పేరు (ఆంగ్లం) | Korrapati Gangadhara Rao |
పేరు (తెలుగు) | కొర్రపాటి గంగాధరరావు |
కలం పేరు | – |
తల్లిపేరు | లక్ష్మీనరసమ్మ |
తండ్రి పేరు | వెంకట కృష్ణయ్య |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 10/05/1922 |
మరణం | 21/01/1986 |
పుట్టిన ఊరు | మచిలీపట్నం |
విద్యార్హతలు | ఎల్.ఐ.ఎం. వైద్యవృత్తి |
వృత్తి | నటుడు, దర్శకుడు, శతాధిక నాటక రచయిత, కళావని సమాజ స్థాపకుడు. వైద్యవృత్తి |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | బాపట్ల |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | నాటకాలు/నాటికలు ,1. రధచక్రాలు (నాటికల సంపుటి),2. పెండింగ్ ఫైల్ (నాటిక),3. గుడ్డిలోకం,4. నిజరూపాలు,5. కమల,6. కొత్తచిగురు,7. పుడమితల్లికి పురిటినొప్పులు,8. ఈ రోడ్డు ఎక్కడికి?,9. తెరలో తెర,విషకుంభాలు, కమల, యథాప్రజా-తథారాజా, తస్మాత్ జాగ్రత్త, లోకంపోకడ, పోటీనాటకాలు, రాగద్వేషాలు, రాగశోభిత, పుడమి తల్లికి పురిటి నొప్పులు మొదలైన నాటకాలు, ప్రార్థన, నాబాబు, పెళ్ళిచూపులు, బంగారు సంకెళ్ళు, తెలుగు కోపం, విధివశం, తనలో తాను, పెండింగ్ ఫైలు, మనిషి వంటి ప్రజాదరణ పొందిన నాటికలు రచించాడు. అంతేకాకుండా ఈ రోడ్డెక్కడికి?, పూలదోసిళ్ళు, మరా-మనిషి, సంక్రాంతి, సాహసి వంటి నాటకాలను తెలుగులోకి అనువదించాడు. |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | వీరి నాటకాలలో ఎన్నో ఉత్తమ రచనలుగా బహుమతులు అందుకున్నాయి. 1. యథాప్రజా-తథారాజా నాటకానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు 2. ప్రార్థన నాటకానికి ఆంధ్రనాటక కళాపరిషత్తు అవార్డు, 3. మద్యపాన నిషేధం వస్తువుగా రాసిన పెడదోవ నాటకానికి కేంద్ర ప్రభుత్వ ప్రథమ బహుమతి లభించాయి. రంగ రచనా ప్రవీణ, కళా ప్రవీణ’ బిరుదులు |
ఇతర వివరాలు | తెలుగు నాటక సాహిత్యంలో వందకుపైగా నాటకాలు, నాటికలు రచించిన మొదటి రచయిత ఇతను. 1955-65 ప్రాంతంలో రంగస్థల ప్రదర్శనల అనుగుణమైన రచనలు చేసి రాష్ట్రవ్యాప్తంగా నాటకొద్యమాన్ని బలోపేతం చేశాడు. కళావని అనే నాటక సంస్థ ద్వారా అనేకమంది యువ కళాకారులను నాటకరంగానికి పరిచయం చేశాడు. ఈయన నాటకాలలో ఎన్నో ఉత్తమ రచనలుగా బహుమతులు అందుకున్నాయి. నాటకరంగాన్ని గురించి, నాటక ప్రదర్శన విధానాల గురించి అనేక వ్యాసాలను రచించి నాటక కళాభివృద్ధికి కృషిచేశాడు. నాటకాన్ని ఒక పదునైన ఆయుధంగా సమాజంలోని చెడ్డ అలవాట్లపై ప్రయోగించాలని ఇతని ఆశయం. కళావని అనే నాటక సమాజాన్ని స్థాపించి, దానికి అధ్యక్షులుగా, దర్శకులుగా వ్యవహరించారు గంగాధర రావు గారు 130కి పైగా నాటక నాటికలు, 12 రేడియో నాటికలు, 20 నవలలు, 7 కథలు, ఏకపాత్రలు, నాటకరంగంపై 65 వ్యాసాలు వ్రాశాడు. గంగాధరరావు రచనలన్నీ సాంఘికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, చారిత్రకంగా అణగారిన సమాజ పరిస్థితులను ఎత్తి చూపించి, వాటికి పరిష్కార మార్గాలను చూపిస్తూ, సమాజాన్ని చైతన్యపరిచే విధంగా ఉంటాయి. ప్రతి రచన సామాజిక ప్రయోజనాన్ని కల్గించేలా ఉంటాయి. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | కొర్రపాటిగంగాధరరావు-నవలానుశీలన |
