పేరు (ఆంగ్లం) | Kamkati Paparaju |
పేరు (తెలుగు) | కంకంటి పాపరాజు |
కలం పేరు | – |
తల్లిపేరు | నరసాంబ |
తండ్రి పేరు | అప్పయామాత్యుడు |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | నెల్లూరు మండలం |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | విష్ణుమాయావిలాసం అనే యక్షగానం , ఉత్తర రామాయణం అనే ఉత్తమ గ్రంథం |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | కంకంటి పాపరాజు |
సంగ్రహ నమూనా రచన | – |
కంకంటి పాపరాజు
కంకంటి పాపరాజు 18 వ శతాబ్దికి చెందిన ఉత్తమ కవి. ఇతను నెల్లూరు మండలం వారు. ఆరువేల నియోగ బ్రాహ్మణులలో శ్రీవత్స గోత్రానికి చెందినవారు.ఆపస్తంబ సూత్రుడు. తండ్రి అప్పయామాత్యుడు. తల్లి నరసాంబ. మదన గోపాల స్వామి భక్తుడు. చతుర్విధ కవితా నిపుణుడు. గణిత శాస్త్ర రత్నాకరుడు. చేమకూర వెంకటకవి తర్వాత మంచికవిగా పేర్కొనవలసినవాడు పాపరాజు మాత్రమే. పాపరాజు విష్ణుమాయావిలాసం అనే యక్షగానం రచించారు. ఉత్తర రామాయణం అనే ఉత్తమ గ్రంథాన్ని చంపూకావ్యంగా రచించి కవిగా ప్రసిద్దికెక్కారు. అంతే కాకుండా ఈయన తన రెండు గ్రంథాలను తన ఇష్ట దైవమైన నందగోపాలస్వామికి అంకితం ఇచ్చారు. ఈయన ప్రళయకావేరి పట్టణములో అమీనుగా లౌక్యాధికారమును కలిగి ఉండెడివారు. ఈయన తమ్ముడు కంకంటి నారసింహరాజు కూడా కవిత్వం చెప్పినారు.
———–