పేరు (ఆంగ్లం) | Avasarala Ramakrishnarao |
పేరు (తెలుగు) | అవసరాల రామకృష్ణారావు |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | అవసరాల జగన్నాధరావు పంతులు |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 12/21/2018 |
మరణం | 11/28/2018 |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | ఇంగ్లీషు లెక్చరర్ |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | మనం మనుష్యులం, సహజీవన సౌభాగ్యం, ఇంకానా అంతరాలు?, అడుగో మావయ్య, ఆ వెనకే మేరీ, సంపెంగలూ, సన్ంజాజులూ, మేం చేసిన తప్పు మీరూ చేస్తారా?, అది ప్రశ్న, ఇది జవాబు, హెడ్మిస్ట్రెస్ హేమలత, పేకముక్కలు |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ (1969), తెలుగు విశ్వవిద్యాలయం హాశ్యరచయిత పురస్కారం (1994), జ్యేష్ఠ లిటరరీ ఎవార్డ్ ( 1998), కొలసాని చక్రపాణి ఎవార్డ్ (1999), ఢిల్లీ తెలుగు ఎకాడమీ ఉగాది పురస్కారం (2000), ఆంధ్రప్రభుత్వం తెలుగు వైభవం పురస్కారం (2004) |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | అవసరాల రామకృష్ణారావు |
సంగ్రహ నమూనా రచన | – |
అవసరాల రామకృష్ణారావు
15 సంవత్సరాల వయసులో చందమామ కథతో మొదలుపెట్టి 80 ఏళ్ల వయసులో చందమామ కథతోనే జీవితం ముగించిన తెలుగు విశిష్ట కథా రచయిత అవసరాల రామకృష్ణారావు గారు. బాల్యంలో అమ్మ చెప్పిన కథనే ఊకొట్టే భాషలోకి మార్చి ఆయన పంపిన ‘పొట్టిపిచిక కథ’ తొలి చందమామ పత్రికలో -1947 జూలై- యధాతథంగా అచ్చయి ఆయన సాహితీ ప్రస్థానానికి తొలి బీజం వేసింది. దాదాపు అరవైనాలుగు సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరం మొదట్లో ఆయన తన చందమామ జ్ఞాపకాలు పంపుతూ, పొట్టిపిచిక కథ రూపంలో తన బాల్యంలో తొంగి చూసిన ఆ తొలి కిరణపు రూపురేఖలే నేటి ఈ వృద్ధాప్యంలో కూడా కొనసాగడం మించిన ఆశ్చర్యం, ఆనందం ఇంకేముందని గర్వంగా చెప్పుకున్నారు.
“ఓ బడుగు జీవి తను కష్టపడి సాధించుకున్నది అది లేషమే ఔగాక, పోగొట్టుకుంటుంది. ఎంతమందినో కలుసుకుని, ఎవరూ కలిసిరాకపోయినా, పట్టుదల వదలక, చివరికి విజయం సాధిస్తుంది. అదీ ‘పొట్టి పిచిక కథ’ అదే నా విజయసూత్రం అవుతుందని ఆనాడనుకోలేదు! వెయ్యి పైగా రచనలు చేసి, ఈనాటికీ తల వంచక, కలం దించక తెలుగు కథకుడిగా కొనసాగుతున్న నాకు వేగుచుక్క ఆ కథే కదా! పక్షులతో జంతువులతో మనుషుల్ని కలిపి సామాజికాంశాల్ని సరళంగా చెప్పవచ్చునని నేను నేర్చుకున్నది. చందమామ పత్రిక చలవవల్లనే. ‘గణిత విశారద’ అనే నవల రాసింది చందమామ పఠన స్పూర్థి తోనే. సైజుతో పాటు చురుకుతునంలో కూడా నాటి పొట్టి పిచిక లక్షణాలు ఇప్పటికీ నాలో మిగిలి ఉన్నాయని నా మీద నేను వేసుకునే సోకైన జోకు! నా తొలి ప్రేమ ‘చందమామ.’ వాక్రూప వర్ణార్ణవం… ఈ నాటికీ కథాసుధల్ని వెదజల్లుతూ హాయిగా జీవించగలిగే నా మనోధృతికి నాటి ‘చందమామే’ మదురస్మృతి!”
