తురగా కృష్ణమూర్తి (Turaga Krishnamurthy)

Share
పేరు (ఆంగ్లం)Turaga Krishnamurthy
పేరు (తెలుగు)తురగా కృష్ణమూర్తి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ11/01/1911
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలురెడ్డి రాజుల యుగంలో తెలుగు, సంస్కృత భాషా సాహిత్యాల అభివృద్ధి, మున్నూరు కాపులు, దేవదాసీలు వంటి కులాల చరిత్ర, కులబ్రాహ్మణ పదనిర్వచనం వంటి అంశాలపై చారిత్రక అధ్యయనం చేసి గ్రంథ ప్రచురణలు చేశారు.
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుచారిత్రక విద్యాధర
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికతురగా కృష్ణమూర్తి
సంగ్రహ నమూనా రచన

తురగా కృష్ణమూర్తి

తురగా కృష్ణమూర్తి గుంటూరు ప్రాంతంలోని సంప్రదాయ నియోగి బ్రాహ్మణ కుటుంబంలో నవంబర్ 1, 1911లో జన్మించారు. ఆయనను సంపన్న గృహస్థు తురగా వెంకటాచలపతిరావు దత్తత తీసుకోవడంతో, చలపతిరావు స్వగ్రామమైన తణుకు ప్రాంతానికి చెందిన పిట్టల వేమవరం వచ్చారు. కృష్ణమూర్తి గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో ఇంటర్ పూర్తిచేసుకుని, 1931లో పిఠాపురం మహారాజా కళాశాల నుంచి గణితంలో పట్టభద్రులయ్యారు. సంపన్నులు కావడంతో ఉద్యోగ ప్రయత్నాలు చేయకుండా జీవితాన్ని చరిత్ర రచనకే అంకితం చేశారు.

కృష్ణమూర్తి పలు చారిత్రకాంశాలపై మౌలిక పరిశోధన చేసి ఆంధ్రప్రదేశ్, కొంతవరకూ భారతీయ చరిత్రలోని కొన్ని కొత్త ప్రతిపాదనలు చేశారు. చరిత్ర రచన విషయంలో భావరాజు వెంకట కృష్ణారావును తొలి గురువుగా భావించారు, మల్లంపల్లి సోమశేఖరశర్మకు తాను ఏకలవ్య శిష్యుణ్ణని చెప్పుకునేవారు. కొల్లూరు హర్షవర్ధనశర్మ, హెచ్.కె.నరసింహస్వామి వంటి చారిత్రికులతో సాహచర్యం తన భాగ్యంగా వ్రాసుకున్నారు.
ద్రాక్షారామంలోని ప్రాచీన భీమేశ్వరస్వామి ఆలయంలో లభించిన 400 శాసనాలపై విశేష కృషిచేసి దాదాపు వంద శాసనాలను చారిత్రక వ్యాఖ్యానాలతో సహా సంకలనం చేసి ప్రచురించారు. రెడ్డి రాజుల యుగంలో తెలుగు, సంస్కృత భాషా సాహిత్యాల అభివృద్ధి, మున్నూరు కాపులు, దేవదాసీలు వంటి కులాల చరిత్ర, కులబ్రాహ్మణ పదనిర్వచనం వంటి అంశాలపై చారిత్రక అధ్యయనం చేసి గ్రంథ ప్రచురణలు చేశారు.
కార్తవీర్యార్జునుని సంతతిగా చెప్పే హైహయ రాజవంశాన్ని గురించి పెద్ద పరిశోధన చేశారు. వీరే ఉత్తర భారతదేశంలో కాలచుర్యులనే పేరుతో ఉన్నారని నిరూపించడమే కాక దక్షిణ భారతమున హైహయ వంశ దర్శనము పేరిట ఆ రాజవంశ చరిత్రను గ్రంథంగా రాశారు. ప్రోలనాడు ప్రాంతాన్ని గురించిన నిర్ణయాన్ని చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం, తణుకు, నిడదవోలు, నరసాపురం ప్రాంతాలను విస్తరించే ప్రాచీనమైన పానార సీమ

———–

You may also like...