నందగిరి ఇందిరాదేవి (Nandagiri Indiradevi)

Share
పేరు (ఆంగ్లం)నందగిరి ఇందిరాదేవి
పేరు (తెలుగు)నందగిరి ఇందిరాదేవి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరువడ్లకొండ నరసింహారావు
జీవిత భాగస్వామి పేరునందగిరి వెంకటరావు
పుట్టినతేదీ09/22/1919
మరణం01/22/2007
పుట్టిన ఊరుహనుమకొండ
విద్యార్హతలుబి.ఎ.
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుఆడవారికి అలుక ఆనందం, ఎవరి తరమమ్మా ఉద్యోగితో కాపరం, ఒక వానరోజున మా ఇంట్లో…, గంగన్న, పందెం, మా వారితో బజారుకు, మావారి పెళ్లి, రూల్సు ప్రకారం మాయిల్లు, వాయిద్యం సరదా, విషమ సంఘటన
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలునందగిరి ఇందిరాదేవి తొలి తరం తెలంగాణ కథారచయిత్రి, సాంఘీక సేవకురాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికనందగిరి ఇందిరాదేవి
సంగ్రహ నమూనా రచన

నందగిరి ఇందిరాదేవి

పధ్నాలుగో ఏటే పాఠశాల తరపున సాహిత్య సంచికల్ని వెలువరించింది. ఆమె అనేక సామాజిక, సాంసృతిక ఉద్యమాల్లో పాలు పంచుకునేది. ఆంధ్రయువతి మండలి వ్యవస్థాపకులలో ఆమె ఒకరు. ఇందిరాదేవి సాంఘిక సంస్కరణోద్యమ సారథిగా ఎన్నో పోరాటాలు చేశారు. వాటిలో ముఖ్యమైనది బాల్య వివాహాల పట్ల నిరసన. అందువల్లనే తాను స్వయంగా యుక్తవయస్కురాలు అయిన తర్వాతనే ఆమె వివాహం చేసుకున్నారు. 1937లో నిజామాబాదులో జరిగిన ఆంధ్ర మహాసభకు అనుబంధంగా జరిగిన ఆంధ్రమహిళాసభలకు ఇందిరాదేవి అధ్యక్షత వహించారు.
నిజాం పాలనాకాలంలో హైదరాబాదు రేడియో కేంద్రం నుంచి ప్రసారమైన ‘నషర్’ కార్యక్రమాల్లో పాల్గొనేవారు. చాలా రేడియో ప్రసంగాలు వ్రాశారు. సంసార, కుటుంబ సంబంధమైన ఇతివృత్తాలతో వ్రాసిన ఇందిరాదేవి కథలు, వ్యావహరిక భాషలో, సరళ శైలిలో ఉన్నాయి. తన కథల్లో వరంగల్ జిల్లా ప్రజా జీవితాన్ని చిత్రించారు. తన కథలలో స్త్రీ పురుషుల మనస్తత్వాలను సుకురమారంగా చిత్రించింది. ఆమె వ్రాసిన కథలు భారతి, గృహలక్ష్మి, ఆంధ్రజ్యోతి, చిత్రగుప్త, ఆంధ్ర కేసరి, శోభ, ప్రజామిత్ర, వనితాజ్యోతి వంటి ప్రముఖ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. తను వ్రాసిన కథలను సంపుటిగా అచ్చు వెయ్యకపోయినా, దాదాపు ఆరు దశాబ్దాల పాటు రచించిన రేడియో ప్రసంగాల్లో ప్రముఖమైన వాటిని ఎంపికచేసి ఆమె “మసకమాటున మంచి ముత్యాలు” పేరుతో 1995లో అచ్చువేసుకున్నారు. కుటుంబ వ్యవస్థ, స్త్రీ పురుష సంబంధాల్లోని వైరుధ్యాలు, సామాజిక సమస్యలు, మనిషి మనస్తత్వ వైచిత్రి వంటి అనేక అంశాల్ని ఇతివృత్తాలుగా చేసుకొని ఆమె ‘వాయిద్యం సరదా’, ప్రథమ పరిచయం’, ‘ప్రాప్తం’, ‘ఏకాకి’ వంటి చాలా కథలు వ్రాసినా, సుమారు పాతిక మాత్రమే లభ్యమైనాయి. వాటిల్లో మనుషుల్లోని సున్నితమైన మానసిక విశ్లేషణని ఆవిష్కరిస్తూ వ్రాసిన కథ ‘పందెం’ ప్రముఖమైనది.
ఈమె భర్త నందగిరి వెంకటరావు వృత్తి రీత్యా న్యాయవాది. తొలితరం తెలంగాణ కథకుల్లో అగ్రగణ్యుడు. ఆంగ్ల, తెలుగు, ఉర్దూ భాషల్లో ప్రసిద్ధ కథా రచయిత. 1926-35 సంవత్సరాల మధ్యకాలంలో 50కి పైగా కథలు వ్రాశాడు. ‘గిరి’ అనే కలం పేరుతో భారతి, ఉదయిని, కృష్ణాపత్రిక, సమదర్శిని, సుజాత, గోలకొండ పత్రికల్లో ఈ కథలు అచ్చయ్యాయి. ఈయన 1935లోనే ప్రథమ అఖిలాంధ్ర కథకుల సమ్మేళనాన్ని హైదరాబాదులో నిర్వహించారు.
2006లో తెలుగు విశ్వవిద్యాలయం, ఇందిరాదేవిని హాస్యరచనలకుగాను ధర్మనిధి పురస్కారానికి ఎంపికచేసింది.

———–

You may also like...