భూపతి నారాయణమూర్తి (Bhupati Narayanamurthy)

Share
పేరు (ఆంగ్లం)Bhupati Narayanamurthy
పేరు (తెలుగు)భూపతి నారాయణమూర్తి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుతెలుగుజాతి-తెలుగుజాతీయత, పాలనా బోధనా జన జీవన రంగాలలో తెలుగు, క్రైస్తవులపై కాషాయం దాడి,
బ్రాహ్మణ భావజాలంపై క్షత్రియుల తిరుగుబాటు, కులతత్వాన్ని మూఢత్వాన్ని పెంచుతున్న విగ్రహారాధన, కులవ్యవస్థ-కమ్యూనిస్టులు, దళితులపై దమనకాండ, రిజర్వేషన్లు పుట్టుపూర్వోత్తరాలు, రిజర్వేషన్లు రాజ్యాంగం
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికభూపతి నారాయణమూర్తి
సంగ్రహ నమూనా రచన

భూపతి నారాయణమూర్తి

భూపతి నారాయణమూర్తి, స్వాతంత్ర్య సమరయోధుడు, కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త, హేతువాది, దళితవాద రచయిత. తెలుగు ప్రజాసమితి స్థాపకుడు. చెముడు ఉన్నప్పటికీ అనేక సంవత్సరాలు తూ.గో జిల్లా మలికిపురం గ్రామ సర్పంచ్గా పనిచేశారు ఎన్నో పుస్తకాలు రాశారు. నారాయణమూర్తి 1921, సెప్టెంబరు 21న రాజోలు మండలంలోని మలికిపురంలో మల్లమ్మ, భూపతి వీరాస్వామి దంపతులకు జన్మించాడు. ఐదుగురు సంతానంలో పెద్దవాడు నారాయణమూర్తి. ప్రాథమిక పాఠశాలలో చదివే రోజుల్లో ఒక అగ్రకులానికి చెందిన బాలున్ని తాకినందుకు తీవ్రంగా చెంపదెబ్బలు తినటం వలన, శాశ్వతంగా చెవిటివాడైపోయాడు. చెముడు వల్ల విద్యాభ్యాసం ఆగిపోయింది.
చిన్నతనంలో కాంగ్రేసు నాయకులతో పాటు స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని జైలుకెళ్లాడు. ఆ తరువాత బర్మాలో ఉన్న తండ్రి దగ్గరికి వెళ్ళి అక్కడ కొన్నాళ్ళు వంటవాడిగా పనిచేశాడు. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో జపాన్ బర్మాపై బాంబుల దాడి చేయటంతో అక్కడి ఉన్న అందరు తెలుగువారిలాగే కాలినడకన బర్మా నుండి తిరిగి మలికిపురం చేరుకున్నాడు. ఆ సుదీర్ఘ ప్రయాణంలో చాలామంది జబ్బుచేసి మరణించారు. అయితే నారాయణమూర్తి అదృష్టం కొద్ది క్షేమంగా స్వస్థలం చేరుకున్నాడు.
మోరి గ్రామానికి చెందిన కమలమ్మను పెళ్ళి చేసుకున్నాడు. భార్య నిరక్షరాస్యురాలని తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. ఆమెకు చదువు చెప్పి ప్రోత్సహించాడు. భర్త ప్రోత్సాహంతో కమలమ్మ కమ్యూనిస్టు పార్టీ కార్యకలాపాల్లో పాల్గొని మహిళా కార్యక్రమాలకు నాయకత్వం వహించింది.
అంత క్రితం మార్క్సిస్టులుగా ఉండి, దళితవాదులుగా మారిన కొంతమంది అంబేద్కరిజాన్ని ప్రధానంగా భావిస్తూనే, మార్క్సిస్టు దృక్పథాన్ని కూడా కలుపుకోవాలని వాదించిన వారిలో భూపతి నారాయణమూర్తి ఒకడు. ఈయన మార్క్సిస్టు మూలసూత్రాల్నీ, అంబేద్కరు భావధారనీ విపులంగా చర్చించి, రెంటి సమ్మేళనం కావాలని “దళితవిముక్తి” అనే సిద్ధాంత గ్రంథాన్ని ప్రచురించాడు. ఈయన 1982లో పుణ్యభూమి కళ్లు తెరిచింది అనే దళితవాద సినిమాను కూడా నిర్మించాడు.

———–

You may also like...