ఎక్కిరాల భరద్వాజ (Ekkirala Bhardwaja)

Share
పేరు (ఆంగ్లం)Ekkirala Bharadwaja
పేరు (తెలుగు)ఎక్కిరాల భరద్వాజ
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ10/30/1938
మరణం04/12/1989
పుట్టిన ఊరుబాపట్ల
విద్యార్హతలు
వృత్తిఐ.ఎ.ఎస్.గా కొంత కాలం పనిచేసి ఆ తరువాత ఆంగ్లోపాధ్యాయునిగా పనిచేశారు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుశ్రీ గురుచరిత్ర, శ్రీ దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి, శ్రీ సాయి అష్టోత్తర శతనామావళి, శ్రీ సాయి లీలామృతము, ఏది నిజం?, మతమెందుకు?
పురుషసూక్త రహస్యం, శ్రీ పాకలపాటి గురువు, అవధూత శ్రీ చీరాల స్వామి, హజరత్ తాజుద్దీన్ బాబా చరిత్ర, స్వామి సనర్ధ (అక్కల్ కోట స్వామి),
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికఎక్కిరాల భరద్వాజ
సంగ్రహ నమూనా రచన

ఎక్కిరాల భరద్వాజ

ఆచార్య ఎక్కిరాల భరద్వాజ ఒక ఆధ్యాత్మిక గురువు, రచయిత. విశేషించి ఆంధ్రదేశానికి షిరిడీ సాయిబాబామాహాత్మ్యమును పరిచయము చేసి, గురు శుశ్రూష సంప్రదాయము పట్ల సరైన అవగాహనను ఇచ్చిన వ్యక్తిగా భరద్వాజ ప్రసిద్ధుడు. దత్త సంప్రదాయమును ప్రచారం చేసారు. షిరిడీకి వచ్చే భక్తులలో అధికులు దక్షిణాది వారంటే అందులో భరద్వాజ గారి కృషి చాలా ఉంది.
ఎక్కిరాల భరద్వాజ 1938, అక్టోబర్ 30 న బాపట్ల లో జన్మించారు. ఐ.ఎ.ఎస్.గా కొంత కాలం పనిచేసి ఆ తరువాత ఆంగ్లోపాధ్యాయునిగా పనిచేశారు. తన 36వ సంవత్సరాన అలివేలు మంగమ్మగారితో వివాహం జరిగింది. సాయిబాబా అను పక్ష పత్రికను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ లో కుల, మత, ప్రాంతీయ తత్వాలకు అతీతంగా షిర్డీ సాయిబాబాను గూర్చి విస్తారంగా, విశేషంగా ప్రచారం చేస్తూ సత్సంగములను ఏర్పాటు చెయ్యటమే కాకుండా ఎన్నెన్నో సాయి మందిరాల నిర్మాణానికి ప్రేరణగా నిలిచారు.
ఈయన ఆంగ్లసాహిత్యంలో ఉన్నత విద్య చదివారు. ఐ.ఏ.ఎస్. పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. షిరిడీలో సమాధి మందిరం వద్ద కలిగిన కొన్ని ఆధ్యాత్మికానుభవాల తరువాత ఐ.ఎ.ఎస్. బాధ్యతలను వదలి ఆంగ్లభాష అధ్యాపకునిగా చేరారు. ఎక్కిరాల భరద్వాజ ఎన్నో ఆద్యాతిక మరియూ సాయితత్వ పుస్తకాలు వ్రాసినారు.

———–

You may also like...