పేరు (ఆంగ్లం) | Kappagantula Lakshmana Sastry |
పేరు (తెలుగు) | కప్పగంతుల లక్ష్మణశాస్త్రి |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 07/02/1911 |
మరణం | 01/10/1980 |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | స్తోత్ర లహరి, మహాభారతము (అనువాదం), సూర్యోపరాగ దర్పణం, విక్రమాంకదేవ చరితము, తెలుగు లిపి సంస్కరణ, లక్ష్మణరేఖలు ఆంధ్ర సంస్కృతకోశము (పుల్లెల శ్రీరామచంద్రుడుతో కలిసి) |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | మహామహోపాధ్యాయ, ఆంధ్రబిల్హణ, సుధీంద్రమౌళి, బ్రహ్మభూషణ |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | కప్పగంతుల లక్ష్మణశాస్త్రి |
సంగ్రహ నమూనా రచన | – |
కప్పగంతుల లక్ష్మణశాస్త్రి
కప్పగంతుల లక్ష్మణశాస్త్రి అష్టభాషాకోవిదుడు. ఉద్దండ పండితుడు. ఇతడు మహబూబ్నగర్ జిల్లా, వనపర్తిలో 1911, జూలై 2 వ తేదీన శ్రీనివాస శాస్త్రి, పద్మావతి దంపతులకు జన్మించాడు. ఇతడు కర్నూలు, తిరుపతి, మద్రాసులలో విద్యాభ్యాసం చేసి వనపర్తిలో ఉపాధ్యాయుడిగా జీవితం ప్రారంభించాడు. ఇతని పాండిత్యాన్ని గుర్తించిన అప్పటి హైదరాబాదు రాష్ట్రముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ఇతడిని హైదరాబాదులోని సిటీ కాలేజి లో ఉపన్యాసకుడిగా నియమించాడు. తర్వాత హైదరాబాదు ప్రభుత్వ సమాచారశాఖలో అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాడు. పిమ్మట ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో డిప్యూటీ డైరెక్టర్ అయ్యాడు. హైదరాబాదు టుడే, ఆంధ్ర ప్రదేశ్ మొదలైన ప్రభుత్వ పత్రికలకు సంపాదకుడుగా ఉన్నాడు. ఇతని శిష్యులలో ప్రముఖులు పి.వి.నరసింహారావు, బూర్గుల రామకృష్ణారావు, రవ్వా శ్రీహరి మొదలైనవారు. ఇతడు తర్క, మీమాంస శాస్త్రాలలో అగ్రగణ్యుడు. ఇతడు 1980లో జనవరి 10 వ తేదీన మరణించాడు.
పదవులు
కాశీ సంస్కృత విశ్వవిద్యాలయం, ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయాల బోర్డ్ ఆఫ్ స్టడీస్ లో సభ్యుడుగా సేవలందించాడు.
సురభారతి వ్యవస్థాపక అధ్యక్షుడు .
ఆంధ్ర సారస్వత పరిషత్తు స్థాపక సభ్యుడు.
తిరువాన్కూర్, గ్వాలియర్ జగద్గురు శంకరాచార్యుల వారి చేత ఘనంగా సత్కరింప బడ్డాడు.
విద్యామంత్రి మండలి వెంకటకృష్ణారావు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జలగం వెంగళరావు నిర్వహణలో జరిగిన ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలో ఇతడు ప్రత్యేకంగా సన్మానం అందుకొన్నాడు.
సార్వభౌమ సంస్కృత ప్రచార కార్యాలయము నకు అధ్యక్షుడుగా వ్యవహరించాడు.
కాశీ సంపూర్ణానంద సంస్కృత విశ్వ విద్యాలయం ఎమిరిటస్ ప్రొఫెసర్ గా (సమ్మాన్య ప్రాచ్యాచార్యులు) గా ఉన్నాడు.
———–