సంగ్రహ నమూనా రచన | కొర్రపాటిగంగాధరరావు-నవలానుశీలన తెలుగులో నవలలు అనేకం ఉన్నప్పటికి కొర్రపాటి గంగాధర రావు నవలలు ఒక ప్రత్యేకతను కలిగి వుంటాయి. అందుకే ‘కొర్రపాటి గంగాధర రావు నవలలు – అనుశీలన’ అనే పరిశోధనాంశాన్ని ఎంచుకొన్నాను. గంగాధరరావు జీవితం, సాహిత్యం మొదటి అధ్యాయంలో వివరించబడ్డాయి. గంగాధరరావు నవలల్లో ఉన్న ఇతివృత్తాలు రెండవ అధ్యాయంలోనూ, పాత్ర చిత్రణలు మూడవ అధ్యాయంలోనూ, సామాజిక ప్రయోజనాలు నాల్గవ అధ్యాయంలో వివరించబడ్డాయి. ఐదవ అధ్యాయంలో నవలాకారునిగా గంగాధరరావు స్థానాన్ని తెలిపే వర్ణనలు, ఆలంకారిక శైలి, మాండలిక భాష, జానపద సాహిత్యం, జాతీయాలు – సామెతలు, విలక్షణాలు వివరించబడ్డాయి. |
కొర్రపాటి గంగాధరరావు
తెలుగు నాటక సాహిత్యంలో వందకుపైగా నాటకాలు, నాటికలు రచించిన మొదటి రచయిత ఇతను. 1955-65 ప్రాంతంలో రంగస్థల ప్రదర్శనల అనుగుణమైన రచనలు చేసి రాష్ట్రవ్యాప్తంగా నాటకొద్యమాన్ని బలోపేతం చేశాడు. కళావని అనే నాటక సంస్థ ద్వారా అనేకమంది యువ కళాకారులను నాటకరంగానికి పరిచయం చేశాడు.
ఈయన నాటకాలలో ఎన్నో ఉత్తమ రచనలుగా బహుమతులు అందుకున్నాయి. నాటకరంగాన్ని గురించి, నాటక ప్రదర్శన విధానాల గురించి అనేక వ్యాసాలను రచించి నాటక కళాభివృద్ధికి కృషిచేశాడు. నాటకాన్ని ఒక పదునైన ఆయుధంగా సమాజంలోని చెడ్డ అలవాట్లపై ప్రయోగించాలని ఇతని ఆశయం. కళావని అనే నాటక సమాజాన్ని స్థాపించి, దానికి అధ్యక్షులుగా, దర్శకులుగా వ్యవహరించారు.
కళాభారతి అనే సాంస్కృతిక సంస్థకు, బాపట్ల ఫిల్ముక్లబ్ కు అధ్యక్షుడుగా అనేక సాంస్కృ తిక కార్యక్ర మాలను నిర్వంహించాడు. లంబడోళ్ళ రాందాసు, బోధిశ్రీ, ధంసా, నాలుగు నాలుగు నలభై నాలుగు, స్వర్గసీమ, శాంతి తోరణం, నారీ స్క్వేర్ బ్రహ్మచారి, అమృత మధనం, లకుమాదేవి- కుమారగిరి, నవతా!మానవతా అనే నవలలు రచించాడు. ఇవేకాక బ్రహ్మచారి పెళ్ళాం, యమలోకంలో సావిత్రి, పతి-పత్ని, వేగుచుక్క,డాక్టర్ గారి అమ్మాయి, సినిమా తారా, చేదుకో మల్లయ్య చేదుకో, ద్వి పాత్ర, పరకాయ ప్రవేశం, ఖబడ్దార్ ఖూనీకోర్ మొదలైన అముద్రిత నవలలు కూడా రచించాడు.
గంగాధర రావు గారు 130కి పైగా నాటక నాటికలు, 12 రేడియో నాటికలు, 20 నవలలు, 7 కథలు, ఏకపాత్రలు, నాటకరంగంపై 65 వ్యాసాలు వ్రాశాడు. విషకుంభాలు, కమల, యథాప్రజా-తథారాజా, తస్మాత్ జాగ్రత్త, లోకంపోకడ, పోటీనాటకాలు, రాగద్వేషాలు, రాగశోభిత, పుడమి తల్లికి పురిటి నొప్పులు మొదలైన నాటకాలు, ప్రార్థన, నాబాబు, పెళ్ళిచూపులు, బంగారు సంకెళ్ళు, తెలుగు కోపం, విధివశం, తనలో తాను, పెండింగ్ ఫైలు, మనిషి వంటి ప్రజాదరణ పొందిన నాటికలు రచించాడు. అంతేకాకుండా ఈ రోడ్డెక్కడికి?, పూలదోసిళ్ళు, మరా-మనిషి, సంక్రాంతి, సాహసి వంటి నాటకాలను తెలుగులోకి అనువదించాడు.
———–