లివారే రాసి నన్నెచోడుని పేరు పెట్టినారని ఒక గ్రంథాన్నే రాసినారు. ఇది చిత్రం కాదా!” — (శతపత్రము: పుటలు 221-2.)
బహుశః జ్ఞాపకాధారితంగా వ్రాసినందువల్ల, ముద్రణదోషాల మూలాన శర్మగారి ఉద్ఘాటనలోనూ కొంత సందిగ్ధత ఉన్నది కాని, బీచుపల్లి శాసనం అన్వయవిషయంలో ఏర్పడిన వైరుద్ధ్యాలను వారు గుర్తించారన్నది స్పష్టం. బీచుపల్లి శాసనంలోని నన్నెచోడునితో బద్దె భూపాలుని చరిత్రకు సంబంధం లేదన్నది స్పష్టం.
బద్దె భూపాలునికి నన్నెచోడుడని బిరుదం ఉన్నదన్న విశ్వాసం మూలాన అటు కుమారసంభవ కర్తతోనూ, ఇటు సుమతి శతకం విషయంగానూ అన్వయం ఏర్పడి అది కళావిలాసము కర్తృత్వవివాదానికి దారితీసింది. శాసనాధారాలతో పొందుపడని ఆ అన్వయం ఇతరేతరాధారాలతో సరిపడుతుందేమో చూడాలి.
నన్నెచోడుని కుమారసంభవము ప్రాచీనగ్రంథమా? అన్న విమర్శగ్రంథాన్ని 1983లో ప్రకటించిన ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి ఈ కళావిలాస కావ్యకర్తృత్వం విషయాన్ని కూడా చర్చించి, ప్రబంధరత్నాకరములోని కళావిలాసము, ప్రయోగరత్నాకరములోని కళావిలాసము ఒకటి కావని, ఆ రెండింటి కర్తలు వేర్వేరని రెండు ముఖ్యమైన సాధ్యనిర్దేశాలను ప్రతిపాదించారు. వారి దృష్టిలో:
పెదపాటి జగన్నాథకవి ప్రబంధరత్నాకరములో ఉదాహృతమైన కళావిలాసము కథాకావ్యం కాదు. అదొక కామశాస్త్రగ్రంథం.
గణపవరపు వేంకటకవి ఆంధ్ర ప్రయోగరత్నాకరములో ఉదాహృతమైన కళావిలాసము కామశాస్త్రగ్రంథం కాదు. అదొక ‘నానాపురాణకథావిలాసము’ అయిన ఒక స్వతంత్రకావ్యం.
అందువల్ల పెదపాటి జగన్నాథకవి, గణపవరపు వేంకటకవి పేర్కొన్నవి రెండూ భిన్నవస్తుకాలైన భిన్నకావ్యప్రభేదాలు (పు. 244-5లు) అని వారి ప్రతిపాదన.
కామశాస్త్రమైన కళావిలాసము ఎవరిదో పెదపాటి జగన్నాథకవి చెప్పలేదు. కావ్యమాత్రమైన కళావిలాసము నన్నెచోడునిదని గణపవరపు వేంకటకవి చెప్పాడు. అందువల్ల ఈ కావ్య కళావిలాసం నన్నెచోడ నరేంద్రుడు అన్న పర్యాయబిరుదాన్ని కలిగిన బద్దె నృపాలుని రచన కావచ్చునని శ్రీరామమూర్తి గారు ఊహించారు. మడికి సింగన సకలనీతిసమ్మతములో ఉన్న బద్దె నృపాలుని మూడు పద్యాలను, నీతిశాస్త్రముక్తావళిలోని రెండు పద్యాలను తమ నిర్ణయానికి ఆధారం చేసుకొన్నారు. ఆ పద్యాలివి:
బద్దెన నీతి లోనివిగా మడికి సింగన సకలనీతిసమ్మతములో ఉదాహరించినవి:
క. సాధింపఁ గడిఁది శత్రుల
సాధించిన బలిమి వృథ నిజక్షితిజనులన్
బాధించు కంటకులఁ బతి
శోధింపనినాఁడు నన్నిచోడనరేంద్రా! (1-113)
క. తనకెన్నఁ డుండియును ద
క్కని భృత్యులఁ బెరుగ మనుపఁగాఁ జనదు ప్రయో
జనమునకుఁ దగిన వెల యి
చ్చునది నరేశ్వరుండు నన్నిచోడనరేంద్రా! (2-420)
క. మనుపఁ గొఱయేని జీతము
దనియఁగ నిచ్చునది యెంత దయగల్గిన నే
రనివాని నెఱతనమునకుఁ
జొనుపుట దుర్నయము నన్నిచోడనరేంద్రా! (2-421)
బద్దె భూపాలుని నీతిశాస్త్రముక్తావళి లోనివిగా మడికి సింగన సకలనీతిసమ్మతములో ఉదాహరించినవి:
క. భూపగుణ మలిగి చెఱుపఁగ
నోపుట కరుణించి మనుప నోపుట జడుఁడై
కోపప్రసాదగుణములు
సూపని పతి పతియె నన్నిచోడనరేంద్రా! (1-10)
క. సతి కంటె నబల వసుమతి
సతి పతిలేకున్నఁ జెడదు సత్యము ధాత్రీ
పతి లేనినాఁడు సద్య
శ్చ్యుతి వసుమతి కండ్రు నన్నిచోడనరేంద్రా! (1-48)
———–