చెలమచెర్ల రంగాచార్యులు (Chelamacherla Rangacharyulu)

Share
పేరు (ఆంగ్లం)Chelamacherla Rangacharyulu
పేరు (తెలుగు)చెలమచెర్ల రంగాచార్యులు
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ01/08/1912
మరణం01/01/1972
పుట్టిన ఊరుకృష్ణా జిల్లాలోని మోటూరు గ్రామం
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలువిశ్వనాథులు సంస్కృతంలో రచించిన ప్రతాపరుద్ర యశోభూషణం అనే అలంకార శాస్త్ర గ్రంథాన్ని 1944లొ తెలుగులోకి అనువదించారు.
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికచెలమచెర్ల రంగాచార్యులు
సంగ్రహ నమూనా రచన

చెలమచెర్ల రంగాచార్యులు

చెలమచెర్ల రంగాచార్యులు సుప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితులు, అధ్యాపకులు, రచయిత.
వీరు 1912 జనవరి 8వ తేదీన కృష్ణా జిల్లాలోని మోటూరు గ్రామంలో జన్మించారు.
వీరు తిరుపతిలోని చింతలపాటి వెంకటశాస్త్రి, సేతు మాధవశాస్త్రి వద్ద సంస్కృతం, వెల్లాల శంకరశాస్త్రి గారి వద్ద వ్యాకరణాన్ని అధ్యయనం చేశారు. అక్కడే విద్వాన్, శిరోమణి పట్టాలు పొందారు.
వీరు సికింద్రాబాదులోని మహబూబు కళాశాలలోను, నారాయణగూడ బాలికోన్నత పాఠశాలలోను అధ్యాపకులుగా పనిచేశారు. తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయం గ్రంథాలయంలొ తాళపత్రగ్రంథాలను సంపాదించే ఉద్యోగిగా చేరారు. ఐదేళ్ల తర్వాత అక్కడే పండిత పదవిలో నియమితులయ్యారు. 1957లో అక్కడి ఆర్ట్స్ కళాశాలలో ఉపన్యాసకులుగా చేరి, అక్కడే ఉద్యోగ విరమణ చేసారు.
వీరు విశ్వనాథులు సంస్కృతంలో రచించిన ప్రతాపరుద్ర యశోభూషణం అనే అలంకార శాస్త్ర గ్రంథాన్ని 1944లొ తెలుగులోకి అనువదించారు. దీనికోసం వీరు అప్పటివరకు వెలువడిన అనేక వ్యాఖ్యానాలను పరిశీలించి ప్రామాణికంగా తెలుగు అనువాదాన్ని రూపొందించారు. అందువలననే ఇప్పటివరకు ఈ గ్రంథం విశ్వవిద్యాలయ పరీక్షలకు పాఠ్యగ్రంథంగా మన్నన పొందించి. అలంకార వసంతము అనే వేరొక లక్షణ గ్రంథాన్ని కూడా వీరు రచించగా గోపాలపేట సంస్థానాధీశులు ముద్రణ వేయించారు. ఇది ‘ విశ్వమతనామ గోపాలపేట రామ ‘ అనే మకుటం గల పద్యాలతో అర్థ శబ్దాలంకారాలు గురించి వివరించే గ్రంథం.
స్వతంత్ర కృతులు కూడా కొన్నింటిని వీరు రచించారు. వాటిలో హాలికుడు అనే నాటకం ప్రముఖమైనది. ఈ నాటకం పలుమార్లు ప్రదర్శించబడడమే కాక అనేక పరీక్షలకు పాఠ్యగ్రంథంగా కూడా ఉన్నది. సోమాద్రి విజయము అనే పద్యకావ్యాన్ని కూడా వీరు రచించారు. గద్వాల సంస్థాన చరిత్రలోని ఒక ఇతివృత్తం దీని కథావస్తువు. మహాభారతంలోని మంచి కథలను భారత కథావళి అనే గ్రంథాన్ని వీరు ప్రచురించారు. కాళిదాసు జీవితం, కవితాతత్వాన్ని గురించి కాళిదాసు కవ్యాద్యానము అనే గ్రంథాన్ని వీరు రచించారు. ఆంధ్ర శబ్దరత్నాకరము అనే నిఘంటువును ఒక వినూత్న పద్ధతిలో రచించారు. ఇవికాక వీరు అనేక గ్రంథాలను, వ్యాసాలను రచించారు; వానిలో మణి ప్రవాళం, ఔచిత్య విచార చర్చ, భక్తి భూషణ చంపు, భారతీయ వ్యాకరణేతిహాసం ముఖ్యమైనది.
వీరు 1972లో పరమపదించారు.

———–

You may also like...