జాస్తి వెంకట నరసింహారావు (Jasti Venkata Narasimharao)

Share
పేరు (ఆంగ్లం)Jasti Venkata Narasimharao
పేరు (తెలుగు)జాస్తి వెంకట నరసింహారావు
కలం పేరు
తల్లిపేరునరసమ్మ
తండ్రి పేరురామస్వామి
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ07/01/1909
మరణం
పుట్టిన ఊరుఅమృతలూరు మండలం పెదపూడి
విద్యార్హతలు
వృత్తితెలుగు ఉపాధ్యాయులు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుశ్రాద్ధ నిర్ణయాలు, జీవాత్మ వైదిక సంద్యారహస్యం, దయా నంద హృదయము, సూర్యాది గోళములయందు జీవరాశి, గీత కాల్పనిక గ్రంథము, మృత్యురహస్యం, దాంపత్య సుఖం
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికజాస్తి వెంకట నరసింహారావు
సంగ్రహ నమూనా రచన

జాస్తి వెంకట నరసింహారావు

ఆయన అమృతలూరు మండలం పెదపూడిలో నరసమ్మ, రామస్వామి దంపతులకు 1909 జులై 1 న జన్మించారు. పండితరావు పేరుతో ఎన్నో గ్రంథాలను రచించిన నరసింహారావు అనంతర కాలంలో స్వామి శాంతానంద సరస్వతి దీక్షానామాన్ని స్వీకరించారు. అమృతలూరు, చిట్టి గూడూరు సంస్కృత పాఠశాలలో విద్యాభ్యాసం చేసి ఉభయ భాషా ప్రవీణ పట్టాను స్వీకరించారు. 1836 నుంచి పెదనందిపాడు, చీరాల, కొలూరు ఉన్నత పారశాలలో తెలుగు ఉపాధ్యాయులుగా సుదీర్ఘకాలం వనిచేశారు. 1949లో కృష్ణానదికి వరదలు వచ్చి లంక గ్రామాలు మునిగి పోగా ప్రజలకు కొలూరులో సహాయ శిబిరాలను ఏర్పాటు చేశారు. ప్రతి రోజూ వెయ్యిమందికి 12 రోజులు భోజన వసతి ఏర్పాటు చేయడంలో గ్రామస్తులను చైతన్యవంతం చేసిన విధానాన్ని అప్పటి ప్రజలు కథలుగా చెప్పకుంటారు. తెనాలి కవిరాజా పబ్లిషర్స్ కు వెన్నుముకగా ఉండి ఎన్నో గ్రంథాలను ముద్రించడంలో కీలకపాత్ర పోషించారు. 1952లో తెనాలిలో మనోరమ పబ్లిషర్స్ సంస్థను స్థాపించి పాఠశాల పాఠ్యగ్రంధాలను ముద్రించారు. పెదపూడిలో స్థాపించిన పాఠశాలను ఆదర్శవంతంగా నిర్వహించారు. ఆధ్యాత్మిక జీవిత్నాన్ని గడిపిన జాస్తి వేదాంతంపై ఎన్నో గ్రంథాలను రచించారు. శ్రాద్ధ నిర్ణయాలు, జీవాత్మ వైదిక సంద్యారహస్యం, దయా నంద హృదయము, సూర్యాది గోళములయందు జీవరాశి, గీత కాల్పనిక గ్రంథము, మృత్యురహస్యం, దాంపత్య సుఖం, దాతు మీమాంస, పూర్వ జన్మ పరజన్మ మరణానంతరం జీవని స్థితి, మూర్తి హజీ సమీక్ష ఆధ్యాత్మిక విద్య వంటి గ్రంథాలను సామాన్యులకు సైతం అర్ధమయ్యే సులభ శైలిలో రచించారు.

———–

You may also like...