పేరు (ఆంగ్లం) | Guttikonda Narahari |
పేరు (తెలుగు) | గుత్తికొండ నరహరి |
కలం పేరు | – |
తల్లిపేరు | రాఘవమ్మ |
తండ్రి పేరు | ఆంజనేయులు |
జీవిత భాగస్వామి పేరు | సరోజిని |
పుట్టినతేదీ | 08/10/1918 |
మరణం | 03/27/1985 |
పుట్టిన ఊరు | యలవర్రు గ్రామం, అమృతలూరు మండలం |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | ములుకోల, ప్రజామిత్ర, సమీక్ష పత్రికలలో వ్యాసాలు వ్రాసారు. |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | గుత్తికొండ నరహరి |
సంగ్రహ నమూనా రచన | – |
గుత్తికొండ నరహరి
గుత్తికొండ నరహరి (ఆగష్టు 10, 1918 – మార్చి 27, 1985) రచయిత, సంపాదకులు, తెలుగు రాజకీయరంగంలో అసమాన వక్త, రాజకీయ విశ్లేషకుడు.
తెలుగు రాజకీయ రంగంలో అసమాన వక్తగా, రాజకీయ విశ్లేషకుడుగా రాణించిన గుత్తికొండ నరహరి ఆగస్టు 10, 1918 న ఆంజనేయులు, రాఘవమ్మ దంపతులకు యలవర్రు గ్రామం, అమృతలూరు మండలం (గుంటూరు జిల్లా) లో పుట్టాడు. ఈ గ్రామం ప్రసిద్ధులకు కాణాచి. సుప్రసిద్ధ శాస్త్రవేత్త యలవర్తి నాయుడమ్మ అక్కడివాడే. సమీపంలో వున్న తురుమెళ్ళ పాఠశాలలో చదువుకున్నాడు. యలవర్తి రోశయ్య, మల్లంపాటి మధుసూదన ప్రసాద్ తన సహాధ్యాయులు. కాలేజీలో చేరకుండానే బర్మా లోని రంగూన్ వెళ్ళి రెండేళ్ళు పత్రికా విలేఖరిగా పనిచేసి, తిరిగి వచ్చి గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో బి.ఎ. పూర్తి గావించాడు. మద్రాస్‌లో న్యాయశాస్త్రములో చేరి మధ్యలోనే స్వస్తిపలికి, ఎం.ఎన్.రాయ్ ప్రభావంలో నవ్య మానవవాద రాష్ట్ర పార్టీ కార్యదర్శి అయ్యాడు. 1944 లో గూడవల్లి లో, మేనమామ కూతురు సరోజినితో పెళ్ళి అయింది. ఈ వివాహం లౌకిక (Secular way) పద్ధతిలో జరిగి, నమోదు చేయబడింది.
1946 ఎన్నికలలో నరహరి యువత నుద్దేశించి పదవులకు రాజీనామాలు చేయమని, స్వాతంత్ర్యం రానున్నందున త్యాగం చేస్తే తరువాత ఉన్నత పదవులు వస్తాయని బోధ చేశాడు. రాడికల్ రాజకీయాలలో అటు కమ్మూనిస్ట్ లను, ఇటు కాంగ్రెస్ వారిని ఎదురుకొని, తన ధారాళ ఉపన్యాసాలతో జనాన్ని ఆకట్టుకున్నాడు. ములుకోల, ప్రజామిత్ర, సమీక్ష పత్రికలలో వ్యాసాలు వ్రాసాడు. విహారి, ఆంధ్రా లేబరు పత్రికల సంపాదకత్వం వహించాడు. రాజకీయ పాఠశాలలో ఎందరినో సుశిక్షితులను గావించాడు. గోపీచంద్, ఆవుల గోపాలకృష్ణమూర్తి, ఎం.వి.రామమూర్తి, కోగంటి రాధాకృష్ణమూర్తి, పి.వి.సుబ్బారావు, రావిపూడి వెంకటాద్రి, ఎన్.వి.బ్రహ్మం లతో నవ్య మానవ వాద ఉద్యమంలో పనిచేశాడు. ఎ.సి.కాలేజి ప్రిన్సిపాల్ టి.ఎస్.పాలస్ కు దగ్గర మిత్రుడు. కొన్నాళ్ళు ఆచార్య రంగాతో పనిచేశాడు. 1972లో క్షాత్ర ధర్మ పరిషత్ అనే రాజకీయ పార్టీ పెట్టి, లోక్ సభకు పోటీ చేశాడు. అసంపూర్తిగా వదిలేసిన లాను పూర్తి చేసి, 1974 లో, హైదరాబాదులో ప్రాక్టీస్ చేసాడు.
———–