డా. కండ్లకుంట అళహ సింగరాచార్యులు (Dr. Kandlakunta Alaha Singaracharyulu)

Share
పేరు (ఆంగ్లం)Dr. Kandlakunta Alaha Singaracharyulu
పేరు (తెలుగు)డా. కండ్లకుంట అళహ సింగరాచార్యులు
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరుజ్వాలానరసింహాచార్యులు
జీవిత భాగస్వామి పేరురంగనాయకమ్మ
పుట్టినతేదీ1930, జూన్ 8
మరణం2023, ఆగస్టు 13
పుట్టిన ఊరుభక్తలాపురం, పెన్‌పహాడ్‌ మండలం, సూర్యాపేట జిల్లా, తెలంగాణ
విద్యార్హతలుఎం.ఏ., బీఈడీ, పి.హెచ్ డి.
వృత్తివిశ్రాంత అధ్యాపకుడు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుసంస్కృత క్రియలు’, ‘సంస్కృత పాఠవల్లరి’
ఇతర రచనలుకూర్మ మహా పురాణం, శుక్రనీతి సారము, భాసుని కర్ణాభారం, విదుర నీతి, స్వప్నవాసవ దత్త రూపకం
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికడా. కండ్లకుంట అళహ సింగరాచార్యులు
సంగ్రహ నమూనా రచన

డా. కండ్లకుంట అళహ సింగరాచార్యులు

సింగరాచార్యులు 1930, జూన్ 8న తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా, పెన్‌పహాడ్‌ మండలం, భక్తలాపురం గ్రామంలోని శ్రీవైష్ణవ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఇతనికి సాలగ్రామ నరసింహులు అని పేరు పెట్టినా, అళహ సింగరాచార్యులు అనే పేరు ప్రచారంలోకి వచ్చి, రికార్డుల్లోనూ నమోదై, స్థిరపడిపోయింది. తండ్రి పేరు జ్వాలానరసింహాచార్యులు.

వీధి బడిలో తెలుగులో పెద్దబాలశిక్ష చదువుకొని, లెక్కలు, ఉర్దూ అభ్యసించాడు. ఆ తరువాత యాదగిరిగుట్ట దేవస్థాన సంస్కృత పాఠశాలలోనూ, హైదరాబాదు నగరంలోని సీతారాంబాగ్‌ వేదాంత వర్థిని సంస్కృత కళాశాలలో మహాభాష్యం వరకు సంస్కృతాధ్యయనం చేశాడు. ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి విద్యా ప్రవీణ, 1955లో ఉస్మానియా విశ్వవిద్యాయలం నుండి బీవోఎల్‌ (బాచెలర్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజెస్) పూర్తిచేశాడు. ఆ రెండు పరీక్షలోనూ సింగరాచార్యులు ఒక్కడే ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులయ్యాడు. ఉద్యోగం చేస్తున్న సమయంలో బీఏ ఇంగ్లిష్‌, ఎంఏ తెలుగు, బీఈడీ చదివాడు. 1978లో నలభైఎనిమిదేళ్ళ వయసులో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు పి.హెచ్.డీ అభ్యర్థిగా చేరి, ‘ఆంధ్ర మహాభారతంలో కృతద్ధిత ప్రయోగాల విశ్లేషణ సిద్ధాంత గ్రంథాలు’ అనే అంశంపై పరిశోధన చేసి, 1985లో పీహెచ్‌డీ పట్టా పొందాడు.

———–

You may also like...