పేరు (ఆంగ్లం) | Anumulaq Venkataseshakavi |
పేరు (తెలుగు) | అనుముల వెంకటశేషకవి |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | తారాశశాంక విజయం, సత్యనారాయన మహత్మ్యం |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | అనుముల వెంకటశేషకవి |
సంగ్రహ నమూనా రచన | – |
అనుముల వెంకటశేషకవి
ఈయనకు చిన్నతనం నుండే అవధాన శక్తి అబ్బినది.నెల్లూరులో స్కూలు ఫైనల్ చేస్తుండగానే మొట్టమొదట అష్టావధానం చేశారీయన. తరువాత చదువుకోవాలని రాజమండ్రి వెళ్ళారు. రాజమహేంద్ర వరంలో ఇరవై యేండ్లు కూడా లేని ఈయన శతావధానానికి అందరూ ఆశ్చర్య పోయేవారు. ఈయన మూడుసార్లు మాత్రమే శతావధానం చేశారు. తర్వాత ఆయన అష్టావధానాలే చేస్తూ వచ్చారు. ఆయన శతాధికంగా అష్టావధానాలు చేశారు.
ఇరవై యేట నుండి సంస్థానాలలో సాహిత్య విహారం చేయటం మొదలు పెట్టారు. సంస్థానాలు పోయిన తర్వాత సారస్వతానికి మరీ దీనస్థితి సంభవించింది. ఇప్పటి అకాడమీల కంటే అప్పటి సంస్థానాలె ఎంతో నయం అని అంటూండేవారాయన. ఆయన
మొట్టమొదట “దైవం దిన్నె” సంస్థాన ప్రవేశం చేశారు.ఆయన ప్రతిభకు రాజమందిరాతిధ్యం, పండిత గోష్టి భాగధేయం కలిగాయి.
శేషకవి తన పద్నాలుగవ యేటనే రెండు నాటకాలు వ్రాసి ప్రచురించారు. మొదటిది “తారాశశాంక విజయం”, రెండవది “సత్యనారాయన మహత్మ్యం”. “చింతాదేవి” తొలి పద్య కృతి. “తెలుగు రాణి” తొలి నవల. “లలితాంజలి” మరియు “వివేకానంద” పద్య కృతులు అముద్రితాలు. “పోతన” నవల కూడా అముద్రితం గానే ఉండిపోయింది. సంస్కృతాంధ్ర , హిందీ, కన్నడ భాషల్లో నిష్ణాతులైన శేషకవికి సంస్కృతంలో బిల్హణ,కాళిదాసులూ, ఆంగ్లంలో షెల్లీ,కీట్స్ , హిందీలో ప్రేమ్చంద్ లు అభిమానులు. ఈయన శ్రీ ఆది శంకరాచార్యులు వ్రాసిన వివేకచూడామణిగ్రంథాన్ని తెలుగు అనువాదం చేశారు.
———–