పేరు (ఆంగ్లం) | Pillalamarri Venkata Hanumantharao |
పేరు (తెలుగు) | పిల్లలమఱ్ఱి వేంకట హనుమంతరావు |
కలం పేరు | – |
తల్లిపేరు | పుణ్యవతి |
తండ్రి పేరు | సుబ్రహ్మణ్యం |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 12/31/1918 |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | శ్రీ పిల్లలమఱ్ఱి కృతులు, సాహిత్య సంపద, మాధురీ మహిమ (వ్యాసములు), సాహిత్య స్రవంతి, సాహిత్య సమీక్ష (ఉపన్యాసములు), సాహిత్య సమాలోచనము శారదా విలాసము (ప్రసంగ వ్యాసములు) |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | పిల్లలమఱ్ఱి వేంకట హనుమంతరావు |
సంగ్రహ నమూనా రచన | – |
పిల్లలమఱ్ఱి వేంకట హనుమంతరావు
పిల్లలమఱ్ఱి వేంకట హనుమంతరావు ప్రముఖ రచయిత. ఇతడు డిసెంబర్ 31, 1918వ తేదీన పుణ్యవతి, సుబ్రహ్మణ్యం దంపతులకు గుంటూరు జిల్లా, పొన్నూరు మండలానికి చెందిన బ్రాహ్మణ కోడూరు గ్రామంలో జన్మించాడు. సికింద్రాబాద్ మహబూబ్ కాలేజ్, హైదరాబాద్నిజాం కాలేజ్, ఆంద్ర విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేశారు. తెలుగు భాషా సాహిత్యములందు ఆనర్స్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత పొందారు. ఎం ఏ పట్టా పొందారు. హైదరాబాద్ ప్రభుత్వ సమాచార శాఖలో ద్విభాషి గా, గుంటూరు, హిందూ కళాశాలలో ఆంధ్రోపన్యాసకునిగా 1943 నుంచి పనిచేశాడు. నవ్యసాహిత్య పరిషత్తు, ఆలిండియా ఓరియంటల్ కాన్ఫరెన్స్ మొదలైన సంస్థలలో సభ్యుడిగా ఉన్నాడు[1].
కవిగా, కథకునిగా, నాటికాకారుడుగా, విమర్శకుడిగా, సహృదయుడుగా, పాత్రికేయుడిగా, చారిత్రకుడుగా, వక్తగా, దేశికుడుగా, దర్శకుడుగా, నటుడుగా, సంపాదకుడుగా, బహు గ్రంథకర్తగా, ఆధ్యాపకుడుగా, బహుముఖ ప్రతిభా ప్రశస్తిని పొందారు.
సికింద్రాబాద్ లో ‘సాధన సమితి’ని వ్యవస్థాపకత్వము చేసి, వాల్తేరు శాఖని నిర్వహించారు. గుంటూరు సరస సారస్వత సమితి, కవితావనము, ఆంద్ర సాహిత్య మండలి, జ్యోత్స్నా సమితుల సంపాదకత్వము; సాహితీ సమితి, హైదరాబాద్ ఆంద్ర సాహిత్య పరిషత్తు, నవ్య సాహిత్య పరిషత్తు, అఖిల భారత ఓరియంటల్ సమావేశనంలో ప్రధాన పాత్ర వహించారు.
జ్యోత్స్నా సమితి సభాపతిగా, శారదా పీఠం కులపతిగా తమ సేవలని అందించారు.
ఇతని భార్య పిల్లలమఱ్ఱి సుశీల కూడా మంచి రచయిత్రి. ఈమె రచనలు పూజాపుష్పాలు అనే పేరుతో సంకలనం చేయబడింది
———–