Share
పేరు (ఆంగ్లం)Muddupalani
పేరు (తెలుగు)ముద్దుపళని
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ01/01/1730
మరణం01/01/1790
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలురాధికా స్వాంతనము
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికముద్దుపళని
సంగ్రహ నమూనా రచన

ముద్దుపళని

ముద్దుపళని 18వ శతాబ్దమునకు చెందిన తెలుగు కవయిత్రి. ఈమె 1739 నుండి 1763 వరకు తంజావూరు నేలిన మరాఠ నాయక వంశపు రాజు ప్రతాపసింహ యొక్క భోగపత్ని. ఈమె ప్రతాపసింహుని ఆస్థానములో నెల్లూరు శివరామకవితో పాటు ఆస్థాన కవయిత్రి కూడా. ముద్దుపళని యొక్క గురువు తిరుమల తాతాచార్యుల వంశమునకు చెందిన వీరరాఘవదేశికుడు.

దేవదాసీల కుటుంబములో జన్మించిన ముద్దుపళని తల్లి పోతిబోటి, అమ్మమ్మ తంజనాయకి కూడా కవియిత్రులని, తండ్రి పేరు ముత్యాలు అని రాధికా స్వాంతనముకు ఈమె రాసిన ప్రవేశికలో తెలుస్తున్నది.

ముద్దుపళని రాసిన రాధికా సాంత్వనము ఒక గొప్ప శృంగార ప్రబంధ కావ్యము. అలిగి కోపముతో ఉన్న రాధను కృష్ణుడు బుజ్జగించడము ఈ కావ్య ఇతివృత్తము. దీనికి యిళా దేవీయము అని కూడా పేరుకలదు. చిన్ని కృష్ణునికి అకింతమైన ఈ గ్రంథములో నాలుగు భాగములలో 584 పద్యములు ఉన్నాయి. ముద్దుపళని యొక్క వర్ణనా శైలిని అనుకరించి నంది తిమ్మన పారిజాతాపహరణము రచించాడని ఒక ఆలోచన ఉంది.

శౌరిని బిల్వగా జనిన చక్కని కీరమదేల రాదొయే
దారిని జన్నదో నడుమ దారెనో చేరెదొలేదొ గోపికా
జారుని గాంచెనోకనదొ చక్కగ నావెతవిన్నవించెనో
సారెకులేక శౌరినుడి చక్కెరయుక్కెఋఅ మెక్కిచిక్కెనో
                — రాధికా సాంత్వనము 2-104.

———–

You may also like...