చందమామ కథ ఇచ్చిన ఊపుతో తాను రాసిన సుప్రసిద్ధ పిల్లల రచనల్లో ‘కేటూ డూప్లికేటూ,’ ‘మేథమేట్రిక్స్,’ మూడు భాగాలూ, ‘ఆంగ్రేజీ మేడీజీ,’ ‘ఆంగ్రేజీ యమఈజీ’ వంటి అరడజను రచనలు భాగమని కూడా ఆయన ఘనంగా చెప్పుకున్నారు.
ఈ కథా పురుషుడి మాన్య ప్రశంసతో చందమామ జన్మ సార్థకమైంది. ‘ప్రపంచం ఎంతగా మారినా సరే.. చందమామ కథ మారకూడదు’ అంటూ ప్రపంచం నలుమూలలనుంచీ చందమామ వీరాభిమానులు ఒకే మాటగా ఉంటూ చందమామ దశను దిశను మార్చే ప్రయత్నం జరపినప్పుడల్లా ఉత్తరాలతో, ఈమెయిల్స్‌తో కొడుతున్న నేటి కాలంలో కూడా, ‘ఏ పత్రికకైనా సరే మార్పులు తప్పవు, కాలానుగుణంగా మార్పును అంగీకరించవలసిందే’ అంటూ స్వల్ప పరిచయంతోటే ఆత్మీయంగా ఫోన్లో నుడివిన పలుకులు మర్చిపోవడం ఎలా సాధ్యం? పత్రిక మనుగడకు సంబంధించి, యాజమాన్య దృష్టి కోణంలో మార్పు సహజం అంటూ సమస్యను రెండు వైపుల నుంచీ అర్థం చేసుకుంటూ ఆయన చందమామలో మార్పులను ఆమోదించిన తీరుతో బహుశా చందమామ వీరాభిమానులకు ఎవరికీ మింగుడు పడకపోవచ్చు కూడా.
చందమామతో మొదలై ముగిసిన ‘కథ’
అవసరాల రామకృష్ణారావు గారు చందమామ కథతో 1947లో తన సాహిత్య రచనా జీవితం మొదలెట్టారు. 65 ఏళ్లపాటు నిర్విరామంగా రచనలు చేస్తూ వచ్చారు. తను పాటించే నీతికి విరుద్ధమనిపించినప్పుడు ప్రచురణకు పంపకుండా ఎన్ని రచనలను ఆయన ఆముద్రితంగా ఉంచేశారో లెక్క తెలీదు కాని జీవిత పర్యంతం వెయ్యి రచనలపైగా చేసినట్లు ఆయనే చెప్పుకున్నారు. ఆయన రాసిన వాటిలో ‘సంపెంగలూ-సన్నజాజులూ’ నవల ఆయనకు మంచి పేరు తెచ్చింది.
ఈ జనవరి 27న హైదరాబాదులో దాసరి సుబ్రహ్మణ్యంగారి ప్రధమ వర్థంతి సందర్భంగా ఆయన చందమామేతర సీరియల్స్ ఆవిష్కరణ సందర్భంగా సిటీసెంట్రల్ లైబ్రరీ సమావేశమందిరంలో కలుసుకున్నప్పుడు మా అందరి ముందూ ఒక మెరుపు మెరిసినట్లయింది వందమంది దాకా చందమామ అభిమానులు, వీరాభిమానులు, చందమామ రచయితలు, పాఠకులు ఒక చోట చేరిన ఆ అరుదైన సన్నివేశంలో ఆయన 80 ఏళ్ల వయస్సులో కూడా ఎంత చలాకీగా కనిపించారో..
సైజుతో పాటు చురుకుతనంలో కూడా నాటి పొట్టి పిచిక లక్షణాలు ఇప్పటికీ మిగిలి ఉన్నాయని ఈయన తనమీద తను సోకైన జోక్ వేసుకుంటారట. అది అక్షరాలా నిజం. ఆయన రూపాన్ని చూసినా, ఫోన్లో మాట్లాడినా గలగలగలమనే పిచ్చిక కువకువలనే తలపించే మూర్తిమత్వం.
ఆ సమావేశంలో కుదురుగా మాట్లాడటం సాధ్యం కాకపోయినా తర్వాత ‘రచన’ సంపాదకులు శాయిగారు ఆయనతో మాట్లాడించినప్పుడు నాలో ఒక్కటే ఆలోచన. మన కళ్లముందు మిగిలి ఉన్న ఈ తొలి చందమామ అపురూప కథకుడి చందమామ జ్ఞాపకాలు ఎలాగైనా సంపాదిస్తే ఎంతబాగుంటుంది! ఆయన రాయగలరా, రాసి పంపగలరా, వయస్సు సహకరించగలదా..
