పేరు (ఆంగ్లం) | Rambhatla Lakshminarayana Sastry |
పేరు (తెలుగు) | రాంభొట్ల లక్ష్మీనారాయణ శాస్త్రి |
కలం పేరు | – |
తల్లిపేరు | సోదెమ్మ |
తండ్రి పేరు | ముఖలింగేశ్వరుడు |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 12/09/1908 |
మరణం | 11/19/1995 |
పుట్టిన ఊరు | పాలకొండ మండలంలోని గుడివాడ అగ్రహారం |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | అనర్ఘ రాఘవం, అభిజ్ఞాన శాకుంతలం, మేఘ సందేశం, విక్రమోర్వశీయం, మాళవికాగ్ని మిత్రం, రఘువంశ రత్నాలు, కాశీ శతకం, రామచంద్ర శతకం |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | రాంభొట్ల లక్ష్మీనారాయణ శాస్త్రి |
సంగ్రహ నమూనా రచన | – |
రాంభొట్ల లక్ష్మీనారాయణ శాస్త్రి
ఈయన పాలకొండ మండలంలోని గుడివాడ అగ్రహారంలో ముఖలింగేశ్వరుడు మరియు సోదెమ్మ దంపతులకు జన్మించాడు. చిన్నతనంలోనే తండ్రి వద్ద రామాయణ, భారత, భాగవతాలను విని తెలుసుకున్నాడు. 13వ ఏట తండ్రి మరణించగా శ్రీహరిపురం లో కొంతకాలం అధ్యాపకునిగా పనిచేశాడు.
గొల్లాది లో గన్నవరపు అబ్బన్నశాస్త్రి వద్ద చేరి కాళిదాస త్రయాన్ని, కావ్య నాటకాలను 18 నెలలలో పూర్తిచేశాడు. తర్వాత విజయనగరం లోని సంస్కృత కళాశాలలో విద్యార్ధిగా చేరాడు. తాతా సుబ్బరాయశాస్త్రి, నౌడూరు వేంకటశాస్త్రి, పేరి వేంకటేశ్వరశాస్త్రి, అప్పల్ల జోగన్నశాస్త్రి, కొంపెల్ల విశ్వనాథశాస్త్రి తదితరుల వద్ద వ్యాకరణం నేర్చుకున్నాడు. గంటి సూర్యనారాయణ దగ్గర మీమాంసాదులను, పరవస్తు రామానుజాచార్యులు వద్ద ఋగ్వేదం, భాషాశాస్త్రం, ఉపనిషత్తులను నేర్చుకున్నాడు.
1929 లో పార్వతీపురం పాఠశాలలో సంస్కృత పండిత పదవిని చేపట్టాడు. 1940 లో టెక్కలి పాఠశాలలో తెలుగు పండితునిగా చేరాడు. 1951 లో విశాఖపట్నం లోని ఎ.వి.ఎన్. కళాశాలలో పండిత పదవికి ఎంపికయ్యాడు. ఆంధ్ర విశ్వకళా పరిషత్ లో ఆంధ్ర పండిత పదోన్నతిని పొంది మూడు సంవత్సరాలు సేవలందించాడు.
పదవీ విరమణ చేసిన తర్వాత విశాఖపట్నంలో స్థిరపడ్డాడు, 1950 లో దివ్యజ్ఞాన సమాజం లో భగవద్గీత ప్రవచనం ప్రారంభించాడు.1969 నుండి 1975 వరకు ద్వారకానగర్ లోని శంకరమఠంలో రామాయణ, భారత, భాగవతాలను నిరాఘాటంగా ప్రవచించాడు. తర్వాత 1975 నుండి రెండు దశాబ్దాలు మధురానగర్ లో రామాయణాది పురాణాలే కాకుండా శ్రీ సీతారామాంజనేయ సంవాదం, ఉత్తర రామచరిత్ర, భాస్కర రామాయణం, వివేక చూడామణి మొదలైన గ్రంథాల సారాన్ని కూడా అందరికి ప్రవచనాల రూపంగా అందించాడు.
ఈయన అనర్ఘ రాఘవం, అభిజ్ఞాన శాకుంతలం, మేఘ సందేశం, విక్రమోర్వశీయం, మాళవికాగ్ని మిత్రం, రఘువంశ రత్నాలు, కాశీ శతకం, రామచంద్ర శతకం మొదలైన సంస్కృత కావ్యాలను ఆంధ్రీకరించాడు. ప్రతీకారం పేరుతో సంస్కృత నాటకం రచించాడు.
———–