కోగంటి రాధాకృష్ణమూర్తి (Koganti Radhakrishnamurthy)

Share
పేరు (ఆంగ్లం)Koganti Radhakrishna Murthy
పేరు (తెలుగు)కోగంటి రాధాకృష్ణమూర్తి
కలం పేరు
తల్లిపేరు 
తండ్రి పేరు 
జీవిత భాగస్వామి పేరు 
పుట్టినతేదీ09/18/1914
మరణం01/03/1987
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుఇండియాలో విప్లవం 1943, ఎం.ఎన్.రాయ్ జీవితం-సిద్ధాంతం 1978, మార్క్సిజం-రాడికలిజం 1997, ఇండియా భవిష్యత్తు, మల్లెపూలు (కథాసంపుటి),
గాంధీమార్గం
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికKoganti Radhakrishna Murthy
సంగ్రహ నమూనా రచన

కోగంటి రాధాకృష్ణమూర్తి

కోగంటి రాధాకృష్ణమూర్తి ప్రముఖ రచయిత, సంపాదకుడు, హేతువాది. తెనాలి నుంచి నలంద ప్రచురణల సంస్థను నడిపారు. ఈయన అనువదించిన ఎం.ఎన్.రాయ్ వ్యాసాలు ఒక హేతువాద వాచకం అంటారు. రాడికల్‌ హ్యూమనిస్టు.ఏ ఇజాన్నీ హీనంగా నిరసించడటం తన అభిమతం కాదు. ఏ సిద్ధాంతానికీ సమగ్రత ఆపాదించరాదనీ, ప్రతి సిద్ధాంతంలోని మంచిని స్వీకరిస్తూ ముందుకు సాగటమే వివేకవంతుల లక్షణమని ఆయన భావన.
కోగంటి రాధాకృష్ణమూర్తి గుంటూరు జిల్లా, తెనాలి ప్రాంతపు కూచిపూడి (అమృతలూరు) గ్రామంలో 1914, సెప్టెంబర్ 18 న జన్మించారు. గుంటూరు ఏసీ కళాశాలలో బి.ఏ. పట్టభ్రదులైన కోగంటి వారు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి ‘విశారద’, ‘ప్రచారక’ చదివి ఉత్తీర్ణులయ్యారు. విద్యార్థిదశలో భారత జాతీయ కాంగ్రెస్‌ కార్యకర్తగా ఉండి పలు కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. గోపీచంద్‌, జి.వి.కృష్ణారావు, ఆవుల గోపాలకృష్ణమూర్తి వంటి వారితో స్నేహం. త్రిపురనేని రామస్వామి భావాల ప్రభావం ఆయన మీద ఎక్కువ.1937 నుంచి మానవేంద్రనాథ్‌రాయ్‌ భావాలతో ఉత్తేజం పొందారు. 1940లో రాయ్‌ స్థాపించిన రాడికల్‌ డెమోక్రటిక్‌ పార్టీలో చేరారు. 1941లో ఆంధ్ర రాష్ట్రంలో రాడికల్‌ డెమోక్రటిక్‌ పార్టీని తెనాలిలో స్థాపించారు. 1946లో జరిగిన సార్వత్రక ఎన్నికలలో ఆ పార్టీ తరఫున తెనాలి నియోజకవర్గం నుంచి పోటీచేశారు. పార్టీ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి పనికిరావనే ఉద్దేశంతో 1948లో రాడికల్‌ డెమోక్రటిక్‌ పార్టీని రాయ్‌ రద్దు చేశారు. రాడికల్‌ హ్యూమనిస్టు ఉద్యమాన్ని ప్రారంభించారు.విహారి, రాడికల్‌, సమీక్ష వంటి పత్రికలకు సంపాదకత్వం వహించారు.
1945 నుంచి 1969 వరకు నలందా ప్రెస్‌, నలందా పబ్లిషర్స్‌ ప్రజాపరిషత్తు వంటి సంస్థలు నడిపారు. ఎం.వి.రామమూర్తి అధ్యక్షతన 1977లో ఏర్పడిన ప్రజాస్వామ్య ప్రచురణల సంస్థ తరఫున ప్రథమ ప్రచురణగా రాధాకృష్ణమూర్తి ఉద్గ్రంథం ‘ఎం.ఎన్‌.రాయ్‌ జీవితం-సిద్ధాంతం’ వెలువడింది. రాయ్‌ జీవితాన్ని 47 అధ్యాయాలలో, 432 పేజీలలో చక్కగా వివరించారు. ఇండియాలో విప్లవం, ఇండియా భవిష్యత్తు, మార్క్సిజం-రాడికలిజం, మల్లెపూలు (కథాసంపుటి), గాంధీమార్గం, మార్క్సిజం-కమ్యూనిజం-చరిత్ర నేర్పిన గుణపాఠం మొదలైనవి ఆయన రచనలు. ప్రపంచ రికార్డులు, ప్రపంచ నాటికలు, న్యాయాన్యాయాలు, రాయ్‌ వ్యాసాలు, జవహర్‌లాల్‌ నెహ్రూ, నూతన రాజ్యాంగ చట్టం మొదలైనవి ఆయన అనువాద రచనలు. భారత స్వాతంత్య్ర పోరాటానికి ఉత్తేజాన్ని, భావోద్వేగాన్ని కలిగించడంలో దోహదపడినంతగా గాంధీ నిర్మాణాత్మకమైన వ్యవస్థలను రూపొందించడంలో సఫలుడు కాలేకపోయాడన్నారు.

———–

You may also like...