రావిపూడి వెంకటాద్రి (Ravipudi Venkatadri)

Share
పేరు (ఆంగ్లం)Ravipudi Venkatadri
పేరు (తెలుగు)రావిపూడి వెంకటాద్రి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ02/09/1922
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు1946లో ఆయన రాసిన తొలి పుస్తకం విశ్వాన్వేషణ,1949 జీవమంటే ఏమిటి?
1960 హ్యూమనిస్టు ఆర్థికవిధానం, 1964 భారతదేశం- గోపూజ, 1976 ర్యాడికల్ హ్యూమనిజం, 1977 నాస్తికత్వం- నాస్తితత్వం,1977 నాస్తికులున్నారు జాగ్రత్త
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుకవిరాజు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికరావిపూడి వెంకటాద్రి
సంగ్రహ నమూనా రచన

రావిపూడి వెంకటాద్రి

ఫిబ్రవరి 9, 1922 లో ప్రకాశం జిల్లా, ఇంకొల్లు మండలం నాగండ్ల లో జన్మించారు. 1956 నుండి 1995 వరకు 40సంవత్సరాలు నాగండ్ల గ్రామ సర్పంచ్ గా పనిచేశారు. నాగండ్లలో 5.4.1943 న కవిరాజాశ్రమం స్థాపించారు. మానవతా విలువలు గుర్తించండి, గౌరవించండి, నిర్భయంగా జీవించండి, సాటి మానవుడిని మానవుడిగా గుర్తించండి అంటూ ఎనభై వరకు పుస్తకాలు రాసిన మానవతావాది, హేతువాది. హేతువాదానికి నమ్మకాలుండవు. సమ్మతాలు (కన్విక్షన్స్) ఉంటాయి అంటారు రావిపూడి వెంకటాద్రి. మానవవాదంతో సమాజాన్ని మానవ సంబంధాలైన ప్రేమ, ఆదరణ వైపు మళ్లించడానికి నిరంతరకృషి చేస్తున్నారు.

మానవులకు మార్గదర్శిగా హేతువాదం చేయూతనిస్తోందనీ, మూఢనమ్మకాలతో సతమతమవుతోన్నవారికి వెలుగు చూపుతోన్నదని వెంకటాద్రి నమ్మకం. హేతువాదం కూడా ఎక్కడో గాల్లోంచి పుట్టలేదు. వైజ్ఞానిక పద్ధతిలోనే పుట్టింది. ఎప్పటికప్పుడూ పరిణమిస్తూ ఉంటుంది. ప్రశ్నించే వారంతా హేతువులను కోరుతున్నట్లే లెక్క. హేతువాదానికి ఒక మతం ఉండదు. అది అన్ని మతాల్ని పరిశీలిస్తుంది. వాటి పరిణామం, పుట్టు పూర్వోత్తరాలు అన్వేషిస్తుంది.

ఎమ్.ఎన్. రాయ్ భావాలకు ఆకర్షితులై ర్యాడికల్ డెమోక్రటిక్ పార్టీలో చేరారు. ఆ తర్వాత మూడు సంవత్సరాలకి ర్యాడికల్ హ్యూమనిస్టు ఉద్యమంలో భాగస్వామి అయ్యారు. 1949లో భారత హేతువాద సంఘం ఏర్పాటైంది. ఆ సంఘం స్థాపన నుంచి వెంకటాద్రి అందులో సభ్యులయ్యారు.ఆంధ్రప్రదేశ్‌ హేతువాద సంఘం లో 1989 వరకు ఆ సంస్థ అధ్యక్షులుగా పనిచేశారు.1982నుంచీ ‘హేతువాది’ అనే మాసపత్రిక నడిపారు. 1988,1996ల్లో కవిరాజు త్రిపురనేని అవార్డు పొందారు. 1992లో తాపీ ధర్మారావు అవార్డును పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి అందుకొన్నారు.

———–

You may also like...