పేరు (ఆంగ్లం) | Modukuri Johnson |
పేరు (తెలుగు) | మోదుకూరి జాన్సన్ |
కలం పేరు | – |
తల్లిపేరు | రత్తమ్మ |
తండ్రి పేరు | మోదుకూరి గరువయ్య |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 08/08/1936 |
మరణం | 12/24/1988 |
పుట్టిన ఊరు | కొలకలూరు గ్రామం, గుంటూరు జిల్లా |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | కరుణామయుడు (1978), ఇంద్రధనుస్సు (1978), మానవుడు – దానవుడు (1972), విచిత్ర దాంపత్యం (1971), , డబ్బుకు లోకం దాసోహం (1973), ఆంధ్ర కేసరి, దేశోద్ధారకులు మొదలైన సినిమాలకు సంభాషణలు రాశారు |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | మోదుకూరి జాన్సన్ |
సంగ్రహ నమూనా రచన | – |
మోదుకూరి జాన్సన్
జాన్సన్ చిరస్మరణీయుడు
– ‘చెరగని జ్ఞాపకం’ పుస్తకావిష్కరణలో కృష్ణ
‘తెలుగు సినీ రంగంలో రచయితగా మోదుకూరి జన్సర్ చెరగని ముద్ర వేశార’ని నటుడు కృష్ణ అన్నారు. ‘మరో ప్రపంచం’, ‘మానవుడు – దానవుడు’, ‘డబ్బుకులోకం దాసోహం’, ‘దేశోద్ధారకులు’, ‘బంగారుభూమి’, ‘కరుణామయుడు’, ‘దేవాలయం’, ‘నేటి భారతం’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలకు మాటలను, ‘మన జన్మభూమి… బంగారు భూమి'(పాడి పంటలు), ‘కదిలింది కరుణ రథం..'(కరుణామయుడు) వంటి పాటలను రచించిన సినీ రచయిత మోదుకూరి జాన్సన్ జీవిత విశేషాలపై ‘చెరగని జ్ఞాపకం’ పేరుతో తెనాలికి చెందిన న్యాయవాది, రచయిత గుంటూరు కృష్ణ రూపొందించిన పుస్తకాన్ని కృష్ణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం పద్మాలయ కార్యాలయంలో జరిగింది.
ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ, ‘జాన్సన్ తెనాలి సమీపంలోని కొలకలూరులో 1934లో జన్మించారు. 1970లో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో అక్కినేని హీరోగా నటించిన ‘మరో ప్రపంచం’ సినిమా ద్వారా రచయితగా పరిచయం అయ్యారు. దాదాపు 50 సినిమాలకుపైగా మాటలు సమకూర్చారు. మాటలతో పాటు శ్రీ శ్రీ, దాసరథి, ఆరుద్ర వంటి ప్రముఖుల సరసన కొన్ని చిత్రాలకు పాటలను కూడా రాశారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, విజయచందర్ చిత్రాలకు రచయితగా పనిచేశారు. పి.సి.రెడ్డి, టి.కృష్ణ, విజయనిర్మల కె.బాపయ్య దర్శకత్వంలో వచ్చిన సినిమాలకు, సురేష్ ప్రొడక్షన్స్, పద్మాలయ పిక్చర్స్, ఉషా శ్రీ పిక్చర్స్ సంస్థలు నిర్మించిన పలు చిత్రాలకు రచయితగా పనిచేసి తెలుగు సినీ ప్రపంచంలో ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. 1988 డిసెంబర్ 24న ఆయన మరణించారు. చనిపోయి 30ఏండ్లు అవుతున్నా నేటికీ జాన్సన్ మాటలు, పాటల ద్వారా చిరస్మరణీయుడుగానే ఉన్నారు. జాన్సన్‌పై పుస్తకాన్ని రాసిన గుంటూరు కృష్ణకు నా అభినందనలు’ అని అన్నారు. ‘సూపర్ స్టార్ కృష్ణ చేతుల మీదుగా ఈ పుస్తకం ఆవిష్కరించబడటం చాలా ఆనందంగా ఉంది’ అని రచయిత కృష్ణ చెప్పారు.
తెలుగునాట సంచలనం సృష్టించిన సినిమా ‘కరుణామయుడు’. ఇందులో మోదుకూరి జాన్సన్ రాసిన కదిలింది కరుణరథం… అనే పల్లవితో సాగే పాట ఈ చిత్రానికే తలమానికం. ‘మనుషులు చేసిన పాపం
మమతల భుజాన ఒరిగింది
పరిశుద్ధాత్మతో పండిన గర్భం
వరపుత్రునికై వగచింది వగచింది’
అంటూ సాగిన మొదటి చరణంలో మానవాళి దుఃఖాన్ని తన భుజాలపై మోయడానికి ఏ పాపం, నేరం చేయకుండానే ఆనాటి పూజారి వ్యవస్థ వేసిన నిందల బారిన పడి, శిక్షవేయబడి శిలువనెత్తిన మహానుభావుడి త్యాగానికి సంబంధించిన సర్వస్వాన్ని అద్భుతంగా ఆవిష్కరించాడు కవి.
‘పరమ వైద్యునిగ పారాడిన పవిత్ర పాదాలు నెత్తురు ముద్దగ మారాయి.
అభిషిక్తుని రక్తాభిషేకంతో ధరణి ధరించి ముద్దాడింది.
శిలువను తాకిన కల్వరి రాళ్లు కలవరపడి కలవరపడి కలవరపడి
అరిచాయి అరిచాయి’ మూగ జీవులైన గొర్రెలకు ప్రేమ అనే పచ్చికను పంచాడు ప్రభువు.
అంతటి కరుణామయుడైన ఆయన దారుణ హింసకు గురయ్యాడు. అది చూసి గొర్రెలన్నీ మూగగా రోదించాయి. ఎంతో పవిత్రమైన ఆయన పాదాలు నెత్తురు ముద్దగా మారిపోయాయి. ఆయన చేతిలోని శిలువను తాకిన రాళ్లు సైతం బాధతో కలవరపడ్డాయి. అవి అరుస్తుంటే, ఆ అరుపులు ప్రతిధ్వనిస్తున్నాయి అనే చెప్పేలా అరిచాయి అరిచాయి అని కవి రచించడంతో ఈ కవి స్వయంగా కరుణామయుడిలా అనిపిస్తాడు.
ఈ పాటలోని ఉపమానాలు ‘పరిశుద్ధాత్మతో పండిన గర్భం వరపుత్రునికై వగచింది…’ అనే పోలికతో పాటు ‘పంచిన రొట్టెలు రాళ్లయినాయి’ అనడం, స్వార్థపరులను ‘ముళ్ల కిరీటం’తో, ఆర్తులను ‘రుధిరం’తో పోల్చడం ప్రేమ పంచిన మహావ్యక్తిని దారుణహింసలకు గురి చేసిన విషయాన్ని శిలువను మోస్తూ మరుభూమికేగిన పాదాలు రక్తపు ముద్దగా మారాయన్నటు వంటి అనేక పోలికలతో ఆ పాటను పరిపుష్టం చేశారు మోదుకూరి జాన్సన్.
———–