కానీ, ఆయనతో మాట్లాడాక ఆ గలగలల శబ్దం ముందు ఈ సందేహాల ‘గలదా’లన్నీ పక్కకు పోయాయి.
ఆయన విశాఖపట్నం వెళ్లాక రెండు రోజుల్లోగా తమ చందమామ జ్ఞాపకాలు, బోనస్‌గా చిట్టి కథ కూడా రాసి శాయిగారికి పంపడం, ఆయన వాటిని స్కాన్ చేసి వెంటనే చందమామకు ఈ మెయిల్ చేయడం నిజంగా అదొక మధురానుభూతి.
1947 జూలైలోనే తొలి చందమామ అచ్చయింది కనుక దీన్ని పునస్కరించుకుని 2011 జూలై నెలలో ఈ మాన్యుడి పాత కథ -పొట్టిపిచిక కథ-, ‘చందమామ జ్ఞాపకాలు,’ బోనస్‌గా అందించిన మరో చిన్న కథ -విజయమాల-లను ఒకేసారి ప్రచురిస్తే బాగుంటుందన్న శాయిగారి ప్రతిపాదనను యాజమాన్యం వారికి చెప్పడం. వెంటనే అది ఆమోదించబడటం జరిగిపోయింది. ఒకే రచయితవి మూడు రచనలు ఒకేసారి ప్రచురించిన చరిత్ర ఇటీవలి చందమామ చరిత్రలో లేదు. ఆవిధంగా చందమామ తనను తాను గౌరవించుకున్నట్లే.
చందమామ 64వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన వేళ ఈ జూలై నెలలో పచ్చిన తన మూడు కథలు చూసుకుని ఆయన ఎంత మురిసిపోయారో! ఈ సందర్భంగా ఆయన గురించి చందమామలు బ్లాగులో ప్రచురించిన కథనాన్ని ఆయన ఎంతగా ఆస్వాదించారంటే అదే ఊపులో జూలైలోనే ఆయన ‘తాత చేతి నీతి కథలు’ శీర్షికతో రెండు కథలు రాసి పంపించారు. ఈ సందర్భంగా ఆయన నాకు పంపిన లేఖ కూడా ఎంత సాహితీ, రాజకీయ భరితమైన విరుపుతో ఉందో చూడండి.
రాజశేఖరా! రమ్యాక్షరా!
మీరు చేసిన అభ్యర్థనతో
అంతకు మించి
జూలై చందమామలో నన్ను
Re (cover) చేసిన పద్ధతిలోని
ఆత్మీయతకు ప్రతిస్పందించడంతో,
అన్నిటినీ మించి
బ్లాగులో బాగుబాగు అనిపించే నా పరిచయ ముఖచిత్రానికి మురియడంతో,
ఇందుతో మరి రెండు
నా కొత్త కథలు అందిస్తున్నాను.
వీటిని ప్రచురణకు అంగీకరించడంలో
మీకు గల సాధకబాధకాలు నాకు తెలీవు.
‘సంపాదకుడెవరైనా
చింపాంజీ కన్న నయము సిరిసిరిమువ్వా!’
అన్నాడు శ్రీశ్రీ మరెక్కడేం చూసో.
అదిష్టానం అరిష్టానికి కట్టుబడిన ఆంధ్రా
కాంగ్రెస్ మంత్రుల్లా అనేక పరిమితులు మీకు.
వరసగా రాసిపారేద్దామన్న దురాశతో
‘తాతచేతి నేతికతలు’ గా 1, 2 పంపించాను. మీరు అలా కాక వేరే వేరే రెండూ వేసి ఊరుకున్నా నేనేం అనుకోను. continue చేద్దాం అంటే 15 రోజుల్లో 3,4 పంపిస్తాను. ఒక్కొక్కటి రెండేసి అచ్చుపేజీలు (నా ‘విజయమాల’లా) వచ్చేలా plan చేసి రాశాను.
ఇవి అంది చదవగానే Phone చేస్తూ మీ అభిప్రాయం నిష్పక్షపాతంగా చెప్పండి. నాకేం వచ్చేకాలమా, పోయేకాలమా?
———–