పేరు (ఆంగ్లం) | Irrinki Narasimhamurthy |
పేరు (తెలుగు) | ఇఱ్ఱింకి నరసింహమూర్తి |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 01/01/1901 |
మరణం | – |
పుట్టిన ఊరు | పశ్చిమ గోదావరి జిల్లా తోలేరు గ్రామం |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | శతావధానము, చాటువులు, శ్రీమదాంధ్ర భాగవతము, మణిరత్నమాల, తేటగీత భగవద్గీత, మహాభారత యుద్ధము, తీర్థయాత్రాదర్శిని, ఆంధ్రపుష్పబాణవిలాసము, యదార్థ రామాయణము వేమగీతమ్ (సంస్కృతం), ప్రథమ సహస్రము, బాపూజీ సూక్తి రత్నావళి, మహాత్మాగాంధీ, ఆశ్రిత పారిజాత శతకము మొదలైనవి ఉన్నాయి |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | ఇఱ్ఱింకి నరసింహమూర్తి |
సంగ్రహ నమూనా రచన | – |
ఇఱ్ఱింకి నరసింహమూర్తి
ఈయన 1901లో పశ్చిమ గోదావరి జిల్లా తోలేరు గ్రామంలో జన్మించాడు. ఇతడు కూడా ఉభయభాషాప్రవీణ ఉత్తీర్ణుడై పశ్చిమ గోదావరి జిల్లాలలోని ఉన్నత పాఠశాలలో ఆంధ్రోపాధ్యాయునిగా పనిచేశాru.
వీరు చేసిన అవధానాలలో తోలేరులో చేసిన శతావధానము వివరాలు మాత్రమే లభ్యమౌతున్నాయి. ఈ అవధానములోని కొన్ని పూరణలు:
వర్ణన: నదిని స్త్రీతో పోల్చి పద్యం
పూరణ:
వేణి భరాభిరామ, యరవింద సముజ్వల నేత్ర, సైకత
శ్రోణియు, చక్రవాక కుచశోభిత, రాజ మరాళయానయై
ప్రాణవిభున్ తమిన్ గవయఁబాల్పడి యేగెడు కాంతకైవడిన్
రాణమెయిన్ స్రవంతి జలరాశిని గూడఁగ నేగుదెంచెడిన్
సమస్య: వక్త్రంబుల్ పది కన్నులైదు కరముల్ వర్ణింపగా వేయగున్
పూరణ:
ఈ క్త్రా ప్రాసముఁజెప్ప నద్భుతమొకో యేంతేనియున్, జూడుడీ
వాక్త్రాసంబుల జంకు వారమనుచున్ భావింపఁగా బోకుడీ
దిక్త్రారాతికిఁబార్వతీ శివులకున్ తిగ్మ ప్రభారాశికిన్
వక్త్రంబుల్ పది కన్నులైదు కరముల్ వర్ణింపగా వేయగున్
సమస్య: మలము దినుము నీదు నోటి మలినము పోవున్
పూరణ:
చలువ కపురంపు పలుకులు
జలుబు మలపు జాజికాయ జాపత్రులు వ
క్కలు యేలకులం గూడు, త
మలము దినుము నీదు నోటి మలినము పోవున్
———–